Stake purchase
-
మణిపాల్ చేతికి ఆమ్రి హాస్పిటల్స్
కోల్‌కతా/న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ తాజాగా ఇమామీ గ్రూప్ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్‌లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్ కంపెనీ టెమాసెక్ హోల్డింగ్స్‌కు 59% వాటాగల మణిపాల్ ఇందుకు రుణాలుసహా రూ. 2,300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆమ్రి హాస్పిటల్స్‌లో 15% వాటాతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ గ్రూప్ ఇన్వెస్టర్‌గా కొనసాగనుంది. తాజా కొనుగోలుతో మణిపాల్ హాస్పిటల్స్ దేశ తూర్పు ప్రాంతంలో కార్యకలా పాలు విస్తరించనుంది. సంయుక్త సంస్థ దేశవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాలలో 9,500 పడకలతో 33 ఆసుపత్రులను నిర్వహించనుంది. వెరసి దేశీయంగా రెండో పెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థగా ఆవి ర్భవించనుంది. సంబంధిత వర్గాల సమా చారం ప్రకారం ఆమ్రి రుణ భారం రూ.1,600 కోట్లు కాగా.. రూ.2,400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ జరిగినట్లు తెలుస్తోంది. క్లినికల్ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలుగల ఆమ్రి హాస్పిటల్స్‌ను జత కలుపుకోవడం ద్వారా భారీ నెట్‌వర్క్‌కు తెరలేవనున్నట్లు మణిపాల్ పేర్కొంది. తద్వారా దేశ తూర్పుప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఆరోగ్యపరిరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన సేవలు అందించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. అయితే మణిపాల్ 2021లో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తూర్పు భారతంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కాగా.. హెల్త్‌కేర్ రంగ మరో దిగ్గజం అపోలో హాస్పిటల్స్ 10,000 పడకల సామర్థ్యంతో 64 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. -
అదానీ గ్రీన్ ఎనర్జీలో క్యూఐఏకి వాటాలు
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్)లో ఖతార్‌కు చెందిన సార్వభౌమ నిధి ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 2.5 శాతం పైగా వాటాలను కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 3,920 కోట్లు వెచ్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఏఈఎంఎల్)లో 2020లో 25.1 శాతం వాటాలు కొనుగోలు చేసిన క్యూఐఏ మళ్లీ అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇది రెండోసారి. స్టాక్ ఎక్ఛేంజీల డేటా ప్రకారం ప్రమోటర్ గ్రూపు సంస్థ ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ .. ఏజీఈఎల్‌లో సుమారు 4.49 కోట్ల షేర్లను (2.8 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 920 చొప్పున మొత్తం రూ. 4,131 కోట్లకు విక్రయించింది. క్యూఐఏ అనుబంధ సంస్థ అయిన ఐఎన్‌క్యూ హోల్డింగ్ 4.26 కోట్ల షేర్లను (దాదాపు 2.68 శాతం వాటా) కొనుగోలు చేసింది. సగటున రూ. 920 రేటు చొప్పున ఇందుకోసం మొత్తం రూ. 3,920 కోట్లు వెచ్చించింది. -
యాంటిఫిన్ వాటా కొనుగోలు.. రూ. 53,957 కోట్లకు చేరిన పేటీఎం వ్యాల్యూ
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండు ఫిన్‌టెక్ దిగ్గజం.. వన్97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనుంది. యాంట్‌ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్స్ నుంచి 10.3 శాతం వాటాను విజయ్ సొంతం చేసుకోనున్నట్లు పేటీఎం తాజాగా పేర్కొంది. ఇందుకు ఎలాంటి నగదు చెల్లింపు ఉండదని, ఆఫ్‌మార్కెట్ లావాదేవీ ద్వారా వాటా బదిలీ ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ వాటా ఎకనమిక్ రైట్స్ యాంట్‌ఫిన్ వద్దనే కొనసాగుతాయని వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా విదేశీ సొంత సంస్థ రెజిలియంట్ అసెట్ మేనేజ్మెంట్ బీవీ ద్వారా వాటాను శర్మ కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. దీనికి బదులుగా మార్పిడికి వీలయ్యే(ఆప్షనల్లీ కన్వర్టిబుల్) డిబెంచర్లను యాంట్‌ఫిన్‌కు రెజిలియంట్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీ కారణంగా కంపెనీ యాజమాన్య నియంత్రణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ లావాదేవీతో పేటీఎంలో శర్మ వాటా 19.42 శాతానికి చేరనుంది. వెరసి కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలవనున్నారు. మరోపక్క యాంట్‌ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.5 శాతానికి తగ్గనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పేటీఎం బోర్డులో యాంట్‌ఫిన్ నామినీ ఉండబోరు. యాంట్‌ఫిన్.. చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ అనుబంధ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. షేరు జూమ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనున్న వార్తల నేపథ్యంలో ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం కౌంటర్లో లావాదేవీలు ఊపందుకున్నాయి. షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 7 శాతం జంప్‌చేసి రూ. 851 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 888కు చేరింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,511 కోట్లు ఎగసి రూ. 53,957 కోట్లను అధిగమించింది. -
స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ael) ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్రైన్‌మ్యాన్ సంస్థను కొనుగోలు చేసింది. సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇదే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఏఈఎల్కి చెందిన అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్) 100 శాతం స్టేక్ కొనుగోలు చేసిందని.. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు వెల్లడించింది. అయితే, ఎంత మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందనే ఆర్ధిక పరమైన అంశాల గురించి ప్రస్తావించలేదు. ఉత్తరాఖండ్ ఐఐటీ - రూర్కీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వినీత్ చిరానియా, కరణ్‌కుమార్‌లు గురుగావ్ కేంద్రంగా ఐఆర్సీటీసీ గుర్తింపుతో ట్రైన్ టికెట్ సేవల్ని అందించేలా ఎస్‌ఈపీఎల్‌ను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ట్రైన్‌మ్యాన్ యాప్ ప్రయాణికులు సులభంగా ట్రైన్ టికెట్లతో పాటు ఇతర సౌకర్యాల్ని అందిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థనే అదానీ గ్రూప్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల, ఎస్ఈపీఎల్ కార్యకలాపాల నిమిత్తం 1 మిలియన్ డాలర్లను అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. ఇక, పెట్టుబడి పెట్టిన సంస్థల్లో గుడ్‌వాటర్ కేపిటల్, హెమ్ ఏంజెల్స్ వంటి సంస్థలున్నాయి. ఈ క్రమంలో రైల్వే సేవల్ని అందించే స్టార్టప్‌ను అదానీ గ్రూప్ కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
జర్మన్ స్టార్టప్‌లో టీవీఎస్‌కు 25 శాతం వాటా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్టులు, విడిభాగాల జర్మన్ స్టార్టప్ కిల్వాట్ జీఎంబీహెచ్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా పేర్కొంది. 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. కొత్తగా జారీ చేయనున్న 8,500 ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా వాటాను పొందనుంది. ఇందుకు షేరుకి 235.29 యూరోల చొప్పున చెల్లించనుంది. ఇందుకు దాదాపు రూ. 18 కోట్లు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అవసరమయ్యే హైటెక్ ప్రొడక్టులు, విడిభాగాల డిజైన్, తయారీ, పంపిణీ చేపడుతోంది. -
అదానీ చేతికి క్వింటిలియన్
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ తాజాగా క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్‌లో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ. 48 కోట్లు వెచ్చించినట్లు ఏంఎజీ మీడియా మాతృ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. రాఘవ్ బల్ ఏర్పాటు చేసిన డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను సొంతం చేసుకోనున్నట్లు గతేడాది మే నెలలో ఏఈఎల్ పేర్కొంది. తాజాగా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. న్యూస్ ప్లాట్‌ఫామ్.. బ్లూమ్‌బెర్గ్ క్వింట్(ప్రస్తుతం బీక్యూ ప్రైమ్)ను క్వింటిలియన్ బిజినెస్ మీడియా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రచురణ, ప్రకటనలు, బ్రాడ్‌క్యాస్టింగ్, విభిన్న మీడియా నెట్‌వర్క్‌ల కంటెంట్ పంపిణీ బిజినెస్‌లలోకి ప్రవేశించేందుకు ఏఎంజీ మీడియాను అదానీ గ్రూప్ ఏర్పాటు చేసింది. -
మ్యాక్స్ లైఫ్ వాటాపై యాక్సిస్ కన్ను
న్యూఢిల్లీ: బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లోగల వాటాను పెంచుకోనున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. రానున్న 6–9 నెలల్లో వాటాను 20 శాతంవరకూ పెంచుకునే వీలున్నట్లు బ్యాంక్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం అనుబంధ సంస్థలు రెండింటితో కలసి మ్యాక్స్ లైఫ్‌లో 12.99 శాతం వాటాను యాక్సిస్ బ్యాంక్ కలిగి ఉంది. గతేడాది ఏప్రిల్‌లో డీల్‌కు అనుమతిని పొందాక మ్యాక్స్ లైఫ్‌లో యాక్సిస్ ఈ వాటాను సొంతం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా మ్యాక్స్ లైఫ్‌లో 7 శాతంవరకూ అదనపు వాటా కొనుగోలుకు యాక్సిస్ అనుబంధ సంస్థలకు హక్కు లభించింది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి ఒకేసారి లేదా దఫదఫాలుగా వాటాను దక్కించుకోవచ్చు. గత ఐదేళ్లలో బ్యాంకెస్యూరెన్స్ విభాగం 18–20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు. నూతన అమ్మకాలలో 60 శాతం ఈ విభాగం ద్వారానే నమోదవుతున్నట్లు తెలియజేశారు. బ్యాంక్, బీమా కంపెనీల మధ్య ఒప్పందమే బ్యాంకెస్యూరెన్స్. దీంతో బ్యాంక్ కస్టమర్లకు బీమా ప్రొడక్టులను విక్రయించడం, బ్యాంక్ బ్రాంచీలను ఇందుకు వినియోగించుకోవడానికి వీలుంటుంది. -
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో కేకేఆర్
న్యూఢిల్లీ: బీమా రంగంలో ఉన్న శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 9.99 శాతం వాటాను ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ చేజిక్కించుకుంటోంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌ను శ్రీరామ్ గ్రూప్, ఆఫ్రికాకు చెందిన ఫైనాన్షియల్ సేవల కంపెనీ సన్లామ్ ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మేరకు మూడు సంస్థల మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయంగా బీమా రంగంలో కేకేఆర్‌కు ఉన్న నైపుణ్యం నుం చి ప్రయోజనం పొందేలా చూస్తున్నామని.. భారతీయ కంపెనీలను తదుపరి స్థాయికి తీసుకెళ్లే అనుభవం ఆ సంస్థకు ఉందని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనిల్‌కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలిపారు. 2009 నుంచి ఇప్పటివరకు భారత్‌లో కేకేఆర్ 20కి పైగా పెట్టుబడులు చేసింది. వీటిలో హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఉన్నాయి. చదవండి: హెచ్డీఎఫ్సీ సంస్థల మెగా విలీనం... ఆర్థికమంత్రితో ‘హెచ్డీఎఫ్సీ’ చీఫ్‌ల భేటీ -
విద్యుత్ కోసం...భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడులు
ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మహరాష్ట్రకు చెందిన ఎలక్ట్రిక్ యూటీలిటీ కంపెనీ అవాదా కేఎన్‌షోరాపూర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సొంతంగా విద్యుత్ ఉత్పాదక కంపెనీలను కలిగివుండాలనే నిబంధనలో భాగంగా భారతి ఎయిర్టెల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అవాదా కేఎన్‌షోరాపూర్‌లో 7 శాతానికిపైగా వాటాను రూ. 1.74 కోట్లతో వాటాలను కొనుగోలు చేసినట్లు భారతి ఎయిర్టెల్ ఆదివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కొనుగోలు ధర వివరాలను తెలియజేస్తూ...ఒక్కొ ఈక్వీటి షేర్‌కు రూ. 10 చొప్పున మొత్తం 17,42,650 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి మొత్తం రూ. 1,74,26,500 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. సొంత అవసరాల కోసం అవాదా కేఎన్‌షోరాపూర్ నుంచి విద్యుత్‌ను తీసుకుంటామని వివరించింది. మల్టీ నేషనల్ కంపెనీలు తమ విద్యుత్ అవసరాల కోసం సొంతంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ చట్టం 2003 ప్రకారం తన సొంత అవసరాల కోసం అవాదా కేఎన్‌షోరాపూర్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసుకునేలా అందులో పెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులను పెట్టడం ద్వారా వచ్చే రిటర్న్స్‌ను భారతి ఎయిర్టెల్ విద్యుత్ రూపంలో స్వీకరించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. చదవండి: ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..! -
ఆ కంపెనీపై అజీమ్ ప్రేమ్‌జీ కన్ను.. వందల కోట్ల పెట్టుబడులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ అపార్చునిటీస్ ఫండ్.. హైదరాబాద్‌కు చెందిన సాగర్ సిమెంట్స్‌లో 10.10 శాతం వాటాను చేజిక్కించుకుంది. డీల్ విలువ రూ.350 కోట్లు. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ.2 ముఖ విలువ కలిగిన 1.32 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.265 చొప్పున ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు జారీ చేయాలన్న ప్రతిపాదనకు సాగర్ సిమెంట్స్ బోర్డ్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డీల్ కారణంగా సాగర్ సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 50.28 నుంచి 45.2 శాతానికి వచ్చి చేరింది. వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని విస్తరణ, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించనున్నట్టు సాగర్ సిమెంట్స్ వెల్లడించింది. కార్యకలాపాలు, వ్యవస్థలను బలోపేతం చేయడం, వాటాదారులకు విలువను పెంపొందించడానికి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సలహాల కోసం ఎదురుచూస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ ఎస్.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కంపెనీతో కలిసి వృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి, అత్యుత్తమ పాలన ప్రక్రియలతో దేశవ్యాప్త బ్రాండ్‌గా మారడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పార్ట్నర్ రాజేశ్ రామయ్య చెప్పారు. సాగర్ సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 82.5 లక్షల టన్నులు. -
ఆయిల్ ఇండియా షేల్ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ ఇండియా.. యూఎస్ షేల్ చమురు వెంచర్లో 20 శాతం వాటా విక్రయించింది. డీల్ విలువ 2.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 187 కోట్లు)కాగా.. తద్వారా వెంచర్ నుంచి బయటపడింది. యూఎస్‌లోని సొంత అనుబంధ సంస్థ ద్వారా నియోబారా షేల్ ఆస్తిలోగల పూర్తివాటాను విక్రయించినట్లు ఆయిల్ ఇండియా వెల్లడించింది. వెరసి గత రెండు నెలల్లో యూఎస్ షేల్ బిజినెస్ నుంచి రెండో దేశీ సంస్థ గుడ్‌బై చెప్పింది. గతేడాది నవంబర్‌లో టెక్సాస్‌లోని ఈగల్ఫోర్డ్ షేల్ ఆస్తుల నుంచి వైదొలగేందుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. కాగా.. నియోబారా షేల్ ఆస్తిలో మరో పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)తో కలిసి 2012 అక్టోబర్‌లో ఆయిల్ ఇండియా 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను క్యారిజో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నుంచి 8.25 కోట్ల డాలర్లకు సొంతం చేసుకుంది. దీనిలో ఆయిల్ ఇండియా వాటా 20 శాతంకాగా.. ఐవోసీ 10 శాతం వాటా తీసుకుంది. ఈ వెంచర్ నిర్వాహక సంస్థ వెర్డాడ్ రీసోర్సెస్‌కు ఆయిల్ ఇండియా వాటాను విక్రయించింది. యూఎస్ వెంచర్ నుంచి ఔట్ -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన కంపెనీను కైవసం చేసుకున్న అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి చెందిన కాటమరాన్ వెంచర్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రియోన్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్సీస్‌ను పూర్తిగా అమెజాన్ సొంతం చేసుకుంది. క్లౌడ్టైల్లోని కాటమరాన్ వెంచర్ వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్ ఇండియా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి అనుమతి కోరింది. కాటరామన్కు చెందిన పూర్తి వాటాలను కొనుగోలు చేసినట్లు అమెజాన్ బుధవారం రోజున ప్రకటించింది. క్లౌడ్‌టైల్ కంపెనీలో అంతకుముందు అమెజాన్ 24 శాతం మేర, కాటరామన్ 76 శాతం మేర వాటాలను కల్గి ఉంది. ఇప్పుడు కాటరామన్కు చెందిన పూర్తి వాటాలను అమెజాన్ ఇండియా కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. ఇటీవల క్లౌడ్‌టైల్ ఇండియా మే 2022 కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. ఇరు సంస్థలు ఇకపై జాయింట్ వెంచర్‌గా కొనసాగబోవని అప్పట్లో ప్రకటించాయి. నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే ఇక ప్రియోన్ పూర్తిగా అమెజాన్ చేతిలోకి వెళ్లనుంది. యాజమాన్యంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. చదవండి: షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్..! -
మనీశ్ మల్హోత్రాతో రిలయన్స్ భారీ డీల్
Reliance Buys Manish Malhotra Stakes: వస్త్ర ప్రపంచంలో తన బ్రాండ్‌తో దూసుకుపోతున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్.. భారీ ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ప్రముఖ డిజైనర్ లేబుల్ ‘మనీశ్ మల్హోత్రా’లో 40 శాతం వాటా చేజిక్కించుకోబోతోంది. పదహారేళ్లుగా దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు విస్తరించుకున్న మనీశ్ మల్హోత్రా బ్రాండ్‌లో రిలయన్స్ మెజార్టీ వాటా కొనుగోలు చేయనుంది. మనీశ్ మల్హోత్రా బయటి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మేరకు మనీశ్‌తో ఒప్పందాన్ని గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాల్లో స్టోర్లను నడిపిస్తున్న మనీశ్ మల్హోత్రా.. దేశంలోనే మొదటి వర్చువల్ స్టోర్ తెరిచిన ఫీట్ సైతం సాధించారు. ‘భారత సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా దుస్తుల్ని రూపొందించడం ఈ లేబుల్ ప్రత్యేకత. రియలన్స్తో ఒప్పందం ద్వారా దేశ, విదేశాలకు సేవలను విస్తరిస్తామ’ని ఈ సందర్భంగా మనీశ్ మల్హోత్రా(54) తెలిపారు. చదవండి: 14 ఏళ్లుగా ఆ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ -
మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!
ముంబై, సాక్షి: దేశీ రిటైల్ ఫార్మసీ మార్కెట్ మరింత వేడెక్కనుంది. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల ఔషధ విక్రయాలు ఊపందుకున్నాయి. అటు ఆఫ్‌లైన్(స్టోర్లు), ఇటు ఆన్లైన్ విక్రయాలు వేగవంతంగా పెరుగుతున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా దేశీ ఫార్మసీ విభాగంలో రిలయన్స్ రిటైల్, టాటా గ్రూప్, అమెజాన్ భారీ పెట్టుబడులతో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా ఇతర కంపెనీలలో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా వేగవంతంగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్లోబల్ పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దేశీయంగా రెండో పెద్ద ఫార్మసీ రిటైల్ చైన్ కలిగిన మెడ్‌ప్లస్‌లో ప్రస్తావించదగ్గ మైనారిటీ వాటా కొనుగోలుకి వార్బర్గ్ అడుగులు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇతర వివరాలు ఇలా.. (టాటాల చేతికి 1ఎంజీ?) రూ. 1,500 కోట్లు మెడ్‌ప్లస్‌లో చెప్పుకోదగ్గ మైనారిటీ వాటా కొనుగోలుకి వార్బర్గ్ పింకస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలుకి వీలుగా రుణాలు, ఈక్విటీ ద్వారా మెడ్‌ప్లస్‌కు నిధులు అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెడ్‌ప్లస్‌కు రుణాలిచ్చిన గోల్డ్‌మన్ శాక్స్, ఎడిల్వీజ్ తదితరాలకు చెల్లింపులు చేపట్టే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2018 జనవరిలో గోల్డ్‌మన్ శాక్స్ నుంచి మెడ్‌ప్లస్ 11.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 845 కోట్లు) రుణాలను తీసుకుంది. ఈ నిధులతో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మౌంట్ కెల్లెట్ క్యాపిటల్ మేనేజ్మెంట్(యూఎస్), టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్, అజయ్ పిరమల్ కంపెనీ ఇండియా వెంచర్ అడ్వయిజర్స్ నుంచి మొత్తం 69 శాతం వాటాను మెడ్‌ప్లస్ సొంతం చేసుకుంది. (అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!) ప్రేమ్జీకు వాటా విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ కంపెనీ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ రూ. 200 కోట్లతో మెడ్‌ప్లస్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఆపై మరో రూ. 100 కోట్ల పెట్టుబడులను సైతం సమకూర్చింది. తద్వారా మెడ్‌ప్లస్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్.. 18 శాతం వాటాతో కొనసాగుతోంది. కాగా.. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న వార్బర్గ్ పింకస్‌కు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ సైతం వాటాను విక్రయించే వీలున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ పెట్టుబడులతో వాటాలను తనఖా నుంచి రిలీజ్ చేసుకోవడం ద్వారా మెడ్‌ప్లస్‌ను వ్యవస్థాపకుడు సీఈవో, మధుకర్ గంగాడీ ఇకపైన కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్) హైదరాబాద్ కంపెనీ 2006లో హైదరాబాద్‌లో ప్రారంభమైన మెడ్‌ప్లస్ ప్రస్తుతం 1,800 స్టోర్లతో దేశంలోనే రెండో పెద్ద ఫార్మసీ చైన్‌గా నిలుస్తోంది. ఆన్‌లైన్‌లోనూ మెడ్‌ప్లస్‌మార్ట్, మెడ్‌ప్లస్‌ల్యాబ్, మెడ్‌ప్లస్ లెన్స్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తోంది. దక్షిణాదిన ప్రారంభమైన కంపెనీ తదుపరి దశలో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా గల 12 లక్షల ఫార్మసీలలో 5 శాతం కంటే తక్కువ వాటాను ఆర్గనైజ్డ్ రంగం కలిగి ఉన్నట్లు అంచనా. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెడ్‌ప్లస్ టర్నోవర్ రూ. 1,200 కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రూ. 160-170 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించవచ్చని అంచనా వేశారు. -
ఎఫ్ఐఐల ఫేవరెట్ షేర్ల స్పీడ్
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీగా పెట్టుబడులు కుమ్మరించారు. క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూ. 35,000 కోట్లకుపైగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. తద్వారా దాదాపు 400 కంపెనీలలో వాటాలను పెంచుకున్నారు. వీటిలో 100 కంపెనీల షేర్లు మార్చి నుంచి చూస్తే 100 శాతంపైగా ర్యాలీ చేశాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో స్టాక్ మార్కెట్లు 52 వారాల కనిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీంతో పలు కౌంటర్లు ఏడాది కనిష్టాలకు చేరాయి. ఈ స్థాయిల నుంచీ పలు షేర్లు లాభాల దౌడు తీస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మార్చి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న సుమారు 385 కంపెనీలలో మార్చి నుంచి చూస్తే.. 107 స్టాక్స్ 100-500 శాతం మధ్యలో జంప్ చేశాయి. మార్చి కనిష్టాల నుంచి రెట్టింపైన కౌంటర్లలో చాలా వరకూ మిడ్, స్మాల్ క్యాప్ విభాగం నుంచే చోటు చేసుకోవడం గమనార్హం. జాబితాలో ఎంఅండ్ఎం, ఇమామీ, ప్రకాష్ ఇండస్ట్రీస్, జిందాల్ పాలీ, అదానీ గ్యాస్, గ్లెన్ మార్క్ ఫార్మా, అదానీ గ్రీన్, అఫ్లే ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. గత రెండేళ్లుగా మిడ్, స్మాల్ క్యాప్స్ అక్కడక్కడే అన్నట్లుగా నిలిచిపోవడంతో కొద్ది రోజులుగా ర్యాలీ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు పటిష్ట యాజమాన్యం, నాణ్యమైన బిజినెస్ వంటి అంశాలు కొన్ని కౌంటర్లకు జోష్ నిస్తున్నట్లు చెప్పారు. లార్జ్ క్యాప్స్ కంటే రానున్న ఏడాది కాలంలో లార్జ్ క్యాప్స్ ను మించి దూకుడు చూపగల మిడ్, స్మాల్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపు సారించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ల రిటర్నులకు ప్రాధాన్యం ఇవ్వకుండా గుర్తింపు కలిగిన, పటిష్ట వ్యాపార అవకాశాలు అధికంగాగల కంపెనీలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. నిజానికి 2018 జనవరి నుంచీ మిడ్, స్మాల్ క్యాప్స్ వెనకడుగులో నిలిచిపోయినట్లు మార్కెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా వివరించారు. అయితే ఇటీవల బిజినెస్ లు మందగించిన లార్జ్ క్యాప్ కంపెనీల నుంచి పెద్ద కంపెనీలుగా ఆవిర్భవించగల మిడ్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపును మరల్చినట్లు తెలియజేశారు. భారీ లాభాలలో ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు, షేర్ల జోరు తీరు ఎలా ఉన్నదంటే.. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లో ఎఫ్ఐఐల వాటా క్యూ2లో 5.2 శాతం నుంచి 6.99 శాతానికి ఎగసింది. ఈ షేరు 544 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో సీజీ పవర్లో వాటా 0.23 శాతం నుంచి 0.3 శాతానికి పెరిగింది. షేరు 459 శాతం దూసుకెళ్లింది. ఆర్తి డ్రగ్స్ లో వాటా 1.82 శాతం నుంచి 2.19 శాతానికి బలపడగా.. షేరు 408 శాతం జంప్ చేసింది. ఇదే విధంగా అదానీ గ్రీన్‌లో ఎఫ్ఐఐల వాటా 21.52 శాతం నుంచి 22.43 శాతానికి చేరగా.. షేరు 405 శాతం పురోగమించింది. లారస్ ల్యాబ్స్ లో వాటా 4.68 శాతంమేర పెరిగి 20.74 శాతాన్ని తాకింది. షేరు 400 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో ఇంటలెక్ట్ డిజైన్, మాస్టెక్, టాటా కమ్యూనికేషన్స్, గ్లోబస్ స్పిరిట్స్, మార్క్ సన్స్ ఫార్మా, మజెస్కో 330-254 శాతం మధ్య ఎగశాయి. వీటిలో ఎఫ్ఐఐల వాటా 1.4-0.2 శాతం మధ్య పెరిగింది. -
అడ్వాన్స్డ్ ఎంజైమ్- సిప్లా.. భళిరా భళి
ట్రేడర్ల షార్ట్ కవరింగ్, వరుస నష్టాల కారణంగా దిగివచ్చిన బ్లూచిప్స్‌లో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్‌చేసి 37,150ను అధిగమించగా.. నిఫ్టీ 185 పాయింట్లు ఎగసి 10,990 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ దాదాపు 4 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు మల్టిపుల్ స్కెరోసిస్ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఓపెన్ మార్కెట్ ద్వారా నలందా ఇండియా ఈక్విటీ ఫండ్ 3.75 శాతం వాటాకు సమానమైన అడ్వాన్స్డ్ ఎంజైమ్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్‌డేటా వెల్లడించింది. షేరుకి రూ. 263.80 ధరలో అడ్వాన్స్డ్ ఎంజైమ్‌కు చెందిన 4.19 మిలియన్ ఈక్విటీ షేర్లను నలందా కొనుగోలు చేసింది. ఇందుకు నలందా ఇండియా రూ. 111 కోట్లు వెచ్చించింది. దీంతో అడ్వాన్స్డ్ ఎంజైమ్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 16 శాతం దూసుకెళ్లి రూ. 317ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 303 వద్ద ట్రేడవుతోంది. సిప్లా లిమిటెడ్ మల్టిపుల్ స్కెరోసిస్ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు సిప్లా లిమిటెడ్ వెల్లడించింది. ఇది బయోజెన్స్ టెక్‌ఫిడెరా ఔషధానికి జనరిక్ వెర్షన్‌గా పేర్కొంది. డైమెథల్ ఫ్యూమరేట్ డీఆర్ క్యాప్సూల్స్‌గా పిలిచే వీటిని 120 ఎంజీ, 240 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధానికి 3.8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 28,000 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 765 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 773 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టం రూ. 819కు చేరువకావడం గమనార్హం! -
జేబీ కెమ్- ఏడీఎఫ్ ఫుడ్స్.. హైజంప్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడికావడంతో ఫుడ్ ప్రొడక్టుల కంపెనీ ఏడీఎఫ్ ఫుడ్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. జేబీ కెమికల్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెల్త్‌కేర్ కంపెనీ జేబీ కెమికల్స్ రూ. 120 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 92 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 522 కోట్లను అధిగమించింది. ఇబిటా 62 శాతం ఎగసి రూ. 155 కోట్లను తాకగా.. మార్జిన్లు 8.25 శాతం మెరుగుపడి 29.76 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో జేబీ కెమ్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 16.5 శాతం దూసుకెళ్లింది. రూ. 965ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 918 వద్ద ట్రేడవుతోంది. ఏడీఎఫ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ ఏడీఎఫ్ ఫుడ్‌లో దాదాపు 1.49 లక్షల షేర్లను ఆశిష్ కచోలియా కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీలో 0.74 శాతం వాటాకు సమానమైన వీటిని కచోలియా షేరుకి రూ. 378 సగటు ధరలో సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఏడీఎఫ్ ఫుడ్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. అమ్మకందారులు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 400 సమీపంలో ఫ్రీజయ్యింది. సోమవారం సైతం ఈ షేరు ఇదే స్థాయిలో లాభపడటం గమనార్హం! -
వొడాఫోన్‌లో గూగుల్ పెట్టుబడులు!
సాక్షి, న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం గూగుల్ వొడాఫోన్ ఇండియాలో 5 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ డీల్ ఖరారైతే రూ వేలాది కోట్ల నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వొడాఫోన్‌కు ఊరట కలిగే అవకాశం ఉంది. రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్ ఇండియాలో వాటా కొనుగోలుకు గూగుల్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. వొడాఫోన్ ఇండియాలో గూగుల్ 5 శాతం వాటా కొనుగోలు చేయనుందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించిండి. ఈ ఒప్పందం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున ఒప్పందంలో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పదిశాతం వాటా కొనుగోలుకు ముందుకొచ్చిన నేపథ్యంలో వొడాఫోన్‌లో గూగుల్ పెట్టుబడుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జియోతో ఫేస్బుక్ ఒప్పందం ఖరారు కాకముందే జియోలో వాటా కొనుగోలుకు గూగుల్ ఆసక్తి కనబరిచినట్టు ప్రచారం సాగింది. టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్‌లు టెలికాం రంగంలోకి ప్రవేశించడంతో టెలికాం మార్కెట్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
హెచ్‌డీఎఫ్‌సీలో చైనా బ్యాంక్ వాటాలు పెంపు
సాక్షి, ముంబై : భారత్‌కు చెందిన హెచ్డీఎఫ్సీ సంస్థలో చైనా సెంట్రల్ బ్యాంక్ తన వాటాలు పెంచుకుంది. 0.8 శాతం నుంచి 1.01 శాతానికి పెంచినట్లు బ్యాంకు వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన త్రైమాసిక గణాంకాల ప్రకారం, మార్చి చివరి నాటికి చైనా సెంట్రల్ బ్యాంక్ 17.5 మిలియన్ షేర్లను కలిగి ఉంది. దీంతో సోమవారం హెచ్డీఎఫ్సీ షేరు 3.5 శాతం ఎగిసింది. మార్కెట్ల బలహీనత నేపథ్యంలో ప్రస్తుతం 1.7 శాతం నష్టంతో కొనసాగుతోంది. మార్చి త్రైమాసికానికి గాను షేర్ల వివరాల ప్రకారం, దేశంలో అతిపెద్ద గృహ తనఖా రుణదాత అయిన హెచ్‌డీఎఫ్‌సీలో(హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్)లో సెంట్రల్ బ్యాంక్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) చైనా సావరిన్ వెల్త్ ఫండ్ సేఫ్ తరపున దాదాపు 1.75 కోట్ల వాటాలను కొనుగోలు చేసింది. కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పలు కంపెనీలు భారీగా క్షీణించడంతో చైనాకు చెందిన సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండడం విశేషం. కాగా కరోనావైరస్ మహమ్మారి , ఆర్ధిక పతనం ఆందోళనలతో మార్చిలో హెచ్డీఎఫ్సీ షేరు విలువ 25 శాతానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. (మరింత బలహీనపడిన రూపాయి) (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు) -
జెట్ ఎయిర్వేస్పై ‘టాటా’ కన్ను
ముంబై : దేశీయ అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ కన్ను ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్పై పడింది. జెట్ ఎయిర్వేస్లో అతిపెద్ద మొత్తంలో వాటా దక్కించుకోవాలని టాటా గ్రూప్ చర్చలు జరుపుతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. నరేష్ గోయల్‌కు చెందిన జెట్, పైలెట్లకు వేతనాలు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో పైలెట్లు, సీనియర్ ఉద్యోగులు మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, జీతాలను ఇన్స్టాల్మెంట్లలో చెల్లిస్తామని ఈ సంస్థ చెబుతోంది. ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్లో టాటా గ్రూప్ మెజార్టీ వాటా దక్కించుకుని, మేనేజ్మెంట్ కంట్రోల్ పొందాలని చూస్తోంది. జెట్ ఎయిర్వేస్ ఆ కంపెనీ ప్రమోటర్ నరేష్ గోయల్‌కు 51 శాతం వాటా ఉంది. మిగతా మొత్తంలో 24 శాతం ఇతిహాద్ ఎయిర్వేస్, 2.1 శాతం ఎల్ఐసీ, 3.6 శాతం ఎంఎఫ్ఎస్, ఇతరుల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం నరేష్ గోయల్‌కు ఉన్న షేరులో 26 శాతం టాటా గ్రూప్ కొనుగోలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాటా రెండు ఏవియేషన్ జాయింట్ వెంచర్లను కలిగి ఉంది. ఒకటి సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆపరేటింగ్ విస్తారా, రెండు బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా. విస్తారా ఎయిర్‌లైన్, జెట్ ఎయిర్వేస్కు ఏవియేషన్ మార్కెట్లో తీవ్ర పోటీ ఉంది. ఒకవేళ ఈ డీల్ కుదిరితే టాటా గ్రూప్ నెట్వర్క్ పరంగా, మార్కెట్ షేరు పరంగా తన ఏవియేషన్ వ్యాపారాలను విస్తరించుకోనుంది. అయితే ఈ విషయాలపై స్పందించడానికి టాటా సన్స్ అధికార ప్రతినిధి నిరాకరిస్తే, జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కంట్రోలింగ్ హక్కులపై ఇరు సంస్థల నుంచి తేడాలు వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ చర్చలు కనుక సఫలమైతే, ఇతిహాద్, జెట్ ఎయిర్వేస్లో ఉన్న తన వాటాను విక్రయించనుంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేయాలని టాటాలు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం పెట్టే షరతులతో వీరి బిడ్డింగ్ తుది దశకు చేరుకోలేదు. అసలు ఎయిరిండియా తొలుత టాటాలదే. టాటా ఎయిర్‌లైన్స్‌గా స్థాపించి, ఎయిరిండియాగా పబ్లిక్‌లోకి వచ్చింది. కానీ 1953లో దాన్ని ప్రభుత్వం తన పరం చేసుకుంది. ఇప్పుడు ఎయిరిండియాకు కూడా అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో, దాన్ని అమ్మేయాలని చూస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ దిగ్గజం పెట్టుబడులు
బెంగళూరు : అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే భారత్‌లో పెట్టుబడులతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీన్ని మరింత హడలెత్తిస్తూ... అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ స్టోర్లు, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మెనార్టీ వాటా కొనుగోలు చేయబోతున్నట్టు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ స్టోర్లు మైనార్టీ వాటా కొనుగోలు చేసేందుకు జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. 15 శాతం నుంచి 20 శాతం వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేయబోతున్నట్టు తెలిసింది. మార్చి వరకు ఈ డీల్ తుది రూపం దాల్చుతుందని రిపోర్టు తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డౌ మెక్‌మిల్లన్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఫ్లిప్‌కార్ట్ బెంగళూరు ఆఫీసును కూడా ఈ వారంలో ప్రారంభంలో సందర్శించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రూమర్లు, ఊహాగానాలపై తాము ఎలాంటి కామెంట్ చేయమని వాల్‌మార్ట్ స్టోర్స్ అధికార ప్రతినిధి రాండీ హర్గ్రోవే అన్నారు. మెక్‌మిల్లన్ దేశంలో మూడు యూనిట్లపై సమీక్షించేందుకు వచ్చారని, నగదు, వ్యాపారాల నిర్వహణ, గ్లోబల్ టెక్నాలజీ సెంటర్, గ్లోబల్ సోర్సింగ్ వంటి వాటిపై ఆయన రివ్యూ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ సైతం దీనిపై స్పందించలేదు. కొంతమంది దీర్ఘకాలిక పెట్టుబడిదారుల ద్వారా నిర్వహించే ప్రైమరీ, సెకండరీ సేల్స్ ఈ డీల్‌లో భాగమై ఉండొచ్చని తెలుస్తోంది. గతేడాదే ఫ్లిప్‌కార్ట్ పోటీదారి అమెజాన్, హోల్ ఫుడ్స్‌లో 400 స్టోర్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసింది. భారత్‌లో అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. వాల్‌మార్ట్‌తో డీల్‌తో ఈ పోటీ మరింత తీవ్రతరం కానుంది. -
నాగార్జున ఆయిల్ సింగపూర్ కంపెనీ వశం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమిళనాడులోని నాగార్జున ఆయిల్ కార్పొరేషన్‌కు (ఎన్‌వోసీఎల్) చెందిన ఆయిల్ రిఫైనరీ యూనిట్‌లోని 46.78 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సింగపూర్ కంపెనీ ముందుకొచ్చింది. నాగార్జున ఆయిల్ రిఫైనరీ పేరుతో రూ. 25,000 కోట్లతో కడలూరులో ఎన్‌వోసీఎల్ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులోని పూర్తి వాటాను సింగపూర్‌కు చెందిన నెట్‌ఆయిల్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఎన్‌వోసీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. కంపెనీ విలువను ఇంకా లెక్కించాల్సి ఉంది. 12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ నిధుల కొరతతో సతమతమవుతోంది. ఈ కొనుగోలు పూర్తయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎన్‌వోసీఎల్‌కి పెద్ద ఊరట లభించినట్లే.