హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జొమాటో ప్లాట్‌ఫామ్‌పై డెలివరీల కోసం వచ్చే రెండేళ్లలో టీవీఎస్ తయారీ 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెడతారు.
2030 నాటికి డెలివరీల కోసం పూర్తిగా ఈవీలను ఉపయోగించాలని జొమాటో లక్ష్యంగా చేసుకుంది. అలాగే వచ్చే రెండేళ్లలో ఒక లక్ష ఈవీలతో కార్యకలాపాలను సాగించేందుకు 50కిపైగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. 2020లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించిన టీవీఎస్ మోటార్ ఇప్పటి వరకు ఒక లక్షకుపైగా యూనిట్లను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment