సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ కొత్తగా అప్‌డేట్ చేసిన జూపిటర్ వెహికల్‌నులాంచ్ చేసింది. దేశంలో 50 లక్షల స్కూటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా స్పెషల్ ఎడిషన్‌గా ‘‘ ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వెహికిల్స్ ఆన్ రోడ్’’ అంటూ టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్‌ను తెచ్చింది. ఈ స్కూటర్లు మిస్టిక్ గ్రే, రీగల్ పర్పుల్ రంగుల్లో లభ్యం. క్లాసిక్ టాప్-స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ. 85,866 (ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది.
కాస్మెటిక్ మార్పులు, ఇంజీన్
జూపిటర్ క్లాసిక్ ఇతర వేరియంట్‌లతో పోల్చినప్పుడు అది ప్రత్యేకంగా కనిపించేలా పలు బ్యూటీ అప్‌డేట్స్ ఇచ్చింది. ముందు ,బ్రౌన్ బాడీ ప్యానెల్‌ల వద్ద లేతరంగు గల విజర్‌ను పొందుతుంది (ఇతర వేరియంట్‌లు బ్లాక్ ప్యానెల్). మిర్రర్‌లు ఇతర వేరియంట్‌లలో క్రోమ్‌తో పోలిస్తే బ్లాక్ ఫినిషింగ్‌ను ఇచ్చింది.
ఫ్రంట్ ఆప్రాన్ న్యూ గ్రాఫిక్స్, పైనుంచి కిందికి జుపిటర్ బ్యాడ్జింగ్ లాంటివి యాడ్ చేసింది. జూపిటర్ క్లాసిక్ నెక్స్ట్ జెన్ అల్యూమినియం, 109.7 సిసి, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ 7.47 పిఎస్ పవర్, 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మోటార్ పేటెంట్ ఎకోనోమీటర్‌తో కూడా వస్తుంది, ఇది 'ఎకో మోడ్' ,'పవర్ మోడ్' రెండింటిలోనూ రైడర్‌లను గైడ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్టర్,కిక్ స్టార్టర్ రెండింటితోపాటు, బ్రేకింగ్ హార్డ్‌వేర్, ముందు డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ఫోర్క్, త్రిస్టెప్ ఎడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment