ఎన్నో రకాల వ్యాధుల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి సిండ్రోమ్ గురించి మాత్రం విని ఉండుండరు. ప్రతి తల్లిదండ్రులు ఈ సిండ్రోమ్ గురించి తప్పక తెలుసుకోవాలని చెబుతోంది పీడియాట్రిక్ వైద్యురాలు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసే దీనిపై అవగాహన ఉండాలని అన్నారు. లేదంటే పిల్లల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటీ సిండ్రోమ్ అంటే..
చిన్నారులకు నడక, మాటలు వచ్చాయంటే.. వారిని ఓ కంటకనిపెడుతూనే ఉండాలి. ఏ క్షణంలో ఏం పనిచేస్తారో చెప్పాలేం. సైలెంట్‌గా ఉన్నారంటే దేన్నో పాడుచేయడం లేదా ప్రమాదం కొని తెచ్చుకునే పనులేవో చేస్తున్నారని అర్థం. ఇలాంటి పిల్లలను కనిపెట్టుకుని ఉండటం, తల్లిదండ్రులకు, పెద్దలకు ఓ సవాలుగా ఉంటుంది. ఇలా కనిపెట్టుకుని ఉండలేక తల్లిదండ్రులు అమ్మమ్మలు లేదా నానమ్మల ఇంటికి పంపించేస్తారు.
అక్కడ వాళ్లు అప్పటి వరకు ఇల్లంతా సందడి లేకుండా ఉంటుంది. ఈ చిచ్చర పిడుగుల రాకతో ఎక్కడ లేని సందడి వచ్చేస్తుంది. అదీగాక నానమ్మ/అమ్మమ్మ తాతయ్యలు కూడా తామిద్దరమే అని ఇంట్లో పర్సులు, వాళ్లకు సంబంధించిన మందులు అందుబాటులోనే పెట్టుకుంటారు. వయసు రీత్యా వచ్చే మతిమరపు సమస్యతో ఆ వస్తువులను సమీపంలోనే ఉంచుకుంటారు. అయితే ఈ చిచ్చర పిడుగులు ఈ వస్తువులను తీసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంటిల్లపాది ఇలా అయ్యిందేంటని బోరుమంటారు.
ఇలా అమ్మమ్మలు లేదా నానమ్మల పర్సలు లేదా మందులతో వైద్య పరిస్థితిని కొని తెచ్చుకోవడాన్ని గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలుస్తారని శిశు వైద్యులు చెబుతున్నారు. కొందరు పర్సులో ఉండే నాణేలను నోటిలో పెట్టుకోవడం, అలాగే పెద్దల మందులు వేసుకోవడం తదితరాలతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఒక్కోసారి అది సీరియస్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులెందరో ఉన్నారని చెబుతున్నారు శిశు వైద్యులు.
ముఖ్యంగా పెద్దలు వేసుకునే దీర్ఘకాలికి వ్యాధులకు సంబంధించిన మందులు కారణంగా అనారోగ్యం పాలై బాధపడుతున్న చిన్నారులు కూడా చాలామంది ఉన్నారని హెచ్చరిస్తున్నారు. అందువల్ల దయచేసి తాతయ్యలు అమ్మమల ఇంటికి పంపిచేటప్పడూ పెద్దవాళ్ల వస్తువులను తీయకూడదని చెప్పడం తోపాటు పెద్దలు కూడా తమ పర్సులు, మందులు డబ్బాలు వారికి అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడటం మంచిదని శిశు వైద్యురాలు టిక్‌టాక్ వీడియోలో పేర్కొంది. అంతేగాదు యూఎస్‌లో అనేక మంది చిన్నారులు గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వైద్య పరిస్థితి బారిన పడి అనారోగ్యం లేదా గాయాల పాలైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment