syndrome
-
'గ్రానీస్ పర్స్ సిండ్రోమ్': ప్రతి పేరెంట్‌కి అవగాహన ఉండాలి!
ఎన్నో రకాల వ్యాధుల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి సిండ్రోమ్ గురించి మాత్రం విని ఉండుండరు. ప్రతి తల్లిదండ్రులు ఈ సిండ్రోమ్ గురించి తప్పక తెలుసుకోవాలని చెబుతోంది పీడియాట్రిక్ వైద్యురాలు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసే దీనిపై అవగాహన ఉండాలని అన్నారు. లేదంటే పిల్లల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటీ సిండ్రోమ్ అంటే..చిన్నారులకు నడక, మాటలు వచ్చాయంటే.. వారిని ఓ కంటకనిపెడుతూనే ఉండాలి. ఏ క్షణంలో ఏం పనిచేస్తారో చెప్పాలేం. సైలెంట్‌గా ఉన్నారంటే దేన్నో పాడుచేయడం లేదా ప్రమాదం కొని తెచ్చుకునే పనులేవో చేస్తున్నారని అర్థం. ఇలాంటి పిల్లలను కనిపెట్టుకుని ఉండటం, తల్లిదండ్రులకు, పెద్దలకు ఓ సవాలుగా ఉంటుంది. ఇలా కనిపెట్టుకుని ఉండలేక తల్లిదండ్రులు అమ్మమ్మలు లేదా నానమ్మల ఇంటికి పంపించేస్తారు.అక్కడ వాళ్లు అప్పటి వరకు ఇల్లంతా సందడి లేకుండా ఉంటుంది. ఈ చిచ్చర పిడుగుల రాకతో ఎక్కడ లేని సందడి వచ్చేస్తుంది. అదీగాక నానమ్మ/అమ్మమ్మ తాతయ్యలు కూడా తామిద్దరమే అని ఇంట్లో పర్సులు, వాళ్లకు సంబంధించిన మందులు అందుబాటులోనే పెట్టుకుంటారు. వయసు రీత్యా వచ్చే మతిమరపు సమస్యతో ఆ వస్తువులను సమీపంలోనే ఉంచుకుంటారు. అయితే ఈ చిచ్చర పిడుగులు ఈ వస్తువులను తీసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంటిల్లపాది ఇలా అయ్యిందేంటని బోరుమంటారు. ఇలా అమ్మమ్మలు లేదా నానమ్మల పర్సలు లేదా మందులతో వైద్య పరిస్థితిని కొని తెచ్చుకోవడాన్ని గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలుస్తారని శిశు వైద్యులు చెబుతున్నారు. కొందరు పర్సులో ఉండే నాణేలను నోటిలో పెట్టుకోవడం, అలాగే పెద్దల మందులు వేసుకోవడం తదితరాలతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఒక్కోసారి అది సీరియస్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులెందరో ఉన్నారని చెబుతున్నారు శిశు వైద్యులు. ముఖ్యంగా పెద్దలు వేసుకునే దీర్ఘకాలికి వ్యాధులకు సంబంధించిన మందులు కారణంగా అనారోగ్యం పాలై బాధపడుతున్న చిన్నారులు కూడా చాలామంది ఉన్నారని హెచ్చరిస్తున్నారు. అందువల్ల దయచేసి తాతయ్యలు అమ్మమల ఇంటికి పంపిచేటప్పడూ పెద్దవాళ్ల వస్తువులను తీయకూడదని చెప్పడం తోపాటు పెద్దలు కూడా తమ పర్సులు, మందులు డబ్బాలు వారికి అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడటం మంచిదని శిశు వైద్యురాలు టిక్‌టాక్ వీడియోలో పేర్కొంది. అంతేగాదు యూఎస్‌లో అనేక మంది చిన్నారులు గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వైద్య పరిస్థితి బారిన పడి అనారోగ్యం లేదా గాయాల పాలైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యింది.(చదవండి: భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుంది?) -
రోజూ అదే టైమ్‌కు ఠంచనుగా వాంతులా? ఎందుకలా?!
కొందరికి అదే పనిగా వాంతులవుతాయి. అంతేకాదు... రోజూ అదే టైమ్‌కు అవుతాయి. ఒకవేళ వాంతులు కాని పక్షంలో... కనీసం వికారంగానైనా ఉండే అవకాశముంది. వాంతులై కొన్ని గంటలు గడిచాకే హాయిగా అనిపిస్తుంటుంది. చిత్రంగా మళ్లీ ఆ మర్నాడు మళ్లీ అదే టైమ్‌కు వాంతులు కావడం మొదలవుతుంది! క్రితం రోజు ఎంత సేపు అయ్యాయో, ఆ మర్నాడు సైతం అంతే సేపు అవుతుంటాయి!. విచిత్రమైన ఈ జబ్బు పేరు... ‘సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్’. సంక్షిప్తంగా సీవీఎస్ అంటారు. చిన్నపిల్లల్లో ఇది మరీ ఎక్కువ. పెద్ద వయసు వాళ్లలోనూ కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. సాధారణంగా ఈ ‘సీవీఎస్’తో పాటు కడుపునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ కూడా కనిపించే అవకాశాలెక్కువ. దీనికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదుగానీ... వాంతుల వల్ల తగ్గి΄ోయిన / దేహంలోంచి వెళ్లిపోయిన లవణాలను భర్తీ చేసేందుకు సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇతరత్రా ప్రత్యేకమైన చికిత్స లేకపోయినప్పటికీ... సాధారణంగా వాంతులను, వికారాన్ని తగ్గించే మందులను‘యాంటీ–ఎమెటిక్’ డ్రగ్స్‌తో డాక్టర్లు ఈ ‘సీవీఎస్’ సమస్యకు చికిత్స అందిస్తారు. ఇదీ చదవండి: Clinical vampirism రక్తం తాగాలనిపించే జబ్బు గురించి తెలుసా? -
ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే? విద్యా బాలన్ నుంచి సన్యా మల్హోత్రా వరకు...
నటి సన్యా మల్హోత్రా దంగల్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల జవాన్ మూవీలో డాక్టర్‌గా నటించి మంచి పేరు తెచ్చకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రసంసలందుకుంది కూడా. అయితే సన్యా ఒక ఇంటర్యూలో తాను ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. దీని వల్ల ఎన్నో తప్పులు చేశానని ఒక్కోసారి తనను తాను క్షమించుకోలేని విధంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.ఇది మన పనిపై భయంకరంగా ప్రభావితం చేస్తుందని చెబుతోంది. దీని కారణంగా ఏది చెయ్యలేని పరిస్థితికి వచ్చేస్తామని అంటోంది. మొదట్లో పెద్దగా ఈ సిండ్రోమ్‌ని పట్టించుకోలేదని, రాను రాను అది తన జీవితాన్నే నిస్తేజంగా చెయ్యడం మొదలు పెట్టడంతో దీన్నుంచి బయటపడే మార్గాలు అన్వేషించి నెమ్మది నెమ్మదిగా కోలుకోవడం చేశానని వివరించింది. ఇదే సిండ్రోమ్‌తో ప్రముఖ సెలబ్రిటి విద్యాబాలన్, గాయని ఎల్లీ గౌల్డింగ్, మోడల్ బెల్లా హడిద్ వంటి వాళ్లు సైతం బాధపడ్డారట.విద్యాబాలన్ పిలింఫేర్ అవార్డులో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. బాడీని బ్యాలెన్సింగ్‌గా ఉంచుకోవడానికి పడే శ్రమలో ఒక్కోసారి భయనాక అనుమానాలు వచ్చి అది ఎలా ఇంపోస్టర్ సిండ్రోమ్కి దారితీసిందో తెలిపింది. అలాగే గాయని ఎల్లీ గౌల్డింగ్ కూడా ఈ సిండ్రోమ్ తన కెరీర్‌ని ఎలా నాశనం చేసిందో వివరించింది. మోడల్ బెల్ హడిద్ కూడా ఈ సమస్యతో ఎంతలా బయటకి కాలు పెట్టేందుకు భయపడిందో చెప్పుకొచ్చింది. అసలు ఏంటీ సిండ్రోమ్ అంటే..!ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే..తనను తాను తక్కువ చేసుకోవడంఆత్మనూన్యతకు గురవ్వడందీనికి తాను అర్హురాలిని కాననుకోవడంతాను చెబితే అవతలి వాళ్లు చేస్తారో లేదా అనే అనుమానంతన మాటకు విలువ ఉండదనే భావనఅభద్రత భావం తదితరాలు ఈ సిండ్రోమ్ లక్షణాలు. ఇది ఎక్కువగా కెరీర్లో మంచి పొజిషన్ ఉన్నవారికి, అప్పుడే ఉన్నతస్థికి ఎదుగుతున్న వారికి ఈ సమస్య ఎదురవుతుంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇవి అందరిలో కనిపించే సర్వసాధారణ లక్షణాలే. కానీ అది శృతి మించితేనే ప్రమాదం అని చెబుతున్నారు. ఈ పరిస్థితి మన పనిపై సరిగా ఫోకస్ చెయ్యనివ్వదు. చెప్పాలంటే కెరీర్‌ని అగాథంలోకి నెట్టే మనలోని మోసగాడు లేదా శత్రువుగా చెప్పొచ్చు. బయటపడాలంటే..మనం ఒంటరి కాదు మన చుట్టు మనలాంటి ఉన్నారనే భావనతో ఉండాలి.ఒకవేళ ప్రతిసారి విజయం మిమ్మల్నే వరించదనే దృక్పథం ఉండాలి. అలాగే మనకు గౌరవం దక్కకపోయినా లేదా మాట వినకపోయినా..లైట్ తీసుకోవడం లేదా ఆ వ్యక్తులను పట్టించుకోకుండా ముందుకు వెళ్లేలా మనసుని సిద్ధం చేసుకోవాలి.అభద్రతా భావం వదిలేయాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా యోగా, ధ్యానం వంటివి చేయాలి.నలుగురితో ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఆటోమెటిగ్గా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడగలమని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఛారిటీ కోసం ఇంగ్లీష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!) -
ఇడియెట్ సిండ్రోమ్ అంటే ఏంటి? మీకూ ఉందేమో చెక్ చేసుకోండి!
గూగుల్ చేసి చూడకు. రాసిచ్చిన మందులు వాడు’ అని డాక్టర్ పేషెంట్‌తో చెప్పాల్సి వస్తోంది. కారణం -ప్రిస్కిప్షన్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆ మందులను గూగుల్ చేసి వాటి గుణాలు, సైడ్ ఎఫెక్ట్లు, వాటిని ఏయే జబ్బులకు వాడతారు అన్నీ పేషెంట్ తెలుసుకోవడమే. తెలుసుకున్న తర్వాత ఎన్నో డౌటానుమానాలు తెచ్చుకొని కొన్ని మందులు వాడకపోవడం, కొన్ని డోస్ తగ్గించమనడం ఇలా చేస్తూ ఆరోగ్యానికి హాని చేసుకుంటున్నారని డాక్టర్లు అంటున్నారు. ఇలా చేసే స్వభావానికి ‘ఇడియట్ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు. కొన్ని నెలల క్రితం ఒక యువతి కిడ్నీలు ఫెయిలయ్యే స్థితిలో హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు మందులు పని చేయని స్థితిని గమనించారు. కారణం ఆమె యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పినప్పుడల్లా తండ్రి ఇంటర్నెట్లో చూసి మందులు తెచ్చి వాడటమే. అతను డాక్టర్ని కలవాలనుకోలేదు. డాక్టర్ కంటే గూగుల్‌ని నమ్మాడు. ఇలా చేయడం వల్ల ప్రాణాంతకమైతే తిరిగి డాక్టరే రక్షించాల్సి వచ్చింది గూగుల్ కాదు.డాక్టర్‌కు తెలుసు డాక్టర్లు తమ డాక్టర్ పట్టా కోసం ఐదేళ్లు చదువుతారు. ఆ తర్వాత తర్ఫీదు అవుతారు. ఆ తర్వాత ప్రాక్టీసు మొదలెడతారు. దేహ గుణాలు, మందు గుణాలు పేషెంట్‌ను బట్టి జబ్బును బట్టి తమ అనుభవం కొద్దీ రాస్తారు. పేషెంట్‌ను కాపాడటమే డాక్టర్ లక్ష్యం. గతంలో డాక్టర్ రాసింది పేషెంట్లు నమ్మకంగా ఫాలో అయ్యేవారు. మహా అయితే మందుల షాపువాణ్ణి ఈ మందులు మంచివేనా అని అడుగుతారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. విస్తృతంగా వచ్చిన ఇంటర్నెట్ వల్ల ప్రతి దాన్ని తెలుసుకోవాలనే ఉబలాటం, ప్రతి దాన్నీ సందేహించే స్వభావం ఏర్పడ్డాయి. డాక్టర్ రాసిన మందులను తమ ఇష్టానుసారం మార్చు కుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ చదివి బెంబేలు పడి కొన్ని వాడటమే లేదు. పైగా మందుచీటిని తిరిగి తీసుకొచ్చి ప్రశ్నలతో వేధిస్తున్నారు. పేషెంట్ల ఇలాంటి రుగ్మతకు డాక్టర్లు పెట్టిన పేరే ‘ఇడియట్ సిండ్రోమ్’!శంక వద్దంటున్నారుఇటీవల సీఎస్ మంజునాథ్ అనే వైద్యుడు ‘మీ గూగుల్ పరిజ్ఞానంతో అయోమయానికి గురై... నా మెడికల్ డిగ్రీని శంకించకండి’ అంటూ బోర్డు పెట్టుకున్న దృశ్యం వైరల్ అయ్యింది. ఆయన దగ్గరే కాదు... ఈ తరహా బోర్డులు మరెన్నో ఆసుపత్రుల్లో కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో వంటలూ, వార్పులూ, కామెడీ ఎంత చూసినా పర్లేదు. కానీ వ్యాధులూ, వైద్యాలు చూస్తూ తమ జబ్బులతో తామే పేషెంట్లు చెలగాటాలాడుతున్నారని డాక్టర్ల ఆవేదన. ‘ఈ మందును ఎక్కువ వాడితే సైడ్ఎఫెక్ట్స్ వస్తాయట’ అంటూ డాక్టర్లకే వైద్యం నేర్పుతున్నారు. ‘పానీపూరీ, ఫాస్ట్ఫుడ్డూ తినేప్పుడు ఇలాగే సైడ్ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారా’ అంటూ డాక్టర్లు చీవాట్లు పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. నిజానికి ‘పేషెంట్’ అనే మాటకు ‘రోగి’ అన్న పదం అంత గౌరవప్రదంగా లేదంటూ ‘బాధితుడు’ అని వాడటం పరిపాటి అయ్యింది. ఇడియెట్ సిండ్రోమ్ వల్ల పేషెంట్ల చేతిలో డాక్టర్లు బాధితులవుతున్నారనేది వైద్యుల ఆవేదన.నెట్ జ్ఞానం సరికాదు...‘ఇడియట్ సిండ్రోమ్’తో రోగులు వైద్యుల్ని ప్రశ్నించడం, సొంతవైద్యం చేసుకోవడం సరికాదు. ఇంటర్నెట్ సమాచారంతో వ్యాధి నిర్ధారణ సమంజసం కాదు. నెట్ చూసి మందులు వాడితే ఒక్కోసారి ప్రాణాలమీదికి రావచ్చు. వైద్యాన్ని వైద్యుడు తన పరిజ్ఞానంతో, అనుభవంతో, నైపుణ్యంతో వ్యాధి నిర్ధారణ చేసి, ఏయే మందులు ఏయే మోతాదులో వాడాలో నిర్ణయిస్తాడు. గూగుల్ సమాచారంతో ఎవరికి వారు నిర్ధారణలూ, మందుల నిర్ణయాలూ సరికాదని తెలుసుకోవాలి.- డాక్టర్ పావనీ ప్రియాంక కార్యదర్శి, ఐఎంఏ, తెనాలి డాక్టర్ షాపింగ్వాస్తవానికి వ్యాధి ఏమిటనేది అనుభవంతో కూడిన వైద్యులు, ఎన్నో కోణాల నుంచి పరిశోధన, ఎన్నో పరీక్షలు చేశాక నిర్థారణ చేస్తారు. తర్వాత తగిన మోతాదులో మందులిస్తారు. అప్పుడు ‘ఈ ఫలానా ఇంజెక్షనే ఎందుకు? దీనికి ప్రత్యామ్నాయంగా ట్యాబ్లెట్ ఉందిగా’ అంటూ అడుగుతున్న పేషెంట్లు... అంతటితో ఆగకుండా... ఆ డాక్టర్‌ను వదిలి మరో డాక్టర్ దగ్గరికి మరో ఒపినీయన్, ఇంకో ఒపీనియన్ అంటూ తిరుగుతున్నారు. ఇలా తిరగడాన్నే వైద్య పరిభాషలో ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. దీని తర్వాత సొంతంగా మందుల్ని కొని వాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న దాఖలాలూ ఉన్నాయి. దీనికి పరాకాష్ట ఇటీవల ఓ భర్త ఇంటర్నెట్ చూస్తూ పురుడు పోస్తూ తన భార్య మరణానికి కారణమయ్యాడు. అందుకే ‘ఇడియట్ సిండ్రోమ్’ ధోరణి వద్దంటున్నారు. – బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి. -
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
రోజుకో కొత్త సిండ్రోమ్‌లు వచ్చేస్తున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి. మనుషుల పిచ్చి అపోహాలు, నమ్మకాలే వ్యాధుల రూపంలో సిండ్రోమ్లుగా బయటకొస్తున్నాయి. అలాంటి సరికొత్త సిండ్రోమ్ ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దానిపేరే 'ఇడియట్ సిండ్రోమ్'. ఏంటీ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..?'ఇడియట్' అంటే "ఇంటర్నేట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ర్స్టక్షన్ ట్రీట్మెంట్". ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు అందుబాటులో ఉన్న ఆన్లైన్ హెల్త్ సమాచారానికి ప్రాధాన్యత ఇచ్చి స్వీయ చికిత్స తీసుకుంటారు. అనారోగ్యాన్ని నిర్థారించుకోవడానికి పూర్తిగా ఆన్లైన్ వనరులనే ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితిని "ఇడియట్ సిండ్రోమ్"అని పిలుస్తారు. ఈ సిండ్రోమ్ ఉన్న రోగులు ఇంటర్నెట్ సర్చ్‌ల ఆధారంగా వ్యాధులను స్వయంగా నిర్థారణ చేసుకుంటారు. ఆఖరికి డాక్లర్లు సూచించిన చికిత్సలను కూడా పక్కన పెట్టేసి వారు ఆన్లైన్ ద్వారా తెలుసుకున్న చికిత్సను స్వయంగా చేసుకోవడం, ఆ మందులనే వాడడం వంటివి చేస్తారు. ఇక్కడ ఈ వ్యక్తులు రోగ నిర్థారణ కోసం వెబ్ శోధనే సరియైనదని భావించడమే ప్రమాదం. డబ్ల్యూహెచ్ఓ దీన్ని 'ఇన్ఫోడెమిక్' అని పిలుస్తుంది. ఈ విధమైన తీరు రాను రాను మరింత తీవ్రమై వైద్య నిపుణలపై అమనమ్మకానికి దారితీస్తుంది. రోగులు ఇక్కడ ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్ వంటి సాంకేతికతో తెలుసుకోవడం వరకు మంచిదే తప్పులేదు. అదే సాయంతో తనకు తానుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ప్రమాదకరం అని వైద్యుల చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎలా ప్రమాదమంటే..ఈ విధానం ముదిరిపోతే వారి దృష్టిలో ఆన్లైన్ హెల్త్ సమాచారమే తిరుగలేనిదిగా కనిపిస్తుంది. నిరంతరం ఆన్లైన్ సెర్చ్లకే పరిమితమైపోతారు. దీంతో విపరీతమైన, ఆందోళనకు, ఒత్తిడికి గురవ్వుతారు.ఒకవేళ్ల అది ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అసలుకే మోసం వచ్చి ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ వైఖరి వైద్య సహాయాన్ని నిరాకరించే స్థితికి తీసుకొస్తుంది. అప్పటి వరకు వాడుతున్న మందులను కూడా ఆపేయడం లేదా వేనే వాటిని వాడేలా చేస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని, లేనిపోని అనారోగ్యల బారినపడతారు.ఇక్కడ వెబ్ అనేది ఒక సాధనం. దీని ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఏర్పరుచుకోండి తప్పులేదు. శృతిమించితేనే ప్రమాదం. రోగ నిర్థారణ, చికిత్సల సలహాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం అని గ్రహించండి. (చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?) -
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్‌కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్‌గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!
ఏదైనా రుగ్మతతో పోరాడుతున్న లేదా వైకల్యంతో బాధపడుతున్న అక్కడితో ఆగిపోకూడదని ప్రూవ్ చేసిందో ఈ యువతి. రుగ్మత గమ్యానికి అడ్డంకి కాదు. అదే నిన్ను పదిమంది ముందు విలక్షణంగా నిలబడేలా మలుచుకునే ఓ గొప్ప అవకాశం అంటోంది ఈమె. అంత పెద్ద సమస్యను ఫేస్ చేస్తూ కూడా..నలుగురు శభాష్ అనేలా తలెత్తుకుని జీవిస్తోంది. తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పేరే జైనికా జగసియా. ఆమె డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. డౌన్‌సిండ్రోమ్ అంటే తెలిసిందే. మానసికలోపంతో బాధపడే చిన్నారులని చెప్పొచ్చు. శారీరక పెరుగుదల ఉన్న మానసిక పెరుగుదల ఉండదు. పైగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి చిన్నారుల ఆయుర్ధాయం కూడా తక్కువే. అంతటి పెను సమస్యతో బాధపడుతున్నప్పటికీ మోడల్, అడ్వకేట్, లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా దూసుకుపోతోంది. ఇంకోవైపు పాకశాస్త్ర నైపుణ్యంతో హోమ్బ్రెడ్ బై అనే బ్రాండ్‌తో ప్రముఖ బేకర్‌గా గుర్తింపుతెచ్చుకుంది. అంతేగాదు జైనికాకి ఫిట్నెస్ ఔత్సాహికురాలిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలో చక్కగా చెబుతుంది. అక్కడితో ఆమె విజయ ప్రస్థానం ఆగలేదు..గూచీ వంటి ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించి డౌన్ సిండ్రోమ్‌తో ఉన్నవాళ్లు అన్ని రంగాల్లో చురుగ్గా రాణించగలరని చూపించాలని ప్రగాఢంగా కోరుకుంటోంది. ఇక ఆమె ఇలా అన్ని విభ్ని రంగాల్లో రాణించగలగడానికి ప్రధాన కారణం అమ్మనాన్నల సహకారం తోపాటు తన సమస్యను అంగీకరించడం అంటోంది జైనికా. "మన బాధ ఏదైనా అంగీకరించాలి. యస్ నా సమస్య ఇది కాబట్టి నేనే చేయగలిగేదేమిటీ..? నా ఐడెంటీటీని ఎలా సంపాదించుకోవాలి అనే దానిపైకి ఫోకస్‌ని పోనివ్వాలి. అంతే తప్ప! మానసిక వైకల్యురాలిని కాబట్టి చేయలేను అనే ఆలోచన రాకూడదు. ఎలా చేస్తే బెటర్‌గా అవ్వగలను అనేది ఆలోచించాలే తప్ప ఆగిపోకూడు. అది పిడుగులాంటి సమస్య అయినా పక్కకు నెట్టి మరీ సాగిపోవాలి. చిన్నప్పటి నుంచి భాష దగ్గర నుంచి చదవడం, రాయడం అన్ని నాతోటి వాళ్ల కన్న వెనుక ఉండేదాన్ని. ప్రతీది లాస్ట్.. లాస్ట్.. ఆ లాస్ట్ని ఫస్ట్ ఎలా చేయగలననే ఆలోచనే అన్నింటిని అలవోకగా నేర్చుకునే శక్తి ఇచ్చింది. లాస్ట్.. లాస్ట్ అంటూ వేస్ట్‌గా కూర్చొండిపోలే. లాస్ట్ని ఫస్ట్‌గా మార్చే ప్రయత్నం చేశా అంతే!. అలాగే బేకింగ్ వంటకాలంటే మొదట్లో కాస్త అయిష్టత ఉండేది. అయితే నా సోదరి ఇవి తయారు చేయడంతో నాకు ఊహించనివిధంగా దానిపై అభిరుచి ఏర్పడింది. తెలియకుండానే ఆ కళలో ప్రావీణ్యం సాధించాను. వాస్తవానికి హెల్తీగా ఉన్నవాళ్లకైనా సరే..ముందగా ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక నా బోటి వాళ్లకు మరింత సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇద్దరికీ సమస్య..సమస్యే అనే విషయం గ్రహించాలి. కాకపోతే.. ఇక్కడ నేను తొందరగా నేర్చుకోలేనన్న భయం నన్ను మరింత శ్రద్ధ పెట్టి నేర్చుకునేలా చేస్తోందని చెబుతోంది జైనికా. అంతేగాదు సవాలు ఎవ్వరికైనా సవాలే కాకపోతే ఇక్కడ నాకు రుగ్మత లేదా వైకల్యం ఉందన్న ఆలోచన ఆ సవాలును అత్యంత కఠినమైనదిగా మారుస్తుంది. జస్ట్ ఇలా ఉండి కూడా సాధించి గ్రేట్‌గా ఉండాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఎంతటి కఠిన సవాలునైనా చేధించొచ్చు అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది." జైనికా. నిజానికి సమాజం అలాంటి పిల్లలను చూసి జాలిపడుతుంది. కానీ ఆ అవసరం లేదు, నేర్చుకోవడానికి టైం తీసుకుంటామే తప్ప మాలాంటి వాళ్లు కూడా సాధించగలరు అని చాటి చెప్పింది జైనికా. (చదవండి: భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?
వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన కోవడ్ మహమ్మారిలా నెమ్మదిగా పెరుతుగున్నాయి ఈ సిండ్రోమ్ కేసులు. అదికూడా ప్రధానంగా చిన్నారులే అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. న్యూమెనియాకు సంబంధించిన మిస్టీరియస్ వ్యాధిగా పరిశోధకులు వెల్లడించడంతో సర్వత్రా భయాందళోనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చైనాలోనే ఈ వ్యాధులు ప్రబలంగా ఉన్నాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధేనని, శీతకాలం కావడం వల్ల కేసులు పెరుగుతన్నాయని చైనా వివరణ ఇచ్చింది. పైగా కరోనా మహమ్మారి అంతా తీవ్రంగా లేదని తెలిపింది. అసలు ఎంతకీ ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్? దేని వల్ల వస్తుందంటే.. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఛాతీలో పేరుకుపోయి తెల్లటి పాచెస్ లాంటి ద్రవం పేరుకుని ఉంటే దాన్ని 'వైట్ లంగ్ సిండ్రోమ్' అంటారు. ఇది అక్యూట్ రెస్పీరేటరీ డిస్ట్రెస్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండినప్పడూ లేదా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో కాల్షియం నిక్షేపాలు ఉన్నప్పుడూ సంభవిస్తాయి. లక్షణాలు.. సాధార శ్వాస సంబంధిత వ్యాధుల్లో వచ్చే సంకేతాలనే చూపిస్తుంది. ముఖ్యంగా దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు.. కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇది కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లేదా కోవిడ్-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం వల్ల సంభవించినట్లు అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మైక్రోప్లాస్మా న్యూమెనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ఈ సిండ్రోమ్కి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు . అలాగే సిలికా ధూళి లేదా ఇతర కాలుష్య కారకాలను పీల్చడం లేదా పర్యావరణ కారకాలు తదితరాలు ఈ వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రధాన కారణమై ఉండొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. చికిత్స.. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, కార్టికోస్టెరాయిడ్స్ వంటి వాటితో ఈ వ్యాధిని నివారించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే టైంలో ఈ వ్యాధి తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడింది. సత్వరమే చికిత్స తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం వాటిల్లదని లేదంటే పరిస్థితి సివియర్ అవుతుందని అన్నారు. (చదవండి: నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?) -
Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై
చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో పెళ్లయ్యాక వేరొక చోట ఉండేందుకో పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ అవుతుంది.. బోసి పోతుంది. తల్లిదండ్రుల జీవితంలో నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్త జీవితం మొదలుపెట్టకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఏం చేయాలి? కేస్ స్టడీ 1: దీపావళి పండగ వచ్చింది. అపార్ట్మెంట్లో అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. కాని మూర్తి గారు, ఆయన భార్య సరళ గారు మాత్రం కిందకు రాలేదు. సరదాకైనా నిలబడలేదు. మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్లు బోలెడన్ని టపాకాయలు కాలుస్తారు. సందడి చేస్తారు. ఈసారి అస్సలు తలుపులే తీయలేదు. కారణం? ఆరు నెలల క్రితమే వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఎం.ఎస్. చేయడానికి యు.ఎస్. వెళ్లాడు. అప్పటి నుంచి వారిలో ఒక రకమైన నిర్లిప్తతను అపార్ట్మెంట్ వాసులు గమనిస్తున్నారు. చివరకు ఆ నిర్లిప్తత పండగల మీద కూడా ఆసక్తిని కోల్పోయేలా చేసింది. కేస్ స్టడీ 2: యాభై ఏళ్ల సీతాదేవికి విపరీతంగా కాలు నొప్పి వస్తోంది. భర్త జానకిరామ్ ఆమెను అన్ని హాస్పిటళ్లకు తిప్పాడు. కాల్లో ఏ సమస్యా లేదు. ఏదైనా ఆందోళన వల్ల వస్తున్న సైకలాజికల్ నొప్పేమోనని డాక్టర్లు అంటున్నారు. సీతాదేవి, జానకిరామ్‌లకు కూతురు, కొడుకు. మొదట కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. కొడుకు చదువుకుంటానని స్వీడన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెకు తెలియని ఆందోళన. ఒంటరితనం. దిగులు. భర్త ఏదైనా కాలక్షేపం కోసం బయటకు వెళ్లినా ఆమెకు దిగులు ముంచుకొస్తోంది. పిల్లలు లేని ఇల్లు ఆమెకు ఎంతకాలానికీ అలవాటు కావడం లేదు. ‘నెస్ట్’ అంటే గూడు. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసి పోతుంది. తల్లిదండ్రులు... వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సంచలనాలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని మానసిక నిపుణులు ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలను విడి గదుల్లో ఉంచి పెంచడం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. భారతీయులు మాత్రం పిల్లలను తమ వద్దే పడుకోబెట్టుకుంటారు. వారికి ఎంత వయసొచ్చినా వారు తమతో లేదా వారి వెంట తాము ఉండాలనుకుంటారు. అలాంటిది చదువు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టడాలు లేదా వేరే చోట స్థిరపడటాలు జరిగినప్పుడు ఒక ఖాళీతనం వారిని ఇబ్బంది పెడుతుంది. దానికి అడ్జస్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు కాస్తా భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ ప్రతికూలతలు: ⇒ పిల్లల గురించి ఆందోళన... వారితో మానసిక ఎడబాటు వస్తుందేమోనన్న భయం ⇒ ఒంటరితనం ఫీల్ కావడం ⇒ సంతోషంగా ఉండలేకపోవడం ⇒ కలత నిద్ర ⇒ జీవితానికి అర్థమేమిటి అనే సందేహం ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనుకూలతలు: ⇒ బోలెడంత ఖాళీ టైమ్ రావడం ⇒ బాధ్యతలు లేని స్వేచ్ఛ ⇒ స్వీయ ఇష్టాలు నెరవేర్చుకునే వీలు ⇒ కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం అయితే తమ మానసిక సామర్థ్యాన్ని బట్టి అనుకూలతలను తీసుకోవాలా ప్రతికూలతలతో కుంగిపోవాలా అనేది తేల్చుకుని ప్రతికూలతలను జయించి ముందుకు సాగాలి. కొత్త జీవితం: అన్నింటి కంటే మించి అంతవరకూ తల్లిదండ్రులుగా ఎక్కువ మసలినవారు పిల్లలు స్థిరపడ్డాక మళ్లీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కాని సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్ధంలో చూస్తూ పాత నష్టాలనూ, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులనూ బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి... స్నేహంగా ఉండాలి... పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవడం, ఏదైనా హాబీని అలవర్చుకోవడం, వాకింగ్ గ్రూపుల్లో చేరడం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవడం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వడం చేయాలి. ఈ సమయంలో పరస్పర భద్రత కూడా ముఖ్యమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవడం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్ల లకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం... ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది ఈ ‘ఎంప్టీ నెస్ట్’ కాలంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెంగ ఉండదు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలాంటి తల్లిదండ్రుల గొంతులో తప్పక సంతోషాన్ని వింటారు. ఆ సంతోషమే పిల్లలకు గొప్ప కానుక. -
ఆ రోగంతో బాధపడుతున్న 'జవాన్' నటి.. దీని కారణంగా!
హీరోయిన్లని చూడగానే చాలా అందంగా ముద్దుగా భలే ఉంటారు. అయితే బయటకు అలా కనిపిస్తున్నా సరే వాళ్లలో కొంతమంది పలు ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కాకపోతే ఎప్పుడూ బయటకు చెప్పుకోరంతే. అయితే పలు సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ, ఈ మధ్య 'జవాన్' మూవీతో సక్సెస్ అందుకున్న నటి సన్య మల్హోత్రా.. తనకున్న రోగం గురించి చెప్పుకొచ్చింది. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో కూడా రివీల్ చేసింది. (ఇదీ చదవండి: ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ) సన్యకు ఏమైంది? 'దంగల్' సినిమాలో ఆమిర్ ఖాన్‌కు కూతురిగా నటించిన సన్య మల్హోత్రా.. అదే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో సహాయ పాత్రలు చేసిన ఈమె.. తర్వాత తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాలు చేసింది. నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. 'జవాన్'లో ఓ మంచి పాత్ర చేసి శెభాష్ అనిపించింది. అయితే తాను చాలాకాలంగా ఇంపోస్టర్ సిండ్రోమ్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చెప్పింది. దీనికారణంగా ఆత్మన్యూనత (ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్)కి గురవుతున్నట్లు అనిపిస్తుందని చెప్పింది. 'నా యాక్టింగ్ గురించి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నా, బాగా చేశావని అంటున్నా సరే నాకు సందేహంగానే అనిపిస్తుంది. బాగా చేయాలేదేమో అని అనుమానం కలుగుతుంది. అలానే నేను చేసే పని కూడా నచ్చదు. 'బదాయి హో' సినిమా హిట్ అయింది. కానీ నేను మాత్రం బాగా యాక్ట్ చేయాలేదని ఫీలయ్యాను. అయితే ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాను' అని సన్య మల్హోత్రా చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) -
అదొక మిస్టీరియస్ వ్యాధి!..ఎలా వస్తుందో తెలియదు..గుర్తించినా చనిపోవడం ఖాయం
ఎన్నో రకాల వ్యాధులు గురించి విన్నాం. కానీ ఇలాంటి అరుదైన వ్యాధిని గురించి వినే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ వ్యాధి ఎంతమందికి వచ్చిందన్నది కూడా తెలియదు. ఎందుకంటే సాధారణ రోగి ఉండే లక్షణాలు సాధారణ వ్యాధులకు ఉండేవిగానే ఉంటాయి. నిజానికి అతడికి కూడా తెలియదు ఆ వ్యాధి ఉందని, ప్రాణాంతకమని. పేషెంట్ తాను ఫేస్ చేస్తున్న వాటిని వైద్యుడికి క్లియర్‌గా చెప్పినప్పటికీ కూడా గుర్తించడం కష్టం. చికిత్స కూడా లేదు. ఇంతకీ ఏంటా వ్యాధి అంటే.. ఈ భయానక వ్యాధి పేరు ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్(ఈడీఎస్) ఈ వ్యాధి జన్యుపరమైన రుగ్మత లేదా అరుదైన వారసత్వ రుగ్మతగా పేర్కొంటారు. ఎందుకంటే ఈ వ్యాధి ఏ ఏజ్‌లో వస్తుందని చెప్పలేం. ఎలా అటాక్ అవుతోందో తెలియదు సడెన్‌గా వచ్చేస్తుంది. కానీ లక్షణాలు చాలా రోజులకు గానీ బయటపడవు. ఆయా వ్యక్తలు నిర్లక్ష్యం వహించకుండా చెకప్‌కి వెళ్లి..అదృష్టవశాత్తు వైద్యులు ఆ వ్యాధి ఏంటో గుర్తించగలిగితే మందులతో ప్రాణాలను నిలబెట్టి.. ఆయుష్షుని పొడిగించుకోవచ్చు. అంతే తప్ప చికిత్స మాత్రం లేదు. అంత విచిత్రంగా ఉంటుంది ఆ వ్యాధి. అచ్చం అలాంటి వ్యాధి బారినే న్యూజిలాండ్‌కి చెందిన 33 ఏళ్ల మహిళ పడింది. పాపం ఆమె తెలుసుకోలేకపోయిందో ఏమో గానీ మానసిక సమస్యలు ఉన్నట్లు పొరబడి అలానే వైద్యలకు తెలిపింది. ఒంట్లో ఒకటే నీరసంగా ఉంటుదని ఆస్పత్రికి వెళ్లింది. వారు చూసి నార్మల్ ఫీవర్ అనే అనుకున్నారు. తన సమస్యలు గురించి కూడా ఏం సరిగా వివరించలేకపోయింది. దీంతో వాళ్లు కొన్ని టెస్ట్‌లు చేసి ఏదో వ్యాధి అనే ఫీలింగ్‌లో ఉంటుంది కాబోలు ఇది మానసిక సమస్యకు సంబంధించిందిగా భావించి మానసిక రోగుల వార్డుకి తరలించారు. ఐతే కానీ ఆమె అనుహ్యంగా చికిత్స తీసుకుంటూ సడెన్‌గా ప్రాణాలు కోల్పోయింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు అసలు ఏ కారణంతో చనిపోయిందని పరీక్షలు చేయగా ఈ విషయం అంతా బయటపడింది. ఆమెకు ఎహర్స్ డాన్లోస్ సిండ్రోమ్(ఈడీఎస్) ఉందని. ఆ వ్యాధి ఆమెకు 25 ఏళ్లు వయసు ఉన్నప్పుడే వచ్చిందని, ఆమె దీన్ని గమనించలేకపోయిందని అన్నారు వైద్యులు. సాధారణ సమస్యలుగానే ఫీలయ్యింది ఇదే ఇంతటి ఘోరం జరగడానికి కారణమైందన్నారు. ఆమె ఈ వ్యాధిని వారసత్వంగా పొందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇది చర్మంలోని టిష్యులకు ఎముకలు, రక్తనాళాలు, ఇతర అవయవాలకు మద్దతు ఇచ్చే ప్రోటీన్ల డెఫిషియన్సీ అని పేర్కొన్నారు వైద్యులు. దీనికారణంగా చర్మం సాగదీయబడినట్లుగా ఉండి, కీళ్లు వదులుగా ఉంటాయి. చిన్న రక్తనాళాలు పెళుసుగా మారి మచ్చలు ఏర్పడతాయి. శరీరం అంతా ఒకవిధమైన గాయాలు వచ్చి ఎన్నటికి నయం కాకుండా ఇబ్బంది పెడతుంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఈ సిండ్రోమ్ కేసుల్లో కొన్ని తేలికపాటి సమస్యలే ఉంటాయి. కొన్ని మాత్రం ప్రాణాంతకంగా మారతాయని చెప్పుకొచ్చారు. ప్రతి 5 వేలమందిలో ఒకరు ఈ వ్యాధి బారినపడతారట. దీనికి వైద్యం లేదు. ఈడీఎస్తో బాధపడుతున్న వ్యక్తులు తరుచుగా మందులతో ప్రాణాలను నిలబెట్టుకుని ఎదురయ్యే సమస్యలను అధిగమించడమే మార్గం అని చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ లక్షణాలు.. తీవ్రమైన మైగ్రేన్ నొప్పి. పొత్తి కడుపు నొప్పి, కీళ్లు తప్పటం, సులభంగా గాయాలు అవ్వటం, ఇనుము లోపం, తదితర లక్షణాలను చూపిస్తాయి. దీంతో వైద్యులు చెక్ చేసి ఎలాంటి సమస్య లేదని తేల్చేస్తారు. ఇలాంటి మిస్టీరియస్ వ్యాధులను క్షుణ్ణంగా స్టడీ చేయాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధి మూర్చ, దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలనే చూపిస్తుంది. కాబట్టి వైద్యుడు ఆ తరహాలో చూసి చికిత్స అందిస్తాడు. ఇలాంటి కేసుల్లో ఈ సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలను దృష్టిలో ఉంచుకుని బేరీజు వేసుకుని ఆ తర్వాత మందులు ఇవ్వాలి. లేదంటే ఆ వ్యాధి అని గుర్తించక ఇచ్చిన మందులు రియాక్షన్ చెంది రోగి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం లేకపోలేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వైద్యలు కొన్ని కేసులు మమ్మల్ని కదిలించాయని, అందులో ఈ న్యూజిలాండ్ మహిళ కేసు కూడా ఒకటని అన్నారు. అలాంటి రోగుల సమస్యలను గుర్తించడంలో వైద్యలకు శిక్షణ ఇవ్వడమే గాక రోగి వైద్య హిస్టరీని కూడా స్టడీ చేసేలా సూచనలిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం ఫేస్ చేశాడు! ఆ వ్యాధి ఏంటంటే..) -
అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం బాధితుడే!
అత్యంత అరుదైన వ్యాధి. దీని బారినపడితే ఆ వ్యక్తి అత్యంత నరకయాతన అనుభవిస్తాడు. చివరికి ఆ నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతారట. అందుకే దీన్ని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ఆ వ్యాధి? ఎలా సోకుతుంది తదితరాల గురించే ఈ కథనం.! ఈ వ్యాధి పేరు ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రైఫేషియల్ న్యూరల్జియా అంటారు. వ్యవహారికంలో ఫాంటమ్ ఫేస్ పెయిన్ అని పిలుస్తారు. ఇది ముఖంలోని నరాలకు సంబంధించిన వ్యాధి. కపాలం నుంచి ముఖానికి వెళ్లే ట్రెజిమినల్ నాడిని ప్రభావితం చేస్తుందట. దీంతో ఆ వ్యక్తి ముఖంలో ఎడమ లేదా కుడివైపు విపరితమైన నొప్పి వస్తుంది. అది ఒక తిమ్మిరి మాదిరిగా, ఎవ్వరైన కొడితే దిమ్మతిరిగినట్లుగా పెయిన్ వస్తుందట. అలా అరగంట నుంచి గంట వరకు విపరీతమైన నొప్పి ఉంటుందట. దీంతో నోరు లేదా దవడలను కదపడం చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఎంతసేపు ఉంటుందనేది చెప్పలేం. తగ్గాక కూడా మళ్లీ ఎప్పుడూ వస్తుందో కూడా చెప్పలేం. దీని ప్రభావం దైనందిన జీవితంపై ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడూ కనీసం బ్రెష్ కూడా చేయలేరు. ఆ నొప్పికి తాళలేక ముఖాన్ని మాటి మాటికి రాపిడికి గురి చేస్తారు రోగులు. దీంతో ముఖం పుండ్లుగా ఏర్పడి ఒక విధమైన చర్మవ్యాధికి దాదితీస్తుంది. ఇది 50 ఏళ్ల వయసు నుంచి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కూడా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యను క్రికెటర్ల దగ్గర నుంచి ఎందరో ప్రముఖ సెలబ్రెటీలు కూడా ఫేస్ చేశారట. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ వ్యాధి బారినే పడ్డారు. దీని కోసం యూఎస్ వెళ్లి మరీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఐతే ఈ చికిత్స అత్యంత ఖర్చుతో కూడినది. పైగా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండదు. ఎలా వస్తుందంటే.. ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రిజెమినల్ డిఫెరెంటేషన్ నొప్పి అనేది కపాలం నుంచి ముఖానికి వెళ్లే త్రిభుజాకారంలోని నరాలు దెబ్బతినడంతో ఈ సమస్య ఉత్ఫన్నమవుతుంది. ఈ నొప్పి తొమ్మిరితో కూడిన ఒక విధమైన భరించేలేనిదిగా ఉంటుంది. మైగ్రైన్ నొప్పిలా అనిపిస్తుంది. దీనికి చికిత్స కూడా చాల కష్టం. ప్రస్తుతం తాజాగా పోలాండ్‌కి చెందిన 70 ఏళ్ల మహిళ కూడా ఇదే వ్యాధిని బారినపడింది. దీని కారణంగా ఆమె కుడివైపు నాసికా రంధ్రం గాయమవ్వటమే కాకుండా కన్ను కుడవైపు ముఖ ప్రాంతమంతా పుండుగా మారిపోయింది. ఆ నొప్పికి తాళ్లలేక ముఖాన్ని రుద్దడంతో పుండ్లు వచ్చి చర్మవ్యాధికి దారితీసింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రితో జాయిన్ చేశారు. వైద్యులు ఆమె ట్రైజెమినల్ ట్రోఫిక్ సిండ్రోమ్(టీటీస్)తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించారు. ఎదురయ్యే సమస్యలు.. దీని కారణంగా దవడ, దంతాలు లేదా చిగుళ్ళలో విద్యుత్ షాక్‌గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ముఖంలో ఆకస్మిక నొప్పికి కారణమయ్యే నరాల నష్టం అని అన్నారు. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా నయం చేయవచ్చు గానీ కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయని అంటున్నారు. దాదాపు నూరు కేసుల్లో 70 శాతం సక్సెస్ అయితే 30 శాతం ఫెయిల్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని అన్నారు. దీనికి పవర్ఫుల్ యాంటి బయోటిక్ మందులు వినియోగించాల్సి ఉంటుందన్నారు. వృద్ధులు వాటిని తట్టుకునే స్థితిలో ఉండలేరు కాబట్టి వారికి చికిత్స చేయడం కష్టమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాధి భారినపడ్డవారు చేతికి గ్లౌజ్‌లు ధరించి ముఖాన్ని రాపిడికి గురిచేయకుండా ఉండేలా క్లాత్‌ని చుట్టి ఉంచుకుంటే..కొద్ది మోతాదు మందులతోనే నయం చేసే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు?
మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మరణ రహస్యం ఏమిటనేది ఈ ప్రపంచంలో ఎవరికీ స్పష్టంగా తెలియదు. విశ్వవ్యాప్తమైన ఈ రహస్యంపై ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఏమీ చెప్పలేకపోయారు. అయితే ప్రతీ మతానికి మరణ రహస్యంపై ప్రత్యేక వివరణలు ఉన్నాయి. మరణం అనేక రకాలుగా సంభవిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యరీత్యా మరణిస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మరణిస్తారు. కొందరు చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఈ రకమైన మరణాన్ని 'స్మైలింగ్ డెత్' అని అంటారు. ఈ స్థితిలో బాధతో విలపిస్తున్న వారు కూడా నవ్వుతూ చనిపోతారు. దీనిని క్రష్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇంతకీ స్మైలింగ్ డెత్ అంటే ఏమిటి? కొందరు చనిపోయే ముందు ఆకస్మికంగా ఎందుకు నవ్వుతారో ఇప్పుడు తెలుసుకుందాం. భూకంపం లేదా ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్న వ్యక్తి రక్తంలో పొటాషియం అధిక మోతాదులో విడుదలవుతుంది. ఈ కారణంగా గుండె చప్పుడులో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా షాక్‌లో ఉంటూనే మరణిస్తాడు. ఈ రకమైన మరణానికి ముందు సదరు వ్యక్తి అసంకల్పితంగా నవ్వడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి అంతర్గతంగా విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ, నవ్వుతూనే ఉంటాడు. అందుకే దీనిని స్మైలింగ్ డెత్ అంటారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? తొలిసారి కనుగొన్నారిలా.. స్మైలింగ్ డెత్‌ను మొదట జపాన్‌లో కనుగొన్నారు. 1923లో జపనీస్ చర్మవ్యాధి నిపుణుడు సీగో మినామి ఈ క్రష్ సిండ్రోమ్ అనే వ్యాధిని మొదటిసారిగా గుర్తించారు. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చాలా మంది చనిపోయారు. మినామి.. చనిపోయిన ముగ్గురు సైనిక సైనికుల పాథాలజీని అధ్యయనం చేశారు. జపాన్ తరువాత ఇంగ్లాండ్‌లో కూడా ఈ వ్యాధిపై అధ్యయనం జరిగింది. 1941లో ఆంగ్ల వైద్యుడు ఎరిక్ జార్జ్ లాప్‌థోర్న్ క్రష్ సిండ్రోమ్ గురించి తెలియజేశారు. క్రష్ సిండ్రోమ్ కేసులు చాలా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంభవిస్తాయి. భూకంపం, యుద్ధం, ఏదైనా భవనం కూలిపోవడం లేదా రోడ్డు ప్రమాదాల వంటి సందర్భాలలో క్రష్ సిండ్రోమ్ కేసులు కనిపిస్తుంటాయి. ఉత్తర టర్కీలో భూకంపంలో క్రష్ సిండ్రోమ్(స్మైలింగ్ డెత్) కారణంగా నమోదైన మరణాల రేటు 15.2% గా ఉంది. ఈ భూకంపం 1999లో సంభవించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం క్రష్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన నొప్పితో కూడిన ఒక రకమైన రిపెర్ఫ్యూజన్ గాయం. శిథిలాలలో చిక్కుకుపోవడం వల్ల శరీర కండరాలు అస్తవ్యస్తంగా మారతాయి. ఎవరైనా వ్యక్తి 4 నుండి 6 గంటల పాటు శిధిలాలలో ఉండిపోతే అతను క్రష్ సిండ్రోమ్ స్థితికి లోనవుతాడు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఒక గంటలోనే ఏర్పడవచ్చు. మరణించే చివరి క్షణంలో.. క్రష్ సిండ్రోమ్ స్థితికి గురైన వ్యక్తి తన భావాలను సరిగా వ్యక్తపరచలేడు. ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉండాలో లేదా ఏమి ఆలోచించాలో అనే ధ్యాసలో మునిగిపోతారు. తాజాగా జరిగిన అధ్యయనంలో క్రష్ సిండ్రోమ్‌కు గురైన వ్యక్తి చివరి క్షణంలో అసమంజసమైన రీతిలో ఆలోచిస్తాడని తేలింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం మరణించే సమయంలో మనిషి.. చనిపోయిన తన బంధువులను గుర్తుకుతెచ్చుకుంటాడు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయంపై నలుగురిని ప్రయోగాత్మకంగా తీసుకున్నారు. వారు ఇక బతికే అవకాశాలు లేవని నిర్ధారించిన తరుణంలో వారికి వెంటిలేటర్ తొలగించిన తర్వాత వారి హృదయ స్పందన రేటుతో పాటు గామా కార్యకలాపాలు కూడా పెరిగాయని గుర్తించారు. ఈ ప్రయోగం ఆధారంగా శాస్త్రవేత్తలు మరణానికి ముందు సదరు వ్యక్తి తెల్లటి కాంతిని, చనిపోయిన బంధువులను చూస్తాడని, విభిన్న శబ్దాలను వింటాడని గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘హలాల్ హాలిడే’ అంటే ఏమిటి? ముస్లిం యువతులకు ఎందుకంత ఇష్టం? -
పీసీఓఎస్‌తో నిద్రాభంగాలు ఎందుకంటే...
అండాశయాల్లో నీటితిత్తులు కనిపించే పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్న కొందరు మహిళల్లో రాత్రివేళల్లో నిద్ర సంబంధిత సమస్యలు కనిపించే అవకాశాలుంటాయి. అంటే... కొందరిలో రాత్రి నిద్రపట్టకపోవడం (ఇన్సామ్నియా), గురకవస్తూ... దాంతో మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం (స్లీప్ ఆప్నియా)తో నిద్రాభంగం అవుతుండటం, కాళ్లు విపరీతంగా కదిలించే ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’తో నిద్రనుంచి లేచి, ఆపై ఎంతకూ నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. పీసీఓఎస్ ఉండి, ఇలాంటి నిద్ర సంబంధిత సమస్యలు కనిపించే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది. అండాశయాల్లో నీటితిత్తులకు హార్మోన్ల అసమతౌల్యతే ప్రధాన కారణం. అంటే కొన్ని హార్మోన్ల స్రావాల్లో హెచ్చు తగ్గులు, ప్రధానంగా పురుషుల్లో ఎక్కువగా ఉండే యాండ్రోజెన్ వంటి హార్మోన్ల మోతాదులు పెరగడం వంటి అంశాలు అసమతౌల్యతకు దారితీస్తాయి. ఈ అసమతౌల్యతే నిద్రా సమస్యలకూ కారణమవుతుంది. ఆహార అలవాట్లతో అధిగమించడం ఇలా... కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉంచడం వల్ల స్లీప్ సమస్యలను దూరంగా ఉంచవచ్చు. అవి... ఎక్కువగా చక్కెరలను వెలువరించే ఆహారాలను చాలా పరిమితంగా తీసుకుంటూ... అదే సమయంలో అతి తక్కువగా చక్కెరను వెలువరించే (లో–గ్లైసీమిక్ ఇండెక్స్) ఆహారాలను తీసుకోవడం. (అంటే ఉదాహరణకు వరిలాంటి ఎక్కువ చక్కెరలను వెలువరించే ఆహారాలు కాకుండా కొర్రలు, రాగుల వంటి చిరుధాన్యాలను తీసుకోవడం, అతిగా పాలిష్ చేయనివీ, పొట్టుతో ఉండే ధాన్యాలనే తీసుకోవడం. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో పాటు కొవ్వులు తక్కువగా ఉండి, ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే చిక్కుళ్ల వంటి ఆహారాలను తీసుకోవడం. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే పానియాలకు దూరంగా ఉండటం. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే బాదం వంటి నట్స్, ఎండుఫలాలను ఎక్కువగా తీసుకోవడం. వేట మాంసాన్ని చాలా పరిమితంగా తీసుకుంటూ, వైట్ మీట్ (చేపలను) ఎక్కువగా తీసుకోవడంతో పీసీఓఎస్‌ను చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలితో... క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే (ధ్యానం, యోగా వంటి)టెక్నిక్స్‌తో, బరువును నియంత్రిస్తూ స్థూలకాయం రాకుండా చూసుకోవడం, రోజుకు కనీసం 8 గంటల పాటు కంటినిండా నిద్రపోవడం వంటి చర్యలతో పీసీఓఎస్‌ను చాలావరకు నివారించవచ్చు. దాంతో నిద్రసమస్యలతో పాటు, ఇతరత్రా అనేక సమస్యలూ నివారితమై, మహిళల ఆరోగ్యం అన్ని విధాలా మెరుగుపడుతుంది. డాక్టర్ ఎమ్ రజనీ సీనియర్ గైనకాలజిస్ట్ (చదవండి: అవుట్డోర్ కుక్వేర్..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు) -
యుద్ధం విధ్వంసమే కాదు.. వ్యాధుల్ని కూడా కలగజేస్తుందా!
రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి ఏడాదికి పైగా కావొస్తోంది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంది. వేలాదిమందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు యుద్ధం బీభత్సానికి బీతిల్లి లక్షలాదిమంది వలసలు వెళ్లిపోయారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉన్నవారందర్నీ ఆ భయం వెన్నాడుతూనే ఉంది. వాళ్లు ఇంకా ఆ సంఘటనల తాలుకా ఆందోళన, ఒత్తిడి కారణంగా చెపుకోలేని మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ శరణార్థులంతా 'సర్వైవర్ సిండ్రోమ్' అనే మానసిక రుగ్మతతో అల్లాడుతున్నారు. ఇంతకీ 'సర్వైవర్ సిండ్రోమ్' అంటే ఏమిటంటే..? సర్వైవర్ సిండ్రోమ్ అంటే.. ఇతరులు మరణించిన లేదా హాని కలిగించే పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత అపరాధం చేసిన భావనలో ఉండటం. విపత్కర పరిస్థితుల్లోంచి తన వాళ్ల కంటే భిన్నంగా బయటపడిన తర్వాత నుంచి వారిని వేధించే ఒక రకమైన మానసిక ఆవేదన. ఏ తప్పు చేయకపోయినా తమ కారణంగానే వారు దూరమయ్యారని కుంగిపోతుంటారు. ఇందులోంచి వారు బయటపడకపోతే గనుక ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత స్థితికి చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన వెంటనే లిసెట్స్కా అనే మహిళ తన ఏడేళ్ల కొడుకుతో పొరుగున ఉన్న మోల్డోవాకు పారిపోయింది. ఐతే ఆ సమయంలో ఆమె తన భర్తను, స్నేహితులను వదిలి రోమేనియా సరిహద్దుకు సమీపంలోని నిస్పోరేని వద్ద ఉన్న మోల్డోవన్ శరణార్థి కేంద్రం వద్దకు చేరుకుంది. తన కొడుకుని సురక్షితంగా ఉంచేందుకు ఆమె ఈ ధైర్యం చేయక తప్పలేదు. కానీ ఆ తర్వాత నుంచి తన మాతృభూమికి ద్రోహం చేశానని, తన వాళ్లను మోసం చేశానేమో అనే ఆవేదనతో కుంగిపోవడం ప్రారంబించింది. శరీర స్ప్రుహ లేకుండా తిండి తిప్పలు లేకుండా జీవచ్ఛవంలా మారిపోయింది. ఇలా అక్కడ ఉంటున్న దాదాపు లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులంతా ఇలాంటి మానసిక రుగ్మతతోనే బాధపడుతున్నారు. తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడి గురవ్వుతున్నారు. ఆయా శరణార్థులకు డాక్టర్స్ ఆఫ్ ది వరల్డ్‌తో సహా దాదాపు 40 ప్రధాన మానవతా సంస్థలు వారికి చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాయి. వారందరికీ ఆర్ట థెరఫీ ఇచ్చి ఆ మానసిక రుగ్మత నుంచి బయటపడేలా చేయడమే గాక వారికి మేమున్నాం అనే భరోసా ఇస్తున్నారు. తాము ఒంటరి అనే భావనను తుడిచిపెట్టి ఇక్కడ ఉన్నవారంతా ఓ కుటుంబంలా.. ఓ కొత్త జీవితానికి నాంది పలకాలంటూ ప్రోత్సహించడంతో ఇప్పుడిప్పుడే వారిలో నెమ్మది నెమ్మదిగా మార్పు రావడం ప్రారంభమైంది. ఆయా శరణార్థుల నైపుణ్యాలను బట్టి వారికి తగిన ఉద్యోగాలివ్వడం, కొందరి చేత పేయింటింగ్ వంటి పనులతో నిమగ్నమయ్యేలా చేశారు. దీంతో వారు ఫేస్ చేస్తున్న మానసిక సమస్యను అధిగమించేలా చేస్తున్నాయి సదరు మానవతా సంస్థలు. ఈ మేరకు ఆయా మానవతా సంస్థల జనరల్ కోఆర్డినేటర్ లిజ్ డివైన్ మాట్లాడుతూ..మోల్డోవాలోని ఉక్రేనియన్ శరణార్థులలో 86 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు. వారి భర్తలు, కుమారులు, సోదరుడు ఉక్రెయిన్‌లో పోరాడటానికి లేదా ఇతర సహాయ నిమిత్తం అక్కడే ఉన్నారు. దీంతో వారిలో సహజంగా 'ఒంటరి' అనే భావన కలుగుతుంది. ఆ తర్వాత తెలయకుండానే ఆందోళనతో కూడిన ఒత్తిడికి గురై ఈ సర్వైవర్ సిండ్రోమ్కి గురవ్వుతారు. అందుకే వారిని ఏదో ఒక పనిలో బిజీ చేసి చుట్టు ఉన్నవాళ్లే తమ వాళ్లుగా స్వీకరించేలా సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు లిజ్ డివైన్. (చదవండి: వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు! ) -
నిరంతరం కాళ్లు కదిలిస్తూ ఉండే... రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్!
కొందరిని గమనిస్తే... కుర్చీలో కూర్చుని కాళ్లు రెండూ కదుపుతూ ఉంటారు. వాళ్లు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా... అలా కదిలించడం వారికి ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ వారు బలవంతంగా దాన్ని నియంత్రించుకుంటే... అది వారికి అనీజీగా అనిపించి... కాసేపటి తర్వాత తమ ప్రమేయం లేకుండానే మళ్లీ కదిలించడం మొదలుపెడతారు. జనాభాలో దాదాపు 3 శాతం మందిలో ఇది ఉంటుంది. ఇలా కాళ్లు కదుపుతూ ఉండే సమస్యను ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’ (ఆర్ఎల్ఎస్) అంటారు. చాలామందిలో ఉండే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. కాళ్లు రెండూ అదేపనిగా కదుపుతూ ఉండే ఈ సమస్య కూర్చుని ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... ఇలాంటివారిని జాగ్రత్తగా గమనిస్తే... ఈ ధోరణి సాయంత్రాలూ, రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా ఉంటుంది. వైద్య పరిభాష లో దీన్ని ‘విల్లిస్ ఎక్బామ్ డిసీజ్’ అని కూడా అంటారు. ఇది ఏ వయసువారిలోనైనా కనిపించినప్పటికీ... వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కనిపించే అవకాశాలు పెరుగుతాయి. కొందరిలో ఇది ఎంత ఎక్కువ అంటే... వారి నిద్రకు సైతం ఇది అవరోధంగా మారుతుంది. కుటుంబ చరిత్రలో ఈ సమస్య ఉన్నవారి పిల్లల్లోని చాలామందిలో అనువంశికంగా ఈ సమస్య కనిపిస్తుంది. కారణాలు: ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు... త్వరగా ఉద్వేగాలకు లోనయ్యేవారు, అతిగా ఆందోళన పడేవారు, యాంగై్జటీకి గురయ్యేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇది ఎక్కువ. . లక్షణాలు: ∙కొందరిలో కాళ్లలో ఇబ్బంది పైకి పాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ∙కాళ్లు కదుపుతూ ఉంటారు. కాళ్లు కదపడం ఆపితే చాలా ఇబ్బందిగానూ, అలా కదుపుతుంటే హాయిగాను ఫీలవుతారు. ∙ఇలా కదిపే వాళ్లలో రాత్రి నిద్రలో అకస్మాత్తుగా కాలి కండరాలు పట్టేస్తాయి. దాంతో అకస్మాత్తుగా నిద్రలేస్తారు. ఒక్కోసారి రాత్రంతా బాధపడతారు. తరచూ నిద్రాభంగాలు, దాంతో వచ్చిన నిద్రలేమితో జీవన నాణ్యత దెబ్బతింటుంది. ∙ఈ లక్షణాలున్న కొందరిలో కాళ్లలాగే భుజాలూ కదపడం కనిపిస్తుంది. కానీ ఇది చాలా అరుదు. అపోహ... వాస్తవం: రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌ను కొందరు మానసిక సమస్యనూ, మెదడు లేదా నాడీమండల సమస్యగానూ భావిస్తారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. కాకపోతే యాంగై్జటీతో పాటు కొన్ని మానసిక సమస్యలు ఉన్నవారిలో ఇది కనిపిస్తుండటం అనే అంశమే ఈ అపోహకు తావిస్తోంది. అంతే తప్ప ఇది మెదడు, నాడీ సంబంధమైన సమస్య లేదా మానసిక సమస్య కాదు. కొంతమంది ఇది నరాల్లోని సమస్యగా భావిస్తారు. ఇది సరి కాదు. నివారణ / నియంత్రణ రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్నవారిలో హీమోగ్లోబిన్‌లో ఐరన్ లోపం ఉందేమో చెక్ చేసుకుని, ఒకవేళ ఉంటే దాన్ని భర్తీ చేయాలి. ∙కెఫిన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి లేదా పరిమితంగా తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ∙కాళ్లు రెండూ గోరువెచ్చగా ఉన్న వేణ్ణీళ్ల టబ్‌లో ఉంచి, మెల్లగా మసాజ్ చేయడం. ∙సమస్య తీవ్రత ఉన్నవారు ‘ఫుట్ ర్యాప్ లేదా వైబ్రేటింగ్ ప్యాడ్స్’ వంటి ఉపకరణాలను డాక్టర్ల సూచన మేరకు వాడటం. -డాక్టర్ కె. శివరాజు,సీనియర్ ఫిజిషియన్ (చదవండి: మీలో ఏకాగ్రత ఎంత ఉంది? అందుకోసం ఏం చేయాలంటే) -
టాయిలెట్‌కి వెళ్లలేని అరుదైన సమస్య! జీవితాంతం..
ఎన్నో జబ్బులు గురించి ఇంతవరకు విన్నాం. అవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి. పైగా అవి ఏదో విటమిన్లోపం లేదా జన్యు సమస్యల కారణంగా వచ్చిన జబ్బులు. ఇంకాస్త ముందుకెళ్లితే మన పనితీరు కారణంగా వచ్చే విచిత్రమైన వ్యాధులు గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకునే ఈ వ్యాధి అత్యంత అరుదైనది, విని ఉండే ఆస్కారమే లేదు కూడా. ఎందుకంటే అది మనిషి జీవితంలో రొటిన్‌గా చేసే సాధారణ పనిని చేయలేకపోవడం. చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే అరుదైన వ్యాధి బారిన పడింది 30 ఏళ్ల మహిళ. ఈ వ్యాధి పగవాడికి కూడా వద్దంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల మహిళ మూత్ర విసర్జన చేయలేకపోడం అనే వింత సమస్యతో బాధపడుతుంది. ఆ మహిళ పేరు ఎల్లే ఆడమ్స్. ఆమె అక్టోబర్ 2022లో తాను టాయిలెట్‌కి వెళ్లలేకపోతున్నట్లు తొలిసారిగా గుర్తించింది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆమె ఆరోజంతా టాయిలెట్‌కి వెళ్లలేకపోయింది. మనిషి నిత్య జీవితంలో సర్వసాధరణంగా చేసే పనిని చేయలేకపోతున్నానంటూ భోరున విలపించింది. దీంతో ఆమె వైద్యలును సంప్రదించగా..వారు అత్యవసర క్యాథెటర్‌ను అందించారు. అంటే ఒక ఒక గొట్టాన్ని మూత్రాశయంలోకి పంపి యూరిన్‌ని తీయడం. దీంతో ఆమె మూత్రశయం నుంచి లీటర్ యూరిన్ తీశారు వైద్యులు. ఇది సాధారణంగా రోగికి శస్త్ర చికిత్సలు చేసేటప్పుడే ఉపయోగిస్తారు. అయితే ఎల్లేకు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే యూరిన్‌ని ఇలా తీయాల్సి వస్తోంది. ఆ గొట్టాన్ని తీసేసి బాత్రూంకి వెళ్లి ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. చివరికి ఎన్ని మందులు వాడిని ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు. దీని గురించి యూరాలజీ సెంటర్ల చుట్టు తిరుగుతూనే ఉంది. సరిగ్గా 14 నెలలు తర్వాత వైద్యులు నిర్వహించిన పలు టెస్ట్‌ల ద్వారా ఎల్లే ఫౌలర్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీంతో ఆమె ఇక జీవితాంతం మూత్ర విసర్జన చేయడానికి క్యాథెటర్ అవసరం అని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేవని తెలిపారు. ఫౌలర్స్ అనేది యూరిన్‌ని పాస్ చేయలేని సమస్య. ఇది ఎక్కువగా యువతులలోనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల తాను ఎంతగా ఇబ్బందిపడుతోందో కన్నీరుమున్నీగు చెబుతోంది ఎల్లే. (చదవండి: మోదీ ఇంటి పేరుపై నాడు ఖుష్బు చేసిన ట్వీట్ దుమారం!) -
సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్
ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్ లేకపోతే ఏ ఒక్క పని జరగని పరిస్థితి. సెల్‌ఫోన్ వల్ల జరిగే మంచిని అటుంచితే... ఇప్పటికే చాలామంది ఎక్కువగా మొబైల్ఫోన్లు వినియోగిస్తూ రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారు. కంటి సమస్యలతో కొందరు, గేమింగ్‌కు బానిసలై మరికొందరు, మానసిక సమస్యలతో కూడా ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. తాజాగా ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్’ (మెడకు సంబంధించిన నొప్పి) పట్టిపీడిస్తోంది. ఉరవకొండకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతోంది. తల ఓవైపునకు వంచినట్టు ఉందని బాధపడుతుంటే తల్లిదండ్రులు డాక్టర్‌కు చూపించారు. ఈమె ఎక్కువగా సెల్‌ఫోన్ వాడటం వల్ల ఇలా జరిగిందని న్యూరో వైద్యులు చెప్పారు. ఇప్పుడామె నొప్పి భరించలేక ఆక్యుపేషనల్ థెరఫీ చేయిస్తోంది. అనంతపురానికి చెందిన అనీల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమెరికాలో కూడా పదేళ్లు పనిచేసి వచ్చారు. మొబైల్ ఫోన్ వాడకం పెరిగి ఆయనకు మెడనొప్పితో పాటు నడుమునొప్పి వచ్చింది. నగరంలోనే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత జిల్లాలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో ఎక్కువ మంది ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ ’కు గురవుతున్నట్లు తేలింది. దీనివల్ల మెడ వంకర్లు పోవడం, మెడనొప్పి రావడం, తలెత్తుకు తిరగలేకపోవడం జరుగుతోంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ ఎర్గొనోమిక్స్ అనే జర్నల్ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ పెద్ద భూతంలా వేధిస్తోందని వెల్లడించింది. ఈ సిండ్రోమ్ కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. ఏమిటీ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్? టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ అనేది వైరసో, బాక్టీరియానో కాదు. తదేకంగా సెల్‌ఫోన్‌ను వాడుతున్న వారికి వచ్చే ప్రత్యేక జబ్బు. స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారిలో ఈ పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా టెక్ట్స్ మెసేజ్‌లు ఎక్కువ సేపు చూస్తూండటం వల్ల మెడ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. దీంతో మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనివల్ల విపరీతమైన తలనొప్పి, భుజాల నొప్పి రావడం, ఇది ఇలాగే కొనసాగి, తొడ నుంచి పాదం వరకూ జాలుగా నొప్పిరావడం వంటివి జరుగుతున్నాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ నుంచి బయట పడండిలా... రెండు, మూడు నిముషాలకు కంటే ఎక్కువగా మెడలు వంచి సెల్ఫోన్లో మెసేజ్‌లు చూడకూడదు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారు పదే పదే మెడను రొటేట్ అంటే కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి. ప్రతి గంటకోసారి రెండు మూడు సార్లు తలను పైకెత్తి మళ్లీ కిందికి బలవంతంగా వంచాలి. మెసేజ్‌ను చదవాలనుకున్నప్పుడు కుర్చీలో వెనక్కు వాలి ఫోన్‌ను ముఖంపైకి తెచ్చుకుని చదువుకోవాలి. పెద్ద పెద్ద మెసేజ్‌లు ఉన్నప్పుడు అంతా ఒకేసారి చదవకుండా మధ్యలో విరామం తీసుకుని మెడ వ్యాయామం చేయాలి. రోజూ యోగాసనాలు చేస్తే కండరాలు, నరాల వ్యవస్థ సానుకూలంగా మారి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. వ్యాయామమే పరిష్కారం చాలామంది టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ గురై మెడనొప్పి తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఇది కరెక్టు కాదు. దీనివల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గచ్చుగానీ, భవిష్యత్‌లో ప్రమాదం ఎక్కువ. తలకు, మెడకు సంబంధించి వ్యాయామం మంచిది. యోగా వల్ల చాలా వరకు నొప్పిని నియంత్రించుకోవచ్చు. – జె.నరేష్‌బాబు, మెడ, వెన్నుపూస వైద్య నిపుణులు తక్కువ సేపు వాడాలి మొబైల్ ఫ్లోన్లు చిన్నతనం నుంచే అలవాటు పడిన చాలామంది పిల్లలు ఇప్పటికే దృష్టిలోపంతో బాధపడుతున్నారు. గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల సున్నితమైన కంటికి సంబంధించి అవయవాలు దెబ్బతింటున్నాయి. వీలైనంత తక్కువ సేపు వాడటం మంచిది. – పల్లంరెడ్డి నివేదిత, కంటివైద్య నిపుణురాలు ఉచ్చులో ఇరుక్కుపోయారు ఓ వైపు మెడనొప్పి, నడుమునొప్పులే కాదు.. రాత్రిళ్లు ఎక్కువగా మొబైల్ వాడి గేమింగ్, బెట్టింగ్‌ల కారణంగా వ్యసనాలకు లోనయ్యారు. నిద్రలేమి కారణంగా మెంటల్ కండీషన్ ఇన్‌బ్యాలెన్స్ అవుతోంది. చాలా మందికి చదువుమీద దృష్టి పోతోంది. మానసిక బలహీనతల వల్ల డ్రగ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు -
10 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం చేసి ఆదుకోరూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు తీవ్రమైన ఇన్ఫనైట్ డెంగ్యూ, హైపర్ ఫెరిటినిమా, ట్రాన్స్మినిట్స్, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప పేరు: ఆర్ హన్విక తండ్రి పేరు: రవి కిరణ్ తల్లి: దీప్తి గూగుల్ పే నంబర్: 8019872446 బ్యాంక్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్: 403901502892 బ్యాంక్ - ఐసీఐసీఐ, సేవింగ్స్ ఖాతా ఖాతాదారుని పేరు: ముసిలమ్మోళ్ల దీప్తి సాయి ఐఎఫ్ఎస్ఈ కోడ్: ICIC0000008 -
స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు
స్మార్ట్ ఫోన్ల వాడకం పతాకస్థాయికి చేరింది. మొబైల్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అవసరానికి వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిసలవుతున్న వారు కెరీర్‌ను పాడు చేసుకుంటున్నారు. అపరిమిత వాడకం.. జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నెముక, కంటి తదితర సమస్యల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్మార్ట్ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లా చిరునామాతో సిమ్ కార్డులు తీసుకున్న 8,01,456 మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నట్లు తేలింది. ఏటా 10 నుంచి 15 శాతం వరకు మొబైల్ఫోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి కాకుండా సాధారణ (కీప్యాడ్) ఫోన్లు మరో 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. నెలకు రూ.16 కోట్లు పైనే స్మార్ట్‌ఫోన్ వినియోగదారు నెలకు సగటున రూ.200 వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారులు వివిధ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు నెలకు కనిష్టంగా రూ.16 కోట్లు, ఏడాదికి రూ.192 కోట్లకు పైగా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. మిగతా సాధారణ ఫోన్లు కూడా కలిపితే ఏడాదికి రూ.250 కోట్లకు పైగా చార్జీల రూపంలో ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నట్టు సమాచారం. సగటున 2 గంటల సమయం వృథా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారికి సగటున రోజుకు రెండు గంటల సమయం వృథా అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ఏదో ఒక యాప్ నుంచి ప్రయోజనం లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా యువకులు, పనిచేసే వారు ఇలా చేయడం వల్ల ఉత్పాదక రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలామంది విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. సెల్‌ఫోన్ కొనివ్వలేదని.. గత ఏడాది డిసెంబర్లో ఉరవకొండ పట్టణంలో రవినాయక్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతకీ కారణమేంటంటే తల్లిదండ్రులు తనకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని. తన కొడుకు సెల్‌ఫోన్‌కు బానిస అయ్యాడని తల్లి కుళ్లాయమ్మ కన్నీరుమున్నీరవుతోంది. అలవాటు చేసినందుకు.. అనంతపురం నగరానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసులు, తనూష దంపతులకు మూడేళ్ల తేజాస్ అనే కుమారుడు ఉన్నాడు. అన్నం తినడం లేదని కుమారుడికి సెల్‌ఫోన్ అలవాటు చేశారు. చివరకు ఆ సెల్‌ఫోన్‌కు బానిసైన చిన్నారి.. ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కు గురయ్యాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్న వారిలో టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ (మెడ నొప్పి) లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సేపు మెడ వంచి మొబైల్ ఫోన్ మెసేజ్‌లు చదువుతున్నారు. గంటల తరబడి మెడ వంచి చూడటం వల్ల వెన్నెముక సమస్యలు కూడా వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మితిమీరి మొబైల్‌ఫోన్‌కు అలవాటు పడిన చిన్నారులకు రెటీనా (కంటి) సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు తేల్చాయి. అనర్థాలకు మూలం సెల్‌ఫోన్ అనేక అనర్థాలకు సెల్‌ఫోన్ వినియోగమే మూలం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెల్‌ఫోన్, వాట్సాప్, ఇంటర్నెట్ వినియోగాన్ని కూడా ఒక బానిసత్వంగా పరిగణించింది. వీటి వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ప్రధానంగా నిద్ర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. నిద్ర లేకపోవడంతో కోపతాపాలకు గురికావడం, ధ్యాస లోపించడం తోపాటు కంటి చూపు పూర్తిగా మందగిస్తోంది. చిన్న వయస్సులో నిషేధిత వెబ్సైట్లలోకి ప్రవేశించి పోర్న్ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. సర్వ అనర్థాలకు కారణం సెల్‌ఫోన్ అని ప్రధానంగా చెప్పవచ్చు. –యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం అధికమవుతున్న అనారోగ్య సమస్యలు (చదవండి: ప్రశాంత్ నీల్.. మన బంగారమే) -
స్వాతికిరణం సిండ్రోమ్
మజ్రూ సుల్తాన్‌పురి అప్పుడప్పుడే కవిత్వం రాసి పేరు సంపాదిస్తున్నాడు. సుల్తాన్‌పూర్‌లో ఇది కొందరికి కడుపులో గులామ్ బులామ్ రేపింది. ఆ ఊళ్లోనే ఉండే మసియుద్దీన్ మసీ అనే కవిని రెచ్చగొడితే అతను మజ్రూ వెంటబడ్డాడు. మజ్రూ ఏం రాసినా వెక్కిరిస్తూ రాసేవాడు. మజ్రూ బాగా క్షోభ పడ్డాడు. ఇబ్బంది పడ్డాడు. కొన్నాళ్లకు భవిష్యత్తును వెతుక్కుంటూ సుల్తాన్పూర్ నుంచి బాంబే వెళ్లాడు. సినీ గేయరచయిత అయ్యాడు. సూపర్ హిట్ పాటలు రాశాడు. సర్వోన్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నాడు. ఇవాళ్టికీ మనం రోజూ మజ్రూని వింటూనే ఉన్నాం. మరి మసియుద్దీన్ మసి సంగతి? మంట వెలిగినట్టు మసి వెలుగునా? మనం కూడా తక్కువ తిన్లేదు. మహా పండితుడు చిన్నయసూరి ఎంతో శ్రమించి, మేధను కరిగించి ‘బాల వ్యాకరణం’ రాస్తే, ఫస్ట్ ఎడిషన్ వచ్చి రికార్డు స్థాయిలో అమ్ముడు పోతుంటే శిష్టు కృష్ణమూర్తి అనే కవి దానిని ‘కాపీ’ అని గగ్గోలు లేవదీశాడు. (అబ్రాహ్మణుడైన) చిన్నయ సూరికి అంత సామర్థ్యం ఎక్కడ చచ్చింది అన్నాడు. ఆ కాలంలోని ఒకరిద్దరు గట్టి పండితులు ఈ విమర్శకు వత్తాసు పలికితే చిన్నయసూరి మౌనంగా ఉండిపోయాడు. సత్యాన్ని ఎంత అణుచుదామని చూసినా అది పొట్ట మీదే నేలక్కరుచుకుంటుంది తప్పితే వీపు మీద కాదు. తెలుగు భాషాకాశంలో భాస్కరుడు చిన్నయసూరి. గగ్గోలుదారులు ఆ మార్తాండ తేజానికి నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోయారు. పి.శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల సంచలనం. ఒక పరిణీత తప్ప దానిని మరొకరు రాయలేరని చదువరులు గ్రహిస్తారు. ‘అబ్బే... ఆ నవలను గోరా శాస్త్రి రాశాడండీ’ అని ఆయన అకౌంట్లో వేయడానికి చూసే పెద్దమనుషులు ఉన్నారు. గోరా శాస్త్రి తెచ్చిన ‘తెలుగు స్వతంత్ర’లోనే ఆరుద్ర ‘త్వమేవాహం’, ఆలూరి బైరాగి ‘నూతిలో గొంతుకలు’ వచ్చాయి. అయితే వాటిని గోరా శాస్త్రి రాయలేదట. ‘తెలుగు స్వతంత్ర’లోనే వచ్చిన పి.శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ మాత్రం గోరా శాస్త్రి రాశాడట. ఇంతా చేసి గోరా శాస్త్రి శబ్ద నాటికలు తప్ప ఒక్క గొప్ప నవలను అటెంప్ట్ చేయలేదు. ఆయనకు నవల రాసే ఆసక్తి ఉంటే రాసే చేయి ఊరకే ఉండేది కాదు. కళాకారుల లోకంలో కీర్తి అనే వెలుతురుతో పాటు కల్మషం అనే నీడ కూడా ఉంటుంది. సృజన లోకంలో రాణించాలనుకున్నవారు, రాణించేవారు, వెలిగినవారు, వెలగలేక ఆరిపోయిన, స్టేక్‌హోల్డర్స్ అయిన పాఠకులతో సహా ఈ వెలుగు నీడల ప్రభావానికి ఏదో ఒక సందర్భంలో గురి కాకుండా పోలేదు. శ్రీశ్రీని తగ్గించి శ్రీరంగం నారాయణబాబును నిలబెట్టాలని ఒక వర్గం ఎంత ప్రయత్నించినా శ్రీశ్రీయే మిగిలాడు. చలంను తెలుగు సరిహద్దుల నుంచి తరిమి కొట్టగలిగారుగానీ తెలుగు హృదయాల నుంచి కాదు. చిన్నబుచ్చేకొద్దీ జాషువా పద్యం ఎదిగి పండింది. అయినా సరే మనం గత పాఠాల నుంచి ఏమీ నేర్చుకోలేదు. ‘సాగర సంగమం’లో తన కళా వికాసానికి వీలు దొరకని కమలహాసన్ తన ఫెయిల్యూర్‌కి కుంగిపోతాడు. ఎవరినీ నిందించడు. కానీ ‘స్వాతికిరణం’లో మమ్ముట్టి అలా కాదు. ఆస్తిపాస్తి, పేరు, కీర్తి అన్నీ ఉన్నా తన సమ కళాకారులనే కాదు ఎక్కువ–తక్కువ ప్రతిభ ఉన్నవారిని చూసి కూడా ఓర్వలేకపోతాడు. అతడి ఈర్ష్య ఎంత తీవ్రమైనదంటే బంగారు భవిష్యత్తు ఉన్న ఒక బాలకళాకారుడు ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఎదుటివారి ప్రాణాలు తీసేంత, పిచ్చివాళ్లను చేసేంత, జడిసి సాధన విరమింపజేసుకునేంత, వగచి ఒంటరితనంలోకి వెళ్లేంత ఈర్షా్య ద్వేషాన్ని కలిగి ఉండటం నుంచి కళాలోకం– ఆ అసూయాపరుల సంఖ్య ఎంత తక్కువైనా కానీ– ఎదగలేక పోతున్నది. సోషల్ మీడియా వచ్చాక ఈ వెర్రి శ్రుతి మించిపోతోంది. నాలుగు వ్యూస్ కోసం ‘తేనెమనసులు రామ్మోహన్ని సూపర్‌స్టార్ కృష్ణ ఎలా తొక్కేశాడో తెలుసా?’ అనే థంబ్‌నెయిల్ పెడితే ‘అవునవును... మాకు తెలుసు’ అని డయపర్ల వయసు దాటని వారు కూడా కామెంట్లు పెడుతుంటారు. ఇద్దరూ ఒకే సినిమాతో బయలుదేరినా కృష్ణ పద్మాలయ చేరడానికీ, రామ్మోహన్ మాసిన గడ్డంతో రాక్ క్యాజిల్‌లో తారసపడటానికీ కారణం ఎవరికి వారే! మనమే మన గమ్యం. మన ఫలితం. విషాదం ఏమంటే ఈ ‘స్వాతికిరణం సిండ్రోమ్’ ఇప్పుడు అన్ని సామాజిక దొంతరల్లోనూ నిండి కనపడటం! గతంలో ‘నువ్వు బాగుపడితే చూడాలని ఉంది’ అని వీధిలో వాళ్లు కూడా అనేవారు. ఇప్పుడు ‘నువ్వెలా బాగుపడతావో చూస్తాను’ అని ఆత్మీయులే అనుకుంటున్నారు. ఏదో లాటరీ తగిలి రాత్రికి రాత్రి బాగుపడితే ఈర్ష్య పడటం సరే. కానీ కష్టపడి పిల్లాడు ర్యాంకు తెచ్చుకున్నా, అమ్మాయికి మంచి సంబంధం కుదిరినా, లోన్ పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నా, అప్పోసప్పో చేసి కారు ఇంటికి తెచ్చుకున్నా, మొగుడూ పెళ్లాలు కొట్లాడుకోకుండా ఉన్నా, పిల్లలు బుద్ధిగా మాట వింటూ ఉన్నా, ఆఖరికి మన ఇంట్లో మొక్కలు బాగా పెరుగుతూ ఉన్నా కుతకుతలాడిపోయేవారు, లోలోపల కీడు కోరుకునేవారు, బంధాలను అనుబంధాలను తెంపుకుపోయేవారు, చెడు ప్రచారానికి పూనుకునేవారు, చేతలతో కాకపోయినా మాటలతో హాని చేద్దాం అనుకునేవారు ఉంటే ఇది ఏమి సంస్కారం? ఇది ఏమి సమాజం? ఈర్ష్యతో ఒకరి చెడుకు చేసే ‘అసత్య వాదన మహాపాపం’ అన్నది వేదం. ‘గీబత్’ (చాడీలు), ‘తొహమత్’ (లేనివి కల్పించడం) చేసేవారికి నిష్కృతి లేదు అంది ఇస్లాం. ‘ఈర్ష్య పడువాని ఎముకలు కుళ్లును’ అన్నది బైబిల్. ప్రేమించేంత ఐశ్వర్యం లేనప్పుడు హాని చేయలేనంత పేదరికంలో ఉందాం! లోకం అదే బతుకుతుంది. -
వైద్యశాస్త్రం విస్తుపోయేలా.. చనిపోయే కొడుకు కోసం..తండ్రే స్వయంగా మందు కనిపెట్టాడు!!
కుమ్మింగ్: తమ పిల్లలు అనారోగ్యం కారణంగా మరికొద్ది రోజుల్లో చనిపోతున్నారంటే తల్లిదండ్రులు ఎవరైన తట్టుకోగలరా. పైగా ఆ బిడ్డను రక్షించుకొనేందుకు తిరగని ఆసుపత్రి ఉండదు. అంతేకాదు ఖర్చుకు కూడా వెనకడుగు వేయరు. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవటం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని అందరకీ తెలుసు. కానీ ఇక్కడొక తండ్రి తన బిడ్డకు వచ్చిన అరుదైన వ్యాధికి మందు లేకపోవడంతో తానే స్వయంగా మందు కనిపెట్టి తన బిడ్డను కాపాడుకోవాలని తాపత్రయపడతాడు. (చదవండి: బల్గేరియాలో దారుణం..బస్సు ప్రమాదంలో 48 మంది మృతి) అసలు విషయంలోకెళ్లితే... చైనాలోని జు వీ అనే వ్యక్తికి హయోయాంగ్ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడు ‘మెంకేస్ సిండ్రోమ్’ అనే జన్యు పరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. జు వీ కొడుకు హయోయాంగ్‌ని పరీక్షించిన వైద్యులు అతడు కొద్ది నెలల మాత్రమే బతుకుతాడు అని తెలిపారు. పైగా ఈ వ్యాధి నాడివ్యవస్థను ప్రభావితం చేయడంతో కదలలేని స్థితిలో మంచానికే పరిమితమౌతాడన్నారు. నిజం చెప్పాలంటే ఈ వ్యాధితో పోరాడే బాధితులు ఎలాంటి భావోద్వేగాన్ని తెలియజేయలేరు పైగా మూడు సంవత్సరాల వయసుకు మించి జీవించడమనేది అసాధ్యం అన్నారు వైద్యులు. అయితే చైనాలో ఈ అరుదైన వ్యాధికి ఇంతవరకు ఎలాంటి మందు కనిపెట్టలేదని ఆ పిల్లాడి తండ్రి జు వీ తెలుసుకుంటాడు. మరోవైపు ఈ కరోనా మహమ్మరీ కారణంగా చికిత్స నిమిత్తం దేశాలు దాటి వెళ్లడం అసాధ్యం. దీంతో ఆ పిల్లాడి తండ్రి జువీ తానే ఈ వ్యాధికి మందు కనిపెట్టాలని నిర్ణయించుకుటాడు. అనుకున్నదే తడువుగా కుమ్మింగ్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ని ప్రయోగశాలగా మారుస్తాడు. అయితే జువీ కేవలం హైస్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. అంతేకాదు జు వీ తన కొడుకు అనారోగ్యానికి గురికాక మునుపు ఆన్లైన్ వ్యాపారం చేస్తుండేవాడు. ఎప్పుడైతే తన కొడుకు ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్నాడో అప్పటి నుంచి అతను పరిశోధనలతోనే గడుపుతుంటాడు. ఈ మేరకు జు వీ ఈ వ్యాధి నయం చేయలేనిదని కేవలం మందులతో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించగలమనే విషయాన్ని తెలుసుకుంటాడు. అంతేకాదు ఫార్మాకి సంబంధించిన విషయాలను ఆంగ్లంలో ఉండటంతో వాటిని అనువాద సాఫ్టవేర్ సాయంతో విశ్లేషించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కాపర్ హిస్టాడిన్(రాగి) సహాయం చేయగలదని కనుగొంటాడు. కాపర్ క్లోరైడ్ డైహైడ్రేట్ను హిస్టిడిన్, సోడియం హైడ్రాక్సైడ్, నీరు కలిస్తే కాపర్ హిస్టాడిన్ని తయారువుతుందని తెలుసుకుంటాడు. అంతేకాదు ఈ మందు తయారు చేయడానికి ఒక ప్రత్యేక పరికరాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే జు వీ తన కొడుకు హయోయాంగ్ తాను స్వయంగా తయారు చేసిన మందును ఇవ్వడం ప్రారంబిస్తాడు. ఈ మేరకు జు వీ తన కొడుకుకి తను స్వయంగా తయారు చేసిన మందుతో చికిత్స చేయడం ప్రారంభించిన రెండు వారాల తర్వాత చేసిన రక్తపరీక్షల్లో రక్తం సాధారణ స్థాయిలో ఉన్నట్లు రసాయన శాస్రవేత్తలు గుర్తిస్తారు. అంతేకాదు పిల్లవాడు మాట్లాడలేడు కానీ తన తండ్రి ఆ పిల్లవాడి తల మీద చేయవేయంగానే చిరు నవ్వుతో తన భావోద్వేగాన్ని తెలియజేశాడని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ మెంకేస్ సిండ్రోమ్ బాలికల కంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా ఉంటుందని పైగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి లక్ష మంది శిశువులలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు ఆ పిల్లాడి తండ్రి జు వీ మాట్లాడుతూ..."తాను తయారు చేసిన కాపర్ హిస్తాడిన్ మందుని మొదట కుందేళ్లపై ప్రయోగించాను. అవి బాగానే ఉన్నాయి కాబట్టి నా కొడుకుకి ఏం కాదు అని నిర్థారించుకున్నా. అంతేకాదు ఈ చికిత్స కోసం ఇతర తల్లిదండ్రులు నన్ను సంప్రదించారు కానీ నా కొడుకుకి మాత్రమే బాధ్యత వహించగలనని చెప్పాను. పైగా నా కొడుకుకి తాను ఏ చికిత్స చేసిన హెల్త్ అధికారులు జోక్య చేసుకోరు" అని కూడా చెబుతాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని టూర్స్ యూనివర్శిటి హాస్పిటల్‌లోని అరుదైన వ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ అన్నీక్ టౌటెన్ మాట్లాడుతూ... "ఒక వైద్యుడిగా జు కేసు గురించి విని "సిగ్గుపడుతున్నాను" . అభివృద్ధి చెందుతున్న దేశంగా అటువంటి కుటుంబాలకు మెరుగైన సహాయం చేయడానికి మన వైద్య వ్యవస్థను మెరుగుపరచగలం. అంతేకాదు ఆ పిల్లాడి తండ్రి జువీతో కలిసి మెంకేస్ సిండ్రోమ్ జన్యు చికిత్స పరిశోధనను ప్రారంభిస్తున్నాం" అని అన్నారు. (చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?) -
వైరల్ వీడియో: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి?
-
చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?
చాలామంది అన్ని సక్రమంగా ఉన్న నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అంటూ రకరకాలుగా చెబుతుంటారు. అంతెందుకు పరిస్థితులు అన్ని బాగున్నప్పటికీ ఏవేవో సాకులతో కాలక్షేపం చేసేస్తుంటారు. ఇక్కొడక వ్యక్తి పుట్టుకతో అవయవాలు ఏమి సరిగా లేవు అయినా చక్కగా మేకప్ వేసుకోగలడు. (చదవండి: వ్యాక్సిన్ వేయించుకుంది ...రూ 7.4 కోట్లు గెలుచుకుంది) అసలు విషయంలోకెళ్లితే....గేబ్ ఆడమ్స్-వీట్లీ అనే వ్యక్తి హన్ హార్ట్ సిండ్రోమ్ అనే పుట్టుకతో వచ్చే వ్యాధితో జన్మించాడు. దీంతో అతని తల్లిదండ్రులు పుట్టిన వెంటనే బ్రెజిల్ ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. ఇది అవయవాలపై ప్రభావం చూపే అరుదైన వ్యాధి. ఈ సిండ్రోమ్ కారణంగా అతనికి దవడ, నాలుక, చేతులు, కాళ్లు పూర్తిగా ఏర్పడలేదు. అంతే కాదు తొమ్మది నెలల వయసులో ఉన్న గేబ్ని ఉటాకు చెందిన ఒక కుటుంబం దతత్త తీసుకుంది. దీంతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది. అతని దత్తత తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో తాను శిశువులా ఉండిపోకూడదని అన్ని నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతను ప్రముఖ టీవీ షో 'యుఫోరియా ప్రేరణతో తన ముఖానికి తాను చక్కగా మేకప్ వేసుకుంటాడు. అంతేకాదు అతని మేకప్ కళకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే కాకా కాళ్లు, చేతులు లేకపోవడంతో తాను రోజువారీ పనులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడో కూడా వివరిస్తుంటాడు. అయితే ప్రస్తుతం గేబ్కి మేకప్ కళకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!) -
అనుకోని అరుదైన వ్యాధి ఆమె జీవితాన్నే మార్చేసింది
రాజస్తాన్: మనం కాస్త బాగొకపోతేనే డీలా పడిపోతాం. కొంచెం వంట్లో బాగోకపోతే ఇక రెస్ట్ తీసుకుంటాం. కానీ రాజస్తాన్‌కి చెందిన ఒక అమ్మాయి లక్షల్లో ఒక్కరికీ వచ్చే అరుదైన వ్యాధితో పోరాడుతూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తోంది. వివరాల్లోకెళ్లితే..... రాజస్తాన్‌కి చెందిన హర్షిత దరియాని 11 ఏళ్ల ప్రాయంలో తల్లిని కోల్పయింది. అంత చిన్నవయసులో ఆ దుఃఖాన్ని అధిగమించి అందరిలా నవ్వుతూ, ఆడుతూ...హయిగా చదువుకునేది. సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటుండగా అనుకోని అరుదైన గుయిలిన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్ ) వ్యాధి ఆమెను మళ్లీ అగాధంలోకి తీసుకువెళ్లిపోయింది. హర్షిత ఇంటర్మీడియేట్‌లో ఉండగా ఒక రోజు బ్యాడ్మింటన్ ఆడుతుంటే ఎడమ చేయి విపరీతమైన నొప్పి వచ్చి ఇక ఆడలేక హాస్టల్‌కి వచ్చేసింది. ఆ తర్వా త రోజు స్టడీ అవర్స్ కోసమై వార్డెన్ మేడం తెల్లవారుఝూమున లేపితే ఆమె అసలు బెడ్‌మీద నుంచి ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పుడే తెలిసింది అత్యంత అరుదుగా నూటికి ఒక్కరికో ఇద్దరికో వచ్చే గుయిలిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్ ) బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. అప్పటికే ఆమె ఆ వ్యాధి నరాల వ్యవస్థపై దాడి చేసి శరీరం మొతం పక్షవాతం వచ్చినట్లుగా చలనం లేకుండా చేసేసింది. ఆఖరికి ఊపిరితిత్తులు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో శ్వాస తీసుకోవడమే కష్టమైంది, ఆమె ఐసీయూలో 47 రోజులు కోమాలోనే ఉంది. అయినప్పటికీ విద్యాసంవత్సరాన్ని క్పోల్పోకుండా పరీక్షకి వీల్ చైర్లో వెళ్లి మరీ రాసి మంచి మార్కులతో ఇంటర్మీడియేట్ పాసై అయ్యింది. కానీ ఈ వ్యాధి కారణంగా తనకి ఇష్టమైన మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలన్న ఆశను వదులుకోవల్సి వచ్చింది. ప్రస్తుతం తాను బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వుతున్నానని, అమెజాన్‌తో కలిసి పనిచేయడానికీ ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ మేరకు హర్షిత మాట్లాడుతూ..."సరిగ్గా ఐద్దేళ్ల క్రితం తాను కనీసం కళ్ల రెప్పలను కూడా కదిలించ లేకపోయాను చూపుతోటే చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడూ వాటన్నింటిని అధిగమించగలిగాన. జీబీఎస్ వ్యాధి నా జీవితాన్ని మార్చేసింది. దేన్నైన తట్టుకుని బతకలగలనన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఈ కష్టం నన్ను కదలనియదు అనుకున్నాను కానీ కాలంతో పాటు అది మారిపోతుంది. కబళించేసేంతా కష్టమైన కదలకుండ ఉండదని, కాల గమనంతోపాటు మారిపోతుంది" అంటూ తన ఆత్మస్థైర్యాన్ని వ్యక్తం చేసింది. -
హవానా... అంతా భ్రమేనా?!
అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకేస్తే ఎక్కడో ఉన్న ఎవరికో తగిలి తుస్సుమన్నట్లు అంతర్జాతీయ డిటెక్టివ్ సినిమా స్థాయిలో అందరూ హడావుడి చేసిన హవానా సిండ్రోమ్ వెనుక రహస్యాయుధాలేమీ లేవని తాజా పరిశోధన తేల్చేసింది. మనిషిలో ఏర్పడే మనో, చిత్త భ్రమల కారణంగానే హవానా సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని న్యూరాలజిస్టుల తాజా అంచనా! ఇంతకీ ఏంటీ సిండ్రోమ్? ఎందుకీ హడావుడి? సైంటిస్టులేమంటున్నారు? చూద్దాం.. ప్రపంచ పెద్దన్న అమెరికానే హైరానా పెట్టిన హవానా సిండ్రోమ్ పేరు 2016–17లో తొలిసారి వినిపించింది. క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. మైగ్రేన్ తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం తదితర లక్షణాలు సిబ్బందిలో కనిపించాయి. దీని గురించి బయటపడి ఐదేళ్లైనా ఎందువల్ల వస్తుందో ఎవరూ కచి్ఛతంగా చెప్పలేకపోయారు. చివరకు జేమ్స్‌బాండ్ సినిమాలోలాగా ఏదో రహస్యాయుధం వల్లనే ఈ లక్షణాలు కలుగుతున్నాయని, అమెరికా సిబ్బందిపై ఈ ఆయుధాన్ని శత్రుదేశాలు ప్రయోగిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి. ఈ ఆయుధం క్యూబా సృష్టి అని, రష్యా రూపకల్పన అని పలురకాల ఊహాగానాలు చెలరేగాయి. కొందరు పేరున్న సైంటిస్టులు కూడా దీనికి సరైన కారణం తెలుసుకోకుండా ఆయుధ వాడకం థియరీని బలపరిచారు. అయితే అమెరికాకే చెందిన న్యూరాలజిస్టు రాబర్ట్ బలో మాత్రం భిన్నంగా ఆలోచించారు. హవానా సిండ్రోమ్ లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ లక్షణాలు తనవద్దకు వచ్చే మనోభ్రాంతి పేషెంట్లలో కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిని సైకోసొమాటిక్(మానసికోత్పన్న) లక్షణాలుగా నిర్ధారణకు వచ్చారు. మానసిక భ్రాంతి కారణంగా కలిగినప్పటికీ ఈ లక్షణాలు నిజమైన బాధను కలగజేస్తాయని ఆయన పరిశోధనలో తేలింది. దీంతో ఈ విషయమై ఆయన మరింత లోతైన అధ్యయనం జరిపారు. బృంద లక్షణాలు మాస్ సైకోజెనిక్ ఇల్నెస్(బృంద చిత్త భ్రమ వ్యాధి) అనేది ఒక సమూహంలోని కొందరు ప్రజలు సామూహికంగా అనుభవించే మనో భ్రమ అని రాబర్ట్ చెప్పారు. ఇదే హవానా సిండ్రోమ్‌కు కారణమై ఉండొచ్చన్నది ఆయన స్థిర అభిప్రాయం. ఒక సమూహంలోని కొందరు తామేదో భయానకమైనదాన్ని ఎదుర్కొన్నామని భావించినప్పుడు ఈ భ్రమ మొదలవుతుందని వివరించారు. ఉదాహరణకు 20వ శతాబ్దంలో టెలిఫోన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. తొలినాళ్లలో పలువురు టెలిఫోన్ ఆపరేటర్లు ఒక షాక్ లాంటి స్థితిని చాలా రోజులు అనుభవించేవారని ఆయన గుర్తు చేశారు. దీనికి కారణం ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇది కేవలం మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అని రాబర్ట్ బల్లగుద్ది చెబుతున్నారు. హవానా సిండ్రోమ్ కూడా అలాంటిదేనన్నది ఆయన భావన. ఒత్తిడిలో పనిచేసేవారిలో ఈ ఇల్నెస్ ఆరంభమవుతుంది. ఒకరిలో ఈ భ్రమ ఆరంభం కాగానే, వారు దీని గురించి ఇతరులకు వివరిస్తారు. అలా విన్నవారిలో కొందరు అలాంటి భ్రమకు లోబడతారు. ఇలా ఈ లక్షణాలు వ్యాపిస్తూ ఉంటాయి. మెదడులో రసాయన మార్పుల కారణంగా ఈ లక్షణాలు ఆరంభమై సదరు వ్యక్తిని పలు ఇబ్బందులు పెడుతుంటాయి. ఇవి కొన్ని సంవత్సరాలు కనిపించే అవకాశం ఉందని రాబర్ట్ చెప్పారు. జాతీయ సైన్స్ అకాడమీ ఈ సిద్ధాంతాన్ని కూడా అంగీకరించింది. కానీ తగిన గణాంకాలు లేనందున నిర్ధారించడంలేదు. క్యూబా ప్రభుత్వం కూడా దీనిపై లోతైన పరిశోధన జరిపి గతనెల 13న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ సిండ్రోమ్ వెనుక ఎలాంటి ఆయుధాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. క్యూబాలో ఎప్పుడో పనిచేసిన ఒక అండర్ కవర్ ఏజెంట్, తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి వల్ల ఈ సిండ్రోమ్ బారిన పడి ఉంటారని, తననుంచి ఇది ఒక అంటువ్యాధిలా వ్యాపించిందనేది హవానా సిండ్రోమ్‌పై తాజా అంచనా. ఇంతకు మించిన కారణాలేమైనా ఉంటే, వాటిని సీఐఏ బయటపెడితే తప్ప హవానా సిండ్రోమ్‌పై హైరానా అనవసరమన్నది సైంటిస్టుల అభిప్రాయం. (చదవండి: అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్) సిద్ధాంత రాద్ధాంతాలు హవానా సిండ్రోమ్ వల్ల కలిగే ఇబ్బందులు ఒక్కరికే పరిమితం కాకుండా పలుమందిలో ఒకేలా కనిపించడం రాబర్ట్‌ను ఆకర్షించింది. దీంతో ఆయన మాస్ హిస్టీరియా, సైకోసొమాటిక్ డిసీజెస్ తదితర అనేక అంశాలను పరిశీలించి అధ్యయనం చేశారు. సోనార్ ఆయుధం వాడకం చెవి అంతర్భాగంలో ఏర్పడుతున్న హాని వల్ల ఈ లక్షణాలు కలుగుతున్నట్లు 2018లో మియామీకి చెందిన కొందరు జరిపిన అధ్యయనం అభిప్రాయపడింది. ఈ ఫలితాలను కూడా ఆయన మదింపు చేశారు. అయితే ఈ అధ్యయనాలన్నింటిలో లోపాల కారణంగానే తప్పుడు సిద్ధాంతాలు రూపొందాయని ఆయన చెబుతున్నారు. (చదవండి: Bihar: నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు) సోనార్ ఆయుధం వాడి ఉంటే కేవలం లోపలి చెవి భాగాలు మాత్రమే కాకుండా మెదడులోని భాగాలు కూడా దెబ్బతిని ఉండేవని వివరించారు. మైక్రోవేవ్ రేడియేషన్ ఆయుధం వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయని 2020లో కొందరు సరికొత్త సిద్ధాంతం లేవనెత్తారు. దీన్ని జాతీయ సైన్సు అకాడమీ పరోక్షంగా సమరి్ధంచడంతో ఈ సిద్ధాంతానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. అయితే మేక్రోవేవ్ ఆయుధం వల్ల వినిపించే శబ్దాలు నిజమైనవి కావని, మెదడులో ఉండే న్యూరాన్లు అనుభవించే మిధ్యా శబ్దాలని రాబర్ట్ చెప్పారు. హవానా సిండ్రోమ్ లక్షణాలు ఇలాంటి మిధ్యా శబ్దాలు కావని ఆయన గుర్తించారు. ఈ విధంగా అనేక పరిశీలన అనంతరం చిత్త భ్రమ వల్లనే ఈ సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని రాబర్ట్ నిర్ధారణకు వచ్చారు. – నేషనల్ డేస్క్, సాక్షి. -
వైద్య రంగానికే సవాల్‌గా హవానా.. భారత్‌లో వెలుగులోకి
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా దౌత్యప్రతినిధులు, గూఢచారులకు సోకుతూ వైద్య రంగానికే సవాల్ విసిరిన హవానా సిండ్రోమ్ మొట్టమొదటిసారిగా భారత్‌లో వెలుగు చూసింది. ఈ నెల మొదటి వారంలో భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన అధికారి హవానా సిండ్రోమ్ లక్షణాలతో బాధపడినట్టుగా ఆలస్యంగా బయటపడింది. తిరిగి వెళ్లిన వెంటనే ఆయనకు వైద్యం అందించినట్టు సీఎన్ఎన్ వెల్లడించింది. గత నెలలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వియత్నాం పర్యటనకు వెళ్లడానికి ముందు ఆ దేశంలోని అమెరికా రాయబారులు ఇద్దరికి ఈ సిండ్రోమ్ సోకడంతో వెంటనే స్వదేశానికి తీసుకు వచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 మంది అమెరికా అధికారులు, వారి కుటుంబీకులు ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 2017లో క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిలో తొలిసారిగా ఈ వ్యాధి లక్షణాలు మైగ్రేన్ తరహాలో తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం కనిపించాయి. ఎందుకు సోకుతోందో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. రష్యా దాడి చేస్తోందా ? రష్యా నిఘా వర్గాలు అల్ట్రాసోనిక్ వెపన్స్ వాడడం ద్వారా అమెరికా ఇంటెలిజెన్స్ ప్రతినిధులపై దాడి చేస్తున్నాయని, అందువల్లే నరాల బలహీనత, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయనే అనుమానాలున్నాయి. అమెరికా ఏమంటోంది ? ఇటీవల కాలంలో అమెరికా దౌత్య ప్రతినిధుల్లో ఈ తరహా లక్షణాలు బయటకు రావడం సర్వసాధారణంగా మారిందని సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్ బృందంలోని ఒక మహిళా ప్రతినిధి వెల్లడించారు. ఎక్కువ మందిలో వైద్యం అందిన వెంటనే ఈ లక్షణాలు సర్దుకుంటున్నాయని కొందరిలో మాత్రం శాశ్వతంగా మెదడు దెబ్బతింటోందని తెలిపారు. ఈ సిండ్రోమ్ ఎందుకు సోకుతోందో నిగ్గు తేల్చడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆమె వివరించారు. అమెరికాలో పలువురు న్యూరాలజిస్టులు ఇది మానసిక ఒత్తిడికి సంబంధించిన వ్యాధిగా చెబుతున్నారు. -
పిల్లల్లోనూ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్
సాక్షి, హైదరాబాద్: అదృష్టవశాత్తు పిల్లల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నా కొద్దిమందిలో మాత్రం కోలుకున్న తర్వాత ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొందరు పెద్దల్లో మల్టీ సిస్టం ఇన్ఫ్లమే టరీ సిండ్రోమ్ వల్ల అవయవాల పనితీరు దెబ్బతింటోంది. కిడ్నీలు, కాలేయం, ఊపిరితి త్తులు, గుండె తదితర ముఖ్యమైన భాగాల న్నింటిపైనా ఇది ప్రభావం చూపుతోంది. రక్తంలో క్లాట్లు (గడ్డలు) ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న పిల్లలపైనా మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ దాడి చేస్తోందని పిల్లల వైద్య నిపుణులు గుర్తించారు. కోలు కున్న 3 వారాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోం దని అంటున్నారు. కవాసాకి అనే వ్యాధి కూడా పిల్లల్లో కనిపిస్తోందంటున్నారు. సిండ్రోమ్, కవాసాకి లక్షణాలు దగ్గరగా ఉంటాయి. అయి తే సిండ్రోమ్‌లో అన్ని అవయవాలపైనా వైరస్ తీవ్రత ప్రభావం చూపుతుంది. కవాసాకిలో మాత్రం గుండెపైనే ప్రభావం చూపుతుంది. గాంధీ, నీలోఫర్ ఆస్పత్రుల్లో 42 మందికి రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో పదేళ్ల లోపు పిల్లలు 4.18 శాతం మంది ఉండగా, 11 నుంచి 20 ఏళ్లలోపు వారు 8.95 శాతం మంది ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లో 42 మంది మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అందులో గాంధీ ఆస్పత్రిలో 38, నీలోఫర్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. వారిలో నలుగురు చనిపోయారని వైద్యులు చెప్పారు. మిగిలిన పిల్లలకు వైద్యం చేస్తున్నారు. సిండ్రోమ్, కవాసాకిలతో పెద్దగా ప్రమాదం లేకున్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. చాలావరకు యాస్పిరిన్, స్టెరాయిడ్స్‌తో ఇది తగ్గిపో తుందని రెండ్రోజుల కిందట లాన్సెట్ అనే ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ స్పష్టం చేసింది. పిల్లల్లో సిండ్రోమ్ లక్షణాలు ♦జ్వరం ♦వాంతులు ♦డయేరియా ♦కడుపులో నొప్పి ♦శరీరంపై దద్దుర్లు ♦కళ్లు ఎర్రగా మారిపోవడం ♦పెదాలు, నాలుక మరింత ఎర్రగా మారడం లేదా వాపు ♦నీరసంగా ఉండటం ♦పాదాలు, చేతులు ఎర్రగా మారడం లేదా వాపు ♦కొందరిలో ఛాతీ నొప్పి, తీవ్ర నిస్సత్తువ ♦శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ♦తీవ్రత పెరిగితే పెదాలు, ♦ముఖం నీలం రంగులోకి మారడం, తీవ్రమైన కడుపునొప్పి లక్షణాలను గుర్తించాలి కరోనా తగ్గాక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సిండ్రోమ్ వల్ల పిల్లలకు పెద్దగా ప్రమాదం లేకపోయినా లక్షణా లుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నీలోఫర్‌లో ఇటువంటి కేసులకు మేము వైద్యం చేశాం. వారిలో కొందరిని గాంధీ ఆస్పత్రికి కూడా రిఫర్ చేశాం. – డాక్టర్ నరహరి, అసోసియేట్ ప్రొఫెసర్, నీలోఫర్ ఆస్పత్రి, హైదరాబాద్ -
ఫెయిర్‌గా లేమని బాధపడే వ్యాధి..
తాము పక్కవారంత తెల్లగా (ఫెయిర్‌గా) లేమంటూ ఎంతగానో ఈర్ష్య పడటాన్నీ, ఎంతెంతో బాధపడటాన్నీ ‘స్నో వైట్ సిండ్రోమ్’గా చెబుతున్నారు వైద్యనిపుణులు. నిజానికి ఈ పదం ‘స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్’ అనే మరో వ్యాధి నుంచి వచ్చిందట. పాశ్చాత్య క్లాసిక్ క్యారెక్టర్లలో ఒకరు సిండరెల్లా అనే అమ్మాయి. సిండరెల్లా అనే ఆ అందమైన అమ్మాయి నిత్యం నిద్రపోతూ ఉంటుంది. ఎవరో అందమైన ఓ రాకుమారుడు ఆమె పెదవుల మీద ముద్దు పెట్టినప్పుడు ఆమె నిద్రనుంచి లేస్తుందట. ఆ కథ చదివి తమను కూడా ఎవరైనా రాకుమారుడి లాంటి హీరో వచ్చి తమకు రారాణి హోదా కల్పిస్తారేమో అనే భావనలో కొందరు అమ్మాయిలు కూరుకుపోయి ఉంటారు. ఇది కొందరు యువతుల బలహీన మనస్తత్వం. దీన్నే ‘స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్’ అంటారు. ఈ సిండ్రోమ్కూ ‘స్నో వైట్ సిండ్రోమ్’కూ ఎలాంటి సంబంధం లేకపోయినా... అచ్చం ఆ వ్యాధి పేరు పుట్టినట్టుగానే ‘స్నో వైట్ సిండ్రోమ్’ పేరు కూడా పుట్టిందంట. -
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇన్ని రోగాలు!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు. పైగా పని అయిపోయేంతవరకు నోట్లో ఏదో ఒకటి వేసుకుని నములుతూనే ఉంటారు. ఇది ఎంత అపాయకరమో ఎవరైనా ఆలోచించారా? ఎప్పుడూ తినేంతగానే తింటున్నాం.. అంతకుమించి ఒక్క ముద్ద ఎక్కువగా తినట్లేదు అంటూ మీరు సమాధానమిచ్చినా ప్రమాదం పొంచే ఉంది. ఆ ప్రమాదాన్ని నిలువరించాలంటే మీరు కంప్యూటర్ మీద ఎంతసేపు పని చేసినా శారీరక వ్యాయామం తప్పనిసరి. ఆఫీసులో ఉంటే కనీసం 5-10 నిమిషాలైనా అటూ ఇటూ నడుస్తూ సహోద్యోగులతో మాట్లాడుతారు. కానీ ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి అంగుళం కూడా కదలట్లేదు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అదిగో.. పై ఫొటోలో ఉన్నట్లుగా మారిపోతారంటోది డైరెక్టీ అప్లై సంస్థ. ఫొటోలో కనిపిస్తున్న మోడల్‌కు 'సుశాన్' అని నామకరణం చేసింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే 25 సంవత్సరాల వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత ఇలా మారిపోతారు అని హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా కింది వ్యాధులు రావడం తథ్యమని చెప్తోంది. (లాప్టాప్ ముందు భర్త.. డాన్స్ చేస్తున్న భార్య) ► కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ► వెన్నెముక వంగిపోవడం ► రిపిటేటివ్ టైపింగ్ స్ట్రైన్ ► జుట్టు రాలిపోవడం ► కంటి కింద మచ్చలు (డార్క్ సర్కిల్స్) ► టెక్ నెక్ (మెడపై అధికభారం, వెన్ను నొప్పి) ► ఇంక్రీజ్డ్ వ్రింకిల్స్ (చర్మంపై ముడతలు) ► ఊబకాయం ► చర్మం పొడిబారి, నిర్జీవంగా మారడం ( విటమిన్ డీ, డీ-12 లేకపోవడం వల్ల) ► తీవ్ర ఒత్తిడి నివారణ కోసం: వీటిని నివారించేందుకు చిన్నపాటి వర్కవుట్లు, నడక, పరుగు, శారీరక శ్రమను కలిగించే పనులు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. అంతేకాకుండా పడకపై పని చేసుకునే దురలవాటుకు ముగింపు పలకాలి. ఎందుకంటే ఇది మీలో గజిబిజిని పెంచి క్రమంగా ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. 6-8 గంటలు మాత్రమే పనికి కేటాయించండి. రోజులో కనీసం ఒక్క గంట అయినా ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు గుడ్‌బై చెప్పండి. ఆ సమయాన్ని కుటుంబంతో కలిసి మాట్లాడేందుకు కేటాయించండి. ఇది మీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. వీటితోపాటు ఎక్సర్సైజులు తప్పనిసరి. ముఖ్యంగా ఉదయం పూట చేసే వ్యాయామం మీ శరీరానికే కాకుండా మానసికంగా కూడా ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. రక్తప్రసరణను మెరుగుపర్చడంతోపాటు, మెదడును ఉత్తేజం చేస్తుంది. ముఖ్యంగా 7-8 గంటలపాటు హాయిగా నిద్రించండి. (వర్క్ ఫ్రం హోంకే జై!) -
ఆయనకు ఒంట్లో ఆల్కహాల్!
న్యూయార్క్: బయటకెళ్లి ఆల్కహాల్ కొనకుండా ఇంట్లోనే ఆల్కహాల్ దొరికితే ఎంత బావుండునో అని మద్యపాన ప్రియులు కోరుకుంటారు. అలాంటిది ఏకంగా ఒంట్లోనే ఆల్కహాల్ ఉత్పత్తి అయితే ఇంకెంత బాగుండు అనుకుంటారు కదా! అతడెంత అదృష్టవంతుడోనని ఆశ్చర్యపోతారు. దీన్ని అనుభవిస్తున్న ఓ వ్యక్తి మాత్రం దీన్ని దురదృష్టకరమని భావిస్తున్నాడు. న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆపి ఆల్కహాల్ స్థాయిని పరీక్షించారు. ఉండాల్సిన స్థాయి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు. అయితే ఇలాంటి ఓ కేసు గురించి విన్న అతని బంధువు అతడికి సహాయం చేసింది. ఆహారంలో ఉన్న పిండిపదార్థాలను గ్లూకోజ్‌గా కాకుండా, ఆల్కహాల్‌గా మార్చే ఓ ప్రత్యేక సూక్ష్మజీవి కడుపులో ఉండటంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఓ డాక్టర్ పర్యవేక్షణలో అతడిని ఉంచారు. అధిక పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని అతడు తీసుకున్నపుడు రక్తంలో ఆల్కహాల్ స్థాయి పెరగడాన్ని గుర్తించారు. పిండిపదార్థాలు అధికంగా లేని ఆహారాన్ని స్వీకరించినపుడే ఆల్కహాల్ స్థాయి లేదు. దీంతో అతన్ని కోర్టు మన్నించింది. ఈ అంతుచిక్కని వ్యాధి పరిశీలన దశలోనే ఉందని పరిశోధకులు బార్బరా కార్డెల్ అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఆల్కహాల్ సేవించినట్లు కనిపిస్తారు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
దానివల్ల బిడ్డకు ప్రమాదమా?
నా వయసు 40, నేను ఈ మధ్యకాలంలో చాలా బరువు తగ్గిపోయాను. కారణమేమిటో అర్థం కావట్లేదు. సిస్ట్ క్యాన్సర్ లక్షణాల్లో బరువు తగ్గిపోవడం ఉంటుందని ఓ పుస్తకంలో చదివాను. అసలు ఎలాంటి లక్షణాల ద్వారా సిస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలుసుకోవచ్చు? సిస్ట్ క్యాన్సర్ ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ చర్యలను వివరంగా తెలియజేయగలరు. – జి.బిందు, హైదరాబాద్ సిస్ట్ క్యాన్సర్ అన్నారు కానీ అది ఎక్కడ అనేది వివరంగా రాయలేదు. సిస్ట్ క్యాన్సర్ అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. శరీరంలో ఎక్కడైనా కూడా సిస్ట్లు తయారు అవుతాయి. మరీ గట్టి పదార్థాలు కాకుండా ఏదైనా ద్రవంతో నిండిన తిత్తులను సిస్ట్లు అంటారు. ఇవి చర్మంపైన రావచ్చు. అన్ని అవయవాలలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఇది ఎందుకు..? ఎలా ఏర్పడతాయి..? అనే విషయాలు కచ్చితంగా చెప్పలేము. చాలావరకు సిస్ట్లు అపాయం కానివే ఉంటాయి. కొన్ని మట్టుకే క్యాన్సర్‌గా మారే అవకాశాలుంటాయి. సెబేసియస్ సిస్ట్, ఒవేరియన్ సిస్ట్, ఎండోమెట్రియల్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ వంటివి ఎన్నో మన శరీరంలో ఏర్పడుతుంటాయి. ఇవన్నీ క్యాన్సర్లు అవ్వాలని ఏమి లేదు. క్యాన్సర్ సిస్ట్ లక్షణాలు ప్రాధమిక స్టేజీలో పెద్దగా కనిపించవు. అవి మెల్లగా పెరుగుతూ ఉండి మిగితా అవయవాలకు పాకేటప్పుడు ఇవి ఏ అవయవంలో వచ్చాయనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. కడుపులో నొప్పి, కడుపు బరువుగా ఉండటం, ఆకలిలేకపోవడం, నీరసం, బరువు తగ్గటం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు క్యాన్సర్ పాకే కొద్ది.. ఏర్పడతాయి. ఇవి అనేక వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి చాలావరకు వీటిని అశ్రద్ధ చెయ్యడం, లేదా నిర్ధారణ ఆలస్యం కావచ్చు. సిస్ట్ క్యాన్సర్లు అన్నింటికి నివారణ మార్గాలు చెప్పలేము. చెడు అలవాట్లు లేకుండా.. పౌష్టిక ఆహారం తీసుకుంటూ.. వ్యాయామాలు చేసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించినప్పుడు కొంతవరకు కొన్ని రకాల క్యాన్సర్లకు నివారణ మార్గం అవుతుంది. నా వయసు 27 సంవత్సరాలు. నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. నాకు కామెర్లు వచ్చాయి. దీనివల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం ఉంటుందా? ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వివరంగా తెలియజేయగలరు. – జి.సృజన, కరీంనగర్ గర్భంలో ఉన్నప్పుడు అనేక రకాల కారణాల వల్ల.. లివర్ పనితీరులో మార్పుల వల్ల.. బైలురూబిన్ పదార్థం రక్తంలో ఎక్కువగా చేరుకుని జాండిస్ అంటే పచ్చకామెర్లు ఏర్పడతాయి. వీటిలో ముఖ్యంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల, రక్తంలో మార్పులవల్ల, హీమోలైటిక్ జాండిస్, జ్వరాలు, గాల్‌బ్లాడర్ స్టోన్స్, బీపీ పెరగడం వల్ల, కొన్ని మందుల వల్ల, హార్మొన్లలో మార్పుల వల్ల జాండిస్ రావచ్చు. మాములు వారిలో కంటే గర్భిణిలలో జాండిస్ వస్తే అది చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. ప్రెగ్నెన్సీలో జాండీస్ వల్ల తల్లిలో లివర్ పనితీరు సరిగా ఉండదు. అంతే కాకుండా ఇతర అవయవాల పనితీరు దెబ్బతింటాయి. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ సరిగా పనిచేయవు. దానివల్ల గర్భిణీలలో అధిక బ్లీడింగ్, బిడ్డ కడుపులో చనిపోవడం, కిడ్నీలపై ప్రభావం, అవి దెబ్బతినటం, తల్లి కోమాలోకి వెళ్లిపోవటం, ప్రాణాపాయం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు. నీకు కామెర్లు ఏ కారణం చేత వచ్చాయి అని తెలుసుకోవటానికి డాక్టర్ పర్యవేక్షణలో అనేక రక్తపరీక్షలు చెయ్యించుకుని నిర్ధారణ చెయ్యించుకోవాలి. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవాలు, నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు, ప్రొటీన్ కలిగిన పోషకపదార్ధాలు తీసుకోవటం అన్నివిధాలా మంచిది. డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్లటం, రక్తపరీక్షలు క్రమం తప్పకుండా చెయ్యించుకుంటూ ఉండటం ముఖ్యం. జాండిస్ తీవ్రతను బట్టి చికిత్స తీసుకుంటూ కాన్పును అన్ని వసతులు ఉన్న హాస్పిటల్లో చేయించుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే పెను ప్రమాదం తప్పదు. నా వయసు 25, నాకు ఈ మధ్యకాలంలో అవాంఛిత రోమాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ విషయం నా ఫ్రెండ్‌కి చెబితే.. ‘నువ్వు ఈ మధ్యకాలంలో లావు కూడా అయ్యావు కదా! నీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చి ఉంటుంది’ అని చెప్పింది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి వివరంగా తెలియజేయగలరు. దీనివల్ల పురుషలక్షణాలు వస్తాయట నిజమే? వివాహం చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయా?– కె.ఎన్, పిడుగురాళ్ల గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో అండాలు పెరిగే చిన్న ఫాలికల్స్ ఉంటాయి. కొందరిలో ఈ ఫాలికల్స్ ఉండవలసిన సంఖ్య కంటే ఎక్కువగా చిన్న చిన్న నీటి బుడగలు లాగా ఉంటాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇది హార్మొన్ల అసమతుల్యత వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడతాయి. ఇవి ఉన్నవారిలో టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్ ఆడవారిలో ఉండవలసినదానికంటే ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల అవాంఛిత రోమాలు, (పై పెదవిపైన, చెంపలపైన, గడ్డాలపైన, ఇతర శరీరభాగాలపైన) మొటిమలు, మెడచుట్టూ చర్మం నల్లగా మందంగా తయారుకావడం తలపైన జుట్టు రాలడం, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడవచ్చు. దీనినే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటారు. వివాహం తర్వాత హార్మొన్ల సమతుల్యత సరిగా లేకపోవడంత వల్ల, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం తయారు కాకపోవడం, దాని వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. గర్భందాల్చిన తర్వాత, అబార్షన్లు, షుగర్ రావటం వంటి సమస్యలు రావచ్చు. అశ్రద్ధ చేస్తే, తర్వాత కాలంలో షుగర్, బీపీ వంటి సమస్యలు చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్నవారు వాకింగ్‌తో పాటు వ్యాయామాలు చెయ్యడం, బరువు పెరగకుండా చూసుకోవడం, ఆహారంలో నియమాలను పాటించడం వంటి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల పాలిసిస్టిక్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఇంకా ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో లక్షణాల తీవ్రతను బట్టి మందులు వాడుకోవడం అన్నివిధాలా మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్\ -
పెట్టా.. ఇదెట్టా..
పెట్ట పని ఏంటి.. గుడ్లు పెట్టడం.. ఒలివియా కూడా అదే పని చేసింది..కొన్ని నెలల క్రితం వరకూ.. మరిప్పుడో.. గుడ్లు పెట్టడం మానేసి.. పుంజులతో గొడవలకు పోతోంది.. తెల్లారకముందే.. కొక్కొరోకో అంటూ చుట్టపక్కలోళ్ల నిద్ర చెడగొడుతోంది.. ఎందుకలా.. ఎందుకంటే.. ఆ పెట్ట కాస్తా ఇప్పుడు పుంజుగా మారింది! ఇదెట్టా?? ఆస్ట్రేలియాలోని కామ్డెన్లో ఉండే ఒలివియా అకస్మాత్తుగా గుడ్లు పెట్టడం మానేయడం.. నెమ్మదిగా పుంజులాగతురాయి పెరగడం చూసి.. దాని యజమానులు డంగైపోయారు.. సంబంధిత వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే.. ఇదో అరుదైన సిండ్రోమ్ అని.. ప్రతి పది వేల పెట్టల్లో ఒకదానికి ఇలా జరుగుతుందని చెప్పారు. దీని అండాశయంలోని కుడివైపు భాగం సరిగా అభివృద్ధి చెందలేదని.. దీనికితోడు టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రభావమూ ఉందని తెలిపారు. మళ్లీ పెట్టగా మార్చాలంటే.. హార్మోన్ల చికిత్స ఒక్కటే మార్గమని తేల్చారు. ప్రస్తుతం ఆ చికిత్స కొనసాగుతోంది.. కొంచెం కొంచెంగా పుంజు కాస్తా పెట్టగా మారుతోందట.. దాని యజమానులు మాత్రం ఇది పూర్తిగా పెట్టగా ఎప్పుడు మారుతుందో.. మళ్లీ గుడ్లెప్పుడు పెడుతుందో అని గుడ్లేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. -
ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్!
నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికత్స ఉందా? - దామోదర్‌రావు, నల్లగొండ మీరు చెబుతున్న లక్షణాలతో మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు చాలావరకు అంతరాయం కలిగిస్తుంది. కారణాలు: మానసిక ఒత్తిడి, ఆందోళన సరైన సమయంలో భోజనం చేయకపోవడం మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం చికాకు, కోపం. లక్షణాలు: మలబద్దకం / విరేచనాలు తరచూ కడుపునొప్పి రావడం కడుపు ఉబ్బరం విరేచనంలో జిగురు పడటం భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం. హోమియో చికిత్స: మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ నడవడం కష్టమౌతోంది... ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. నాకు కుడిపైపు తుంటి భాగంలో నొప్పి వస్తోంది. గత ఆర్నెల్లుగా ఈ నొప్పి ఉంటోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. మా దగ్గర ఎముకల నిపుణుడిని సంప్రదిస్తే ఇది తుంటి ఎముక చివరలో ఉండే బంతి లాంటి భాగం దెబ్బతిన్నదనీ, అది ఒక రకం ఆర్థరైటిస్ అనీ చెప్పారు. నాకు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరమని అన్నారు. అయితే నా మిత్రులు మాత్రం దానికి సర్జరీ అవసరం లేదనీ అంటున్నారు. కానీ నేను చాలా మెల్లిగా మాత్రమే నడవగలుగుతున్నాను. వేగంగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను చాలా ఆందోళన పరుస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - కృష్ణమూర్తి, చీరాల మీ ఫ్రెండ్స్ చెప్పినట్లే చాలామందిలో తుంటి ఎముక మార్పిడి (టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ) అనే శస్త్రచికిత్స మీద చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. ఒకవేళ మీ ఆర్థోపెడిక్ సర్జన్ అదే సమస్య అని నిర్ధారణగా చెబితే, మరో నిపుణుడి నుంచి రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) తీసుకోవడంలో తప్పులేదు. అయితే తుంటి ఎముక మార్పిడి మీద ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలు సరికాదు. అది గత 30 ఏళ్లుగా సురక్షితంగా చేస్తున్న ప్రక్రియ. నిపుణులైన డాక్టర్లు దాన్ని చేయడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ రావు. పైగా అది చేశాక ఆటలాడవద్దు అని ముందుజాగ్రత్తగా డాక్టర్లు చెప్పినా, పాశ్చాత్య దేశాల్లో చాలామంది సోర్ట్స్ వంటివి ఆడుతూనే ఉంటారు. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీతో దుష్ర్పభావాలు (కాంప్లికేషన్లు) కనిపించే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే. కాబట్టి మీరు సర్జరీ గురించి అపోహలు పెట్టుకోవద్దు. కాకపోతే నిపుణులను సంప్రదించి, రెండో అభిప్రాయం మాత్రం తీసుకోండి. నా వయసు 27 ఏళ్లు. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? సలహా ఇవ్వండి. - చిన్నా, విజయవాడ మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొనిపనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ మీటింగ్స్‌లో కూడా నిద్రపోతున్నాను..! స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడు సైతం నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - వినయకుమార్, విశాఖపట్నం మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీడిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. -
'మోదీ కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నారు'
న్యూఢిల్లీ: 'రెండు పవర్ సెంటర్ల మధ్య ఇమడలేక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనీబాబాలా వ్యవహరించేవారు. ఇప్పుడు మోదీదీ అదే పరిస్థితి. ఇటు నాగ్ పూర్ ఆదేశాలు పాటించాలో లేక ఢిల్లీలోని అధికార యంత్రాంగం మాట వినాలో తెలియక మోదీ సతమతమవుతున్నారు. అందుకే మౌనాన్ని ఆశ్రయించి మిన్నకుండిపోయారు' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుల్తాన్ అహ్మద్ పార్లమెంట్ లో ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపేక్రమంలో ఆ పార్టీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ శుక్రవారం లోక్ సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మౌనీబాబా సిండ్రోమ్(వ్యాధి)తో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. 56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పే ప్రధాని.. జాట్ ఉద్యమం సందర్భంగా దేశ రాజధానికి 35 కిలోమీటర్ల దూరంలో అల్లర్లు చెలరేగి, రూ.34 వేల కోట్ల ప్రజాధనం బూడిద అయిపోయినా అడ్డుకోలేకపోయారని, గతంలో పటేళ్లు కూడా ఇదే మారిది విధ్వంసానికి దిగినా ప్రధాని ఒక్క మాటైనా మాట్లాడలేదని, అందుకే హోం మంత్రి రంగంలోకి దిగి కోటా ప్రకటన చేశారని అహ్మద్ అన్నారు. ప్రధాని మాట్లాడే ఒకే ఒక్క కార్యక్రమం 'మన్ కీ బాత్'ను కూడా ప్రజలు పట్టించుకోవడం మానేశారని ఎద్దేవాచేశారు. -
ఆటో ఇమ్యూన్ డిసీజెస్... కంచే మేనుమేసినట్టు...
మన శరీరం అనేక వ్యవస్థల సమ్మేళనంతో ఏర్పడ్డ అత్యద్భుతమైన నిర్మాణం. ఈ అద్భుత నిర్మాణాన్ని కాపాడుకోవడానికి మనలో అంతర్గతంగా ఒక రక్షణ వ్యవస్థ కూడా ఉంది. దీన్నే ‘వ్యాధి నిరోధకత’ (ఇమ్యూనిటీ) అని మనం వ్యవహరిస్తుంటాం. శత్రుదుర్భేద్యమైన ఈ వ్యవస్థ కార్యకలాపాలు మన శరీరంలో జరిగేందుకు ఎన్నో రక్షణ కణాలు ఉంటాయి. బయటి నుంచి వచ్చే అనేక హానికారక క్రిములు, సూక్ష్మజీవులు, ఏకకణజీవులను తరమి వేసేందుకు ఈ కణాలన్నీ చాలా చురుగ్గా, కర్కశంగా పనిచేస్తుంటాయి. బయటి నుంచి ఏదైనా హానికారక క్రిమిగానీ, లేదా జీవిగానీ ప్రవేశించగానే ఈ రక్షణ కణాలన్నీ దాన్ని చుట్టుముడతాయి. దాని పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. అలా ఆ హానికారక శత్రుకణాలను నాశనం చేసేవరకు వాటి ముట్టడింపు కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఒక్కోసారి అది మన శరీరంలోని మన సొంత కణాలనే శత్రుకణాలుగా పరిగణించే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు మన స్వీయ రక్షణ వ్యవస్థే మన సొంత కణాల వినాశానికి పూనుకుంటుంది. ఇలా జరగడం వల్ల వచ్చే రుగ్మతలను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. స్వయం రక్షణ వ్యవస్థ తిరగబడటం వల్ల ప్రత్యేకంగా మన ‘నాడీ వ్యవస్థ’కు చేకూరే హానికరమైన అంశాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే... మన శరీరంలోని అన్ని భాగాలతో పాటు ముఖ్యంగా మన రక్తంలో రక్షణ కణాలు ఉంటాయి. వీటిలో ‘టీ-లింఫోసైట్స్’ అనేవి ముఖ్యమైనవి. ఇలాంటి మరికొన్ని రక్షణ కణాలుంటాయి. ఈ కణసముదాయం అంతా శరీరాన్ని రక్షించే పనిలో ‘పోలీస్’ బాధ్యతలను నిర్వహిస్తుంటుంది. శరీరానికి హాని చేసే ఏదైనా కణం లోపలికి ప్రవేశించగానే దానికి వ్యతిరేకంగా పనిచేసే కణాలు పుడతాయి. ఇలా వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే వీటిని ‘యాంటీబాడీస్’గా వ్యవహరిస్తుంటారు. మనకు హాని చేయడానికి బయట నుంచి వచ్చే క్రిములనూ, సూక్ష్మజీవులను సాధారణంగా మనం ‘ఫారిన్‌బాడీ’ అని అంటుంటాం. ఏ హానికారకం (ఫారిన్‌బాడీ) మనలోకి ప్రవేశిస్తుందో.. సరిగ్గా దానికి వ్యతిరేకమైన ‘యాంటీబాడీస్’ మనలో పుడుతుంటాయి. అవి మనకు హానిచేసే వాటిని చుట్టుముట్టి, వాటిని తుదముట్టించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఒక్కోసారి ఈ యాంటీబాడీస్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలాంటప్పుడు మన యాంటీబాడీసే మన శరీరంలోని ఏదో ఒక భాగాన్ని ఫారిన్బాడీగా భావిస్తాయి. మన యాంటీబాడీస్‌కు ఇలాంటి భావన రాగానే అవి... సొంత శరీర భాగాన్ని శత్రువుగా పరిగణించి దానిపై తమ ముట్టడిని ప్రారంభిస్తాయి. ఇలాంటి ప్రక్రియ శరీరంలోని ఏ భాగంలోనైనా జరగవచ్చు. ఉదా: నాడీవ్యవస్థ, కిడ్నీలు, కీళ్లు, లంగ్స్, చర్మం, కళ్లు, జీర్ణవ్యవస్థ, గుండె, గర్భాశయం... ఎక్కడైనా ఈ ప్రక్రియ చోటు చేసుకోవచ్చు. ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటోఇమ్యూన్ డిసీజెస్‌కు గురయ్యే అవకాశాలున్నాయి. గులియన్‌బ్యారీ సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) సీఎమ్ వైరస్, కాంపైలో బాక్టర్ అనే సూక్ష్మాంగజీవులు శరీరంలోకి వెళ్లినప్పుడు జ్వరం, జలుబు మొదలైనవి వస్తాయి. ఆ తర్వాత 3-4 రోజులకు జ్వరం తగ్గుతుంది. కానీ జ్వరం తగ్గిన రెండు నుంచి మూడు వారాల తర్వాత జీబీ సిండ్రోమ్ లక్షణాలు మొదలవుతాయి. పైన పేర్కొన్న సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించగానే... వెంటనే రక్తంలో ఉండే యాంటీబాడీస్ ఆ సూక్ష్మజీవులపై దాడి ప్రారంభిస్తాయి. మన శరీరంలోని రక్షణ వ్యవస్థ ఎంత పటిష్ట్టమైనదంటే... మనలోకి ప్రవేశించిన రోగకారక క్రిములు ఎంత బలంగా ఉంటే మన లింఫాటిక్ వ్యవస్థలోంచి రక్షణ కణాలూ అంతగానే యాంటీబాడీస్‌ను సృష్టిస్తాయి. ఈ యాంటీబాడీస్ అన్నీ బలగాల రూపంలో సమీకృతమై ఒక బెటాలియన్లాగా రంగంలోకి దిగుతాయి. సాధారణంగా ఆ యాంటీబాడీస్ అన్నీ బయటి జీవుల్ని పూర్తిగా నాశనం చేసి, బయటకు పంపే మార్గాన్నే చూస్తుయి. కానీ జబ్బు వచ్చాక వెలువడ్డ ఈ యాంటీబాడీస్‌లో కొద్దిపాటి జన్యుపరమైన మార్పుల వల్ల సూక్ష్మజీవులపై దాడి చేయడానికి బదులుగా మన ప్రతి నరంపై ఉండే తొడుగు వంటి పొరను బయటి సూక్ష్మజీవిగా పొరబడతాయి. దాంతో మన నరాలపై ఉండే ‘మైలీన్’ తొడుగును నాశనం చేయడం ప్రారంభిస్తాయి. ఈ మైలీన్ తొడుగు ద్వారానే మెదడు నుంచి సదరు అవయవానికి వెళ్లాల్సిన ఆదేశాలు వెళ్తుంటాయి. ఈ తొడుగు నాశనం కావడం వల్ల మెదడు నుంచి ఆ భాగానికి అందాల్సిన ఆదేశాలు అందవు. దాంతో ఆ భాగం చచ్చుబడుతుంది. లక్షణాలు: చిన్నపాటి జ్వరం తర్వాత 2-3 వారాల్లో లక్షణాలు కనబటడం మొదలవుతుంది. మొదట తొలిరోజున కాళ్లు-చేతులు తిమ్మిరెక్కడం ప్రారంభమవుతుంది. ఆ రెండోరోజున కాళ్లు, తొడ కండరాలు, పిక్క కండరాలు చచ్చుబడతాయి. దీనివల్ల కూర్చుని-లేవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, నడవలేకపోవడం, నిలబడలేకపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. మూడోరోజున చేతులు చచ్చుపడిపోవడం జరగవచ్చు. కొందరిలో మూడు/నాలుగో రోజున ఛాతీకి సంబంధించిన కండరాలు కూడా చచ్చుబడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో వారిని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి కృత్రిమశ్వాస ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొందరికి ముఖానికి ఒకవైపు పక్షవాతం (ఫేసియల్ పెరాలసిస్) రావచ్చు. ఇంకొందరిలో మింగడానికి ఇబ్బంది కలగడం, మాట మారిపోవడం/మాటరాకపోవడం జరుగుతుంది. నిర్ధారణ: కాలి, చేతి కండరాలు చచ్చుపడటం దీని ప్రధాన లక్షణం. ఈ లక్షణాలను చూడగానే నర్వ్ కండక్షన్ స్టడీ అనే పరీక్షను నిర్వహించి జీబీ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. కొందరికి వెన్నెముక నుంచి నీరు (సీఎస్ఎఫ్) తీసి పరీక్ష చేస్తారు. చికిత్స: ఆటో ఇమ్యూన్‌జబ్బుల్లో శరీరానికి హాని చేసే యాంటీబాడీస్‌ను రక్తం నుంచి తొలగించడం అనే పద్ధతినిగాని లేదా యాంటీబాడీస్‌ను దెబ్బతీసే ప్రక్రియను గాని అనుసరించాలి. మొదటిది ప్లాస్మాపెరిసిస్ అనే పద్ధతి. అంటే ఈ ప్రక్రియలో శరీరంలోని రక్తాన్నంతా వేరే మెషిన్‌లోకి పంపి, ఆ యాంటీబాడీస్‌ను వేరు చేసి శుద్ధి అయిన రకాన్ని శరీరంలోకి పంపుతారు. రెండో పద్ధతిలో ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ను రక్తంలోకి పంపి యాంటీబాడీస్ ఉత్పత్తికి కారణమైన యాంటీజెన్స్‌ను (అంటే శరీరంలోకి ప్రవేశించే దొంగలాంటి పదార్థాలను) శక్తిహీనం (న్యూట్రలైజ్) చేస్తారు. దీనివల్ల మరిన్ని యాంటీబాడీస్ అభివృద్ధి కావడం నిలిచిపోతుంది. ఇలాంటి చికిత్సప్రక్రియ ఆటోఇమ్యూన్ జబ్బులు తీవ్రంగా ఉన్న సమయంలో ఉపయోగపడుతుంది. కోలుకునే సంభావ్యత: మొదటి రెండు వారాల లోపు ఈ చికిత్స ఇస్తే దాదాపు 90 శాతం మందికి పూర్తిగా బాగయ్యే అవకాశం ఉంటుంది. మయస్థేనియా గ్రేవిస్ మన శరీరంలో ఉండే కండరాలు తొందగా అలసిపోవడం, కనురెప్పలు వాలిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, కూర్చుని లేవలేకపోవడం వంటి లక్షణాలతో ‘మయస్థేనియా గ్రేవిస్’ కనపడుతుంది. జబ్బు తీవ్రత మరీ ఎక్కువ అయితే శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, మింగలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఎందుకు వస్తుంది: మన కండరాల్లో ఎన్నో కండర కణాలు ఉంటాయి. ఈ కండరాలు, నరాలతో అనుసంధానమయ్యే సూక్ష్మప్రాంతాన్ని ‘న్యూరో మస్క్యులార్ జంక్షన్’ అంటారు. ఇలాంటివి కొన్ని మిలియన్లు ఉంటాయి. కండరాల కదలికలు, అవి సక్రమంగా పనిచేయడమంతా ఈ జంక్షన్స్ ద్వారానే జరుగుతుంది. కండరాల కదలికలకు అవసరమైన ‘అసిటైల్ కొలీన్’ అనే పదార్థం నాడీకణం చివరి భాగం నుంచి ఉత్పత్తి అయి కండరకణ పొరల్లో ఉండే రిసెప్టార్స్లోకి వెళ్లి అక్కడ్నుంచి కండరాల్లోకి వెళ్లి, దాని కదలికలకు కారణమవుతుంది. అయితే కొన్నిసార్లు అసిటైల్ కొలీన్ యాంటీబాడీస్ ఉత్పన్నమై కండరపొర అయిన రిసెప్టార్‌కు అతుక్కుపోయి అసిటైల్ కొలీన్ను కండరంలోకి ప్రవేశించకుండా అడ్డుపడతాయి. దాంతో కండరాలు త్వరగా చచ్చుబడిపోవడం, పనిచేయకుండా ఉండటం జరుగుతుంది. నిర్ధారణ: ఈ జబ్బును క్లినికల్ పరీక్షలోనే 90 శాతం వరకు నిర్ధారణ చేయవచ్చు. అయితే పూర్తి నిర్ధారణ కోసం నియోస్టిగ్మిన్ అనే ఇంజెక్షన్‌ను కండరంలోకి (ఇంట్రామస్క్యులర్) ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే చచ్చుబడినట్లు ఉన్న కండరం 20 నుంచి 30 నిమిషాల సేపు మునుపటిలాగానే శక్తిని పుంజుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ మామూలుగా చచ్చుబడిపోతుంది. ఇదేగాక... రక్తంలో ‘అసిటైల్ కోలిన్ యాంటీబాడీస్’ను కనుగొనడం ద్వారా కూడా ఈ జబ్బును నిర్ధారణ సాధ్యం. చికిత్స: ఈ జబ్బుకు చాలా దశల్లో చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అవి... 1) ‘పైరిడోస్టిగ్మిన్’ అనే మందును 60 ఎంజీ టాబ్లెట్ల రూపంలో రోజుకు మూడుసార్లు ఇస్తారు. 2) కొందరికి ఛాతీలో ఉండే థైమస్ గ్రంథి పెద్దగా ఉంటే దాన్ని శస్త్రచికిత్స ద్వారా తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జబ్బు ఉన్న వారికి ఛాతీ సీటీ స్కాన్ తీయించి, థైమస్ గ్రంథిని చూడాల్సి ఉంటుంది. 3) కొందరికి ఈ జబ్బు చాలా తీవ్రంగా వస్తుంది. వీరికి వెంటనే చికిత్స ఇవ్వకపోతే అది ప్రాణహానికి దారితీయవచ్చు. దీన్నే ‘మయస్థేనియా క్రైసిస్’ అంటారు. ఈ కండిషన్లో శ్వాస తీసుకోలేకపోవడం, శరీరంలోని అన్ని కండరాలూ చచ్చుబడిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు రోగికి ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వాలి. పైరిడోస్టిగ్మిన్ మందును ఇస్తూ, స్టెరాయిడ్స్, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ లేదా ప్లాస్మా పెరిసిస్ ప్రక్రియలను అనుసరించాలి. 4) రోగి కోలుకున్న తర్వాత దీర్ఘకాలం పాటు పైరిడోస్టిగ్మిన్, ఇమ్యూనోసప్రెసెంట్స్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మల్టిపుల్ స్క్లిరోసిస్ దీన్నే సంక్షిప్తరూపంలో ఎమ్ఎస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్‌జబ్బుల్లో చాలా సంక్లిష్టమైన రుగ్మత. ఎవరికి వస్తుంది : ఇది ఎవరికైనా రావచ్చు. అయితే 15 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉన్న మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎలా వస్తుంది: కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ (ముఖ్యంగా మంప్స్, మీజిల్స్ వంటివి) వచ్చి తగ్గాక నాడీ పదార్థానికి సంబంధించిన యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. ఇవి నాడీ వ్యవస్థలోని... మెదడు, చిన్నమెదడు, బ్రెయిన్‌స్టెమ్, ఆప్టిక్ నర్వ్, వెన్నుపాము... ఇలా ఏ భాగంపైనైనా దాడి చేస్తాయి. దాంతో ఆ భాగం దెబ్బతిని, మెదడులో ఆ భాగానికి (సెంటర్‌కు) సంబంధించిన కణాలు నిర్వీర్యమై - శరీరంలో సదరు అవయవం చచ్చుపడుతుంది. లక్షణాలు: కొందరికి ఒక వైపు చేయి, కాలు చచ్చుపడిపోతాయి. కొందరిలో ఒక వైపు కంటి చూపు కోల్పోవడం జరుగుతుంది. మరికొందరిలో నడక సమయంలో నియంత్రణ తప్పడం, మూతి, ముఖం వంకరపోవడం, మెల్లకన్ను, ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ విజన్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: లక్షణాలను బట్టి ఎమ్మారై (బ్రెయిన్) తీయాల్సి ఉంటుంది. ఇందులో తెల్లటి మచ్చలు (వైట్ ప్యాచెస్) కనిపిస్తాయి. దీంతో జబ్బును 99 శాతం నిర్ధారణ చేయవచ్చు. ఇక వీఐపీ అనే టెస్ట్ చేయడం ద్వారా కూడా నిర్ధారణ సాధ్యమవుతుంది. వెన్నులోంచి తీసిన నీటి (సీఎస్ఎఫ్)లో కనిపించే ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ కూడా ఈ జబ్బు నిర్ధారణకు తోడ్పడేవే. బెల్స్ పాల్సీ ఇది చాలా మందిలో కనిపించే సాధారణ జబ్బే. క్రేనియల్ నర్వ్స్‌లో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ (ముఖానికి సంబంధించిన నరాన్ని)ను దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వచ్చి, అది అనుసంధానం చేసే ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి. లక్షణాలు: మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే సమర్థంగా పుక్కిలించగలగడం... ఫలితంగా నోటికి ఒకవైపు నుంచే నీళ్లు చిమ్మినట్లుగా బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: బెల్స్ పాల్సీ నిర్ధారణ కోసం మిథైల్ ప్రెడ్నిసలోన్ అనే మందును 500 ఎంజీ మోతాదులో రోజుకు రెండుసార్లు చొప్పున గాని లేదా 1 గ్రామును రోజుకు ఒకసారిగాని... మూడు రోజులు ఇవ్వాలి. ఆ తర్వాత 10వ రోజు నుంచి మెరుగుదల కనిపిస్తుంటుంది. పూర్తిగా కోలుకునేందుకు ఒక నెల రోజులు పట్టవచ్చు. గతంలో ఆటోఇమ్యూన్ జబ్బులకు పెద్దగా చికిత్స ఉండేది కాదు. అయితే ఇటీవల ఇమ్యూనోగ్లోబ్యులిన్ వంటి మందులతో ఒకింత సమర్థమైన చికిత్సే అందుబాటులో ఉంది. కాబట్టి ఆటోఇమ్యూన్ జబ్బులకు అంతగా నిరాశపడాల్సిన అవసరం లేదు. మరికొన్ని ఆటోఇమ్యూన్ జబ్బులు పైన పేర్కొన్న ఆటో ఇమ్యూన్ జబ్బులేగాక... ఈ తరహాకు చెందినవే మరికొన్ని రుగ్మతలూ ఉన్నాయి. అవి... ఇటన్‌లాంబర్ట్ సిండ్రోమ్ లింబిక్ ఎన్సెఫలోపతి / డిమెన్షియా సెన్సరీ న్యూరోపతి ఎమ్‌ఎన్‌డీ (మోటార్ న్యూరాన్ డిసీజ్) ఆప్సోక్లోనస్ / మయోక్లోనస్ పాలిమయోసైటిస్ వంటివి. ఇటన్‌లాంబర్ట్ సిండ్రోమ్‌లో కండరాలు చచ్చుపడిపోతాయి. ఈ లక్షణం ఉదయం ఎక్కువగా ఉండి, పనిచేసే కొద్దీ చచ్చుదనం తగ్గిపోతూ ఉంటుంది. ‘లింబిక్ ఎన్సెఫలోపతి’లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. ప్రవర్తన, నడవడికలో మార్పులు వస్తాయి. సెన్సరీ న్యూరోపతి వచ్చినప్పుడు నరాలలో కొన్ని పొరలు (ఫైబర్స్) దెబ్బతింటాయి. దీనవల్ల శరీరంలో కొంత మేర స్పర్శ తగ్గిపోతుంది. కానీ కదలికలు మాత్రం బాగానే ఉంటాయి. ఎమ్‌ఎన్‌డీ... అంటే వెన్నుపాములో ఉండే యాంటీరియర్ హర్స్సెల్స్ దెబ్బతినడం వల్ల చేతికండరాలు చచ్చుపడటం, కాలికండరాలు గట్టిగా మారడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలా కండరాలు బిగుసుకుపోవడాన్ని, కండరాలు కొట్టుకుంటూ ఉండటాన్ని చర్మం బయటి నుంచి చూడవచ్చు. ఆప్సోక్లోనస్ / మయోక్లోనస్లో కనుగుడ్లు ఎప్పుడూ పక్కకుగాని, పైకి కిందికిగాని వేగంగా కదులుతూ ఉంటాయి. అంతేకాకుండా కాళ్లు చేతులు జర్క్‌లు ఇచ్చినట్లుగా కొట్టుకుంటూ ఉంటాయి. అదనంగా పేర్కొన్న ఈ ఆటోఇమ్యూన్ జబ్బుల్లో ఇటన్ లాంబర్ట్ సిండ్రోమ్ మినహా మిగతావి కాస్తంత అరుదైనవి. నాడీ వ్యవస్థకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎందుకు వస్తాయి? మన నాడీ వ్యవస్థలో ముఖ్యమైనది మెదడు. ఇందులోంచి 12 జతల నరాలు (క్రేనియల్ నర్వ్స్) బయలుదేరుతాయి. ఇవిగాక వెన్నుపాము, దాని నుంచి వెలువడే పెరిఫెరల్ నర్వ్స్ కూడా ఉంటాయి. నాడీ వ్యవస్థకు అనుసంధానమైన కండరాలూ ఉంటాయి. ఏ కారణంగానైనా మన సొంత వ్యాధి నిరోధక ఆత్మరక్షణ వ్యవస్థ... పైన పేర్కొన్న మన సొంత భాగాలనే దెబ్బతీయడం వల్ల చాలా రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. నాడీ వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన ఆటోఇమ్యూన్ డిసీజెస్... నాడీ వ్యవస్థకు వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో చాలారకాలే ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ కిందివి చాలా సాధారణంగా/ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి... గులియాన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) మయస్థేనియా గ్రేవిస్ మల్టిపుల్ స్క్లిరోసిస్ (ఎమ్.ఎస్.) బెల్స్ పాల్సీ ఆటోఇమ్యూన్ క్రేనియల్ మోనోన్యూరోపతీస్ ఆటోఇమ్యూన్ ఎన్సెఫలోపతి స్టిఫ్‌మ్యాన్ సిండ్రోమ్ ఆటోఇమ్యూన్ ఎపిలెప్సీ ఆటోఇమ్యూన్ సెరిబెల్లార్ అటాక్సియా ఆటోఇమ్యూన్ డిమెన్షియా ఆటోఇమ్యూన్ సెరిబ్రల్ వ్యాస్క్యులైటిస్. స్టిఫ్‌మ్యాన్ సిండ్రోమ్ ఈ రుగ్మత ‘యాంటీ జీఏడీ యాంటీబాడీస్’ అనే కణాలను సృష్టించి వెన్నుపాములో ఉండే కొన్ని కణశ్రేణులపై దాడి చేసి వాటిని దెబ్బతీస్తాయి. దాంతో లక్షణాలు నిదానంగా చాలా దీర్ఘకాలంలో బయటపడతాయి. ఈ లక్షణాలు బయటపడటానికి నెలలూ పట్టవచ్చు. లక్షణాలు : నడిచేటప్పుడు కాళ్లు చేతులు నొప్పి పుట్టడం, కండరాలు గట్టిగా పట్టుకుపోవడం, నడవలేకపోతారు. చికిత్స : దీనికి పైన పేర్కొన్న రుగ్మత అయిన ఆటోఇమ్యూన్ ఎన్సెఫలోపతితో పాటు స్టిఫ్‌మాన్ సిండ్రోమ్‌కు మిథైల్ ప్రెడ్నిసలోన్, ఇమ్యూనోగ్లోబ్యులిన్తో చికిత్స చేస్తే జబ్బులు క్రమంగా తగ్గుతాయి. ఆ తర్వాత ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే మందులు చాలా కాలం వాడాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలోపతి ఇది రెండు విధాలుగా వస్తుంది. అవి... 1) హషిమోటోస్ ఎన్సెఫలోపతి 2) పారానియోప్లాస్టిక్ ఎన్సెఫలోపతి ఈ రెండింటిలోనూ యాంటీబాడీస్ నాడీవ్యవస్థకు విరుద్ధంగా పనిచేసి, మెదడును దెబ్బతీస్తాయి. దాంతో ఫిట్స్ రావడం, నడకలో నియంత్రణ కోల్పోవడం, స్పృహతప్పడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. నిర్ధారణ : ఎమ్మారై (బ్రెయిన్)లో తెల్ల మచ్చలు (వైట్ప్యాచెస్) కనిపించడం; వెన్నునుంచి తీసిన నీటి (సీఎస్ఎఫ్)లో ఈ యాంటీబాడీస్, యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్‌లు ఉండటం ద్వారా ఆటోఇమ్యూన్ ఎన్సెఫలోపతిని నిర్ధారణ చేస్తారు. ఆటో ఇమ్యూన్ సెరిబ్రల్ వాస్క్యులైటిస్ (ఏసీవీ) ఇది కొన్ని సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్‌లో భాగంగా కనిపించే జబ్బు. అంటే జీవ వ్యవస్థలలో ఏ వ్యవస్థకైనా వచ్చే రుగ్మతతో పాటు వస్తుంది. అందులో ముఖ్యమైనది సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ). ఈ ఆటో ఇమ్యూన్ సెరిబ్రల్ వాస్క్యులైటిస్ అనే జబ్బులో మెదడులో ఉండే రక్తనాళాలకు వ్యతిరేకంగా కొన్ని యాంటీబాడీస్ వృద్ధిచెందుతాయి. ఫలితంగా ఆ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా మెదడులోని ఏ అవయవాన్ని నియంత్రించే సెంటర్‌కు రక్తసరఫరా అందదో మన శరీరంలో ఆ భాగం దెబ్బతింటుంది. ఇది పక్షవాతంలా బయటపడుతుంది. అంటే అకస్మాత్తుగా ఒకవైపు కాలు, చెయ్యి పడిపోవడం, మూతి వంకరపోవడం, మాట మారడం, చూపు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవేగాక... కొందరిలో తలనొప్పి, ఫిట్స్, ఒకేవస్తువు రెండుగా కనిపించడం, కాళ్లూచేతులు తిమ్మిరెక్కడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. చికిత్స: దీనికోసం కూడా మొదటి దశలో మిథైల్ ప్రెడ్నిసలోన్, ఆ తర్వాత ఇమ్యూనో మాడ్యులేటర్స్ వాడుతారు.ఈ మందులతో దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఆటోఇమ్యూన్ క్రేనియల్ మోనోన్యూరోపతీ మన నాడీవ్యవస్థలో మెదడు నుంచి పుర్రె భాగం నుంచి 12 జతల నరాలు బయటకు వస్తాయనీ, వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటారన్న సంగతి తెలిసిందే. ఈ నరాలలో ప్రతిదీ కుడి, ఎడమ... రెండువైపులా ఉండి తమదైన ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంటాయి. అవి... మొదటి క్రేనియల్ నర్వ్... వాసన చూసేందుకు రెండో క్రేనియల్ నర్వ్... చూడటానికి మూడు, నాలుగు, ఆరు నరాలు...కన్ను కదలికలకు ఐదో క్రేనియల్ నర్వ్... ముఖంపై స్పర్శజ్ఞానానికి ఏడో క్రేనియల్ నర్వ్ ... ముఖం కండరాల కదలికలకు ఎనిమిదో క్రేనియల్ నర్వ్... చెవులతో వినికిడి జ్ఞానం కోసం తొమ్మిది, పది నర్వ్స్... గొంతు -మింగడం కోసం పదకొండో నర్వ్... మెడ స్పర్శకు పన్నెండో క్రేనియల్ నర్వ్...నాలుక కదలికలకు... ఉపయోగపడతాయి. సాధారణంగా ఒకరోజు లేదా రెండు రోజుల నుంచి కన్ను కదలిక సరిగా జరగకుండా ఉండటం, మనుషులు లేదా వస్తువులు రెండుగా కనిపిస్తూ ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వీళ్లలో 3, 4, 6 క్రేనియల్ నర్వ్స్‌లో ఏదో ఒకటి దెబ్బతిని ఉంటుంది. కొందరికి అకస్మాత్తుగా ఒకవైపు చూపు తగ్గిపోతుంది. ఇది రెండో క్రేనియల్ నర్వ్ దెబ్బతినడం వల్ల జరిగే పరిణామం. దీన్నే ‘ఆప్టిక్ న్యూరైటిస్’ అంటారు. ఇక కొందరిలో వాసన తెలియకపోవడం, కొందరికి రుచి తెలియకుండా పోవడం వంటివి జరగవచ్చు. అంటే వీళ్లలో రెండో లేదా ఐదో క్రేనియల్ నర్వ్ దెబ్బతిందన్నమాట. కొందరికి మింగడం కష్టం కావచ్చు. నాలుక వంకరపోవచ్చు. ఈ రకమైన పరిణామాలు 9, 10, 12వ క్రేనియల్ నర్వ్స్ దెబ్బతినడం వల్ల జరుగుతాయి. ఈ పన్నెండు క్రేనియల్ నర్వ్స్‌లో ఏది దెబ్బతిన్నా దాని వల్ల వాటికి సంబంధించిన సదరు లక్షణాలు కనిపిస్తున్నాయని నిర్ధారణ అయితే పైన పేర్కొన్న లక్షణాలన్నింటికీ ఒకే రకమైన చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. అదే... మిథైల్ ప్రెడ్నిసలోన్ 500 ఎంజీ మోతాదులో రోజుకు రెండుసార్ల చొప్పున మూడు రోజులు ఇచ్చి... ప్రెడ్నిసలోన్ అనే మాత్రలు 10 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో జబ్బు నిర్ధారణ జరిగాక మాత్రమే అనుసరించాల్సిన ప్రక్రియ. కాబట్టి రోగులు ఎవరికి వారు లక్షణాలు కనిపించగానే పైన పేర్కొన్న చికిత్స ప్రక్రియలు అనుసరించకూడదు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
పేగు మూలకణాల గుట్టు రట్టు
లండన్:మనిషి పేగుల్లో ఉండే మూలకణాల గుట్టు రట్టయింది. పేగుల్లో ప్రౌఢ మూలకణాలు ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాయన్నది తొలిసారిగా క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో మనుషుల్లో పేగు కేన్సర్ తొలిదశల్లో ఎలా అభివృద్ధి చెందుతోందన్నది తెలుసుకునేందుకు వీలుకానుందట. ప్రౌఢ మూలకణాలలో మార్పులపై దృష్టిపెట్టిన వర్సిటీ పరిశోధకులు.. నిర్దిష్ట భాగంలో ఎన్ని మూలకణాలు ఉంటున్నాయి? వాటి మధ్య పోటీ ఎలా ఉంటోంది? అన్నది పరిశీలించారు. సాధారణ సందర్భాల్లో పేగులోని ఆయా భాగాల్లో తక్కువ మూలకణాలు మాత్రమే ఉండగా.. కేన్సర్ ఏర్పడిన చోట మాత్రం మూలకణాల సంఖ్య బాగా పెరుగుతోందని, అలాగే వాటి మధ్య మనుగడ కోసం పోటీ సైతం తీవ్రమవుతోందని వీరు కనుగొన్నారు.