మహారాష్ట్రలో కూలిన హెలికాఫ్టర్: ఐదుగురు మృతి | Five killed in chopper crash near Thane | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో కూలిన హెలికాఫ్టర్: ఐదుగురు మృతి

Published Sun, Sep 29 2013 11:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

Five killed in chopper crash near Thane

మహారాష్ట్రలోని థానే జిల్లాలో టొక్వాని గ్రామీణ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ హెలికాఫ్టర్ కూలింది. ఆ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ముంబయి నుంచి ఔరంగాబాద్ వెళ్తుండగా ఆ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అదికారులు వెల్లడించారు. మృతులను గుర్తించవలసి ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. 

 

హెలికాఫ్టర్ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. హైటెన్షన్ వైర్లు తగిలి హెలికాఫ్టర్ కుప్పకులిందని ఉన్నతాధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement