chopper crash
-
ఎవరెస్టు సమీపంలో కూలిన హెలికాఫ్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి..
ఖాట్మండ్: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎవరెస్టు పర్వత ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మెక్సికోకు చెందినవారు కాగా.. మరోకరు స్థానిక వ్యక్తిగా గుర్తించారు. ఎవరెస్ట్‌తో సహా పలు ఎత్తైన పర్వత ప్రాంతాలకు నిలయమైన సోలుఖున్వు జిల్లాలోని సుర్కే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల్లో ఒకరైన క్యాప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ మృతదేహాన్ని ఖాట్మండ్ పోస్టుకు సమీపంలో గుర్తించారు. కాగా.. ఆయన 1998 నుంచి మనాంగ్ ఏయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్‌ను మనాంగ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్టుతో సహా పలు ఉన్నత శిఖరాలను చూడటానికి పర్యటకుల కోసం మనాంగ్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ సేవలను అందిస్తోంది. అయితే.. ఖాట్మండ్‌కు తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 9N-AMV నంబర్ కలిగిన ఈ హెలికాఫ్టర్ ఉదయం 10 గంటల సమయంలో రాడార్ నుంచి తప్పిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత శిథిలాలను సోలుఖున్వు జిల్లాలో లమ్జురా గ్రామంలో స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు చేపట్టనుంది. ఇదీ చదవండి: Why Pirates Wear Eye Patches: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..! -
కుప్పకూలిన చీతా.. విషాదాంతం
భారత ఆర్మీ ఛాపర్ చీతా ప్రమాదం.. విషాదంగా ముగిసింది. పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డితో పాటు కో పైలట్ మేజర్ జయంత్ కూడా మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యంతో పాటు ఐటీబీపీ మరో రక్షణ విభాగ సాయంతో మొత్తం ఐదు బృందాలు కూలిపోయిన పైలట్ల ఆచూకీ కోసం గాలించాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్ ప్రాంతం బంగ్లాజాప్ వద్ద గ్రామస్తులు కాలిపోతున్న ఛాపర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న బలగాలు.. ఆపై పైలట్, కోపైలట్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించారు. ఛాపర్ క్రాష్‌కు గురైన ప్రాంతంలో పొగమంచు దట్టంగా నిండిపోయి ఉండడం, కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థకు ఆటంకం కలుగుతోందని గుర్తించారు. మరోవైపు ప్రమాదానికి కారణాల గుర్తించేందుకు దర్యాప్తునకు ఆదేశించింది భారత ఆర్మీ. చీతా ఐదుగురు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న హెలికాఫ్టర్. అనేక రకాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలోనూ.. మిషన్ల సమయంలో అత్యంత ఎత్తులో(ప్రపంచ రికార్డు సైతం ఉంది దీనిపేరిట) అయినా ప్రయాణించగలిగే సత్తా ఉందన్న పేరుంది. హాల్(HAL) 1976-77 నడుమ తొలి ఛాపర్‌ను భారత సైన్యానికి అందించింది. ఇప్పటిదాకా 279 హెలికాఫ్టర్లను హాల్.. భారత్‌తో పాటు విదేశాల్లోనూ అందించింది. -
ఉత్తరాఖండ్ క్రాష్: భార్యకు చివరి కాల్లో ఆ పైలట్..
ముంబై: ఉత్తరాఖండ్ ఘోర విమాన ప్రమాదంలో పైలట్లు, యాత్రికులు మృత్యువాత పడ్డారు. ప్రతికూల వాతావరణంతోనే మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ఓ అంచనాకి వచ్చారు. అయితే.. ప్రమాదానికి ముందు కల్నల్(రిటైర్డ్), పైలట్ అనిల్ సింగ్(57) భార్యతో మాట్లాడిన మాటలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. తూర్పు ఢిల్లీకి చెందిన అనిల్ సింగ్.. కుటుంబంతో పాటు ముంబై(మహారాష్ట్ర) అంధేరీలోని ఓ హౌజింగ్ సొసైటీలో గత పదిహేనుళ్లుగా ఉంటున్నారు. ఆయనకు భార్య షిరిన్ ఆనందిత, కూతురు ఫిరోజా సింగ్ ఉన్నారు. భార్య షిరిన్ ఫిల్మ్ రైటర్.. గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు కూడా. ఇక కూతురు ఫిరోజా.. మీడియాలో పని చేస్తోంది. అయితే.. ప్రమాదం కంటే ముందు రాత్రి అంటే సోమవారం రాత్రి ఆయన తన భార్యకు ఫోన్ చేసి పలు జాగ్రత్తలు సూచించినట్లు ఆనందిత తెలిపారు. ఆనందిత మాట్లాడుతూ.. గత రాత్రి ఆయన మాకు ఫోన్ చేశారు. ఫిరోజాకు ఆరోగ్యం బాగోలేదని ఆరా తీశారు. బిడ్డ జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశారు. అవే ఆయన చివరి మాటలు అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ఇది ప్రమాదంగానే భావిస్తున్నామని, కుట్ర కోణంతో ఫిర్యాదు చేసే ఆలోచనలో లేమని ఆమె వెల్లడించారు. కూతురితో పాటు ఢిల్లీలో జరగబోయే భర్త అంత్యక్రియలకు ఆమె బయలుదేరారు. 2021 నవంబర్‌లో మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో గాయపడ్డ పోలీస్ సిబ్బందిని తరలించడంలో అనిల్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. మరోవైపు మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన చాపర్ బెల్ 407(VT-RPN) కేదర్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి యాత్రికులను తీసుకెళ్లే క్రమంలో దేవ దర్శిని(గరుడ్ ఛట్టి) వద్ద ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణంతో కొండ ప్రాంతాల్లో అది పేలిపోయి ప్రమాదానికి గురై ఉంటుందని రుద్రప్రయాగ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై డీజీసీఏ తోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సైతం దర్యాప్తు చేపట్టింది. -
Aircraft Crashes: కుప్పకూలిన ఆర్మీ ట్రైనర్ హెలికాప్టర్
న్యూఢిల్లీ: ఆర్మీ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్‌కు గురవటం కలకలంగా మారింది. ఈ ప్రమాదం బిహార్‌లోని బోధ్ గయా బ్లాక్‌లో చోటు చేసుకుంది. కాగా, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్.. ట్రైనింగ్‌లో భాగంగా ఇద్దరు ట్రైనీలకు ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ నిస్తుంది. దీనిలో భాగంగా వీరు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ గయా సమీపంలో కుప్పకూలింది. ట్రైనీ ఉద్యోగులు.. హెలికాప్టర్ టెకాఫ్‌కు ప్రయత్నించిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో.. హెలికాప్టర్ అక్కడే ఉన్న పొలాల్లో దూసుకుపోయిందని సీనియర్ అధికారి తెలిపారు. కాగా, హెలికాప్టర్ కిందపడటాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే సంఘటన స్థలానికి పరుగున వెళ్లి చేరుకున్నారు. హెలికాప్టర్ చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రైనీలకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని ఆర్మీ సిబ్బంది తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు గల కారణాలపై విచారణ చేపట్టామని తెలిపారు. #WATCH | An aircraft of the Indian Army’s Officers’ Training Academy in Gaya, Bihar today crashed soon after taking off during training. Both the pilots in the aircraft are safe. Video source: Local village population pic.twitter.com/gauLWCrfxN — ANI (@ANI) January 28, 2022 చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’ -
Bipin Rawat: సైనిక్ స్కూల్‌కు జనరల్ బిపిన్ రావత్ పేరు
లక్నో: దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరును మెయిన్‌పురి జిల్లాలోని ఒక సైనిక్ స్కూల్‌కు పెట్టాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్ ప్రమాదంలో నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం గురువారం ఒక ట్వీట్‌చేసింది. 2019 ఏప్రిల్ ఒకటిన ఈ స్కూల్‌ను ప్రారంభించారు. కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం విదితమే. -
కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
Captain Varun Singh Passed Away: ఆర్మీహెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా, డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మందిలో 13 మంది అదే రోజు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ఈరోజు కన్నుమూశారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. చదవండి: ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా! Group Captain Varun Singh served the nation with pride, valour and utmost professionalism. I am extremely anguished by his passing away. His rich service to the nation will never be forgotten. Condolences to his family and friends. Om Shanti. — Narendra Modi (@narendramodi) December 15, 2021 IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family. — Indian Air Force (@IAF_MCC) December 15, 2021 -
పప్పా నా హీరో, బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులోని ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బాసిన బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో శనివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లిడ్డర్ సతీమణి గీతిక, కుమార్తె అస్నా భావోద్వేగానికి లోనుకావడం అక్కడున్న వాందరి కళ్ళల్లో కన్నీరు నింపింది. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అమరుడయ్యారన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి పార్థివ దేహాన్ని ముద్దు పెట్టుకుని కడసారి వీడ్కోలు పలికిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆస్రా మాట్లాడుతూ ఆయన అకాల మరణం జాతికి తీరని నష్టం. నన్ను చాలా గారాబం చేసేవారు.. ఇపుడు భయంగా ఉంది. నాకిపుడు 17 ఏళ్లు. ఈ 17 ఏళ్లు నాన్న నాతో ఉన్నారు. ఆ సంతోషకరమైన జ్ఞాపకాలతో ముందుకు వెళ్తా. మా పప్పా నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనే నా బిగ్గెస్ట్ మోటివేటర్ అంటూ కంటతడి పెట్టారు. #WATCH | Daughter of Brig LS Lidder, Aashna Lidder speaks on her father's demise. She says, "...My father was a hero, my best friend. Maybe it was destined & better things will come our way. He was my biggest motivator..." He lost his life in #TamilNaduChopperCrash on Dec 8th. pic.twitter.com/j2auYohtmU — ANI (@ANI) December 10, 2021 బ్రిగేడియర్ లిడ్డర్ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు గీతిక. అనంతరం సతీమణి గీతిక మాట్లాడుతూ ‘‘ఆయన చాలా మంచి మనిషి, స్నేహ శీలి..అందుకే నవ్వుతూ సాగనంపుతామని వచ్చా ఆయన మంచి తండ్రి. నా బిడ్డ ఆయనను చాలా మిస్ అవుతుంది. ఆయన లేకుండా జీవించాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది. చాలా నష్టం. కానీ విధి అలా ఉంది..గర్వంగా కంటే చాలా బాధగా ఉంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లిడ్డర్తోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. లిడ్డర్ జనరల్ రావత్‌కు రక్షణ సలహాదారుగా ఉన్నారు. లిడ్డర్ మేజర్ జనరల్ ర్యాంక్‌కి పదోన్నతి పొందాల్సి ఉంది. లిడ్డర్‌కు 2020లో సేన మెడల్, విశిష్ట సేన పతకం లభించింది. గతంలో కశ్మీర్లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్‌కు నేతృత్వం వహించారు. #WATCH | "...We must give him a good farewell, a smiling send-off, I am a soldier's wife. It's a big loss...," says wife of Brig LS Lidder, Geetika pic.twitter.com/unLv6sA7e7 — ANI (@ANI) December 10, 2021 -
రేగడపల్లె ముద్దుబిడ్డ.. నిను మరువదు ఈ గడ్డ!
రేగడపల్లె.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఓ కుగ్రామం. భరతమాత ముద్దుబిడ్డకు జన్మనిచ్చిన ఈ పల్లె ఇప్పుడు మౌనంగా రోదిస్తోంది. దేశానికే భద్రత కల్పించే అధికారికి రక్షణ కవచంగా నిలిచిన ఓ వీరుడు ఊహించని ప్రమాదంలో కన్నుమూయగా, నా బిడ్డడేనని గర్వంగా చాటుతోంది. మూడు పదుల వయసు కూడా లేని యువకుడు.. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి దేశం తలెత్తుకునే స్థాయికి ఎదిగి ఈ నేలలోనే ఒదిగిపోయాడు. విధి నిర్వహణలోనే∙వీర మరణం పొందాడు. దీంతో సొంతూరు కన్నీరు పెడుతోంది. దేశ సేవకు నడుంబిగించిన బి.సాయితేజ(27) అకాల మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బి.కొత్తకోట: తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లాన్స్‌నాయక్ బి.సాయితేజ మృత్యువాత పడ్డారు. దేశ భద్రత పర్యవేక్షించే సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారి అయిన ఈ యువ జవాను మృతితో స్వగ్రామం రేగడపల్లె కన్నీటి పర్యంతమవుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులకు బి.సాయితేజ, బి.మహేష్‌బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నాడు. 10వ తరగతి పూర్తి కాగానే దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణతతో 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. చీఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఏర్పాటయ్యాక తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్నాడు. రోజూ 10 కి.మీ రన్నింగ్ ఢిల్లీలో ఉన్నా, రేగడలో ఉన్నా సాయితేజ ప్రతిరోజు ఉదయం 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడు. శరీర దృఢత్వానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం చూసి ఊరే ఆశ్చర్యపోయేది. క్రికెట్ అడటమంటే కూడా ఎంతో ఇష్టం. గ్రామానికి చెందిన యువకులను క్రికెట్ టోర్నమెంట్లకు పంపుతూ ప్రోత్సహించేవాడు. ఎక్కడ క్రీడలు జరుగుతున్నా పాల్గొనేవాడు. రేగడలో ఉన్నన్ని రోజులు అందరితో కలసిమెలిసి ఉండటమేకాదు ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. మంచి మిత్రుడు రేగడపల్లెకు చెందిన సాయితేజ, నేను మంచి స్నేహితులం. సాయితేజ 2012లో సైన్యంలో చేరగా, నేను 2014లో సీఆర్పీఎఫ్లో చేరా. ఇద్దరం ఒకేసారి సెలవులు తీసుకొని స్వగ్రామానికి వచ్చేవాళ్లం. నెలరోజులు ఎంతో సందడిగా గడిచిపోయేది. సాయితేజ మరణం నన్ను కలచివేస్తోంది. – వై.మనోజ్‌కుమార్‌రెడ్డి, సీఆర్పీఎఫ్ జవాను, రేగడపల్లె దేశ సేవలోనే ఇద్దరు కుమారులు పిల్లలు కళ్లముందే ఉండాలి.. కంటికి రెప్పలా చూసుకోవాలి.. పిల్లాపాపలతో ఇల్లు కళకళలాడాలి.. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఈ సంతోషమే. కానీ బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులు తమ కంటిపాపలను దేశ సేవకు అంకితం చేశారు. గొప్పగా బతికే ధనధాన్యాలు లేకపోయినా.. దేశానికే రక్షణ కల్పించే తమ బిడ్డలను చూసి ఉప్పొంగిపోయారు. ఉన్న ఇద్దరు పిల్లలు సైన్యంలో చేరగా.. పెద్ద కొడుకు రక్షణ విధుల్లోనే కన్నుమూశాడు. ఆ వీరునికి జన్మనిచ్చిన దంపతులను చూసి ఆ ఊరంతా ఒక్కటై వచ్చి ఓదారుస్తోంది. ఊరు ఊరే కదిలింది.. ఆ ఊరి పిల్లోడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడనే సమాచారం తెలియగానే ఊరు ఊరే సాయితేజ ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన జవాను తల్లిదండ్రులు బి.మోహన్, బి.భువనేశ్వరికి కుటుంబ సభ్యులై ఓదార్చారు. రక్షణ విధుల్లో తలమునకలయ్యే సాయితేజ సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు తలలో నాలుకగా మెలుగుతూ అందరి ఆప్యాయత చూరగొన్నాడు. అలాంటి తమ ఊరి ముద్దుబిడ్డ ఇకలేడంటే ఇప్పటికీ ఆ ఊరు నమ్మలేకపోతోంది. ఏం జరిగిందో తెలియక... ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియక చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని అందరి ముఖాల్లోకి దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసి కన్నీరుకార్చని హృదయం లేదు. -
బిపిన్ రావత్ ప్రయాణించిన MI 17 V5 హెలికాప్టర్ ప్రత్యేకతలు
చెన్నై: తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలి, తీవ్ర విషాదాన్ని మిగిలి్చన ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. సాంకేతికంగా అడ్వాన్స్డ్ హెలికాప్టర్‌గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఇదే అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్ నుంచే అభివృద్ధి చేశారు. ఎంఐ–8 ఎయిర్ ఫ్రేమ్‌పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌లో ఉపయోగిస్తున్నారు. MI 17 V5 హెలికాప్టర్ అన్నింటిలో టాప్ ఎయిర్‌క్రాఫ్ట్ రకం సైనిక రవాణా హెలికాప్టర్. సైనిక ఆపరేషన్లు, ప్రకృతి విపత్తుల్లోనూ సేవలందించగలదు. డిజైన్ చేసిందెవరు? రష్యాలోని మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్ రూపొందించింది? రష్యా హెలికాప్టర్ల సంస్థకు అనుబంధ సంస్థ కజాన్ ఉత్పత్తి నుంచి భారత్‌కు చేరిందిలా ► 1975లో తొలి ఎంఐ–17 హెలికాప్టర్ తయారీ ఎగుమతికి ఉద్దేశించిన హెలికాప్టర్లను ఎంఐ–17గా వ్యవహరిస్తారు. రష్యా సైనిక దళాలు మాత్రం వీటిని ఎంఐ–8ఎంటీ హెలికాప్టర్లుగా పిలుస్తాయి. ► 2008 ఎంఐ–17వీ5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ► 2011 భారత వైమానిక దళానికి అందజేత ప్రారంభం. 2012 నుండి సేవలు. చదవండి: హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంట్లో ప్రకటన ముఖ్యాంశాలు.. ► ఎంఐ–17వీ5.. హెలికాప్టర్ ప్రపంచంలో అత్యాధునిక రవాణా హెలికాప్టర్. సరుకులు, ఆయుధాల రవాణా కోసం డిజైన్ చేశారు. ► సైనికులను కూడా చేరవేయవచ్చు. అగ్ని మాపక సిబ్బందికి సాయపడుతుంది. కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్‌కు, గాలింపునకు, సహాయక చర్యల్లోనూ సేవలందిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఈ హెలికాప్టర్లను 60 దేశాలు వినియోగిస్తున్నాయి. చదవండి: ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్లో ప్రమాణించింది వీరే.. MI 17 V5 ప్రత్యేకతలు ► ఎంఐ–17వీ5 మధ్యశ్రేణి హెలికాప్టర్లో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించే రాడార్, రాత్రిపూట సైతం వీక్షించే పరికరాలు ఉన్నాయి. ► గరిష్టంగా 13,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఎక్కడా ఆగకుండా 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ► 36 మంది సైనికులను లేదా 4,000 కిలోల పేలోడును తరలించగలదు. ► రాత్రి, పగలు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట కూడా ల్యాండింగ్ చేయొచ్చు. ► గత పదేళ్లలో ఐఎం–17వీ5 హెలికాప్టర్లు కొన్ని ప్రమాదాలకు గురయ్యాయి. ► కొన్ని రోజుల క్రితం తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఇద్దరు పైలట్లు, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ► 2018 ఏప్రిల్ 3న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కూలిపోయింది. ఇందులోని ఆరుగురు ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ► 2017 అక్టోబర్ 7న చైనా సరిహద్దు వైపు వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో నేలకూలింది. మొత్తం ఏడుగురు మృతిచెందారు. ► 2013 జూన్ 15న ఉత్తరాఖండ్‌లో వరద సహాయక చర్యల్లో పాల్గొని కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ► 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు ఎంఐ–17వీ5 హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి. 9 మంది వైమానిక దళం జవాన్లు మరణించారు. చదవండి: బిపిన్‌రావత్ ఇంటికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణించింది వీరే..
చెన్నై: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ Mi-17V-5 తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్, కుమార్తె, సిబ్బందితో కలిపి మొత్తం 14 మందితో తమిళనాడులోని సలూన్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా నీలగిరి కొండల్లోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ నుంచి భారీగా మంటలు చెలరేగి కాలిబూడిదైంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని భారత వాయుసేన విభాగం ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. చదవండి: హెలికాప్టర్ నుంచి మృతదేహాలు పడటం కళ్లారా చూశా: ప్రత్యక్ష సాక్షి బిపిన్ రావత్ షెడ్యూల్ ఇలా.. వెల్లింగ్టన్లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ఆర్మీ అధికారిక కార్యక్రమంలో మధ్యాహ్నం 2:40 గంటలకు రావత్ మాట్లాడాల్సి ఉంది. హెలికాప్టర్లో ప్రయాణించిన వారి వివరాలు.. 1. బిపిన్ రావత్ 2.మధులిక రావత్ 3. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ 4. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ 5. ఎన్కే గురు సేవక్ సింగ్ 6. ఎన్కే జీతేంద్రకుమార్ 7. లాన్స్ నాయక్ వివేక్ కుమార్ 8. లాన్స్ నాయక్ సాయి తేజ 9. హవల్దార్ సత్పాల్.. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. #WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper. (Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J — ANI (@ANI) December 8, 2021 -
సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే కూల్చివేయడం అతిపెద్ద తప్పిదమని వైమానిక దళ(ఐఏఎఫ్) ప్రధానాధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అంగీకరించారు. పాక్ వైపు నుంచి జరిగే ఏ దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ సమయంలోనే స్పందించి, సైన్యం, నౌకాదళంతో సమన్వయం చేసుకుని దాడులు చేయగలమన్నారు. ఫిబ్రవరి 27న పొరపాటున బుద్గాం జిల్లాలో ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17 చాపర్‌ను వైమానిక దళం భూమి మీది నుంచి ఆకాశంపై ప్రయోగించగల క్షిపణి ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులు, ఒక పౌరుడు మరణించారు. ఈ ఘటనపై జరిపిన అంతర్గత విచారణ ముగిసిందని, బాధ్యులుగా తేలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని భదౌరియా శుక్రవారం తన తొలి ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. చాపర్‌లోని సిబ్బంది, కంట్రోల్ సెంటర్లోని అధికారుల మధ్య సమాచార లోపం విచారణలో స్పష్టంగా కనిపించిందని భదౌరియా తెలిపారు. కూల్చివేతకు గురైన సమయంలో చాపర్‌లోని ‘ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో’(ఐఎఫ్ఎఫ్– మిత్రుడా, శత్రువా గుర్తించడం) సిస్టమ్ నిలిపేసి ఉందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. దాంతో శత్రు చాపర్‌గా భావించి దానిని క్షిపణి ద్వారా కూల్చివేశారన్నారు. ఫిబ్రవరి 27న కశ్మీర్‌లోని నౌషేరాలో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ విమానాలు భీకర పోరు సలుపుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఎంఐ 17 కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే. డ్రోన్లతో ముప్పు సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం కొత్త ముప్పుగా మారిందని భదౌరియా పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర సంస్థలే దీనికి పాల్పడుతున్నాయన్నారు. టిబెట్ ప్రాంతంలో చైనా భారీగా మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు.అయితే, దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఒప్పుకోకపోయినా, ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్ 16ను భారత్ కూల్చివేయడం వాస్తవమేనని స్పష్టం చేశారు. మరో బాలాకోట్ తరహా దాడులకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఆదేశాలపై, లక్ష్యాలేవైనా, వాటి పని పడ్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ సమాచార వ్యవస్థను భవిష్యత్తులో పాక్ అడ్డుకునే వీలు లేకుండా సాంకేతికతను మెరుగుపర్చామన్నారు. పాక్ ఎఫ్ 16ను కూల్చేసిన అనంతరం భారత వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు భారత వాయుసేన నుంచి సందేశాలు నిలిచిపోవడం వల్లనే, ఆయన ప్రయాణిస్తున్న మిగ్ 21ను పాక్ దళాలు కూల్చివేయగలిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
సీఎం హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు
ముంబై : లాతూర్ జిల్లా నిలంగా తాలూకాలో ఇటీవల జరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదం తరువాత తేరుకున్న హోం శాఖ ప్రముఖుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు విమానం, హెలికాప్టర్ల భద్రతపై త్వరలో ఒక నియమావళి రూపొందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన నిమిషం వ్యవధిలోనే విద్యుత్ తీగకు తగులకుని క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఫడ్నవీస్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ రోజు అసలేం జరిగింది..? తప్పు ఎక్కడ జరిగింది....? అనే వివిధ కోణాలలో విచారణ జరుగుతోంది. దీంతో హెలికాప్టర్లో బయలుదేరే ముందు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనేది కొత్త నియమావళి రూపొందించచనున్నట్లు మంత్రి మునగంటివార్ తెలిపారు. కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు హెలికాప్టర్ టేకాఫ్ కాగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున దుమ్ము, దూలి గాలిలో పైకి లేచింది. దీంతో పైలట్‌కు ముందుకు వెళ్లేందుకు దారి కనిపించక ఏం చేయాలో తెలియెక, గందగోళానికి గురై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రోజు మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌పై నీళ్లు చల్లలేదు. కాగా హెలికాప్టర్ రెక్కల గాలికి దుమ్ము, దూళి గాలిలో ఎగరకుండా హెలీప్యాడ్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. అంతేగాకుండా హెలిప్యాడ్‌కు వందమీటర్ల దూరంలో విద్యుత్ తీగలు గాని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండకూడదు. కాని ఆ రోజు ముఖ్యమంత్రి హెలికాప్టర్ కోసం తయారుచేసిన హెలిప్యాడ్‌కు కొద్ది దూరంలోనే విద్యుత్ తీగలున్నాయి. అంతేగాకుండా క్రాష్ ల్యాండ్ అయిన ప్రాంతానికి కూత వేట దూరంలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. అదృష్ట వశాత్తు దానిపై పడలేదు. లేని పక్షంలో ప్రాణ నష్టం జరిగేది. వీటన్నింటిని బట్టి కొన్ని నియమాలు పాటించలేదని ఈ ఘటన ద్వారా స్పష్టమైతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. త్వరలో వాస్తవాలు బయటపడతాయి. -
కాలనీలో కూలిన హెలికాప్టర్
-
కాలనీలో కూలిన హెలికాప్టర్
న్యూఢిల్లీ: ముంబయిలో హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. ఓ కాలనీపై రాబిన్ సన్ ఆర్ 44 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. నగరంలోని గోరేగావ్ లోని ఆరే కాలనీపై చాపర్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పైలెట్ తోపాటు ఐదుగురు ప్రయాణీకులు ఉన్నారు. చాపర్ కూలిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలి వద్దకు రెండు అగ్ని మాపక వాహనాలు వెళ్లి మంటలు ఆర్పుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఆ హెలికాప్టర్‌ను కూల్చింది ఓ పక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కాట్రా ప్రాంతంలో సోమవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి ఓ పక్షి కారణమని తెలుస్తోంది. హెలికాప్టర్‌కు ఓ పక్షి తగలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనా స్థలంలో పక్షి మృతదేహం లభించిందని, ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మలా సింగ్ తెలిపారు. సింగిల్ ఇంజన్‌తో కూడిన ఈ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఒక్కసారిగా పక్షి తగలడంతో అది అదుపు తప్పి కూలిపోయిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా, ఏడుగురు మరణించారు. వారిలో ముగ్గురు ఢిల్లీకి చెందినవారు కాగా, ఇద్దరు జమ్మూకు చెందినవారని అధికారులు గుర్తించారు. ఈ విమానం హిమాలయన్ హెలీ సర్వీస్‌కు చెందినది. దైవదర్శనానికి వైష్ణోదేవి బయల్దేరిన తమ కుటుంబసభ్యులు మరణించడంపై వారి బంధువులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. -
కూలిపోయిన నాటో హెలికాప్టర్
కాబుల్: నాటో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లో చోటు చేసుకుంది. నాటోకు చెందిన రిసొల్యూట్ సపోర్ట్ మిషన్‌లో భాగంగా బయలు దేరిన హెలికాప్టర్ సోమవారం ఉదయం కుప్పకూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇందులో ఉన్న ఐదుగురు మృత్యువాతపడ్డారని వారు వివరించారు. -
కూలిన హెలికాప్టర్ : 17 మంది మృతి
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ జబుల్ ప్రావిన్స్‌లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారని కమాండర్ జనరల్ అబ్దుల్ రజాక్ సిర్జాయి కాబూల్‌లో వెల్లడించారు. మృతుల్లో 12 మంది సైనికులు, ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. -
రెండు హెలికాప్టర్లు ఢీ: 10 మంది మృతి
పాపులర్ ఫ్రెంచ్ రియాలిటీ టీవీ షో ‘డ్రాప్డ్’ షూటింగ్ కోసం ఫ్రెంచ్ క్రీడాకారులను తీసుకెళుతున్న రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలిపోవడంతో ఇద్దరు ఒలింపిక్ మెడల్ విజేతలు, ఓ సెయిలింగ్ ఛాంపియన్ సహా పదిమంది దుర్మరణం చెందారు. నగరానికి దాదాపు 1150 కిలోమీటర్ల దూరంలోని రియోజా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అర్జెంటీనా పైలట్లు, 8 మంది ఫ్రెంచ్ దేశీయులు అక్కడికక్కడే మరణించారు. గగనతలంలో పొరపాటున రెండు హెలికాప్టర్లు కూలిపోయి ఉండవచ్చని శకలాలను పరిశీలించిన అర్జెంటీనా అధికారులు తెలిపారు. మృతుల్లో స్విమ్మింగ్‌లో ఒలింపిక్ గోల్డ్‌మెడల్ విజేత కమిల్లే మఫత్, బాక్సింగ్‌లో ఒలింపిక్ మెడల్ విజేత బాక్సర్ అలెక్సీ వస్టైన్, సెయిలింగ్ ఛాంపియన్ ఫ్లోరెన్స్ ఆర్థాడ్ ఉన్నారు. -
మహారాష్ట్ర లోని ధానేలో కూలిన హెలికాప్టర్
-
మహారాష్ట్రలో కూలిన హెలికాఫ్టర్: ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో టొక్వాని గ్రామీణ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ హెలికాఫ్టర్ కూలింది. ఆ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ముంబయి నుంచి ఔరంగాబాద్ వెళ్తుండగా ఆ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అదికారులు వెల్లడించారు. మృతులను గుర్తించవలసి ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. హెలికాఫ్టర్ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. హైటెన్షన్ వైర్లు తగిలి హెలికాఫ్టర్ కుప్పకులిందని ఉన్నతాధికారులు చెప్పారు.