ఖాట్మండ్: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎవరెస్టు పర్వత ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మెక్సికోకు చెందినవారు కాగా.. మరోకరు స్థానిక వ్యక్తిగా గుర్తించారు. ఎవరెస్ట్‌తో సహా పలు ఎత్తైన పర్వత ప్రాంతాలకు నిలయమైన సోలుఖున్‌వు జిల్లాలోని సుర్కే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ప్రయాణికుల్లో ఒకరైన క్యాప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ మృతదేహాన్ని ఖాట్మండ్ పోస్టుకు సమీపంలో గుర్తించారు. కాగా.. ఆయన 1998 నుంచి మనాంగ్ ఏయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్‌ను మనాంగ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్టుతో సహా పలు ఉన్నత శిఖరాలను చూడటానికి పర్యటకుల కోసం మనాంగ్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ సేవలను అందిస్తోంది. అయితే.. ఖాట్మండ్‌కు తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
9N-AMV నంబర్ కలిగిన ఈ హెలికాఫ్టర్ ఉదయం 10 గంటల సమయంలో రాడార్ నుంచి తప్పిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత శిథిలాలను సోలుఖున్వు జిల్లాలో లమ్జురా గ్రామంలో స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు చేపట్టనుంది.
ఇదీ చదవండి: Why Pirates Wear Eye Patches: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment