ఇంటర్నెట్లో దీనిపై భారీ చర్చనే నడిచింది. కొందరు ఎగ్ దోశ అని చెబితే.. మరికొందరు వాళ్లమ్మ వేసే మినప్పిండి దోశ సేమ్ ఇలాగే ఉంటుందని.. కాబట్టి.. ఇది అదే అని వాదించారు. ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ మాత్రం ఎహే.. ఇది ప్లెయిన్ దోశ అంటూ తేల్చేశారు. ఇంతకీ మీరేమంటారు? ఏం దోశ ఇది.. మసాలానా.. లేక మరేదైనానా.. సరిగ్గా తెలియడం లేదా.. టైం అప్.. నిజమేంటంటే.. అసలు ఇది దోశనే కాదు.. ఓ గ్రహం..
అది కూడా సౌర వ్యవస్థలోనే అత్యంత పెద్దదైన బృహస్పతి(జుపిటర్). గతంలో నాసాకు చెందిన అంతరిక్ష నౌక ‘కసీని’ కక్ష్యలో తిరుగుతూ ఈ గ్రహాన్ని కింద నుంచి ఫొటో తీసింది. తాజాగా నాసా దీన్ని మళ్లీ విడుదల చేయడం.. ఈ ఫొటో దోశను పోలి ఉండటంతో ట్విట్టర్‌లో ‘ఇది ఏం దోశ’’ అనే చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా నెటిజన్లు సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment