
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్టులు, విడిభాగాల జర్మన్ స్టార్టప్ కిల్‌వాట్ జీఎంబీహెచ్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా పేర్కొంది. 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. కొత్తగా జారీ చేయనున్న 8,500 ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా వాటాను పొందనుంది.
ఇందుకు షేరుకి 235.29 యూరోల చొప్పున చెల్లించనుంది. ఇందుకు దాదాపు రూ. 18 కోట్లు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అవసరమయ్యే హైటెక్ ప్రొడక్టులు, విడిభాగాల డిజైన్, తయారీ, పంపిణీ చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment