యస్‌ బ్యాంక్‌లో ఎస్‌ఎంబీసీ వాటా జూమ్‌ | SMBC Becomes Largest Shareholder in Yes Bank with 24.2% Stake | Sakshi
Sakshi News home page

యస్‌ బ్యాంక్‌లో ఎస్‌ఎంబీసీ వాటా జూమ్‌

Sep 18 2025 8:36 AM | Updated on Sep 18 2025 11:18 AM

SMBC Acquires Stake in Yes Bank

పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) నుంచి యస్‌ బ్యాంక్‌కు చెందిన 13.18 శాతం వాటాను జపనీస్‌ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఎంబీసీ) చేజిక్కింకుకుంది. దీంతో ఎస్‌ఎంబీసీ నుంచి రూ. 8,889 కోట్లు అందుకున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఫలితంగా యస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ వాటా 10.8 శాతానికి దిగివచ్చింది. ఈ డీల్‌లో భాగంగా ఇతర 7 ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి సైతం మరో 6.82 శాతం వాటాను ఎస్‌ఎంబీసీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా యస్‌ బ్యాంక్‌లో పీఈ దిగ్గజం కార్లయిల్‌ నుంచి మరో 4.2 శాతం వాటాను ఎస్‌ఎంబీసీ సొంతం చేసుకోనుంది. ఇందుకు షేరుకి రూ. 21.5 ధరలో(ఎస్‌బీఐ వాటా విక్రయ ధర)నే కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం(17న) తెలియజేసింది. ఇందుకు రూ. 2,800 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. వెరసి యస్‌ బ్యాంక్‌లో వాటాను జపనీస్‌ దిగ్గజం సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్‌ గ్రూప్‌(ఎస్‌ఎంఎఫ్‌జీ)కు చెందిన ఎస్‌ఎంబీసీ 24.2 శాతానికి పెంచుకోనుంది. తద్వారా యస్‌ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌లో కార్లయిల్‌ గ్రూప్‌ 4.22 శాతం వాటా కలిగి ఉంది.

ఇదీ చదవండి: పండుగ సీజన్‌పై ‘సోనీ’ ఆశలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement