TVS Motors
-
పండుగలకు జోరుగా టూ వీలర్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్ తిరిగి బలంగా పుంజుకోవడం, రుతుపవనాల పునరుద్ధరణ కారణంగా రాబోయే పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కమ్యూటర్ బిజినెస్ హెడ్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్లకు ఆదరణ పెరగడం ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని అన్నారు. మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల విభాగం వాటా ప్రస్తుతం 32 శాతం ఉందని, ఇది మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీ కారణంగా స్కూటర్లు మెరుగైన మైలేజీ ఇవ్వడం కూడా కస్టమర్ల ఆసక్తికి కారణమైందని వివరించారు. అదనంగా స్థలం, సౌకర్యం, సౌలభ్యం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగవడం కూడా స్కూటర్ల వినియోగం పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పారు. అటు కుటుంబ సభ్యులు సైతం సౌకర్యంగా నడపవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల డిమాండ్.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో టూ వీలర్స్ పరిశ్రమలో 13 శాతం వృద్ధిని చూశామని అనిరుద్ధ హల్దార్ తెలిపారు. ‘ఇది ఇటీవలి సంవత్సరాలలో మనం చూసిన దానికంటే ఎక్కువ. ఈమధ్య గ్రామీణ ప్రాంతాల డిమాండ్ పట్టణ ప్రాంతాలను మించిపోవడం మరింత సంతోషకరమైన విషయం. గ్రామీణ డిమాండ్ పట్టణ డిమాండ్‌ను అధిగమించడం ప్రారంభించినప్పుడు ఇది మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమకు చాలా మంచి సంకేతం. పండుగల సీజన్లో మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమ ప్రస్తుత వృద్ధి రేటును అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. పరిశ్రమను మించిన వృద్ధిని టీవీఎస్ నమోదు చేస్తుందని నమ్మకంగా ఉంది’ అని హల్దార్ చెప్పారు. -
ఎలక్ట్రిక్ టూవీలర్స్ పోటీ!
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా జూలై నెలలో సేల్స్ దాదాపు రెట్టింపు కావడం దీనికి నిదర్శనం. మరోపక్క, ఈ విభాగంలో పోటీ ఫాస్ట్ చార్జింగ్ అవుతోంది. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు షాకిస్తున్నాయి. ధరల యుద్ధానికి తెరతీసి, ఓలా మార్కెట్ వాటాకు గండికొడుతున్నాయి. ఐపీఓ సక్సెస్‌తో దండిగా నిధుల జోష్‌లో ఉన్న ఓలా.. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది! ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1,07,016 ఈ–టూవీలర్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన 54,616 వాహనాలతో పోలిస్తే 96 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాలు 79,868 మాత్రమే. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సేల్స్ మళ్లీ ఎలక్ట్రిక్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పెట్రోలు టూవీలర్లలో రారాజులుగా ఉన్న సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటో సైతం ఎలక్ట్రిక్ బరిలో తగ్గేదేలే అంటూ కాలుదువ్వడమే దీనికి ప్రధాన కారణం. జూలైలో బజాజ్ ఆటో ఏకంగా 17,642 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం విశేషం. జూన్‌తో పోలిస్తే 80 శాతం సేల్స్ పెరిగాయి. మార్కెట్ వాటా సైతం 11.6 శాతం నుంచి 16.9 శాతానికి జంప్ చేసింది. ఇక టీవీఎస్ అమ్మకాలు 30 శాతం పైగా ఎగబాకి 19,471 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండింటితో పోలిస్తే వెనుకబడ్డ హీరో మోటో 5,044 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి సత్తా చాటింది. మొత్తంమీద చూస్తే, ఈ మూడు దిగ్గజాల ‘ఎలక్ట్రిక్’ వాటా 40 శాతానికి పైగా ఛార్జింగ్ అయింది. ఇందులో టీవీఎస్, బజాజ్ వాటాయే దాదాపు 35 శాతం గమనార్హం. ఓలాకు షాక్... రెండు నెలల క్రితం, మే నెలలో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాతో తిరుగులేని స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీ సెగ బాగానే తగులుతోంది. జూన్‌లో కంపెనీ 36,781 వాహనాలు విక్రయించగా.. జూలైలో ఈ సంఖ్య కాస్త మెరుగుపడి 41,597కు చేరింది. అయితే, మార్కెట్ వాటా మాత్రం జూన్‌లో 47.5 శాతానికి, ఆపై జూలైలో ఏకంగా 40 శాతానికి పడిపోయింది. ఓలాకు తగ్గుతున్న మార్కెట్ వాటాను సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ వేగంతో కొట్టేస్తున్నాయి. మరోపక్క, పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ఏథర్ ఎనర్జీ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. జూన్‌లో 6,189 (8% మార్కెట్ వాటా), జూలైలో 10,080 (10% వాటా) వాహనాలను అమ్మింది. అయితే, దీని స్కూటర్ల ధరలు రూ. లక్ష పైనే ఉన్నాయి. సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు రూ. లక్ష లోపు ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుండటంతో.. ఓలా, ఏథర్ వంటి పూర్తి ఈవీ కంపెనీలు కూడా ధరల యుద్ధంలోకి దూకాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాటా పతనంతో ఓలా ఇక పూర్తిగా ఈ–టూవీలర్లపైనే దృష్టిసారించాలని నిర్ణయించుకుంది.భారీ నెట్వర్క్, సర్వీస్ ప్లస్..తొలిసారిగా రూ. లక్ష లోపు స్కూటర్లను ప్రవేశపెట్టడం కూడా బజాజ్, టీవీఎస్, హీరో అమ్మకాలు పుంజుకున్నాయి. ‘ఈ 3 సాంప్రదాయ టూవీలర్ కంపెనీలకు విస్తృత డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్, బ్రాండ్ విలువ, సర్వీస్ సదుపాయాలు దన్నుగా నిలుస్తున్నాయి.మార్కెట్ వాటాను కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని రీసెర్చ్ సంస్థ నోమురా ఆటోమోటివ్ రిటైల్ విభాగం హెడ్ హర్షవర్ధన్ శర్మ పేర్కొన్నారు. ధరల పోరు, బ్యాటరీ టెక్నాలజీలో మెరుగుదల వంటివి ఈ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. తాజా పరిణామాలతో ఛార్జింగ్ స్టేషన్ల భారీ పెరుగుదలతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయాలు జోరందుకుంటాయని, వినియోగదారులకు కూడా ఇది మేలు చేకూరుస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టీవీఎస్ నుంచి మరిన్ని ఎలక్ట్రిక్ టూ–వీలర్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ వచ్చే ఏడాది వ్యవధిలో తమ ఎలక్ట్రిక్ టూ–వీలర్ల పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. అలాగే విద్యుత్ త్రిచక్ర వాహనాన్ని కూడా రూపొందిస్తోంది. 5 నుంచి 25 కిలోవాట్ల శ్రేణిలో పలు వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐక్యూబ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 25,000 యూనిట్లకు పెంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రెండు ఈ–స్కూటర్లు ఉన్నాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ విక్రయాలు ఈ క్వార్టర్‌లోనే ప్రారంభించనున్నట్లు రాధాకృష్ణన్ చెప్పారు. -
మొదటిసారి ఈ-రేసింగ్ ఛాంపియన్షిప్ - టీవీఎస్ మోటార్స్
బెంగళూరు: టీవీఎస్ మోటార్స్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు(టీవీఎస్ ఎలక్ట్రిక్ వన్ మేకింగ్ చాంపియన్‌షిప్) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఈ రేస్ మోటార్‌సైకిళ్లతో ఈ పోటీలు జరగనున్నాయి. ఈవీ మోటార్ రేసింగ్ ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించిన మొట్ట మొదటి భారత కంపెనీ తమదేనని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. భారత్‌లో మోటార్స్పోర్ట్స్లను ప్రోత్సహించడం, సుస్థిర రవాణా పరిష్కారాలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త బైకులు, ఇవే!
Upcoming Bikes: 2023 ఆగష్టు నెల ముగిసింది.. గత నెలలో హీరో కరీజ్మా ఎక్స్ఎమ్ఆర్, టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్, హోండా SP160, ఓలా ఎస్1 వంటివి విడుదలయ్యాయి. కాగా ఈ నెలలో మరి కొన్ని విడుదలకావడానికి సన్నద్ధమవుతున్న బైకులు ఏవి? ఎప్పుడు లాంచ్ అవుతాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్స్ ఈ నెలలో అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇది కేవలం రీబ్యాడ్జ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ మాత్రమే కాదు.. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉండనై ఆశిస్తున్నాము. ఇది 2023 సెప్టెంబర్ 06న విడుదలకానున్నట్లు సమాచారం. 2024 కేటీఎమ్ 390 డ్యూక్.. యువతరానికి ఇష్టమైన కెటిఎమ్ బ్రాండ్ త్వరలో 2024 కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల చేయనుంది. ఈ బైక్ 399 సీసీ ఇంజిన్ కలిగి 44.8 హార్స్ పవర్ & 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము. సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ.. సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ నెలలో తన వీ-స్ట్రోమ్ 800 డీఈ బైక్ లాంచ్ చేయనుంది. ఇది 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించనుంది. ఈ కొత్త 800DE ఒక ఆధునిక ఎలక్ట్రానిక్స్ సూట్ అండ్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంది. ఈ కొత్త బైకుకి సంబంధించిన ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి. -
టీవీఎస్, జొమాటో జోడీ.. డెలివరీల కోసం 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జొమాటో ప్లాట్‌ఫామ్‌పై డెలివరీల కోసం వచ్చే రెండేళ్లలో టీవీఎస్ తయారీ 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెడతారు. 2030 నాటికి డెలివరీల కోసం పూర్తిగా ఈవీలను ఉపయోగించాలని జొమాటో లక్ష్యంగా చేసుకుంది. అలాగే వచ్చే రెండేళ్లలో ఒక లక్ష ఈవీలతో కార్యకలాపాలను సాగించేందుకు 50కిపైగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. 2020లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించిన టీవీఎస్ మోటార్ ఇప్పటి వరకు ఒక లక్షకుపైగా యూనిట్లను విక్రయించింది. -
టీవీఎస్ నుంచి కొత్త బైక్.. పేరేంటో తెలుసా?
అనేక ఆధునిక వాహనాలు భారతీయ మార్కెట్లో అడుగుపెడుతున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) దేశీయ విఫణిలో ఓ కొత్త బైక్ విడుదల చేయడానికి ట్రేడ్ మార్క్ దాఖలు చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కంపెనీ 'అపాచీ ఆర్టీఎక్స్' (Apache RTX) అనే నేమ్‌ప్లేట్‌ను ట్రేడ్‌మార్క్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అపాచీ విభాగంలో 160సీసీ, 180సీసీ, 200సీసీ, 310సీసీ బైకులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. కాగా ఈ సెగ్మెంట్లో మరో కొత్త మోడల్ చేరటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌పై టీవీఎస్ కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు ఒక బైక్ కూడా విడుదల చేయలేదు. రాబోయే కొత్త బైక్ టీవీఎస్ ఆర్టీఆర్ కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతే కాకుండా చాలా మంది వాహన ప్రియులు అడ్వెంచర్ బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ బైకులు ఆల్ ఇన్ వన్ బైకులుగా ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!) కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ తప్పకుండా ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జర్మన్ స్టార్టప్‌లో టీవీఎస్‌కు 25 శాతం వాటా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్టులు, విడిభాగాల జర్మన్ స్టార్టప్ కిల్వాట్ జీఎంబీహెచ్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా పేర్కొంది. 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. కొత్తగా జారీ చేయనున్న 8,500 ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా వాటాను పొందనుంది. ఇందుకు షేరుకి 235.29 యూరోల చొప్పున చెల్లించనుంది. ఇందుకు దాదాపు రూ. 18 కోట్లు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అవసరమయ్యే హైటెక్ ప్రొడక్టులు, విడిభాగాల డిజైన్, తయారీ, పంపిణీ చేపడుతోంది. -
టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ కొత్తగా అప్డేట్ చేసిన జూపిటర్ వెహికల్నులాంచ్ చేసింది. దేశంలో 50 లక్షల స్కూటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా స్పెషల్ ఎడిషన్‌గా ‘‘ ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వెహికిల్స్ ఆన్ రోడ్’’ అంటూ టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్‌ను తెచ్చింది. ఈ స్కూటర్లు మిస్టిక్ గ్రే, రీగల్ పర్పుల్ రంగుల్లో లభ్యం. క్లాసిక్ టాప్-స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ. 85,866 (ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది. కాస్మెటిక్ మార్పులు, ఇంజీన్ జూపిటర్ క్లాసిక్ ఇతర వేరియంట్లతో పోల్చినప్పుడు అది ప్రత్యేకంగా కనిపించేలా పలు బ్యూటీ అప్డేట్స్ ఇచ్చింది. ముందు ,బ్రౌన్ బాడీ ప్యానెల్ల వద్ద లేతరంగు గల విజర్‌ను పొందుతుంది (ఇతర వేరియంట్లు బ్లాక్ ప్యానెల్). మిర్రర్లు ఇతర వేరియంట్లలో క్రోమ్‌తో పోలిస్తే బ్లాక్ ఫినిషింగ్‌ను ఇచ్చింది. ఫ్రంట్ ఆప్రాన్ న్యూ గ్రాఫిక్స్, పైనుంచి కిందికి జుపిటర్ బ్యాడ్జింగ్ లాంటివి యాడ్ చేసింది. జూపిటర్ క్లాసిక్ నెక్స్ట్ జెన్ అల్యూమినియం, 109.7 సిసి, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ 7.47 పిఎస్ పవర్, 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మోటార్ పేటెంట్ ఎకోనోమీటర్తో కూడా వస్తుంది, ఇది 'ఎకో మోడ్' ,'పవర్ మోడ్' రెండింటిలోనూ రైడర్లను గైడ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్టర్,కిక్ స్టార్టర్ రెండింటితోపాటు, బ్రేకింగ్ హార్డ్‌వేర్, ముందు డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ఫోర్క్, త్రిస్టెప్ ఎడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఇందులో ఉన్నాయి. -
అదర గొట్టిన టీవీఎస్ మోటార్, షేరు జూమ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ కన్సాలిడేటెడ్‌గా జూన్ త్రైమాసికానికి రూ.297 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం రూ.7,348 కోట్లకు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్లో 5 శాతం ఎగిసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో టీవీఎస్ మోటార్ రూ.15 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం రూ.4,692 కోట్లుగా ఉంది. గతేడాది మొదటి త్రైమాసికంలో లాక్డౌన్లు అమల్లో ఉన్నందున, నాటి ఫలితాలను తాజాగా ముగిసిన త్రైమాసికంతో పోల్చి చూడకూడదని సంస్థ పేర్కొంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల విక్రయాలు (ఎగుమతులు సహా) 9.07 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి విక్రయాలు 6.58 లక్షల యూనిట్లుగా ఉండడం గమనించాలి. మోటారు సైకిళ్ల విక్రయాలు 3.06 లక్షల యూనిట్ల నుంచి 4.34 లక్షల యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల విక్రయాలు 1.38 లక్షల నుంచి 3.06 లక్షల యూనిట్లకు చేరాయి. 2.96 లక్షల యూనిట్ల ద్వచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. రూ.125 కోట్ల విలువైన ఎన్సీడీలను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయాలని సంస్థ నిర్ణయించింది. -
అదరగొట్టేస్తున్న టీవీఎస్ కొత్త బైక్ ,ధర ఎంతంటే!
పంజిమ్ (గోవా): ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ బుధవారం ప్రీమియం లైఫ్‌స్టయిల్ 225 సీసీ బైక్ ’రోనిన్’ను ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో లభించే ఈ బైక్ ధర రూ. 1.49 లక్షలు, రూ. 1.56 లక్షలు, రూ. 1.69 లక్షలుగా (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. డ్యుయల్ చానల్ ఏబీఎస్, వాయిస్ అసిస్టెన్స్, అలాయ్ వీల్స్, ఎల్ఈడీ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఎంపిక చేసిన డీలర్ల దగ్గర ఈ నెల నుంచి రోనిన్ అందుబాటులో ఉంటుందని టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు తెలిపారు. రోనిన్ ఆవిష్కరణ తమ సంస్థకు ఒక మైలురాయిలాంటిదని ఆయన పేర్కొన్నారు. గడ్డుకాలం గట్టెక్కినట్లే.. దేశీ టూ–వీలర్ పరిశ్రమకు గడ్డు కాలం తొలగిపోయినట్లేనని, రాబోయే రోజుల్లో రెండంకెల స్థాయికి తిరిగి రాగలదని అంచనా వేస్తున్నట్లు వేణు వివరించారు. చిప్‌ల లభ్యత క్రమంగా మెరుగుపడుతోందని వేణు చెప్పారు. మెరుగైన వర్షపాతాల అంచనాలతో ఈ ఆర్థిక సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకోగలవని భావిస్తున్నట్లు టీవీఎస్ డైరెక్టర్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. కమోడిటీల ధరలు కొంత మేర సవాళ్లు విసిరే అవకాశం ఉందని చెప్పారు. ప్రీమియం బైక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటున్న ఆసియా, లాటిన్ అమెరికా తదితర ప్రాంతాలకు కూడా రోనిన్ బైక్‌ను ఎగుమతి చేయనున్నట్లు రాధాకృష్ణన్ వివరించారు. ప్రస్తుతం మోటర్‌సైకిల్ స్పోర్ట్స్ సెగ్మెంట్ (150 సీసీ పైబడి) నెలకు దాదాపు 1.5 లక్షల యూనిట్లుగా ఉంటోందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని సంస్థ ప్రీమి యం బిజినెస్ హెడ్ విమల్ సంబ్లీ తెలిపారు. -
టీవీఎస్ మోటార్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 237 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 290 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 6,095 కోట్ల నుంచి రూ. 6,597 కోట్లకు ఎగసింది. రాల్ఫ్ డైటర్ స్పేథ్ను చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు కంపెనీ బోర్డు పేర్కొంది. 2022 ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకిరానుండగా.. చైర్మన్ ఎమిరిటస్ హోదాలో వేణు శ్రీనివాసన్ కంపెనీ ఎండీ బాధ్యతలు కొనసాగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ3లో స్టాండెలోన్ నికర లాభం రూ. 266 కోట్ల నుంచి రూ. 288 కోట్లకు పుంజుకుంది. వాహన విక్రయాలు ఇలా: తాజా సమీక్షా కాలంలో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 9.52 లక్షల యూనిట్ల నుంచి 8.35 లక్షలకు తగ్గినట్లు టీవీఎస్ మోటార్ వెల్లడించింది. వీటిలో ఎగుమతులు 12 శాతం వృద్ధిని సాధించగా.. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4.26 లక్షల యూనిట్ల నుంచి 4.46 లక్షల యూనిట్లకు పుంజుకున్నాయి. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు 2.5 శాతం నష్టంతో రూ. 637 వద్ద ముగిసింది. -
అదిరే లుక్స్, హై రేసింగ్ పర్ఫార్మెన్స్తో నయా టీవీఎస్ అపాచీ లిమిటెడ్ ఎడిషన్ బైక్!
ప్రముఖ టూవీలర్ వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ న్యూ రేస్ పర్ఫార్మెన్స్ (ఆర్పీ) సిరీస్ బైక్‌లను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ మొదటి బైక్‌గా నిలవనుంది. ఈ బైక్‌ను కొనుగోలుదారులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చును. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌గా రానుంది. కేవలం 200 యూనిట్లను మాత్రమే టీవీఎస్ ఉత్పత్తి చేయనుంది. దీని ధర రూ. 1,45,000(ఎక్స్ షోరూమ్ ధర) టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ ఫీచర్స్..! ఈ బైక్‌లో అధునాతన 164.9 సీసీ సింగిల్-సిలిండర్ 4-వాల్వ్ ఇంజన్‌తో రానుంది. 10,000 ఆర్పీఎమ్ వద్ద 19 బీహెచ్పీ, 8,750 ఆర్పీఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ శక్తిని విడుదల చేయనుంది. ఈ బైక్‌లో కొత్త సిలిండర్ హెడ్, ట్విన్ ఎలక్ట్రోడ్ స్పార్క్ ప్లగ్‌తో రానుంది. రేసింగ్ పర్ఫెర్మెన్స్ కోసం హై-లిఫ్ట్, హై-డ్యూరేషన్ క్యామ్స్ , డ్యూయల్ స్ప్రింగ్ యాక్యుయేటర్లను అమర్చారు. అధిక కంప్రెషన్ రేషియో కోసం కొత్త డోమ్ పిస్టన్ పరిచయం చేసింది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీనిలో రేస్-ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, సర్దుబాటు చేయగల క్లచ్, బ్రేక్ లివర్లను కూడా కలిగి ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ బైక్‌లో రేసింగ్ డీకాల్స్, రెడ్ అల్లాయ్ వీల్స్ ,కొత్త సీట్ ప్యాటర్న్‌తో రానుంది. కొత్త హెడ్‌ల్యాంప్ అసెంబ్లీతో పాటు ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్స్ (FPL)తో పాటుగా లో,హైబీమ్తో ఏకకాలంలో పని చేయనుంది. చదవండి: టూవీలర్ కొనుగోలుదారులకు మరోసారి భారీ షాక్..! -
స్పైడర్‌మ్యాన్ క్రేజ్..! మార్కెట్లలోకి సూపర్ హీరోస్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్స్
Tvs Ntorq 125 Price And Mileage: ప్రపంచవ్యాప్తంగా మార్వెల్స్ హీరోస్‌పై క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీలు మార్వెల్స్ హీరోస్ స్ట్రాటజీతో తమ వ్యాపారాలకు మరింత ఆదాయాలను సంపాదించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న రిలీజైన స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ వెండి తెర సంచలనం సృష్టిస్తోంది. భారత్‌లో కూడా స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ క్రేజ్ మామూలుగా లేదు. మార్వెల్స్ హీరోస్ లవర్స్ కోసం ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మార్వెల్స్ సూపర్ హీరోస్ ఎడిషన్ స్కూటర్లను లాంచ్ చేసింది. చదవండి: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..! అందులో టీవీలు, హెడ్‌ఫోన్స్, ఇంకా మరెన్నో..! టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ NTORQ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మరో రెండు మార్వెల్ సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్, థోర్ ప్రేరేపిత స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. గత ఏడాది సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మార్వెల్ సూపర్ హీరోస్ - ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా ఎడిషన్ టీవీఎస్ Ntorq 125బైక్‌లను ప్రారంభించింది. భారత్‌లోకి RT-Fi సాంకేతికతతో వచ్చిన మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన స్కూటర్‌గా టీవీఎస్ Ntorq 125 నిలుస్తోంది. సూపర్ హీరోస్ ఫీచర్స్‌తో..! కొత్త మార్వెల్ స్పైడర్ మ్యాన్ , థోర్ వెర్షన్లు స్కూటర్స్ సూపర్ హీరోల ముఖ్య లక్షణాలను టీవీఎస్ Ntorq 125 ఏర్పాటుచేశారు. స్పైడర్ మ్యాన్, థోర్ కు సంబంధించిన విషయాలను ఇందులో ఉండేలా టీవీఎస్ డిజైన్ చేసింది. ఈ స్కూటర్లలోని స్మార్ట్‌కనెక్ట్ యాప్ స్పైడర్ మ్యాన్ లోగో , థోర్స్ హమర్ వంటి సంబంధిత పాత్రల చిహ్నాల సిల్హౌట్‌తో ఒపెన్ కానుంది.ఈ స్కూటర్లు మార్వెల్ సూపర్ హీరోస్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఎంతంటే..! టీవీఎస్ NTORQ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 84,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు... స్కూటర్ మొదటి-రకం వాయిస్ అసిస్ట్ ఫంక్షన్, మొదటి-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్ రైడ్ మోడ్‌లను అందించే వేరియంట్‌తో రానుంది. చదవండి: మల్టీప్లెక్సుల బిజినెస్ అదరహో.. సాయం చేసిన స్పైడర్‌మ్యాన్- భరోసా ఇచ్చిన పుష్ప -
ఈవీ కంపెనీల నిధుల వేట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్, ప్రోత్సాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ–వాహనాల కంపెనీలు నిధులు సమకూర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్‌లో ద్విచక్ర వాహనాల దిగ్గజం టీవీఎస్ మోటార్స్ మరిన్ని పెట్టుబడులు పెట్టింది. జోహో కార్పొరేషన్‌తో కలిసి ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. అయితే, పెట్టుబడి పరిమాణాన్ని వెల్లడించలేదు. భారీ సామర్థ్యం ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎఫ్77 తయారీ, విక్రయాలకు ఈ నిధులను అల్ట్రావయొలెట్ ఉపయోగించుకోనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీలో అల్ట్రావయొలెట్ తమ తయారీ, అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎఫ్77 బైక్‌ల తొలి బ్యాచ్‌ను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న మొబిలిటీ సేవల సంస్థ బౌన్స్ కూడా భారీ ఎత్తున నిధులను సమీకరిస్తోంది. ’బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి సంబంధించి మరో 200 మిలియన్ డాలర్లు సమకూర్చుకోవాలని యోచిస్తోంది. బౌన్స్ ఇప్పటిదాకా యాక్సెల్, సెకోయా, బి క్యాపిటల్ గ్రూప్ వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి 220 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు దక్కించుకుంది. ఈ ఏడాదే దాదాపు 7 మిలియన్ డాలర్లు వెచ్చించి 22మోటార్స్ సంస్థలో 100 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీనితో రాజస్తాన్‌లోని భివాడీలో ఉన్న అధునాతన తయారీ ప్లాంటు కంపెనీ చేతికి వచ్చింది. ఇందులో వార్షికంగా 1,80,000 స్కూటర్లను ఉత్పత్తి చేయొచ్చు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరగబోయే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ భారతదేశంలో దాదాపు 5,00,000 వాహనాల తయారీ సామర్థ్యంతో మరో ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో బౌన్స్ ఉంది. ఇందుకోసం వచ్చే ఏడాది వ్యవధిలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం 100 మిలియన్ డాలర్లను పక్కన పెట్టింది. ఒబెన్లో ఉయ్ ఫౌండర్ సర్కిల్ ఇన్వెస్ట్మెంట్లు అటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్టార్టప్ సంస్థ ఒబెన్ ఈవీ 1.5 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. ప్రారంభ దశ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల గ్రూప్ అయిన ఉయ్ ఫౌండర్ సర్కిల్‌తో పాటు లైఫ్ ఎలిమెంట్ కో–ఫౌండర్ రాకేశ్ సొమానీ, ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్లు సుమీత్ పాఠక్, మిలన్ మోదీ తదితరులు ఈ విడత ఇన్వెస్ట్ చేశారు. తమ బైక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు, ఎక్స్పీరియన్స్ సెంటర్లను విస్తరించేందుకు ఒబెన్ ఈ నిధులు వినియోగించుకోనుంది. ఒక్కసారి చార్జి చేస్తే 200 కి.మీ. దాకా ప్రయాణించగలిగే ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేసే ప్రయత్నాల్లో ఒబెన్ ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 100 కి.మీ.లుగా ఉంటుంది. వచ్చే రెండేళ్లలో వివిధ విభాగాల్లో నాలుగు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ చెబుతోంది. మరో ఆరు నెలల్లో తొలి ఉత్పత్తిని ఆవిష్కరించనున్నట్లు సంస్థ వివరించింది. -
టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన ధరలు!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ జూపిటర్ 110 కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఇటీవల జూపిటర్ 125 స్కూటర్ లాంచ్ చేసిన తర్వాత టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు తన అత్యంత ప్రజాదరణ పొందిన జూపిటర్ 110 స్కూటర్ ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త ధరల పెంపుతో, జూపిటర్ 110 ఇప్పుడు ధర రూ.600 వరకు పెరగనుంది. టీవీఎస్ జూపిటర్ 110 వేరియెంట్ వారీగా కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. షీట్ మెటల్ వీల్: ₹66,273 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) స్టాండర్డ్: ₹69,298 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) జడ్ ఎక్స్ (డ్రమ్ బ్రేక్): ₹72,773 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) జడ్ ఎక్స్ (డిస్క్ బ్రేక్): ₹76,573 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) క్లాసిక్: ₹76,543 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) టీవీఎస్ జూపిటర్ 109.7సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ చేత పనిచేస్తుంది. ఇది 7.37బిహెచ్ పీ పవర్, 8.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ స్కూటర్ ఎకోత్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఈటి-ఫై) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల 15 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ జూపిటర్ లో డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. స్కూటర్లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, మొబైల్ ఛార్జర్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇన్ టెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది. -
ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై టీవీఎస్ కీలక నిర్ణయం..!
ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఏకంగా కొత్త కంపెనీను సెటప్ చేయాలని టీవీఎస్ మోటార్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ టీవీఎస్ మోటార్స్‌కు అనుబంధ సంస్థగా పనిచేయనుంది. ఈ కంపెనీ ద్వారా ఈవీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు..పలు కొత్త ఈవీ ప్రొడక్ట్స్ లాంచ్, డెవలమెంట్ అండ్ విస్తరణకు నిలయంగా ఉంటుందని టీవీఎస్ భావిస్తోంది. చదవండి: ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారు ధర మరి ఇంత తక్కువ! టూవీలర్, త్రీవీలర్ పరిశ్రమల కోసం వివిధ ఈవీ కాన్సెప్ట్లపై సుమారు 500కు పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారని టీవీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈవీ టెక్నాలజీ కోసం భవిష్యత్తులో రూ. 300 కోట్ల వరకు ఖర్చు చేయాలని టీవీఎస్ యోచిస్తోంది. కంపెనీ ఇటీవలే స్విట్జర్లాండ్‌కు చెందిన ఈవీ కంపెనీ ఇగో మూవ్మెంట్లో మెజారిటీ వాటాను టీవీఎస్ కొనుగోలు చేసింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల్లో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్ ఈ-స్కూటర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ ఎంపిక చేసిన నగరాల్లోనే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. చదవండి: TVS Motor: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! -
అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటర్స్ (2021-22) ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో సుమారు రూ. 5,619 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.4605 కోట్లను సొంతం చేసుకోగా... గత ఏడాదితో పోలిస్తే కంపెనీ రెండో త్రైమాసికంలో 22 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. క్యూ2లో రూ.277.60 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది రూ. 196.3 కోట్ల నికర లాభాలను సాధించింది. చదవండి: వ్యాక్సిన్ వేసుకోకుంటే జీతం కట్! ఆ కంపెనీ సంచలన నిర్ణయం ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా నెలకొన్న కంటైనర్లు, సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ టీవీఎస్ మోటార్స్ గణనీయంగా లాభాలను పొందింది. పన్ను ముందు లాభాలు సుమారు 41 శాతం పెరిగి రూ. 377 కోట్లకు చేరుకుంది, అదే సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో ₹ 267 కోట్లును టీవీఎస్ మోటార్స్ ఆర్జించింది. జూలై నుంచి సెప్టెంబర్ 2021 కాలంలో..సుమారు 8.70 లక్షల ద్విచక్ర వాహనాల అమ్మకాలను టీవీఎస్ జరిపింది. బజాజ్ ఆటో తర్వాత భారత నుంచి ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసే రెండో అతిపెద్ద కంపెనీగా టీవీఎస్ మోటార్స్ నిలుస్తోంది. చదవండి: ఫ్యూచర్ వీటిదేనా? లాభాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారేనా? -
మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ బైక్ : ధర?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మార్కెట్లలోకి మరో కొత్త రైడర్ స్పోర్ట్స్ బైక్ ప్రవేశపెట్టింది. దీని ధర ₹77,500(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త టీవీఎస్ బైక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ తో వచ్చింది. ఇది బజాజ్ పల్సర్ 125, ది హోండా సీబీ షైన్ ఎస్పీ బైక్‌లకు పోటీగా 2021 టీవీఎస్ రైడర్ నిలవనుంది. 2021 టీవీఎస్ రైడర్ బైక్ ఎల్ఈడీ డీఆర్ఎల్(డే టైమ్ రన్నింగ్ ల్యాప్స్), అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్, మోనో షాక్, ఎల్ఈడీ ల్యాంప్స్‌తో వచ్చింది. ఈ బైక్‌లో డిజిటల్ రివర్స్ డిస్ప్లే కూడా ఉంది. స్పోర్టీ లూక్‌తో 2021 టీవీఎస్ రైడర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. రైడర్ టీవీఎస్ స్మార్ట్ క్సోనెక్ట్ వేరియెంట్ తో 5 అంగుళాల టిఎఫ్ టీ క్లస్టర్ తో వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసీస్ట్ అందిస్తుంది. దీనిలో మరింత భద్రత కోసం సీబీబిఎస్ ఆప్షన్ ఇచ్చారు. మోటార్ సైకిల్ 124 సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 11.32 హెచ్‌పీ శక్తిని, 11.2 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైనది. ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్ తో వచ్చిన ఇదే మొట్టమొదటి మోటార్ సైకిల్.(చదవండి: దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!) -
బజాజ్ పల్సర్125కు పోటీగా టీవీఎస్ నుంచి అదిరిపోయే బైక్..!
ప్రముఖ బైక్‌ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మార్కెట్లలోకి మరో కొత్త బైక్‌ను రిలీజ్ చేయనుంది. కంపెనీ నుంచి రాబోయే బైక్‌ను టీవీఎస్ తన సోషల్‌మీడియా ఖాతాలో టీజ్ చేసింది.‘ 2021 టీవీఎస్ రైడర్’ బైక్‌ను ఈ నెల 16 న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ బైక్ 125 సీసీ ఇంజన్ సెగ్మెంట్లో రానుందని తెలుస్తోంది. బజాజ్ పల్సర్ 125, ది హోండా సీబీ షైన్ ఎస్పీ బైక్‌లకు 2021 టీవీఎస్ రైడర్ పోటీగా నిలవనుంది. చదవండి: కియా కా కమాల్... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్ కారు అమ్మకాలు టీజర్లో భాగంగా 2021 టీవీఎస్ రైడర్ బైక్‌కు ముందుభాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్(డే టైమ్ రన్నింగ్ ల్యాప్స్), అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్, మోనో షాక్, ఎల్ఈడీ ల్యాంప్స్‌తో రానున్నట్లు తెలుస్తోంది. బైక్‌కు డిజిటల్ రివర్స్ డిస్ప్లే కూడా రానుంది. స్పోర్టీ లూక్‌తో 2021 టీవీఎస్ రైడర్ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. ఈ బైక్ ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 80,000 నుంచి 90,000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో ఉంచే అవకాశం ఉంది . చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
టూవీలర్స్‌కు ‘ఎలక్ట్రిక్’ కిక్..!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్ (బైక్‌లు, స్కూటర్లు, మోపెడ్లు) ఇప్పుడు క్రాస్‌రోడ్స్‌లో ఉంది. సంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాలతో పోలిస్తే.. పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు ఇటీవలి కాలంలో వేగాన్ని అందుకుంటున్నాయి. పరిణామక్రమాన్ని కొన్ని కంపెనీలు ముందుగానే పసిగట్టి పెద్ద అడుగులు వేయడానికి వెనుకాడడం లేదు. ఓలా కంపెనీ భారీ పెట్టుబడులతో, ఆధునిక ఫీచర్లతో రెండు స్కూటర్లను ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ విభాగంలో బెంగళూరు స్టార్టప్ ఏథెర్ బలంగా ఉంది. ఇంకా పదుల సంఖ్యలో చిన్న కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నాయి. కానీ, సంప్రదాయ (కంబస్టన్ ఇంజన్) విభాగంలోని దిగ్గజ కంపెనీలైన హోండా, హీరో మోటోకార్ప్, యమహా, సుజుకీ ఇంత వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయలేదు. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో పేరుకు ఒక్కో మోడల్‌తో ఎంట్రీ ఇచ్చి వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నాయి. ఈ సంస్థలు కూడా పరిశోధన, అభివృద్ధితో ఆధునిక స్టార్టప్ కంపెనీలకు పోటీనిచ్చేలా మోడళ్లను ప్రవేశపెడితే ఈ మార్కెట్ మరింత వేడెక్కి, వేగాన్ని సంతరించుకోనుంది. కానీ, అదెప్పుడా అన్నదే ప్రశ్న? ‘ఓలా’ విజయం నిర్ణయిస్తుంది.. ‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. వినియోగదారుల ఇష్టాన్ని గెలిచామా?’ అన్నదే వాహనాల విషయంలో ప్రామాణికం అవుతుంది. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంప్రదాయ వాహన కంపెనీలకు నెట్వర్క్ చాలా పటిష్టమైనది. విక్రయాలు, విక్రయానంతర సేవల విషయంలో భారీ పెట్టుబడుల అవసరం వీటికి ఉండదు. అయినా కానీ, ఈ కంపెనీల ధోరణి తొందరపాటు వద్దన్నట్టుగా ఉంది. స్కూటర్ల మార్కెట్‌ను 50 శాతం వాటాతో జపాన్‌కు చెందిన హోండా శాసిస్తోంది. ఈ సంస్థ ఇంతవరకు ఎలక్ట్రిక్ వాహనాలపై తన ప్రణాళికల గురించి నోరు మెదపలేదు. మరోవైపు ఓలా ఈ విభాగంలో బలంగా పాతుకుపోయే ప్రణాళికలతో వచ్చింది. ఏడాదికి 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో తమిళనాడులో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. ఎస్1, ఎస్1 ప్రో పేరుతో రెండు మోడళ్లను ఆవిష్కరించింది. అక్టోబర్ నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. మొదటి ఏడాదే 5 లక్షల వాహనాలను విక్రయించాలన్న లక్ష్యంతో దూకుడుగా వెళుతోంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రణాళికల అమలు విజయం ఈ మార్కెట్‌కు కీలకం అవుతుందని జెఫరీస్ రీసెర్చ్ అనలిస్ట్ నీరజ్ మంగల్ అభిప్రాయపడ్డారు. ద్విచక్ర ఈవీ మార్కెట్లో ఓలా అడుగులు ఇప్పటికే ఉన్న కంపెనీల్లో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా.. కొత్త సంస్థల ప్రవేశానికి సానుకూలతలను తీసుకురావచ్చని నిపుణుల అంచనాగా ఉంది. మార్పుకు సమయం పడుతుంది.. టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఐక్యూబ్’ ప్రతీ నెలా 1,000 యూనిట్ల విక్రయాలే నమోదవుతున్నాయి. బజాజ్ ఆటో ఈ–స్కూటర్ ‘చేతక్’ అయితే కేవలం 250–300 యూనిట్లే అమ్ముడుపోతున్నాయి. కానీ, ఈవీలకు సంబంధించి ఈ సంస్థలు ఇప్పటికీ భారీ ప్రణాళికలను ప్రకటించలేదు. ఏథెర్ తన విక్రయాల గణాంకాలను విడుదల చేయడం లేదు. ఈ సంస్థకు వార్షికంగా లక్ష వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ‘‘కొత్తగా ఒక సంస్థ వచ్చిందన్న కారణంతో ప్రస్తుత మా ప్రణాళికలను సమీప కాలంలో మార్చుకునే ఉద్దేశం అయితే లేదు. మా ప్రణాళికలు యథావిధిగా కొనసాగుతాయి’’ అని బజాజ్ ఆటో ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. అచ్చమైన ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో పోలిస్తే సంప్రదాయ ద్విచక్ర వాహన కంపెనీలు నిదానంగా అడుగులు వేస్తుండడం అర్థం చేసుకోతగినదేనని నోమురా ఆటో రీసెర్చ్ హెడ్ హర‡్షవర్ధన్ శర్మ అన్నారు. ప్రభుత్వాల మద్దతు..! ఫేమ్–2 పథకం (ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు) విషయమై అనిశ్చితి కొనసాగుతూ ఉండడం, కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూలతలు, చిప్‌లకు కొరత నెలకొనడం ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫేమ్ పథకం కింద కేంద్ర సర్కారు ఎప్పటి నుంచో సబ్సిడీలు అందిస్తోంది. కాకపోతే ఈ సబ్సిడీలను ఇటీవలే మరింత పెంచింది. అదే విధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఈవీ రాయితీలతో విధానాలను తీసుకొస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర ఈ విషయంలో ముందున్నాయి. -
ఢాకాలో విడుదలైన టీవీఎస్ ఎన్ టోర్క్ 125 స్కూటర్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ టీవీఎస్ మోటారు తన ఎన్ టోర్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లాంచ్ చేసినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ స్కూటర్ మార్కెట్లో ఇదివరకెన్నడూలేని కొత్త ఫీచర్లను జోడించి మరీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఇంజిన్, స్మార్ట్‌ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలు, స్టయిలిష్ లుక్ దీని సొంతం. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తున్న మొట్టమొదటి స్కూటర్ ఇదే. భారతదేశంలో ఈ టీవీఎస్ ఎన్ టోర్క్ 125 రేస్ ఎడిషన్ ధర రూ.80,325(ఎక్స్ షోరూమ్, ఇండియా).(చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!) స్కూటర్ సెగ్మెంట్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీవీఎస్ అధునాతన 'స్మార్ట్జోనెక్ట్' టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో దీన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. 125 సీసీ ఇంజిన్ 9.4 పీఎస్ పవర్, 10.5ఎన్ ఎం టార్క్, బ్లూ టూత్ కనెక్టివిటీ ప్రధాన పీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు కాలర్ఐడీ, పార్కింగ్ లోకేషన్ అసిస్టెంట్, ఫుల్లీ-డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా నావిగేషన్ సహాయాన్ని అందిస్తుంది. షార్ప్ హెడ్ లాంప్, డే టైం రన్నింగ్ లైట్ లాంప్, ఎల్ఈడీ టెయిల్ ట్యాంప్, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ లాంటి ఫీచర్లు, డ్యుయల్ టోన్ పెయింట్ వల్ల మొత్తం డిజైన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సేకన్లలో తాకగలదు అని సంస్థ పేర్కొంది ఈ కొత్త స్కూటర్ ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్ తో వస్తుంది. ఇందులో నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇన్-బిల్ట్ ల్యాప్-టైమర్, ఫోన్-బ్యాటరీ డిస్ ప్లే, చివరి పార్క్ చేసిన లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, స్ట్రీట్ అండ్ స్పోర్ట్ వంటి మల్టీ రైడ్ స్టాటిస్టిక్ మోడ్లతో సహా 55 ఫీచర్లను కలిగి ఉంది. -
ఆ స్కూటర్ ధరలు భారీగా పెంచిన టీవీఎస్ మోటార్
ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ 110సీసీ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలను భారీగా పెంచింది. ఈ స్కూటర్ ఐదు వేరియెంట్లలో లభిస్తుంది. కనిష్ఠంగా రూ.736 పెంచితే, గరిష్టంగా రూ.2,336 పెంచింది. షీట్ మెటల్ వీల్ వేరియెంట్ స్కూటర్ కొత్త ధర ఇప్పుడు ₹65,673, స్టాండర్డ్ మోడల్ స్కూటర్ ధర ₹67,398(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. జడ్ ఎక్స్ డ్రమ్, జడ్ఎక్స్ డిస్క్ ట్రిమ్ స్కూటర్ ధరలు వరుసగా ₹71,973, ₹75,773గా ఉన్నాయి. అయితే, క్లాసిక్ మోడల్ స్కూటర్ ధర ఇప్పుడు ₹75,743గా ఉంది. జూపిటర్ మోడల్ స్కూటర్ కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. TVS Jupiter variant Revised price Sheet metal wheel variant ₹65,673 Standard Variant ₹67,398 ZX Drum ₹71,973 ZX Disc ₹75,743 Classic Variant ₹75,743 టీవీఎస్ జూపిటర్ 109.7సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 7.37బిహెచ్ పీ పవర్, 8.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ స్కూటర్ ఎకోత్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఈటి-ఫై) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల 15 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ జూపిటర్ లో డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. స్కూటర్లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, మొబైల్ ఛార్జర్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇన్ టెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది. -
బైక్ లవర్స్‌కు షాకిచ్చిన టీవీఎస్ మోటార్..!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరోసారి బైక్ లవర్స్‌కు షాకిచ్చింది. టీవీఎస్ అపాచీ బైక్ ధరలను గణనీయంగా పెంచింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి, అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధరలను టీవీఎస్ భారీగా పెంచింది. ఈ ఏడాదిలో అపాచీ బైక్‌ల ధరలను టీవీఎస్ పెంచడం ఇది మూడోసారి. అపాచీ ఆర్టీఆర్ 160 4వి వేరియంట్ ధరను సుమారు రూ. 3000 వరకు పెంచింది. దీంతో అపాచీ ఆర్టీఆర్ 160 4వి డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 1,14,615 కాగా, డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 1,11,565 గా ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి వేరియంట్ ధరను రూ. 3,750 వరకు పెంచింది. దీంతో అపాచీ ఆర్టీఆర్ 200 4వి సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 1,33,065 కాగా, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ట్రిమ్ వేరియంట్ ధర రూ. 1,38,115 గా ఉంది. పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ప్రాంతంలోనే వర్తిస్తాయి. ఆయా ప్రాంతాలను బట్టి బైక్ ధరల్లో మార్పులు ఉండవచ్చును. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్ వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 9,250 ఆర్పీఎమ్ వద్ద 17.39 బిహెచ్ పీ పవర్ అవుట్ పుట్, 7,250 ఆర్ పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్ లైట్, ట్విన్ డీఆర్ ఎల్ అప్ ఫ్రంట్, ఎల్ ఈడి టెయిల్ ల్యాంప్, ఎబీఎస్, ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ(జిటిటీ)తో వస్తుంది. ఈ స్పోర్ట్స్ కమ్యూటర్ మోటార్ సైకిల్ నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, రేసింగ్ రెడ్ కలర్ రంగులలో లభ్యం అవుతుంది. -
కొత్త బైక్ కొనేవారికి టీవీఎస్ మోటార్ గుడ్‌న్యూస్!
మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. టీవీఎస్ మోటార్ ఇండియా అత్యంత ప్రజాదరణ పొందిన అపాచీ ఆర్టీఆర్ 160 4వీపై నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్‌ను ప్రకటించింది. మీరు అపాచీ బైక్ కొనుగోలు చేసే సమయంలో 3 నుంచి 6 నెలల కాలానికి ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ జూలై 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. టీవీఎస్ మోటార్ ఇండియా అందించిన ఈ ఆఫర్ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల, ఈ ఆఫర్ పూర్తి వివరాల కోసం మీకు దగ్గరల్లో ఉన్న టీవీఎస్ షో రూమ్ లను సంప్రదించండి. టీవీఎస్ మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం, మీరు కేవలం రూ.5 వేలు డౌన్ పేమెంట్‌తో అపాచీ ఆర్టీఆర్ 160 4వీ బైక్‌ను మీ దగ్గరలోని టీవీఎస్ షో రూమ్, అధికారిక వెబ్ సైట్ కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఎన్ టోర్క్, అపాచే ఆర్టీఆర్ 200 4వీ, స్కూటీ పెప్ ప్లస్, జెస్ట్ కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్ వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 9,250 ఆర్పీఎమ్ వద్ద 17.39 బిహెచ్ పీ పవర్ అవుట్ పుట్, 7,250 ఆర్ పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్ లైట్, ట్విన్ డీఆర్ ఎల్ అప్ ఫ్రంట్, ఎల్ ఈడి టెయిల్ ల్యాంప్, ఎబీఎస్, ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ(జిటిటీ)తో వస్తుంది. ఈ స్పోర్ట్స్ కమ్యూటర్ మోటార్ సైకిల్ నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, రేసింగ్ రెడ్ కలర్ రంగులలో లభ్యం అవుతుంది. చదవండి: డీఆర్డీఓ డీ-4 డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్