![Police Unable To Trace Youtuber Ranveer Allahbadia](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Ranveer-Allahbadia1.jpg.webp?itok=vqjJgioc)
ముంబయి:వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి ఆగ్రహాన్ని చవిచూసిన యూట్యూబర్ రణ్‌వీర్‌అల్హాబాదియా పారిపోయాడా.. పోలీసులకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికైనా వెళ్లిపోయాడా..అంటే అవుననే అంటున్నారు ముంబయి పోలీసులు. అల్హాబాదియాకు ఫోన్ చేస్తే స్విచ్‌ఆఫ్ వస్తోందని, ఇంటికి వెళ్తే తాళమేసి ఉందని పోలీసులు తెలిపారు.ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో తల్లిదండ్రులపై అల్హాబాదియా అశ్లీల వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో అల్హాబాదియాను పోలీసులు విచారించాల్సి ఉంది. అయితే తాను తన ఇంటి వద్దే వాంగ్మూలం ఇస్తానని అల్హాబాదియా పోలీసులను కోరాడు.దీనికి పోలీసులు తిరస్కరించారు. తర్వాత స్టేట్‌మెంట్ కోసం పోలీసులు అల్హాబాదియాకు ఫోన్‌చేయగా స్విచ్‌ఆఫ్ వచ్చింది. ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హాజరవడానికిగాను మరో కమెడియన్ సమయ్‌రానాకు పోలీసులు మార్చి 10 దాకా సమయమిచ్చారు.
బీర్‌బైసెప్స్‌తో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నరణ్‌వీర్ అల్హాబాదియా ఇటవలే ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో యూట్యూబ్ ఆ వీడియోను కూడా ఇప్పటికే డిలీట్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అస్సాంలోనూ అల్హాబాదియాపై కేసు నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అల్హాబాదియా తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment