టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. కొంతకాలంగా మోడల్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్న పృథ్వీ షా ఈ సోమవారం రాత్రి థానేలోని నెహ్రూ నగర్‌లో ఉన్న మిట్రన్ లాంజ్‌కు వచ్చాడు. ఈ లాంజ్ హాంగ్‌ఔట్ ప్లేస్‌కు పాపులర్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఎయిర్ సీటింగ్ సౌకర్యం ఉన్న ఈ లాంజ్‌కు ఎంతో మంది సెలబ్రిటీలు వస్తుంటారు. అయితే మంగళవారం మిట్రన్ లాంజ్‌ను వేగల్ ఎస్టేట్ పోలీసులు సీజ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఆరు గంటల వరకు లాంజ్ నడుస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లాంజ్‌లో రెక్కీ నిర్వహించి సీజ్ చేశారు. ఆ సమయంలో పృథ్వీ షా అదే లాంజ్‌లో ఉన్నట్లు తేలింది. సీజ్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని పృథ్వీ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
కాగా ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ బినూ వర్గీస్ తన ట్విటర్‌లో మిట్రన్ లాంజ్ గురించి రాయడం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ''ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాత లాంజ్ బయట ఒక ఆరుగురు బౌన్సర్స్ కస్టమర్స్‌తో గొడవ పడుతున్నట్లు తెలిసింది. అయితే అన్ని బార్స్, లాంజ్, రెస్టారెంట్లకు అర్థరాత్రి 1:30 తర్వాత మూసేయాలని నిబంధన ఉంది. కానీ మిట్రన్ లాంజ్‌కు ఆ నిబంధన వర్తించదా. సెలబ్రిటీలు ఎక్కువగా వస్తారన్న కారణంతో స్పెషల్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా.. దీనివల్ల లాంజ్ చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీలు ఇబ్బంది పడుతాయి కదా.. దీనిపై వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాల్సిందే'' అంటూ రాసుకొచ్చాడు.
బినూ వర్గీస్ ట్వీట్‌పై స్పందించిన ఎక్సైజ్ శాఖ వెంటనే అప్రమత్తం అయింది. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఇన్‌స్పెక్టర్ ఆర్‌సీ బిరాజ్‌దార్ తన సిబ్బందితో కలిసి లాంజ్‌లో రెక్కి నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఆరు గంటల వరకు లాంజ్‌నడుస్తున్నందున పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో రెండు చార్జీషీట్లు దాఖలు చేశారు. చార్జీషీట్‌లో పేర్కొన్నవన్నీ కోర్టులో నిజమని తేలితే మెట్రజ్ లాంజ్ పర్మినెంట్‌గా క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి.
ఇక పృథ్వీ షా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పృథ్వీ 13.25 సగటుతో 106 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్థసెంచరీ ఉంది.
Excise Department have lodge the Breech Case against Mitron Lounge, 2 More cases The Lounge will Shutdown Permanently #Nightlife #ThaneCitypolice #earthquake https://t.co/dKlv8f9Pek pic.twitter.com/LeOnlrZ7Xo
— SBT News (@TimesSukhi) June 13, 2023
Comments
Please login to add a commentAdd a comment