పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చేసే అల్లరి, తెలియక చేసే కొన్ని పనులు వాళ్లని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. పిల్లలతో బయటకు వెళ్తే..కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. సరదాగా షికారుకు వెళ్లినప్పుడు.. చిన్నారులు కార్‌లోకి వెళ్లి లోపల నుంచి లాక్ వేసుకోడం కొత్తేమి కాదు. కార్ల తయారీదారులు సెంట్రల్ లాకింగ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం.
పంజాబ్‌లోని లూథియానాలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన భార్య, పిల్లాడి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో తన రెండో కుమారుడు ( 3 సంవత్సరాలు) అతని చేతిలో నుంచి కారు కీ లాక్కొని వాహనంలోకి ప్రవేశించాడు. అనంతరం కార్ డోర్ వేయడంతో పాటు కొన్ని సెకన్లలో, కారు లాక్ అవుతుంది. కార్ డోర్‌లు అన్నీ లాక్ అవడంతో.. ఆ తండ్రి తన కొడుకుతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించి.. అన్‌లాక్ బటన్‌ను నొక్కమని అడిగాడు.
అయినప్పటికీ, పిల్లవాడు గందరగోళానికి గురవడంతో అనుకోకుండా అన్ లాక్ బటన్‌ను అనేకసార్లు నొక్కడంతో కారులోని అలారం యాక్టివేట్ అవుతుంది. దీంతో చిన్నారి ఏడవడంతో స్థానికులు గుమిగూడారు. చివరికి అనేక ప్రయత్నాల తరువాత, వారు సుత్తితో వెనుక క్వార్టర్ గ్లాస్‌ను పగలగొట్ట.. పిల్లవాడిని కారులోంచి బయటకు సురక్షితంగా రక్షించుకోగలిగారు. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Tragedy averted with God’s grace 🙏
— Sunderdeep - Volklub (@volklub) July 20, 2023
There will always be a moment that no matter how smart you think you are, you will panic and have a brain-fade moment.
So today while picking my 3 years old sons from school, one of them locked himself inside with windows fully rolled up.… pic.twitter.com/SeG9Be1kh2
చదవండి దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా.. వామ్మో అన్ని ఆస్తులు ఉన్నాయా!
Comments
Please login to add a commentAdd a comment