ఎన్నో రకాల వ్యాధులు గురించి విన్నాం. కానీ ఇలాంటి అరుదైన వ్యాధిని గురించి వినే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ వ్యాధి ఎంతమందికి వచ్చిందన్నది కూడా తెలియదు. ఎందుకంటే సాధారణ రోగి ఉండే లక్షణాలు సాధారణ వ్యాధులకు ఉండేవిగానే ఉంటాయి. నిజానికి అతడికి కూడా తెలియదు ఆ వ్యాధి ఉందని, ప్రాణాంతకమని. పేషెంట్ తాను ఫేస్ చేస్తున్న వాటిని వైద్యుడికి క్లియర్‌గా చెప్పినప్పటికీ కూడా గుర్తించడం కష్టం. చికిత్స కూడా లేదు. ఇంతకీ ఏంటా వ్యాధి అంటే..
ఈ భయానక వ్యాధి పేరు ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్(ఈడీఎస్) ఈ వ్యాధి జన్యుపరమైన రుగ్మత లేదా అరుదైన వారసత్వ రుగ్మతగా పేర్కొంటారు. ఎందుకంటే ఈ వ్యాధి ఏ ఏజ్‌లో వస్తుందని చెప్పలేం. ఎలా అటాక్ అవుతోందో తెలియదు సడెన్‌గా వచ్చేస్తుంది. కానీ లక్షణాలు చాలా రోజులకు గానీ బయటపడవు. ఆయా వ్యక్తలు నిర్లక్ష్యం వహించకుండా చెకప్‌కి వెళ్లి..అదృష్టవశాత్తు వైద్యులు ఆ వ్యాధి ఏంటో గుర్తించగలిగితే మందులతో ప్రాణాలను నిలబెట్టి.. ఆయుష్షుని పొడిగించుకోవచ్చు. అంతే తప్ప చికిత్స మాత్రం లేదు. అంత విచిత్రంగా ఉంటుంది ఆ వ్యాధి.
అచ్చం అలాంటి వ్యాధి బారినే న్యూజిలాండ్‌కి చెందిన 33 ఏళ్ల మహిళ పడింది. పాపం ఆమె తెలుసుకోలేకపోయిందో ఏమో గానీ మానసిక సమస్యలు ఉన్నట్లు పొరబడి అలానే వైద్యలకు తెలిపింది. ఒంట్లో ఒకటే నీరసంగా ఉంటుదని ఆస్పత్రికి వెళ్లింది. వారు చూసి నార్మల్ ఫీవర్ అనే అనుకున్నారు. తన సమస్యలు గురించి కూడా ఏం సరిగా వివరించలేకపోయింది. దీంతో వాళ్లు కొన్ని టెస్ట్‌లు చేసి ఏదో వ్యాధి అనే ఫీలింగ్‌లో ఉంటుంది కాబోలు ఇది మానసిక సమస్యకు సంబంధించిందిగా భావించి మానసిక రోగుల వార్డుకి తరలించారు. ఐతే కానీ ఆమె అనుహ్యంగా చికిత్స తీసుకుంటూ సడెన్‌గా ప్రాణాలు కోల్పోయింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు అసలు ఏ కారణంతో చనిపోయిందని పరీక్షలు చేయగా ఈ విషయం అంతా బయటపడింది.
ఆమెకు ఎహర్స్ డాన్లోస్ సిండ్రోమ్(ఈడీఎస్) ఉందని. ఆ వ్యాధి ఆమెకు 25 ఏళ్లు వయసు ఉన్నప్పుడే వచ్చిందని, ఆమె దీన్ని గమనించలేకపోయిందని అన్నారు వైద్యులు. సాధారణ సమస్యలుగానే ఫీలయ్యింది ఇదే ఇంతటి ఘోరం జరగడానికి కారణమైందన్నారు. ఆమె ఈ వ్యాధిని వారసత్వంగా పొందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇది చర్మంలోని టిష్యులకు ఎముకలు, రక్తనాళాలు, ఇతర అవయవాలకు మద్దతు ఇచ్చే ప్రోటీన్ల డెఫిషియన్సీ అని పేర్కొన్నారు వైద్యులు. దీనికారణంగా చర్మం సాగదీయబడినట్లుగా ఉండి, కీళ్లు వదులుగా ఉంటాయి. చిన్న రక్తనాళాలు పెళుసుగా మారి మచ్చలు ఏర్పడతాయి. శరీరం అంతా ఒకవిధమైన గాయాలు వచ్చి ఎన్నటికి నయం కాకుండా ఇబ్బంది పెడతుంటాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఈ సిండ్రోమ్ కేసుల్లో కొన్ని తేలికపాటి సమస్యలే ఉంటాయి. కొన్ని మాత్రం ప్రాణాంతకంగా మారతాయని చెప్పుకొచ్చారు. ప్రతి 5 వేలమందిలో ఒకరు ఈ వ్యాధి బారినపడతారట. దీనికి వైద్యం లేదు. ఈడీఎస్‌తో బాధపడుతున్న వ్యక్తులు తరుచుగా మందులతో ప్రాణాలను నిలబెట్టుకుని ఎదురయ్యే సమస్యలను అధిగమించడమే మార్గం అని చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ లక్షణాలు.. తీవ్రమైన మైగ్రేన్ నొప్పి. పొత్తి కడుపు నొప్పి, కీళ్లు తప్పటం, సులభంగా గాయాలు అవ్వటం, ఇనుము లోపం, తదితర లక్షణాలను చూపిస్తాయి.
దీంతో వైద్యులు చెక్ చేసి ఎలాంటి సమస్య లేదని తేల్చేస్తారు. ఇలాంటి మిస్టీరియస్ వ్యాధులను క్షుణ్ణంగా స్టడీ చేయాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధి మూర్చ, దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలనే చూపిస్తుంది. కాబట్టి వైద్యుడు ఆ తరహాలో చూసి చికిత్స అందిస్తాడు. ఇలాంటి కేసుల్లో ఈ సిండ్రోమ్‌కి సంబంధించిన లక్షణాలను దృష్టిలో ఉంచుకుని బేరీజు వేసుకుని ఆ తర్వాత మందులు ఇవ్వాలి. లేదంటే ఆ వ్యాధి అని గుర్తించక ఇచ్చిన మందులు రియాక్షన్ చెంది రోగి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం లేకపోలేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వైద్యలు కొన్ని కేసులు మమ్మల్ని కదిలించాయని, అందులో ఈ న్యూజిలాండ్ మహిళ కేసు కూడా ఒకటని అన్నారు. అలాంటి రోగుల సమస్యలను గుర్తించడంలో వైద్యలకు శిక్షణ ఇవ్వడమే గాక రోగి వైద్య హిస్టరీని కూడా స్టడీ చేసేలా సూచనలిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం ఫేస్ చేశాడు! ఆ వ్యాధి ఏంటంటే..)
Comments
Please login to add a commentAdd a comment