న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్)లో ఖతార్‌కు చెందిన సార్వభౌమ నిధి ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (క్యూఐఏ) 2.5 శాతం పైగా వాటాలను కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 3,920 కోట్లు వెచ్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఏఈఎంఎల్)లో 2020లో 25.1 శాతం వాటాలు కొనుగోలు చేసిన క్యూఐఏ మళ్లీ అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇది రెండోసారి.
స్టాక్ ఎక్ఛేంజీల డేటా ప్రకారం ప్రమోటర్ గ్రూపు సంస్థ ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ .. ఏజీఈఎల్‌లో సుమారు 4.49 కోట్ల షేర్లను (2.8 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 920 చొప్పున మొత్తం రూ. 4,131 కోట్లకు విక్రయించింది. క్యూఐఏ అనుబంధ సంస్థ అయిన ఐఎన్‌క్యూ హోల్డింగ్ 4.26 కోట్ల షేర్లను (దాదాపు 2.68 శాతం వాటా) కొనుగోలు చేసింది. సగటున రూ. 920 రేటు చొప్పున ఇందుకోసం మొత్తం రూ. 3,920 కోట్లు వెచ్చించింది.
Comments
Please login to add a commentAdd a comment