Jupiter
-
ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ స్కూటర్ (ఫొటోలు)
-
ప్రపంచంలోనే.. మొట్ట మొదటి సీఎన్జీ స్కూటర్ ఇదే
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైక్ (ఫ్రీడమ్ 125) లాంచ్ చేస్తే.. టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీ మొదటి సీఎన్జీ స్కూటర్(జూపిటర్)ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించింది. ఇది ఫ్రీడమ్ 125 మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీలతో నడుస్తుంది.టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ (TVS Jupiter CNG) స్కూటర్ చూడటానికి జుపీటర్ 125 మాదిరిగా ఉన్నప్పటికీ.. ముందుభాగంలో కనిపించే CNG స్టిక్కర్ దానిని సీఎన్జీ స్కూటర్‌గా గుర్తించడానికి సహాయపడుతుంది. 1.4 కేజీ కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్.. స్కూటర్ సీటు కింద ఉంటుంది. కాగా ఇందులోని 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6000 rpm వద్ద 7.2 హార్స్ పవర్, 5500 rpm వద్ద 9.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ 226 కిమీ మైలేజ్ (సీఎన్జీ + పెట్రోల్) ఇస్తుందని సమాచారం. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80.5 కిమీ కావడం గమనార్హం. స్టాండర్డ్ జూపిటర్ మాదిరిగానే.. సీఎన్జీ స్కూటర్ కూడా డిజిటల్ అనలాగ్ డిస్ప్లే, యూఎస్బీ ఛార్జర్, స్టార్ట్ / స్టాప్ టెక్ వంటివన్నీ పొందుతుంది. కంపెనీ తన సీఎన్జీ స్కూటర్ ధరలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది సాధారణ జూపిటర్ ధర కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఏడు సంవత్సరాలు.. 67 లక్షల సేల్స్: దూసుకెళ్లిన జుపీటర్
స్కూటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టీవీఎస్ జుపీటర్.. 2013 సెప్టెంబర్ నుంచి జులై 2024 వరకు 67,39,254 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో 110 సీసీ మోడల్, 125 సీసీ మోడల్ రెండూ ఉన్నాయి.2024 ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ జుపీటర్ సేల్స్ 8,44,863 యూనిట్లు. హోండా యాక్టివాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటూనే మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్షిస్తోంది. జుపీటర్ ప్రారంభమైన మొదటి రెండు సంవత్సరాల్లో 5 లక్షల స్కూటర్లు మాత్రమే సేల్ అయ్యాయి.2021 ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల జుపీటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2022 నాటికి 50 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం మీద జుపీటర్ అత్యుత్తమ అమ్మకాలను పొందగలిగింది. ఈ స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. -
ఈ స్కూటర్‌ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. గత దశాబ్ద కాలంలో 10 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్, జుపీటర్ 125 అమ్మకాలు మాత్రం 63 శాతం ఉన్నట్లు సమాచారం.భారతీయ స్కూటర్ మార్కెట్లో జుపీటర్, జుపీటర్ 125 వాటా 25 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జుపీటర్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 844863 యూనిట్లు. గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో జుపీటర్ పొందిన అత్యుత్తమ అమ్మకాలు ఇవే అని స్పష్టమవుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ అమ్మకాలు కేవలం 98937 యూనిట్లు మాత్రమే.110సీసీ, 125సీసీ వేరియంట్లలో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్3. కాగా టీవీఎస్ కంపెనీకి చెందిన రైడర్ 125 (478443 యూనిట్లు), ఎక్స్ఎల్ (481803 యూనిట్లు), అపాచీ (378112 యూనిట్లు), ఎన్‌టార్క్ 125 (331865 యూనిట్లు) వేహనాలు ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి. -
భూమికి బై బై.. నిష్క్రమించిన ఆకుపచ్చ తోకచుక్క
న్యూయార్క్: జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి తొలి వారం దాకా దాదాపు నెల రోజుల పాటు ఆకాశంలో కనువిందు చేసిన ఆకుపచ్చని తోకచుక్క ఇక సెలవంటూ వెళ్లిపోతోంది. సి2022ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్క మన నుంచి అత్యంత దూరంగా సౌరమండలపు వెలుపలి తీరాల కేసి పయనమవుతోంది. ఇది మళ్లీ భూమికి సమీపంగా వచ్చి మనకు కనిపించేది మరో 50 వేల సంవత్సరాల తర్వాతే! సరిగ్గా చెప్పాలంటే, 52023వ సంవత్సరంలో అన్నమాట!! అయితే సూర్యుడు, ఇతర గ్రహాల ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల దాని కక్ష్యలో బాగా మార్పుచేర్పులు జరిగే క్రమంలో అది అంతకంటే చాలా ముందే మరోసారి భూమికి సమీపానికి వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమంటున్నారు సైంటిస్టులు. అదే సమయంలో కక్ష్యలో వ్యతిరేక మార్పులు జరిగితే 50 వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయమూ పట్టవచ్చని కూడా వారు చెబుతున్నారు. భూమికి అతి సమీపానికి వచ్చినప్పుడు భూ ఉపరితలం నుంచి ఈ తోకచుక్క 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనువిందు చేసింది. అది చివరిసారి మనకు కన్పించినప్పటికి భూమిపై ఆధునిక మానవుని ఆవిర్భావమే జరగలేదు! అప్పటికింకా నియాండర్తల్ మానవుల హవాయే నడుస్తోంది. -
చాలా చాలా పెద్ద గ్రాములు: క్వెట్టా అంటే వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లు, మరి రొన్నా అంటే..
భూమి బరువు ఆరు రొన్నా గ్రాములు... గురుగ్రహం బరువు రెండు క్వెట్టా గ్రాములు ..ఇదేంటి అంతంత పెద్ద గ్రహాల బరువులు గ్రాముల్లోనా? అనిపిస్తోందా.. అవి ఉత్త గ్రాములు కాదు.. ‘చాలా చాలా పెద్ద గ్రాములు’.. మరీ లక్షలకు లక్షలు, కోట్లకు కోట్ల సంఖ్యల్లో ఏం చెప్తాంలే అన్న ఉద్దేశంతో.. శాస్త్రవేత్తలు ఇలా కొత్త ప్రామాణిక సంఖ్యల పేర్లను సిద్ధం చేశారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ అతిపెద్ద సంఖ్యల అవసరంతో.. ఇంటర్నెట్ డేటా గానీ.. వాతావరణం, అంతరిక్ష విశేషాలుగానీ.. కంప్యూటర్లు చేసే లెక్కల లెక్కగానీ అతి పెద్దవి. ఏవైనా కోట్ల కోట్లలో చెప్పుకోవాల్సినవి. ఇలా చెప్పుకోవడం కష్టం. అతిపెద్ద డేటా పెరిగిపోతుండటంతో సులువుగా పిలవడం, లెక్కగట్టడం కోసం శాస్త్రవేత్తలు అతిపెద్ద సంఖ్యలకు పేర్లు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ‘ప్రపంచ వెయిట్స్ అండ్ మెజర్స్’ జనరల్ కాన్ఫరెన్స్‌లో రెండు అతిపెద్ద, మరో రెండు అతిచిన్న సంఖ్యలకు పేర్లను ఆమోదించారు. ‘బేస్’ కొలతలకు అదనంగా.. దాదాపు ప్రపంచదేశాలన్నీ అనుసరిస్తున్న మెట్రిక్ విధానంలో కొన్ని ప్రధాన కొలతలు ఉన్నాయి. బరువుకు గ్రాములు, దూరానికి మీటర్లు, సమయానికి సెకన్లు, ఉష్ణోగ్రతకు కెల్విన్, వెలుగు తీవ్రతకు క్యాండెలా వంటివి ‘బేసిక్’ కొలతలు. వీటికి అదనపు సంఖ్యా పదాలను జోడించి వినియోగిస్తుంటారు. ఉదాహరణకు వెయ్యి మీటర్లు అయితే ఒక కిలోమీటర్ అన్నమాట. అతిపెద్దవి.. అతి చిన్నవి.. ప్రస్తుతం కొత్తగా అమల్లోకి తెచ్చిన అతిపెద్ద సంఖ్యల పేర్లు రొన్నా, క్వెట్టా.. అతి చిన్న సంఖ్యల పేర్లు రొంటో, క్వెక్టో.. ►రొన్నా అంటే ఒకటి పక్కన 27 సున్నాలు. అంటే పది లక్షల కోట్ల కోట్ల కోట్లు. ►క్వెట్టా అంటే ఒకటి పక్కన 30 సున్నాలు. అంటే వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లు. ►రొంటో అంటే పాయింట్ పక్కన 26 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య. అంటే ఒకటిలో పది లక్షల కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట. ►క్వెక్టో అంటే పాయింట్ పక్కన 29 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య. అంటే ఒకటిలో వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట) ►ఇప్పటివరకు ప్రత్యేకమైన పేరు పెట్టి వినియోగిస్తున్న అతిపెద్ద సంఖ్య యొట్టా (ఒకటి పక్కన 24 సున్నాలు – అంటే వెయ్యి కోట్ల కోట్ల కోట్లు).. అతి చిన్న సంఖ్య యొక్టో (పాయింట్ పక్కన 23 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య – అంటే ఒకటిలో.. వెయ్యి కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట). ఈ సంఖ్యల పేర్లను చివరిసారిగా 1991లో ఖరారు చేశారు. తాజాగా దీనికన్నా పెద్దవాటిని ఓకే చేశారు. ఈ సంఖ్యలతో వేటిని కొలుస్తారు? ఉదాహరణకు అణువులు, పరమాణువులు, వాటిలోని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు వంటి వాటి బరువు గ్రాములో కోట్ల కోట్ల వంతు ఉంటుంది. మరోరకంగా చెప్పాలంటే కొన్ని లక్షలకోట్ల కోట్ల ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కలిపినా ఒక గ్రాము బరువు ఉండవు. మరి వాటిలో ఒకదాని బరువును చెప్పేందుకు వీలయ్యేవే అతి చిన్న సంఖ్యలు. ఇక గ్రహాలు, నక్షత్రాల బరువులు, ఖగోళ దూరాలు వంటి అత్యంత భారీ కొలతల కోసం పెద్ద సంఖ్యలను వాడుతారు. ఉదాహరణకు.. ►ఒక హైడ్రోజన్ పరమాణువు బరువు సుమారు రెండు యొక్టో గ్రాములు ►ఒక ఎలక్ట్రాన్ బరువు రొంటోగ్రాము కంటే కూడా కాస్త తక్కువ. ►అదే సూర్యుడి బరువు సుమారు 20 లక్షల రొన్నా గ్రాములు. లేదా రెండు వేల క్వెట్టా గ్రాములు అన్నమాట. (3.3 లక్షల భూగ్రహాలు కలిస్తే ఒక సూర్యుడు అవుతాడు మరి) -
మళ్లీ చూడాలంటే 107 ఏళ్లు ఆగాల్సిందే!
వాషింగ్టన్: సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి సోమవారం భూమికి అతి సమీపానికి, అంటే 59 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. ఫలితంగా సోమవారం సాయంత్రం 5.29 నుంచి మంగళవారం తెల్లవారుజాము 5.30 దాకా ఆకాశంతో అత్యంత ప్రకాశవంతంగా కన్పించి కనువిందు చేసింది. బృహస్పతి భూమికి ఇంత దగ్గరికి రావడం గత 59 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ ఇంత సమీపానికి రావాలంటే 2129 దాకా ఆగాల్సిందే. 53 ఉపగ్రహాలున్న బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఏకంగా 11 ఏళ్లు తీసుకుంటుంది! -
టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ కొత్తగా అప్డేట్ చేసిన జూపిటర్ వెహికల్నులాంచ్ చేసింది. దేశంలో 50 లక్షల స్కూటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా స్పెషల్ ఎడిషన్‌గా ‘‘ ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వెహికిల్స్ ఆన్ రోడ్’’ అంటూ టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్‌ను తెచ్చింది. ఈ స్కూటర్లు మిస్టిక్ గ్రే, రీగల్ పర్పుల్ రంగుల్లో లభ్యం. క్లాసిక్ టాప్-స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ. 85,866 (ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది. కాస్మెటిక్ మార్పులు, ఇంజీన్ జూపిటర్ క్లాసిక్ ఇతర వేరియంట్లతో పోల్చినప్పుడు అది ప్రత్యేకంగా కనిపించేలా పలు బ్యూటీ అప్డేట్స్ ఇచ్చింది. ముందు ,బ్రౌన్ బాడీ ప్యానెల్ల వద్ద లేతరంగు గల విజర్‌ను పొందుతుంది (ఇతర వేరియంట్లు బ్లాక్ ప్యానెల్). మిర్రర్లు ఇతర వేరియంట్లలో క్రోమ్‌తో పోలిస్తే బ్లాక్ ఫినిషింగ్‌ను ఇచ్చింది. ఫ్రంట్ ఆప్రాన్ న్యూ గ్రాఫిక్స్, పైనుంచి కిందికి జుపిటర్ బ్యాడ్జింగ్ లాంటివి యాడ్ చేసింది. జూపిటర్ క్లాసిక్ నెక్స్ట్ జెన్ అల్యూమినియం, 109.7 సిసి, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ 7.47 పిఎస్ పవర్, 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మోటార్ పేటెంట్ ఎకోనోమీటర్తో కూడా వస్తుంది, ఇది 'ఎకో మోడ్' ,'పవర్ మోడ్' రెండింటిలోనూ రైడర్లను గైడ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్టర్,కిక్ స్టార్టర్ రెండింటితోపాటు, బ్రేకింగ్ హార్డ్‌వేర్, ముందు డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ఫోర్క్, త్రిస్టెప్ ఎడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఇందులో ఉన్నాయి. -
ఇంతకీ ఇది ఏం దోశ.. తెలియడం లేదా?
ఇంటర్నెట్లో దీనిపై భారీ చర్చనే నడిచింది. కొందరు ఎగ్ దోశ అని చెబితే.. మరికొందరు వాళ్లమ్మ వేసే మినప్పిండి దోశ సేమ్ ఇలాగే ఉంటుందని.. కాబట్టి.. ఇది అదే అని వాదించారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ మాత్రం ఎహే.. ఇది ప్లెయిన్ దోశ అంటూ తేల్చేశారు. ఇంతకీ మీరేమంటారు? ఏం దోశ ఇది.. మసాలానా.. లేక మరేదైనానా.. సరిగ్గా తెలియడం లేదా.. టైం అప్.. నిజమేంటంటే.. అసలు ఇది దోశనే కాదు.. ఓ గ్రహం.. అది కూడా సౌర వ్యవస్థలోనే అత్యంత పెద్దదైన బృహస్పతి(జుపిటర్). గతంలో నాసాకు చెందిన అంతరిక్ష నౌక ‘కసీని’ కక్ష్యలో తిరుగుతూ ఈ గ్రహాన్ని కింద నుంచి ఫొటో తీసింది. తాజాగా నాసా దీన్ని మళ్లీ విడుదల చేయడం.. ఈ ఫొటో దోశను పోలి ఉండటంతో ట్విట్టర్లో ‘ఇది ఏం దోశ’’ అనే చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా నెటిజన్లు సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో సందడి చేశారు. -
నియో మిలీనియల్స్
బ్యాంకుల గురించి సామాజిక మాధ్యమాల్లో బోలెడు జోక్స్, మీమ్స్ కనిపిస్తుంటాయి. మచ్చుకు కొన్ని... ‘ఈరోజు మీకు బ్యాంకులో పని ఉందా? అయితే ఇవి మీతో పాటు తెచ్చుకోవడం అనివార్యం... 1. ఐడీ ప్రూఫ్, 2. లంచ్ బాక్స్, 3.ప్లేయింగ్ కార్డ్స్ 4. డిన్నర్ సరంజామా, 5.బెడ్‌షీట్, 6. మెత్తని దిండు, 7. బ్లాంకెట్ 8.ఫోన్ చార్జర్... వీటన్నికంటే ముఖ్యమైనది బోలెడు ఓపిక’ ‘ఈ అమ్మాయి పేరు సువర్ణముఖి. బ్యాంకుకు వెళ్లే ముందు ఎంత ఫ్రెష్‌గా ఉందో చూడండి. బ్యాంకుకు వెళ్లి వచ్చిన తరువాత చంద్రముఖిగా మారిన సువర్ణముఖి రూపం ఇది’ ‘ఒక బ్యాంకు ఉద్యోగి వాచ్‌లో టైమ్ స్థానంలో లంచ్, లంచ్, లంచ్... అని ఉంటుంది. గడియారం ముళ్లు వాటి మీదే తిరుగుతుంటాయి’ ఇవి అతిశయోక్తితో కూడిన జోక్స్ అయినప్పటికీ, సంప్రదాయ బ్యాంకులకు వెళ్లడానికి నవతరంలో ఎక్కువమంది అంతగా ఆసక్తి చూపడం లేదు. దీని కారణాలలో క్యూ, దూరభారంలాంటివి ఉన్నాయి. బ్యాంకులకు వెళ్లడానికి ఇష్టపడని మిలీనియల్స్ నియో బ్యాంకులపై ఆసక్తి చూపుతున్నారు. ఏమిటీ నియో బ్యాంకులు? నియో బ్యాంకులు అనేవి వర్చువల్ బ్యాంక్స్. వీటికి ఫిజికల్ బ్రాంచ్‌లు ఉండవు. అయితే ఫిజికల్ బ్రాంచ్‌లు ఉన్న ప్రముఖ బ్యాంకులతో వీటికి భాగస్వామ్యం ఉంటుంది. ‘క్యూ’ కంటే ‘క్విక్’ విధానానికి ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఈ బ్యాంకులను అమితంగా ఇష్టపడుతుంది. సంప్రదాయ బ్యాంకులకు ‘విశ్వసనీయత’ అనేది గట్టి పునాది అయినప్పటికీ, వీటితో పోల్చితే నియో బ్యాంకులు రకరకాల ప్రత్యా మ్నాయ అవకాశాలు కల్పిస్తున్నాయి. మనీ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి మరో ప్లస్ పాయింట్‌గా మారింది. వీటి ద్వారా తమ ఖర్చులు, పొదుపు నకు సంబంధించి స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశం యూజర్‌కు కలుగుతుంది. బడ్జెటింగ్, సేవింగ్, ఇన్వెస్టింగ్, రుణ నిర్వహణకు సంబంధించి సులభంగా గ్రహించగలిగే ఆర్థిక సలహాలను బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కోరుకుంటున్నారు మిలీనియల్స్. వారి అంచనాలు సంప్రదాయ బ్యాంకులు అందుకోలేక పోవడం కూడా నియో బ్యాంకుల వైపు ఆకర్షితులు కావడానికి ఒక కారణం. రోబోటిక్స్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ సమయంలో సేవలు అందిస్తున్నాయి నియో బ్యాంకులు. తక్కువ ఛార్జీలు, సులభంగా ఖాతా ప్రారంభించే అవకాశం ఉండడం, రుణాలు, బిల్లులు... మొదలైన చెల్లింపులను గుర్తు చేయడానికి రిమైండర్ సదుపాయం... ఇలాంటివి నియో విజయానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. రకరకాల ఫైనాన్షియల్ సర్వీస్‌లను నియో బ్యాంకులు ఒకే గొడుగు కిందికి తీసుకురావడం టెక్–సావి మిలీనియల్స్‌ను ఆకట్టుకునే అంశం. రేజర్ పే ఎక్స్, జూపిటర్, ఓపెన్... మొదలైనవి మన దేశంలోని కొన్ని నియో బ్యాంకులు. గూగుల్ పే క్రియేటర్స్ సుజిత్ నారాయణ్, సుమిత్‌లు మిలీనియల్స్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ‘ఫై’ అనే నియోబ్యాంకును ప్రారంభించారు. ఇది ఫెడరల్ బ్యాంక్ భాగస్వామ్యంతో పనిచేస్తుంది. మన దేశంలో నియో బ్యాంక్ స్టార్టప్‌ల సంఖ్య పెరగడానికి కారణం మిలీనియల్స్ ఆదరణ. స్థూలంగా చెప్పాలంటే... నియో బ్యాంకింగ్ సెగ్మెంట్లో మిలీనియల్స్ అతి ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకున్నారు. అయితే నియో బ్యాంకుల మధ్య కూడా గట్టి పోటీ ఉంది. వాటి పనితీరు ఆధారంగా రేటింగ్స్ ఉంటున్నాయి. డిజైన్ లాంగ్వేజ్ అనేది వాటి ఆదరణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. -
అదిరిపోయే ఫీచర్లతో టీవీఎస్ జూపిటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ స్మార్ట్ ఫీచర్స్‌తో జూపిటర్ జడ్ఎక్స్ను ప్రవేశపెట్టింది. బ్లూటూత్, వాయిస్ అసిస్ట్, డిజిటల్ కన్సోల్, నావిగేషన్ అసిస్ట్, ఎస్ఎంఎస్, కాల్ అలర్ట్ ఫీచర్లను జోడించింది. 110 సీసీ స్కూటర్స్ విభాగంలో వాయిస్ అసిస్ట్ పొందుపర్చడం ఇదే తొలిసారి అని కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.80,973 ఉంది. డ్యూయల్ టోన్ సీట్, బ్యాక్‌రెస్ట్, 7,500 ఆర్పీఎంతో 5.8 కిలోవాట్ అవర్ పవర్, 5,500 ఆర్పీఎంతో 8.8 ఎన్ఎం టార్క్, ఇంటెలిగో టెక్నాలజీ, ఐ–టచ్‌స్టార్ట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మొబైల్ చార్జర్, 21 లీటర్ స్టోరేజ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి హంగులు ఉన్నాయి. -
ఆ స్కూటర్ ధరలు భారీగా పెంచిన టీవీఎస్ మోటార్
ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ 110సీసీ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలను భారీగా పెంచింది. ఈ స్కూటర్ ఐదు వేరియెంట్లలో లభిస్తుంది. కనిష్ఠంగా రూ.736 పెంచితే, గరిష్టంగా రూ.2,336 పెంచింది. షీట్ మెటల్ వీల్ వేరియెంట్ స్కూటర్ కొత్త ధర ఇప్పుడు ₹65,673, స్టాండర్డ్ మోడల్ స్కూటర్ ధర ₹67,398(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. జడ్ ఎక్స్ డ్రమ్, జడ్ఎక్స్ డిస్క్ ట్రిమ్ స్కూటర్ ధరలు వరుసగా ₹71,973, ₹75,773గా ఉన్నాయి. అయితే, క్లాసిక్ మోడల్ స్కూటర్ ధర ఇప్పుడు ₹75,743గా ఉంది. జూపిటర్ మోడల్ స్కూటర్ కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. TVS Jupiter variant Revised price Sheet metal wheel variant ₹65,673 Standard Variant ₹67,398 ZX Drum ₹71,973 ZX Disc ₹75,743 Classic Variant ₹75,743 టీవీఎస్ జూపిటర్ 109.7సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 7.37బిహెచ్ పీ పవర్, 8.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ స్కూటర్ ఎకోత్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఈటి-ఫై) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల 15 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ జూపిటర్ లో డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. స్కూటర్లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, మొబైల్ ఛార్జర్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇన్ టెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది. -
యూరోపా యాత్రకు లైన్‌క్లియర్!
అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది... గురుగ్రహ ఉపగ్రహం యూరోపాపైకి నాసా ప్రయోగించనున్న... యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టుకు గ్రీన్‌లైట్ పడింది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్‌పై 2024లో క్లిప్పర్ యూరోపా చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై జీవం ఉందా? లేదా తెలుసుకోవడమే లక్ష్యం! భూమికి ఆవల మనిషి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? అన్నది తెలుసుకునేందుకు చాలాకాలంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌర కుటుంబానికి ఆవల వేల సంఖ్యలో గ్రహాలను ఇప్పటికే గుర్తించినప్పటికీ ఈ ఎక్సోప్లానెట్లలో జీవం ఆనవాళ్లు కానీ.. జీవించేందుకు అనువైన పరిస్థితులు కానీ ఇప్పటివరకూ గుర్తించ లేదు. సూర్యుడికి (ఇతర గ్రహ వ్యవస్థల్లోనైతే మాతృ నక్షత్రం) తగినంత దూరంలో ఉండటం.. భూమితో సరిపోలేలా రాళ్లు రప్పలతో, నీళ్లతో ఉండటం జీవం ఉండేందుకు అత్యవసరమన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని గోల్డీలాక్స్ జోన్ అని పిలుస్తుంటారు. సౌర కుటుంబంలోని గురు గ్రహానికి ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటైన యూరోపా కొంచెం అటు ఇటుగా ఈ గోల్డీలాక్స్ జోన్లోనే ఉంది. పైగా ఆ ఉపగ్రహంలో మహా సముద్రాలు ఉన్నాయని చాలా కాలంగా తెలుసు. ఈ నేపథ్యంలోనే యూరోపా చుట్టూ చక్కర్లు కొడుతూ దాన్ని మరింత నిశితంగా పరిశీలించేందుకు జరుగుతున్న యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ వివరాలు... 1610లో గెలీలియో గురుగ్రహం వైపు తన దుర్భిణిని మళ్లించి చూసినప్పుడు అతడికి గ్రహంతోపాటు వెలుగులు చిమ్ముతున్న నాలుగు చుక్కల్లాంటివి కనిపించాయి. గురుగ్రహానికి ఉన్న 67 ఉపగ్రహాల్లో అతిపెద్దవైన నాలుగు ఉపగ్రహాలివి. వీటిల్లో అతి చిన్నది యూరోపా! నాసా ప్రయోగించనున్న యూరోపా క్లిప్పర్ కంటే ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2022లోనే జూపిటర్ ఐసీమూన్ ఎక్స్‌ప్లోరర్ లేదా జ్యూస్ పేరుతో ఓ పరిశోధక నౌకను యూరోపా పైకి ప్రయోగించనుంది. భవిష్యత్తులో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను యూరోపాలోని సముద్రాల్లో ప్రయాణించేలా చేసి ఆ ఉపగ్రహం గురించి మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకూ ప్రణాళికలు ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌర కుటుంబంలోని అతి పెద్ద చంద్రుడిపై నీటి జాడ..!
వాషింగ్టన్: సౌర కుటుంబంలోనే అతి పెద్ద చంద్రుడు, గురు గ్రహ ఉపగ్రహం ‘గనీ మీడ్’ వాతావరణంలో నీటి ఆవిరి ఉందని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమిపై ఉన్న మహాసముద్రాల కంటే ఎక్కువ పరిమాణంలో గనీమీడ్ నీటిని కల్గి ఉందని నాసా వెల్లడించింది. గనీమీడ్‌పై ద్రవరూపంలో ఉన్న నీటిని కనుగొనడం కష్టమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహంపై అత్యంత శీతలీకరణ పరిస్థితులు ఉండటంతో నీరు ఎప్పుడు ఘనీభవన స్థితిలో ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గనీమీడ్ క్రస్ట్ కింద సుమారు 100 మైళ్ల దూరంలో మహాసముద్రాలు ఉన్నాయని నాసా పేర్కొంది. ఈ ఉపగ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడంలో నీటిని కనుగొనడం ఒక కీలకమైన అడుగు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా గత రెండు దశాబ్దాలుగా హబుల్ టెలిస్కోప్ అందించిన డేటాను విశ్లేషించి గనీమీడ్‌పై నీటి జాడ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. వేరే గ్రహలపై ద్రవ రూపంలో నీటి జాడ ఉంటే.. ఆయా గ్రహాలు నివాసయోగ్యంగా ఉంటాయనే విషయం కష్టంతో కూడుకున్న పని అని నాసా తెలిపింది. నాసా శాస్త్రవేత్తలు 1988లో హబుల్టెలిస్కాప్ అందించిన గనీమీడ్ అతినీల లోహిత(యూవీ) చిత్రాల ఆధారంగా పరిశోధనలను చేపట్టారు. ఈ పరిశోధనల్లో భాగంగా భూమిపై అయస్కాంత క్షేత్రాల వద్ద ఏర్పడే దృగ్విషయాలను గనీమీడ్ ఉపగ్రహంపై ఉన్నట్లు గుర్తించారు. గనీమీడ్ వాతావరణంలో మధ్యాహ్న సమయాల్లో మంచు భాష్పీభవన ప్రక్రియకు గురై నీటి ఆవిరి రూపంలో ఉన్నట్లు కనుగొన్నారు. 2022లో నాసా జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ మిషన్‌ను ప్రయోగించనుంది. ఈ మిషన్ 2029లో గురుగ్రహం వద్దకు చేరుకుంటుందని తెలుస్తోంది. -
ఐదేళ్లలో అంతరిక్ష నగరాలు!?
సౌర కుటుంబంలో కుజుడు (మార్స్), జూపిటర్ (గురు) మధ్య ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్‌లోని వేలాది గ్రహ శకలాలు పరిభ్రమిస్తుంటాయని తెలిసిన సంగతే! ఈ బెల్టులోని పెద్ద పెద్ద శకలాల చుట్టూ సమీప భవిష్యత్ లో మానవ ఆవాసాలు (హ్యూమన్ సెటిల్మెంట్స్) సాధ్యమేనని ఫిన్లాండ్ సైంటిస్టు డా. పెక్కా జాన్హ్యునన్ చెబుతున్నారు. అది కూడా ఎప్పుడో కాదని, వచ్చే నాలుగైదేళ్లలో 2026 నాటికి హ్యూమన్ కాలనీలు ఏర్పడతాయంటున్నారు. వచ్చే 15 సంవత్సరాల్లో లక్షలాది మంది ఈ మెగాసిటీలో నివాసం ఉండేందుకు తరలిపోతారంటున్నారు. ఈ మేరకు ఆయన ‘మెగా శాటిలైట్’ పేరిట ఒక రిసెర్చ్ పేపర్‌ను పబ్లిష్ చేశారు. ఈ బెల్టులోని అతిపెద్ద గ్రహ శకలం సీరిస్ చుట్టూ పరిభ్రమించేలా శాటిలైట్ నగరాలు నిర్మించవచ్చని చెప్పారు. సీరిస్ గ్రహం భూమి నుంచి 32.5కోట్ల మైళ్ల దూరంలో ఉంది. ఆర్టిఫిషియల్ గ్రావిటీతో ఈ శాటిలైట్ కాలనీలు ఏర్పాటు చేయవచ్చని జాన్ చెప్పారు. ఇప్పటివరకు అంతరిక్షంలో మానవ సెటిల్మెంట్ ఆలోచనలన్నీ చంద్రుడు, కుజుడు, టైటాన్ చుట్టూనే తిరిగాయి. తొలిసారి జాన్ విభిన్న సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నార ప్రతిపాదిత శాటిలైట్ సిటీ డిస్క్ ఆకారంలో ఉంటుందని, వేలాది స్థూపాకార నిర్మాణాలు ఇందులో ఉంటాయని, ఒక్కో నిర్మాణంలో 50 వేల మంది నివసించవచ్చని చెప్పారు. వీటిని శక్తిమంతమైన అయిస్కాంతాలకు లింక్ చేయడం వల్ల కృత్రిమ గ్రావిటీని సృష్టించి వీటిని స్థిరంగా ఉంచవచ్చన్నారు. 15 సంవత్సరాల తర్వాత ఈ కాలనీల్లో ప్రజలు సీరిస్‌పై వనరులు తవ్వడం ఆరంభించవచ్చని అంచనా వేశారు. సీరిస్ నుంచి శాటిలైట్ నగరానికి వచ్చేందుకు స్పేస్ ఎలివేటర్లు ఉంటాయన్నారు. సీరిస్‌పై వాతావరణంలో నైట్రోజన్ ఎక్కువని, అందువల్ల భూమి వాతావరణానికి దగ్గనడి ఉంటుందని చెప్పారు. ఇన్ని చెబుతూ, ఇలా ఏర్పరిచే కృత్రిమ నగరాలకు ఆస్ట్రాయిడ్స్ నుంచి, స్పేస్ రేడియేషన్ నుంచి ముప్పు పొంచి ఉంటుందని తేల్చేశారు. ఈ ముప్పులను తట్టుకునేందుకు శాటిలైట్ సిటీల చుట్టూ స్థూపాకార అద్దాలు ఏర్పరచాలని సూచించారు. ఇవన్నీ వింటుంటే సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదా! కానీ జాన్ ప్రతిపాదన మాత్రం అంతరిక్షంలో మానవ ఆవాసాల ఏర్పాటుపై కొత్త కోణాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
400 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అద్భుతం..
న్యూయార్క్ : సోమవారం(రేపు) ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రెండు పెద్ద గ్రహాలైన శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోనికి రానున్నాయి. దీన్నే ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇక మళ్లీ 60 ఏళ్ల తర్వాతే ఇది జరుగుంది. అంటే 2080లో శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోకి వస్తారన్న మాట. ఇలాంటి ఘట్టం దాదాపు 400 ఏళ్ల తర్వాత చోటుచేసుకోబోతోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని, బృహస్పతి దగ్గరగా, ఒకే వరుసలోకి వచ్చే సంఘటన రాత్రి పూట జరిగి దాదాపు 800 ఏళ్లు అయిందని పేర్కొన్నారు. గెలీలియో టెలీస్కోప్ను కనిపెట్టిన 13 ఏళ్ల తర్వాత 1623లో ‘క్రిస్మస్ స్టార్’ ఆవిష్కృతం అయిందని అంటున్నారు. -
అంతరిక్షంలో దోశ
వాషింగ్టన్ : మొన్నటికి మొన్న సూర్యుడి వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగా అబ్బుపరిచిందో తెలిసిన విషయమే. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రెజల్యూషన్ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించిందీ నాసా. ఇది చూసిన నెటిజన్లు సూర్యుడికి నానాటికీ ఫైర్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అంటూ చమత్కరించారు. ఈసారి బృహస్పతి ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కానీ ఆ గ్రహాన్ని బృహస్పతి అని పిలవడానికి చాలామందికి మనసొప్పడం లేదు. అందుకు బదులుగా దోశ, మసాలా దోశ అంటూ రకరకాల దోశ పేర్లతో పిలుచుకుంటున్నారు. (జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం) దీనికి కారణం అది దోశ ఆకృతిలో కనిపించడమే. తొలిసారిగా ఈ ఫొటో చూసినవారెవరైనా అది దోశ అని భ్రమించి తప్పులో కాలేస్తారు. 2000వ సంవత్సరంలో నాసా తీసిన బృహస్పతి ఫొటో ప్రస్తుతం ఆహారప్రియులను తెగ ఆకర్షిస్తోంది. "ఇది ఖచ్చితంగా దోశలాగే కనిపిస్తుంది అనేవాళ్లు చేతులెత్తండి" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. "లేదు లేదు, నోరూరిస్తున్న దోశను పట్టుకుని బృహస్పతి అంటారేమిటి? అది అబద్ధం" అంటూ మరో నెటిజన్ చమత్కరించాడు. (వైరల్‌గా నాసా విడుదల చేసిన సూర్యుడి వీడియో..) -
ఖగోళ వింత: ఆసక్తి కలిగిస్తున్న ధృవాలు
న్యూఢిల్లీ : గురుగ్రహం.. చంద్రుడు తరువాత మనిషి అత్యంత ఆసక్తి చూపుతున్న గ్రహం.. కొన్నేళ్లుగా ఈ గ్రహంపై నాసా సహా పలు అంతర్జాతీయ సైంటిస్టులు విరివిగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యలో గురు గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లను కనుగునేందుకు నాసా జునోను ప్రయోగించింది. గురుగ్రహ కక్ష్యలో తిరుగుతూ.. అద్భుతమై, ఆసక్తికరమైన ఫొటోలను భూమికి చేరవేసింది. దాదాపు ఏడాది కాలంగా గురుగ్రహ కక్ష్యలో తిరుగుతున్న జునో.. విప్లవాత్మక విషయాలను గుర్తించింది. ప్రధానంగా ప్రతి 53 రోజులకు ఒకసారి.. గురువు దగ్గరగా వెళుతూ.. గ్యాస్ స్పాట్లను గుర్తించింది. ఉత్తర, దక్షిణ ధృవాల చుట్టూ దగ్గరగా తిరుగుతూ.. అక్కడి వాతావరణానికి సంబంధించిన చిత్రాలను నాసాకు పంపంది. ఇప్పుడు ఈ చిత్రాలను విశ్లేషించడంపైనే నాసా సైంటిస్టులు కుస్తీలు పడుతున్నారు. 2017 సెప్టెంబర్ 1న జునో.. దక్షిణ ధృవానికి దగ్గరగా వెళ్లి.. అక్కడి భౌతిక, వాతావరణానికి సంబంధించిన చిత్రాలను అందించింది. వాటిని విశ్లేషిస్తే.. గ్రహంలో మొత్తం 11 రంగులు కనిపిస్తాయి. దక్షిణార్ద గోళంతో పోలిస్తే.. ఉత్తరార్ద గోళం దగ్గర వాతావరణం విభిన్నంగా ఉంటుంది. గురు గ్రహం దగ్గర రాత్రి, పగలు వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ధృవప్రాంతాలతో పోలిస్తే.. మధ్య భాగంలో వాతావరణం మరింత విభిన్నంగా ఉంటుందని సైంటిస్టులు విశ్లేషణ చేస్తున్నారు. మచ్చలు, తక్కువగా ఉంటాయి. -
పురుషుల కోసం టివిఎస్ జూపిటర్
-
రెండేళ్లయితే.. బైక్ మార్చెయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యువకులు ఆలోచన ల్లోనే కాదు, బైక్‌ల కొనుగోళ్ల విషయంలోనూ వేగంగా దూసుకెళ్తున్నారట. అందుకే 150 సీసీ, ఆపై సామర్థ్యం ఉన్న ప్రీమియం బైక్‌లను రెండు, రెండున్నరేళ్లకోసారి మార్చి కొత్త మోడళ్లను దక్కించుకుంటున్నారు. మార్కెట్లోకి కొత్త బైక్ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు రోడ్లపైకి దూసుకెళ్దామా అని అలోచించేవారు 15-20 శాతం మంది ఉంటారని టీవీఎస్ మోటార్ అంటోంది. ఇక 100 సీసీ బైక్‌ల విషయంలో అయితే నాలుగైదేళ్లు వాడిన తర్వాతే విక్రయిస్తున్నారని ఈ కంపెనీ చెబుతోంది. ద్విచక్ర వాహనాలను కొంటున్నవారిలో 35-40 శాతం మంది నిన్న మొన్నటివరకు వేరే మోడల్‌ను నడిపించి ఇప్పుడు కొత్త బైక్‌కు మారినవారే. ఇక 150 సీసీ, ఆపై సామర్థ్యంగల బైక్‌ల వాటా ప్రస్తుతం 15 శాతం ఆక్రమించింది. స్కూటర్ల అమ్మకాలు జూమ్.. దేశవ్యాప్తంగా స్కూటర్ల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. మొత్తం ద్విచక్ర వాహనాల్లో స్కూటర్ల వాటా 2010-11లో 18 శాతముంటే, ఇప్పుడు 14 శాతం వృద్ధి రేటుతో 23 శాతానికి చేరింది. భారత్‌లో నెలకు అన్ని కంపెనీలవి కలిపి సగటున 2.62 లక్షల స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. ఇక పురుషులు మాత్రమే వాడుతున్న స్కూటర్ల వాటా 36 శాతం, స్త్రీలు మాత్రమే నడుపుతున్న మోడళ్లు 13 శాతం, ఇరువురు వాడగలిగే స్కూటర్లు 35 శాతం ఉన్నాయి. మహిళా వాహనదార్ల సంఖ్య 7-8 శాతం పెరుగుతుండగా, పురుషుల విషయంలో ఇది 12-14 శాతం వృద్ధి ఉంటోంది. పట్టణాల్లోని బైక్ వినియోగదారుల్లో స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నవారు 15 శాతం మంది దాకా ఉంటున్నారట. పట్టణీకరణ, సౌలభ్యం కారణంగానే స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీలు అంటున్నాయి. రాష్ట్రంలోకి టీవీఎస్ జూపిటర్ టీవీఎస్ మోటార్ కంపెనీ రాష్ట్ర మార్కెట్లోకి జూపిటర్ స్కూటర్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మోడల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పురుషుల స్కూటర్ల విభాగంలోకి కంపెనీ అడుగిడింది. ప్రస్తుతం నెలకు 30-32 వేల స్కూటర్లను టీవీఎస్ దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. కొత్త మోడల్ చేరికతో వచ్చే మార్చినాటికి అమ్మకాలు నెలకు 50 వేలకు ఎగబాకుతాయని కంపెనీ ప్రాంతీయ మేనేజర్ (సౌత్-2) ఎస్.అరుణ్ కుమార్ ఈ విడుదల సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్లు ఇప్పుడు అధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జూపిటర్ మోడల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో జూపిటర్ స్కూటర్ ధర రూ.48,400. మైలేజీ లీటరుకు 62 కిలో మీటర్లు వస్తుందని ఆయన చెప్పారు. -
టీవీఎస్ కొత్త స్కూటర్... జూపిటర్
చెన్నై: టీవీఎస్ మోటార్స్ స్కూటర్ సెగ్మెంట్లో కొత్త మోడల్, జూపిటర్ను సోమవారం విడుదల చేసింది. స్కూటర్లు నడిపే పురుషులను లక్ష్యంగా చేసుకుని 110 సీసీ కేటగిరీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ జూపిటర్ స్కూటర్ ధరను రూ.44,200(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ సీఎండీ వేణు శ్రీనివాసన్ చెప్పారు. 62 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ స్కూటర్‌ను ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోనే విక్రయిస్తామని, దీపావళికల్లా దక్షిణాది మార్కెట్లో అమ్మకాలు ప్రారంభిస్తామని వివరించారు. ఇప్పటి నుంచి ప్రతీ మూడు నెలలకొకసారి కొత్త మోడల్‌ను అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే జనవరిలో స్కూటీ జెస్ట్‌ను మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. నాలుగో మోడల్: స్కూటర్ సెగ్మెంట్లో మరింత వాటా లక్ష్యంగా టీవీఎస్ కంపెనీ నాలుగో స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీ స్కూటీ పెప్, స్కూటీ స్ట్రీక్, వెగో మోడళ్లను విక్రయిస్తోంది. ఈ జూపిటర్ స్కూటర్ హోండా యాక్టివా, హీరో మోటోకార్ప్ మ్యాస్ట్రో, యమహా రే జడ్ స్కూటర్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రత్యేకతలు: 17 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ(హెల్మెట్ పెట్టొచ్చు) ఉన్న ఈ స్కూటర్లో బాడీ బ్యాలెన్స్ ప్రత్యేక ఆకర్షణ. పెద్ద అలాయ్ వీల్స్‌తో 4 రంగుల్లో(బ్లాక్, వైట్, గ్రే, రెడ్) లభిస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్, ట్విన్ సిటీ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, మొబైల్ చార్జింగ్ పాయింట్, ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్స్, గ్యాస్ చార్జ్డ్ రియర్ సస్పెన్షన్, పాసింగ్ లైట్ స్విచ్(ఈ సెగ్మెంట్లో ఇలాంటి ఫీచర్ ఉన్న తొలి స్కూటర్ ఇదే) వంటి ప్రత్యేకతలున్నాయి. వెనక వైపు ఉన్న ఎల్ఈడీ లైట్ల పైన పెట్రోల్ టాంక్ మూత ఉంది(పెట్రోల్ పోయించుకోవడానికి సీట్‌ను పైకి ఎత్తాల్సిన అవసరం లేదు).