near
-
‘నియర్’ వెరీ డియర్
‘నియర్’ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా సరిగ్గా 24 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన ఒక అంతరిక్ష నౌక అనూహ్యంగా ఒక గ్రహశకలంపై దిగింది. దానికి ఆ సామర్థ్యం ఏమాత్రమూ లేకపోయినా రాతితో కూడిన నేలపై అతి సున్నితంగా లాండైంది. అన్ని ప్రతికూలతలను తట్టుకుంటూ అక్కడి నుంచి రెండు వారాల నిక్షేపంగా పనిచేసింది. సదరు అస్టరాయిడ్కు సంబంధించిన విలువైన డేటాను భూమికి చేరవేసింది. గ్రహంపై కాకుండా ఓ గ్రహశకలంపై కాలుమోపిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఇదంతా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పట్లో ప్రయోగించిన నియర్ ఎర్త్ అస్టరాయిడ్ రెండీవ్ (నియర్) స్పేస్‌క్రాఫ్ట్ గురించే. ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమి వైపుగా శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో నాసా సైంటిస్టులు నాటి నియర్ ఘనతను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. వైఆర్4 భూమిని ఢీకొనే అవకాశాలు 2 శాతం దాకా ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ఇది బహుశా 2032లో జరిగే చాన్సుందట. భూమికేసి రాకుండా దాన్ని దారి మళ్లించాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో నాడు ‘నియర్’ అందించిన వివరాలు ఎంతగానో ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. అలా జరిగింది... భూమికి 35.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘433 ఏరోస్’ అనే ఎస్–క్లాస్ గ్రహశకలం లక్షణాలు, అందులోని ఖనిజాలు, అయస్కాంత క్షేత్రం తదితరాలను అధ్యయనం చేయాలని నాసా భావించింది. దాని చుట్టూ కక్ష్యలో పరిభ్రమించే లక్ష్యంతో నియర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను 1996 ఫిబ్రవరి 17న ప్రయోగించింది. అంతరిక్షంలో వెళ్లిన ఏడాదికి అది అస్టరాయిడ్ ఉపరితలానికి 1,200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అక్కణ్నుంచి మరింత ముందుకెళ్లి ఏరోస్ చుట్టూ కక్షలోకి తిరగాల్సి ఉండగా నియర్ జాతకమే తిరగబడింది. 1998 డిసెంబర్ 20న సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బర్న్ కారణంగా నియర్ అనుకున్నట్లుగా పనిచేయలేని పరిస్థితి! దాంతో బ్యాకప్ ఇంధనం సాయంతో దాన్ని ఏకంగా అస్టరాయిడ్పైనే దించాలని నాసా నిర్ణయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా నియర్ 2001 ఫిబ్రవరి 12న ఏరోస్కు అత్యంత సమీపానికి చేరుకుంది. చివరికి నెమ్మదిగా ఏరోస్పై దిగి చరిత్ర సృష్టించింది. ఒక అంతరిక్ష నౌక గ్రహశకలాన్ని తాకడం అదే మొదటిసారి. అలా నియర్ కాస్తా సైంటిస్టులకు వెరీ డియర్గా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వినువీధి నుంచి చంద్ర గ్రహణ వీక్షణం
టెక్సాస్: చంద్రగ్రహణాన్ని భూమి నుంచి చూశారు. అయితే అత్యంత దగ్గరగా, అది కూడా ఆకాశం నుంచి చూశారా? లేదు కదా. అయితే వచ్చే నెలలో చంద్రునిపై దిగనున్న బ్లూ ఘోస్ట్ ల్యాండర్ చంద్రగ్రహణాన్ని అత్యంత సమీపం నుంచి చూపించి అబ్బురపరిచింది. అది తాజాగా తీసిన చంద్రగ్రహణం ఫొటోలను జతకూర్చి వీడియోగా కూర్చి ల్యాండర్ తయారీదారు ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో తెగ వైరలవుతోంది. ల్యాండర్ ప్రస్తుతం అంతరిక్షంలో భూ సమీప కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రగ్రహణం ఫొటోలను తన 6.6 అడుగుల ఎత్తయిన డెక్ నుంచి కెమెరాలో బంధించింది. సూర్యకిరణాల వల్ల ఏర్పడిన తన నీడతో భూమి చంద్రుడిని కప్పేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనువిందు చేస్తున్నాయి. చంద్రునిపై నాసా పరిశోధనలకు పరికరాలను మోసుకెళ్లేందుకు ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సరీ్వసెస్’ ప్రాజెక్టులో భాగంగా జనవరి 15న అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బ్లూ ఘోస్ట్ ల్యాండర్‌ను ప్రయోగించారు. -
‘డూమ్స్‌డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా?
కొంతమందికే తెలుసు.. ప్రపంచంలో అలాంటి స్మార్ట్ వాచ్ ఉందని.. అది 1947 నుండి మనకు ప్రమాదాలను సూచిస్తోందని... ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా ఈ వాచ్ తన స్పీడ్‌ని పెంచింది. అంటే మనం ఇప్పుడు గతంలో కంటే వేగంగా ప్రళయకాలానికి దగ్గరవుతున్నామని దాని అర్థం. ఇప్పుడు మనం ‘డూమ్స్‌డే క్లాక్’ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సింబాలిక్ క్లాక్.. మహమ్మారి, అణు దాడులు, వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచ విధ్వంస అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రళయానికి ముందు మనుషులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ గడియారం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది ప్రళయకాలాన్ని తెలియజేస్తోంది. 1945లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం, కొంతమంది అణు శాస్త్రవేత్తలు కలిసి డూమ్స్‌డే వాచ్‌ను రూపొందించారు. ప్రపంచ మనుగడకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పడానికే డూమ్స్‌డే క్లాక్ రూపొందించారు. ఈ గడియారాన్ని 13 మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటుంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈవాచ్‌లో టైమ్ మారుతుంటుంది. దీనిని తొలిసారిగా 1947లో సృష్టించినప్పుడు మానవాళికి ఉన్న ఏకైక ముప్పు అణు దాడి. దీనిని రూపొందించినప్పుడు ఈ గడియారపు సమయాన్ని 10 సెకన్లు తగ్గించారు. దీని ప్రభావం మూడేళ్లలో కనిపించింది. దీని వేగం సాధారణ గడియారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే కాలానుగుణంగా సహజ, మానవ వాతావరణ మార్పుల కారణంగా ఇది వేగవంతం అవుతుంది. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ ఈ గడియారాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ అణు దాడులు, జీవ రసాయన ఆయుధాలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులను పర్యవేక్షిస్తుంది. కరోనా వైరస్, ఎబోలా వ్యాప్తి, సిరియా దాడులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత డూమ్స్‌డే సమయం నిరంతరం తగ్గుతూవస్తోంది. ప్రపంచం ముందున్న సవాళ్లను ఇకనైనా అరికట్టకపోతే ప్రళయం మరింత వేగంగా ముంచుకువస్తుందని ఈ డూమ్స్‌డే గడియారం మానవాళిని హెచ్చరిస్తోంది. ఇది కూడా చదవండి: బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది? -
ఎవరెస్టు సమీపంలో కూలిన హెలికాఫ్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి..
ఖాట్మండ్: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎవరెస్టు పర్వత ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మెక్సికోకు చెందినవారు కాగా.. మరోకరు స్థానిక వ్యక్తిగా గుర్తించారు. ఎవరెస్ట్‌తో సహా పలు ఎత్తైన పర్వత ప్రాంతాలకు నిలయమైన సోలుఖున్వు జిల్లాలోని సుర్కే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల్లో ఒకరైన క్యాప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ మృతదేహాన్ని ఖాట్మండ్ పోస్టుకు సమీపంలో గుర్తించారు. కాగా.. ఆయన 1998 నుంచి మనాంగ్ ఏయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్‌ను మనాంగ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్టుతో సహా పలు ఉన్నత శిఖరాలను చూడటానికి పర్యటకుల కోసం మనాంగ్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ సేవలను అందిస్తోంది. అయితే.. ఖాట్మండ్‌కు తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 9N-AMV నంబర్ కలిగిన ఈ హెలికాఫ్టర్ ఉదయం 10 గంటల సమయంలో రాడార్ నుంచి తప్పిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత శిథిలాలను సోలుఖున్వు జిల్లాలో లమ్జురా గ్రామంలో స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు చేపట్టనుంది. ఇదీ చదవండి: Why Pirates Wear Eye Patches: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..! -
చిత్తూరు జిల్లా : కాణిపాకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మళ్లీ చూడాలంటే 107 ఏళ్లు ఆగాల్సిందే!
వాషింగ్టన్: సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి సోమవారం భూమికి అతి సమీపానికి, అంటే 59 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. ఫలితంగా సోమవారం సాయంత్రం 5.29 నుంచి మంగళవారం తెల్లవారుజాము 5.30 దాకా ఆకాశంతో అత్యంత ప్రకాశవంతంగా కన్పించి కనువిందు చేసింది. బృహస్పతి భూమికి ఇంత దగ్గరికి రావడం గత 59 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ ఇంత సమీపానికి రావాలంటే 2129 దాకా ఆగాల్సిందే. 53 ఉపగ్రహాలున్న బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఏకంగా 11 ఏళ్లు తీసుకుంటుంది! -
కాన్పూర్ వద్ద రైలు ప్రమాదం
-
చెట్టును ఢీకొట్టిన ట్రాలీ
క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్ పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసినా స్పందన నిల్ అరగంట తరువాత వచ్చిన 108 ఈ లోగా రక్షణ చర్యల్లోకి దిగిన ‘సాక్షి’ సిబ్బంది సెక్యూరిటీలోనే ప్రాథమిక చికిత్సలు అనంతరం ఆసుపత్రికి తరలింపు రాజానగరం : విధులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు విధులు ముగించుకొని బయటకు వస్తున్న ‘సాక్షి’ సిబ్బందికి ఏడీబీ రోడ్డుపై పెద్ద శబ్ధం వినిపించింది. ముద్రణా కార్యాలయానికి కూతవేటు దూరంలో ఏదో ప్రమాదం జరిగిందని భావించిన సిబ్బంది వెంటనే స్పందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కటిక చీకట్లో సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో లారీ ప్రమాదానికి గురైందని గుర్తించారు. తునాతునకలైనా లారీ క్యాబిన్లో ఇరుక్కున క్లీనర్ ఆర్తనాదాలు విని సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులోనే అక్కడకు చేరుకుని క్లీనర్‌ని బయటకు తీశారు. కాకినాడ పోర్టు నుంచి వస్తున్న గ్రానైట్‌ను రవాణా చేసే ట్రాలీ ఏడీబీ రోడ్డుపై మలుపుతిరుగుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ట్రాలీ క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ఇదే సమయంలో విధులు ముగించుకుని ‘సాక్షి’ ముద్రణాకార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఎడిటోరియల్ స్టాఫ్, మరికొందరు ఇతర విభాగాల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతంలో కరెంటు తీగలు కూడా తెగిపడి వేళాడుతుండటాన్ని గమనించి ముందుగా విద్యుత్ శాఖ ఇంజనీర్‌కి సమాచారం ఇచ్చారు. దానితో వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఆ శాఖ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రమాదానికి గురైన ట్రాలీ వద్దకు వెళ్లి క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్ రాజును, డ్రైవర్ కొమరయ్యను బయటకు తీశారు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడినా క్లీనర్‌కి మాత్రం తలకు బలమైన గాయాలై రక్తం కారుతుండటంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్పందించని పోలీసులు సంఘటనా స్థలంలో చెట్టును ఢీ కొన్న ట్రాలీ నుంచి క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్, డ్రైవర్లను బయటకు తీసేందుకు ‘సాక్షి’ సిబ్బంది తీవ్రంగా కష్టపడవలసి వచ్చింది. ఈ సమయంలో ప్రమాదం గురించి పోలీసులకు తెలియజేసేందుకు పోలీసు స్టేషనుకు ఎన్నిమార్లు ఫోన్ చేసినా అవతలి నుంచి రెస్పాండ్ లేదు. చివరకు ప్రాణాపాయస్థితిలో ఉన్న క్లీనర్, డైవర్లను బయటకు తీసి, వారి ప్రాణాలను కాపాడారు. అయితే ఈ ప్రమాదం గురించి సోమవారం ఉదయం తెలుసుకున్న సీఐ శంకర్‌నాయక్ దృష్టికి ఫోన్ విషయాన్ని తీసుకువెళ్లగా కొన్ని రోజులుగా పోలీసు స్టేషనులో ఫోన్ పనిచేయడం లేదన్నారు. తాను బందోబస్తు డ్యూటీలో ఉన్నానన్నారు. ప్రమాదాల నెలవు ఈ మలుపు ఏడీబీ రోడ్డు పై ‘సాక్షి’ ముద్రణా కార్యాలయానికి సమీపంలో ఉన్న మలుపు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టును కాకినాడ వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఢీ కొన్న సంఘటన మాదిరిగానే ఈ ప్రాంతంలో రెండేళ్లలో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఎక్కువగా మలుపులో వేగాన్ని నియంత్రించలేక ప్రమాదానికి గురైన వాహానాలే ఉన్నాయి. ఈ మలుపునకు అటునిటు సాఫీగా ఉంటే రహదారి ఒక్కసారిగా మలుపు తిరగడంతోపాటు ఆ మలుపును దగ్గరకు వచ్చే వరకు గమనించే వీలు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ కారణంగా నాలుగు లేన్ల రహదారిగా ఈ రోడ్డును విస్తరించే అవకాశాలున్నందున కనీసం ఆ సమయంలోనైనా ఇక్కడ ఉన్న మలుపును ప్రమాదాలకు తావులేకుండా సరిచేయాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. -
వెరిజోన్ చేతికి యాహూ?
లండన్ : యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కోనుగోలుకు ప్రముఖ వైర్ లెస్ దిగ్గజం వెరిజోన్ సంస్థ అంతాసిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొదటినుంచీ గట్టి పోటీదారుడుగా భావిస్తున్న వెరిజోన్ చివరకి యాహూ ను కైవసం చేసుకోనుంది. ఈ క్రమంలో ఈ రెండు సంస్థల మధ్య చర్చలు మరింత సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. సుమారు రూ. 33 వేల 575 కోట్లకు (5 బిలియన్ డాలర్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్దమైనట్టు ఇరు కంపెనీల సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ ముగించనున్నట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు వచ్చే వారం రోజుల్లోపే ఈ డీల్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అయితే వెరిజోన్ యాహూ కోర్ ఇంటర్నెట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమనీ, ఈ ఒప్పందంలో యాహూ రియల్ ఎస్టేట్ ఆస్తులు, పేటెంట్లు లాంటి ఇతర ఆస్తులు ఉండవని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. నాన్ కోర్ మేధో సంపత్తి ఆస్తుల అమ్మకం విడిగా విక్రయించబడుతుందని తెలిపారు. మరోవైపు వెరీజోన్ తప్ప మరి ఏ కంపెనీ యాహూ ఆస్తులను కొనుగోలు చేయలేదని రీకాన్ ఎనలిస్ట్ రోజర్ ఎ ట్నెర్ వ్యాఖ్యానించారు.అయితే వెరిజోన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీనిపై స్పందించడానికి నిరాకరించినట్టు సమాచారం. 140 మిలియన్లకు పైగా యూజర్లతో ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం ఎడ్వర్టైజింగ్ టెక్నాలజీ ప్లాట్ ఫాంని రూపొందించాలనే యోచనలో యాహూ పై కన్నేసింది. డిజిటల్ ప్రకటనల మార్కెట్లో పోటీ పెరగనుందనీ, 200 మిలియన్ యాహూయూజర్లతో వెరిజోన్ ప్రకటనల బేస్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ సంవత్సరం యాహూ షేర్లు ఇప్పటివరకు 18 శాతానికిపైగా వృద్ధి చెందాయి కాగా మిగతా బిడ్డర్స్ లో పెట్టుబడిదారులు సమాఖ్య (కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టర్స్), బైన్ క్యాపిటల్ ,బెర్క్ షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫ్ఫెట్, ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ, ఎల్లో పేజెస్ మాతృ సంస్థ వైపి హోల్డింగ్స్ పేర్లు ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
కబాలి కోసం..థియేటర్ల దగ్గర బారులు
-
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా గంజాయి!
-
పచ్చని పైరులో కొంగల విన్యాసం
పచ్చని పైరులో కొంగల విన్యాసం దేవరకొండ పట్టణ సమీపంలోని భీమనపల్లి కాలువ వెంట, పక్కనే ఉన్న పచ్చని వరిపొలాల్లో శనివారం భారీ సంఖ్యలో కొంగలు వచ్చి వాలి చూపరులను కనువిందు చేశాయి. ఆహారాన్వేషణలో భాగంగా కాలువలోని చేపల కోసమో.. పొలాల్లోని మిడతల కోసం వచ్చిన ఈ కొంగలు పచ్చని పైర్ల మధ్య తిరుగుతూ పలువురిని ఆకట్టుకున్నాయి