సాక్షి,ముంబై: సీఎండీ నియామకం అంశంలో ప‍్రయివేటురంగ బ్యాంకు ఎస్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి తన నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. తాను ముందు ఆదేశించినట్టుగానే సీఈవో, ఎండీగా రాణా కపూర్ పదవి నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1నాటికి బ్యాంకు కొత్త సీఎండీ నియామాకం చేపట్టాలని పేర్కొంది.
ఆర్‌బీఐ మరోసారి తన నిర్ణయాన్ని దృఢంగా ప్రకటించడంతో బ్యాంకు సీఎండీ మరింత కాలం కొనసాగాలని భావించిన రాణా కపూర్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు. బ్యాంకు ఉన్నతాధికారిగా కపూర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల పాటు పొడిగించాలని గతంలోనే వాటాదారులు కోరినప్పటికి ఆర్‌బీఐ ఆర్‌బీఐ నిరాకరించింది. 2019, జనవరి 31నాటికి కొత్త సీఎండీని ఎంపిక చేయాలని సెప్టెంబరు24న ఆదేశించింది. అయితే రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని , ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి మరింత సమయం కావాలని ఆర్‌బీఐని ఎస్‌బ్యాంకు కోరింది. అలాగే కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. తాజాగా ఈ అభ్యర్థనను కూడా ఆర్‌బిఐ తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment