door lock
-
పరారీలో యూట్యూబర్ అల్హాబాదియా..!
ముంబయి:వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి ఆగ్రహాన్ని చవిచూసిన యూట్యూబర్ రణ్వీర్అల్హాబాదియా పారిపోయాడా.. పోలీసులకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికైనా వెళ్లిపోయాడా..అంటే అవుననే అంటున్నారు ముంబయి పోలీసులు. అల్హాబాదియాకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వస్తోందని, ఇంటికి వెళ్తే తాళమేసి ఉందని పోలీసులు తెలిపారు.ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో తల్లిదండ్రులపై అల్హాబాదియా అశ్లీల వ్యాఖ్యలు చేశారు.ఈ కేసులో అల్హాబాదియాను పోలీసులు విచారించాల్సి ఉంది. అయితే తాను తన ఇంటి వద్దే వాంగ్మూలం ఇస్తానని అల్హాబాదియా పోలీసులను కోరాడు.దీనికి పోలీసులు తిరస్కరించారు. తర్వాత స్టేట్మెంట్ కోసం పోలీసులు అల్హాబాదియాకు ఫోన్‌చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హాజరవడానికిగాను మరో కమెడియన్ సమయ్రానాకు పోలీసులు మార్చి 10 దాకా సమయమిచ్చారు.బీర్బైసెప్స్తో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నరణ్వీర్ అల్హాబాదియా ఇటవలే ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో యూట్యూబ్ ఆ వీడియోను కూడా ఇప్పటికే డిలీట్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అస్సాంలోనూ అల్హాబాదియాపై కేసు నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అల్హాబాదియా తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. -
డోర్‌లాక్ పేరుతో అడ్డగోలు బాదుడు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ ప్రగతినగర్ సెక్షన్ బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంటులో విద్యుత్ లైన్‌మన్ మీటర్ రీడింగ్ నమోదు చేయకుండానే డోర్‌లాక్ పేరుతో మినిమం బిల్లు జారీ చేశారు. ఆగస్టులో 5 యూనిట్లకు బిల్లు ఇచ్చారు. సెప్టెంబర్‌లో ఇవ్వలేదు. అక్టోబర్‌లో మాత్రం ఏకంగా రూ.3,667 బిల్లు జారీ చేశారు. సదరు వినియోగదారుడు బాచుపల్లి ఏఈని ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన స్పందించకపోవడంతో బాధితుడు కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది.హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజన్ నారపల్లి సెక్షన్ పరిధిలోని ఓ వినియోగదారుడి ఇంట్లోని విద్యుత్ మీటర్‌కు ఒక నెలలో బిల్ కన్జమ్షన్, మరో నెలలో మీటర్ స్టకప్ అని నమోదు చేశారు. ఫలితంగా ఆయన ఇంటి నెలవారీ బిల్లు రూ.2 వేలు దాటింది. ఒక వైపు కరెంట్ వినియోగం జరగలేదంటూనే..మరో వైపు మినిమం బిల్లు పేరుతో అధిక బిల్లు జారీ చేశారు. కనీసం బిల్ స్టేటస్‌ను కూడా పట్టించుకోలేదు. వినియోగదారుడు ఈ లోపాన్ని గుర్తించి సంబంధిత సెక్షన్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన కూడా లేదు.ఆజామాబాద్ డివిజన్లోని రామాలయం సెక్షన్ పరిధిలో ఓ వినియోగదారుడి ఇంట్లో కరెంట్ మీటర్లో సాంకేతిక లోపం తలెత్తింది. గత నాలుగు నెలలుగా స్టకప్లోనే ఉంది. రీడింగ్ నమోదు కావడంలేదు. వెంటనే ఆ మీటర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆపరేషన్స్ విభాగం డీఈ, ఏడీఈ, ఏఈలు ప్రతినెలా బిల్స్టేటస్పై రివ్వూ్యలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడి అధికారులు అవేవీ పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయి లైన్మెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సదరు వినియోగదారుడు నెలకు రూ.1,500కు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోంది...ఇలా మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోనే కాదు శివారులోని సరూర్‌నగర్, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల నిర్లక్ష్యంతో వినియోగదారులు నష్టపోతున్నారు. నెలకు రాబడి రూ.1,800 కోట్లు గ్రేటర్ పరిధిలో 60 లక్షలకుపైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 52 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు, మరో 8లక్షల మంది వాణిజ్య వినియోగదారులు ఉన్నా రు. పారిశ్రామిక, ఇతర కనెక్షన్లు మరో 2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. వీరి ద్వారా సంస్థకు ప్రతి నెలా రూ.1,600 కోట్ల నుంచి రూ.1,800 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు డిస్కం.. అన్ని డివిజన్ల పరిధిలోనూ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తుల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాంకేతిక సమస్యల పునరుద్ధరణ కోసం సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ) గ్యాంగ్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొత్త కనెక్షన్ల జారీ, లైన్లకు అంచనాలు రూపొందించడం, మీటర్ రీడింగ్, రెవెన్యూ వసూళ్ల కోసం ఆపరేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సీబీడీ గ్యాంగ్‌లు చురుగ్గా పని చేస్తున్నాయి. ఆపరేషన్ విభాగం పనితీరు అధ్వానం భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో చోటు చేసుకున్న నష్టాలను గంటల వ్యవధిలోనే సీబీడీ గ్యాంగ్‌లు పునరుద్ధరిస్తున్నాయి. కానీ ఆపరేషన్ విభాగంలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, లైన్మెన్లు మాత్రం ఆఫీసు దాటి బయటికి రావడం లేదు. ముఖ్యమైన మీటర్ రీడింగ్‌కు ఒక నెలలో రెగ్యులర్ లైన్మెన్లు, ఏఈలు, ఏడీఈలు వెళ్లాల్సి ఉంది. మరో నెలలో కాంట్రాక్టు కార్మికులతో రీడింగ్ నమోదు చేయాల్సి ఉంది. కానీ ప్రతి నెలా కాంట్రాక్ట్ మీటర్ రీడర్లు మినహా ఆపరేషన్ విభాగంలోని జేఎల్ఎంలు, ఏఈలు, ఏడీఈలు మాత్రం రీడింగ్‌కు వెళ్లడంలేదు.చదవండి: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం? లైన్ల నిర్వహణ, విద్యుత్ చౌర్యం, రెవెన్యూ వసూళ్లపైనే కాదు.. కనీసం మీటర్ స్టేటస్‌పై రివ్వు్యలు కూడా నిర్వహించడం లేదు. డిస్కంలో కీలకమైన సైబర్ సిటీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలోని ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల అలసత్వం కారణంగా ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నష్టపోతున్నారు. చేతికందుతున్న బిల్లులను చూసి.. లబోదిబోమంటున్నారు. -
భార్య కోసం వెయిటింగ్.. కార్లోకి వెళ్లి డోర్ లాక్ చేసిన చిన్నారి.. చివరికి
పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చేసే అల్లరి, తెలియక చేసే కొన్ని పనులు వాళ్లని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. పిల్లలతో బయటకు వెళ్తే..కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. సరదాగా షికారుకు వెళ్లినప్పుడు.. చిన్నారులు కార్లోకి వెళ్లి లోపల నుంచి లాక్ వేసుకోడం కొత్తేమి కాదు. కార్ల తయారీదారులు సెంట్రల్ లాకింగ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. పంజాబ్‌లోని లూథియానాలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన భార్య, పిల్లాడి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో తన రెండో కుమారుడు ( 3 సంవత్సరాలు) అతని చేతిలో నుంచి కారు కీ లాక్కొని వాహనంలోకి ప్రవేశించాడు. అనంతరం కార్ డోర్ వేయడంతో పాటు కొన్ని సెకన్లలో, కారు లాక్ అవుతుంది. కార్ డోర్లు అన్నీ లాక్ అవడంతో.. ఆ తండ్రి తన కొడుకుతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించి.. అన్‌లాక్ బటన్‌ను నొక్కమని అడిగాడు. అయినప్పటికీ, పిల్లవాడు గందరగోళానికి గురవడంతో అనుకోకుండా అన్ లాక్ బటన్‌ను అనేకసార్లు నొక్కడంతో కారులోని అలారం యాక్టివేట్ అవుతుంది. దీంతో చిన్నారి ఏడవడంతో స్థానికులు గుమిగూడారు. చివరికి అనేక ప్రయత్నాల తరువాత, వారు సుత్తితో వెనుక క్వార్టర్ గ్లాస్‌ను పగలగొట్ట.. పిల్లవాడిని కారులోంచి బయటకు సురక్షితంగా రక్షించుకోగలిగారు. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Tragedy averted with God’s grace 🙏 There will always be a moment that no matter how smart you think you are, you will panic and have a brain-fade moment. So today while picking my 3 years old sons from school, one of them locked himself inside with windows fully rolled up.… pic.twitter.com/SeG9Be1kh2 — Sunderdeep - Volklub (@volklub) July 20, 2023 చదవండి దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా.. వామ్మో అన్ని ఆస్తులు ఉన్నాయా! -
కాకినాడలో విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో విషాదం చోటుచేసుకుంది. పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప.. అందులోనే మృత్యువాతపడింది. కారు డోర్లు లాక్ అవడం.. ఎవరూ గమనించకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి.. దగ్గరల్లో పార్క్ చేసిన కారులోకి వెళ్లి డోర్ వేసుకుంది. మళ్లీ డోర్ లాక్ తీయరాకపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో కారులో గాలి అందకపోవడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. మధ్యాహ్నం కారులోకి వెళ్లిన పాప సాయంత్రం వరకు అందులోనే ఉండిపోయింది. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలా మొత్తం గాలించారు. చివరికి ఇంటి పక్కన కారులో కొన ఊపిరితో బాలికను గుర్తించిన స్థానికులు హుటాహుటిన యానాం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితమే బాలిక తండ్రి మరణించగా.. బాలికతో పాటు, పదేళ్ల కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్మి పోషించుకుంటోంది. తాజాగా కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చదవండి: ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి -
ఆస్పత్రి బాత్రూమ్ డోర్‌లాక్.. చిన్నారిని రక్షించిన ఫైర్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి తల్లిదండ్రులను, ఆస్పత్రి సిబ్బందిని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు. వాష్ రూమ్‌లోకి వెళ్లి అనుకోకుండా లాక్ వేసేసుకున్నాడు. దీంతో అక్కడే ఇరుక్కుపోయి ఏడ్వసాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు.. ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాళాలు లేకపోవడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించే యత్నం చేశారు. సుత్తి, స్క్రూడ్రైవర్‌తో తాళం పగులగొట్టి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో.. 101కు డయల్ చేయాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ట్విటర్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. -
అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!!
ఈ దొంగ చాలా డీప్‌గా హర్ట్ అయ్యాడండీ.. పాపం!! ఎంతగా నొచ్చుకున్నాడంటే సాటి ఏ దొంగకీ ఈ పరిస్థితి దాపరించకూడదని తిరిగి వెళ్తూ.. తాను వచ్చి వెళ్లినట్లు ఆనవాళ్లు కూడా వదిలివెళ్లాడు. అసలేం జరిందంటే.. దొంగన్నాక కన్నం వేయాలి.. కన్నం వేయాలంటే కష్టపడి తాళం పగలగొట్టాలి... విలువైన ధనం, బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి.. మూడో కంటికి కనిపించకుండా ఉడాయించాలి! మామూలు కష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దొంగ మాత్రం కొంచెం భిన్నంగా నిజాయితీ పరుడైన డిప్యూటీ కలెక్టర్ ఇంటిని దోచుకోవడానికి ఎంచుకున్నాడు. ఐతే ఎప్పటిలాగానే దొంగగారు ఇంటితాళం పగులగొట్టాడు. లోపలికి ప్రవేశించాడు. ఎంతవెతికినా ఏమీ దొరకలేదు. చిర్రెత్తిపోయిన ఆ దొంగ వెళ్తూ వెళ్తూ ఒక ఉత్తరం ఆ ఇంట్లో రాసి పెట్టి మరీ వెళ్లాడు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందనేగా మీ సందేహం! ‘మీ ఇంట్లో డబ్బు లేనప్పుడు తాళం వేయడం ఎందుకు కలెక్టర్?’ అని ఆ నోట్లో రాసి ఉంది. ఈ హాస్యాస్పదమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా, త్రిలోచన్ గౌర్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఇంటి సమీపంలోనే పోలీసు సూపరింటెండెంట్ ఇల్లు కూడా ఉంది. ఇంత సాహసోపేతమైన పనికి ఒడిగట్టిన దొంగ, అతను రాసిన ఉత్తరం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐతే లోకల్ అథారిటీస్ మాత్రం దీనిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, ఆ ఘరానా దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా వెతుకుతున్నారు. చదవండి: Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
ఈ బతుకు మాకొద్దు.. మరణించేందుకు అవకాశమివ్వండి
శివాజీనగర: ఆత్మహత్య లేఖ రాసి ఉంచి కుటుంబం అదృశ్యమైన సంఘటన బెంగళూరు బాగలగుంటలో చోటు చేసుకుంది. గాంధీ, శాలిని దంపతులు, వారి పిల్లలు భానుశ్రీ, హేమశ్రీ అదృశ్యమైనవారు. దంపతుల తనయుడు చిరంజీవి తుమకూరులో చదువుకుంటున్నాడు. రోజూ కుటుంబంతో ఫోన్లో మాట్లాడేవాడు. ఆగస్టు 12న ఫోన్ చేయగా అందరి ఫోన్లు స్విచ్చాఫ్ అని రావడంతో కంగారుపడిన చిరంజీవి, దగ్గర్లోని స్నేహితునికి సమాచారమిచ్చాడు. అతడు వెళ్లిచూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి యజమానిని విచారించగా, కుటుంబంతో కలిసి వస్తువులన్నింటిని తీసుకొని వెళ్లారని చెప్పాడు. ఇది తెలిసి చిరంజీవి బాగలకుంటెకు వచ్చి తన వద్ద ఉన్న తాళంతో ఇంటి తలుపులు తీయగా, కిటికీ వద్ద డెత్‌నోట్ కనిపించింది. తమకు బతకటం చాలా కాష్టమవుతోంది, ఈ జీవితం అవసరం లేదు. దయచేసి మరణించేందుకు అవకాశం ఇవ్వాలని అందులో రాసి ఉంది. చిరంజీవి ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయగా కేసు నమోదు చేసుకుని గాలింపు జరుపుతున్నారు. చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు -
కారు డోర్ లాక్; ఇద్దరు చిన్నారుల మృతి
లక్నో : కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి ముందున్న కారు లోపలికి వెళ్లారు. దీంతో డోర్ లాక్ అయ్యి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా, మిగతా ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో మహమ్మద్ అల్తాఫ్ (5), అబ్షర్ రాజా (7) ఉన్నారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితమే వీరి కుటుంబం సెకండ్ హ్యాండ్లో కారు కొనుగోలు చేయగా అదే కారులో చిన్నారులు మృత్యువాత పడ్డారు. (ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయన: గడ్కరీ) ఎంత సేపటికి పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతగ్గా, కారులో అపస్మారక స్థితిలో కన్పించారు. దీంతో వెంటేనే ఆస్పత్రికి తరలించగా ఇద్దరు చిన్నారులు చనిపోగా, మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు అని మొరాదాబాద్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు. కారు లోపలే దాదాపు రెండు గంటలకు పైగా ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చిన్నారులు చనిపోయినట్లు పేర్కొన్నారు. (16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం ) -
108 డోరు తెరుచుకోక గర్బిణి అవస్థలు
-
తెరుచుకోని '108' డోరు.. గర్భిణి అవస్థలు
మెదక్: 108 అంబులెన్స్ ల దుస్థితి ఎలా ఉందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది.108 డోర్ తెరుచుకోకపోవడంతో నిండు గర్భిణి అరగంట పాటు విలవిల్లాడిన సంఘటన మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సదశివపేట మండలం ఆరూర్ గ్రామానికి చెందిన మమత నిండు గర్భిణి. ఉదయం నుంచి ఆమెకు నొప్పులు మొదలవడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. ఆమెను ఎక్కించుకున్న అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకున్నాక వాహనం తలుపులు తెరుచుకోలేదు. దీంతో అరగంట పాటు మమత నొప్పులతో యాతన అనుభవించింది. గమనించిన అస్సత్రి సిబ్బంది అంబులెన్స్ డోర్‌ను కర్రలు, ఇనుపరాడ్డుల సాయంతో బద్దలు కొట్టి గర్భిణిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై స్తానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.