
సాక్షి, గోపాలపురం: జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోతుల రామతిరుపతిరెడ్డి (72) శుక్రవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతిచెందారు. సీనియర్ నాయకుడిగా పార్టీలకతీతంగా అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా గుర్తింపు ఉన్న తిరుపతిరెడ్డి మృతిచెందిన వార్తను ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో పెద్దాయనగా గుర్తింపు కలిగిన వ్యక్తిగా, పార్టీలో తగిన ప్రాధాన్యం ఉన్న వ్యక్తిగా తిరుపతిరెడ్డికి పేరుంది. ఈయన మృతిపట్ల గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతిరెడ్డి నివాసానికి చేరుకుని ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment