అదిరే లుక్స్‌, హై రేసింగ్‌ పర్ఫార్మెన్స్‌తో నయా టీవీఎస్‌ అపాచీ లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌! | Tvs Apache Rtr 165 Rp Launched Priced At 1 45 Lakh | Sakshi
Sakshi News home page

TVS Apache RTR 165 RP: అదిరే లుక్స్‌, హై రేసింగ్‌ పర్ఫార్మెన్స్‌తో నయా టీవీఎస్‌ అపాచీ లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌! ధర ఎంతంటే..?

Published Thu, Dec 23 2021 5:43 PM | Last Updated on Thu, Dec 23 2021 5:56 PM

Tvs Apache Rtr 165 Rp Launched Priced At 1 45 Lakh - Sakshi

ప్రముఖ టూవీలర్‌ వాహనాల తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ న్యూ రేస్‌ పర్ఫార్మెన్స్‌ (ఆర్‌పీ) సిరీస్‌ బైక్లను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా  టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 165 ఆర్‌పీ మొదటి బైక్‌గా నిలవనుంది. ఈ బైక్‌ను కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చును. టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 165 ఆర్‌పీ లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌గా రానుంది. కేవలం 200 యూనిట్లను మాత్రమే టీవీఎస్‌ ఉత్పత్తి చేయనుంది. దీని ధర రూ. 1,45,000(ఎక్స్‌ షోరూమ్‌ ధర)

టీవీఎస్‌ అపాచీ ఆర్టీఆర్‌ 165 ఆర్‌పీ ఫీచర్స్‌..!
ఈ బైక్‌లో అధునాతన 164.9 సీసీ సింగిల్-సిలిండర్ 4-వాల్వ్ ఇంజన్‌తో రానుంది.  10,000 ఆర్‌పీఎమ్‌ వద్ద 19 బీహెచ్‌పీ, 8,750 ఆర్‌పీఎమ్‌ వద్ద 14.2 ఎన్‌ఎమ్‌ శక్తిని విడుదల చేయనుంది. ఈ బైక్‌లో  కొత్త సిలిండర్ హెడ్‌,  ట్విన్ ఎలక్ట్రోడ్ స్పార్క్ ప్లగ్‌తో రానుంది.



రేసింగ్‌ పర్ఫెర్మెన్స్‌ కోసం  హై-లిఫ్ట్, హై-డ్యూరేషన్ క్యామ్స్‌ , డ్యూయల్ స్ప్రింగ్ యాక్యుయేటర్‌లను అమర్చారు. అధిక కంప్రెషన్ రేషియో కోసం కొత్త డోమ్ పిస్టన్ పరిచయం చేసింది. ఈ బైక్‌లో  5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీనిలో రేస్-ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, సర్దుబాటు చేయగల క్లచ్, బ్రేక్ లివర్‌లను కూడా కలిగి ఉంది.



టీవీఎస్‌ అపాచీ ఆర్టీఆర్‌ 165 ఆర్‌పీ బైక్‌లో రేసింగ్ డీకాల్స్, రెడ్ అల్లాయ్ వీల్స్ ,కొత్త సీట్ ప్యాటర్న్‌తో రానుంది.  కొత్త హెడ్‌ల్యాంప్ అసెంబ్లీతో పాటు ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్స్ (FPL)తో పాటుగా లో,హైబీమ్‌తో ఏకకాలంలో పని చేయనుంది. 

చదవండి: టూవీలర్‌ కొనుగోలుదారులకు మరోసారి భారీ షాక్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement