వాషింగ్టన్: సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి సోమవారం భూమికి అతి సమీపానికి, అంటే 59 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. ఫలితంగా సోమవారం సాయంత్రం 5.29 నుంచి మంగళవారం తెల్లవారుజాము 5.30 దాకా ఆకాశంతో అత్యంత ప్రకాశవంతంగా కన్పించి కనువిందు చేసింది.
బృహస్పతి భూమికి ఇంత దగ్గరికి రావడం గత 59 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ ఇంత సమీపానికి రావాలంటే 2129 దాకా ఆగాల్సిందే. 53 ఉపగ్రహాలున్న బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఏకంగా 11 ఏళ్లు తీసుకుంటుంది!
Comments
Please login to add a commentAdd a comment