mysterious death
-
పుట్టినరోజునే ప్రాణాలు కోల్పోయిన చింతా స్నిగ్ధ
-
అమెరికాలో ఇండియన్ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్ ఎంబసీ (దౌత్య కార్యాలయం)లో విషాదం చోటు చేసుంది. కార్యాలయం ప్రాంగణంలో ఓ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నిన్న (శుక్రవారం) ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మృతి చెందిన అధికారికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడిచలేదు.‘‘భారత రాయబార కార్యాలయ ప్రాంణంలో 18 సెప్టెంబర్ 2024 (బుధవారం) రోజు సాయంత్రం ఓ అధికారి మరణించినట్లు మేము ధృవీకరిస్తున్నాం. మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి పంపిచడానికి సంబంధిత ఏజెన్సీలు, కుటుంబ సభ్యులతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక.. కుటుంబం గోప్యత కోసం మరణించిన అధికారికి సంబంధించి అదనపు వివరాలను వెల్లడించటం లేదు. ఈ విషాద సమయంలో ఆ అధికారి కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం’ అని పేర్కొంది.మరోవైపు.. ఈ ఘటపై స్థానిక పోలీసులు, సిక్రెట్ సర్వీస్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మ హత్య చేసుకున్నా? లేదా హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చదవండి: లెబనాన్ పేజర్ల పేలుళ్ల కేసులో కేరళ టెక్కీ ప్రమేయం! దర్యాప్తులో ఏం తేలిందంటే.. -
Delhi: 20 రోజుల్లో 13 మంది చిన్నారుల అనుమానాస్పద మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ షెల్టర్ హోహ్లో చిన్నారుల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌లో నెల రోజుల వ్యవధిలోనే 13 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక వికలాంగుల షెల్టర్‌హోమ్‌లో 13 మంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు సబ్ డివిజనల్ కార్యాలయం జరిపిన విచారణలో తేలింది. రోహిణిలో ప్రాంతంలోని ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌లో జనవరి నుంచి ఇప్పటి వరకు 27 మరణాలు నమోదయైనట్లు వెల్లడైంది. అయితే షెల్టర్ హోమ్‌లో చిన్నారుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.దివ్యాంగ చిన్నారులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని, నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా చనిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గత ఏడాది కంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, పోస్ట్‌మార్టం నివేదికల తర్వాత మరణాలకు అసలు కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. పిల్లలకు అందిస్తున్న తాగునీటి శుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆప్ ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. షెల్టర్‌హోమ్‌కు నిజానిజాలు తేల్చేందుకు ఓ బృందాన్ని పంపింది.‘అనేక సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ షెల్టర్ హోమ్ ఆశను కోల్పోయింది. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. వాటిని భరించలేక ప్రాణాలు విడుస్తున్నారు. అయినా ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.దీనిపై విచారణకు మేము బృందాన్ని పంపాము. వివరాలు తెలుసుకుంటాం’ అని కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లపై కూడా ఎన్సీడబ్ల్యూ ఆడిట్ చేస్తోందని చెప్పారు.అయితే మృతుల సంఖ్యపై ఢిల్లీ మంత్రి అతిషి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని కోరారు. 2024 జనవరి నుంచి షెల్టర్ హోమ్‌లో 14 మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఈ మరణాలకు కారణమైన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.మరోవైపు షెల్టర్ హోమ్‌లో మరణాల నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. అక్కడి పిల్లలకు స్వచ్ఛమైన నీళ్లు, ఆహారం, వైద్యం అందించడం లేదని ఆరోపిస్తోంది. ఈ మరణాలకు కారణమైన అధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మరణాలను సమీక్షించేందుకు ఢిల్లీ బీజేపీకి చెందిన బృందం కూడా ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌కు చేరుకుంది. -
అంతుచిక్కని మిస్టరీగా రాజా హుకుం సింగ్ హత్య
జోద్పూర్ పరిసర ప్రాంతాలన్నీ ఉదయాన్నే తెలిసిన ఆ వార్తతో ఉలిక్కపడ్డాయి. 1984 ఏప్రిల్ 17న అర్ధరాత్రి వేళ జరిగింది ఆ సంఘటన. రావు రాజా హుకుం సింగ్ అలియాస్ టుటు బనాను ఎవరో చంపేశారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటన జరిగిన రాజ్‌పుత్ రెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. హత్య జరిగి కొన్ని గంటలు గడిచిపోవడంతో అప్పటికే హుకుం సింగ్ శరీరం చల్లబడిపోయింది. విచిత్రంగా ఇద్దరు నిందితులు హుకుం సింగ్ మృతదేహం పక్కనే పోలీసుల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నిందితుల్లో మరో ఇద్దరు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. మృతదేహం పక్కనే నెత్తుటి మరకల కత్తి పడి ఉంది. అది హుకుం సింగ్‌దే! హుకుం సింగ్ శరీరంపై ఇరవైకి పైగా కత్తి వేట్లు ఉన్నాయి.జోద్పూర్ రాజవంశానికి చెందిన రావు రాజా హుకుం సింగ్ హత్యపై అనుమానాలు చాలానే ఉన్నాయి. ఎన్నో ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.హుకుం సింగ్ జోద్పూర్ మహారాజా గజ్ సింగ్‌కు సవతి సోదరుడు, జోద్పూర్ మాజీ పాలకుడు మహారాజా హనువంత్ సింగ్, జుబేదా బేగంల కుమారుడు. హనువంత్ సింగ్, జుబేదా బేగం దంపతులు 1952లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి హుకుమ్ సింగ్ వయసు ఏడాది మాత్రమే! సవతి తల్లి కృష్ణకుమారి ఆలన పాలనలో పెరిగాడు. తండ్రి హనువంత్ సింగ్ మరణం తర్వాత హుకుం సింగ్ సవతి సోదరుడు గజ్ సింగ్ పట్టాభిషిక్తుడయ్యాడు.అతి గారాబం వల్ల హుకుం సింగ్ అల్లరి చిల్లరిగా, దురుసుగా తయారయ్యాడు. రాచప్రాసాద మర్యాదలను పెద్దగా పట్టించుకోకుండా, ఊళ్లోని ఆకతాయి యువకులతో కలసి విచ్చలవిడిగా తిరిగేవాడు. తాగుడుకు అలవాటుపడి, జనాలతో తరచు తగవులు పెట్టుకునేవాడు. ఒక సందర్భంలో తనను నిలువరించడానికి ప్రయత్నించిన పోలీసులనే తుపాకి గురిపెట్టి బెదిరించాడు. తుపాకితో బెదిరించినందుకు పోలీసులు హుకుం సింగ్‌పై హత్యాయత్నం అభియోగం మోపుతూ కేసు పెట్టారు. హైకోర్టు ఆ కేసును కొట్టేసి, బెదిరింపు కేసు కింద విచారణ చేపట్టింది. ఇలాంటి దుందుడుకు స్వభావం ఉన్న హుకుం సింగ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. జోద్పూర్ జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగాడు. అకస్మాత్తుగా అతడు హత్యకు గురవడంతో జోద్‌పూర్‌లో కలకలం రేగింది.మొదటగా రంగంలోకి దిగి, దర్యాప్తు చేసిన జోద్పూర్ పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదు. నలుగురు నిందితులను అరెస్టు చేసినా, అసలు దోషులను నిరూపించలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత జోద్పూర్ ఎస్పీ శంతను కుమార్ మీడియా ముందుకు వచ్చాడు. అతను చెప్పిన ప్రకారం– హుకుం సింగ్‌కు నేరప్రవృత్తి ఉంది. పర్యాటక శాఖ ఉపమంత్రి నరేంద్రసింగ్ భాటితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, కొద్దిరోజులగా ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. హత్య జరిగిన రోజు సాయంత్రం హుకుం సింగ్ సమీపంలోని బస్తీలో జరిగిన డ్యాన్స్ కార్యక్రమం చూసి, రాత్రి రెస్ట్‌హౌస్‌కు తిరిగి వచ్చాడు. అతనితో పాటు మరో నలుగురైదుగురు ఉన్నారు. అందరూ మందు పార్టీ చేసుకున్నారు. తాగిన మత్తులో తనతో ఉన్నవాళ్లతో గొడవ పడ్డాడు. ఈ గొడవలోనే హత్యకు గురయ్యాడు. హత్య జరిగాక మృతదేహం వద్ద వేచి చూస్తున్న ఇద్దరినీ, అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్న మరో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారే దోషులని నిరూపించలేకపోయారు. హుకుం సింగ్ హత్య కాంగ్రెస్ జాతీయ పార్టీలోనూ అలజడి రేపింది. హత్య వెనుక మంత్రి భాటి హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. భాటి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘హత్యకు కొద్దిరోజుల ముందు హుకుం సింగ్ జైపూర్ సర్క్యూట్‌హౌస్‌లో గొడవ పడ్డాడు. సంఘటనా స్థలానికి వచ్చిన విధాయక్పురి పోలీసులు అతణ్ణి కొట్టారు. హత్యాయత్నం కేసులో దిగువకోర్టు శిక్ష విధిస్తే, నాలుగు నెలలు జైల్లో గడిపి, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. తరచు తగవులు పెట్టుకునే హుకుం సింగ్‌కు చాలామంది శత్రువులు ఉంటారు’ అని భాటి చెప్పారు. ఈ సంఘటనలో హుకుం సింగ్ సవతి సోదరుడు గజ్ సింగ్‌పై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఇద్దరికీ పొరపొచ్చాలు ఉన్న మాట నిజమే అయినా, హత్యలో గజ్ సింగ్ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.అయితే, జోద్పూర్ కాంగ్రెస్ నేతలు భాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మూపనార్‌కు ఫిర్యాదు చేశారు. మూపనార్ దీనిపై భాటిని ప్రశ్నించారు. హుకుం సింగ్ ఢిల్లీలో తన పరువుతీసే పనులు చేస్తున్నాడని, తన ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడని, అయితే అతడి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హుకుం సింగ్ హత్యలో రాజకీయ నాయకులెవరి ప్రమేయమూ లేదని రాజస్థాన్ ఐజీ జీసీ సింఘ్వీ మీడియాకు వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే రాజస్థాన్ పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు కొందరు ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసు సీబీఐ చేతికి మారింది. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు సీబీఐ ఈ కేసులో గుమన్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. విచిత్రంగా విచారణకు ముందే అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ఈ కేసు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. -
అదొక మిస్టీరియస్ వ్యాధి!..ఎలా వస్తుందో తెలియదు..గుర్తించినా చనిపోవడం ఖాయం
ఎన్నో రకాల వ్యాధులు గురించి విన్నాం. కానీ ఇలాంటి అరుదైన వ్యాధిని గురించి వినే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ వ్యాధి ఎంతమందికి వచ్చిందన్నది కూడా తెలియదు. ఎందుకంటే సాధారణ రోగి ఉండే లక్షణాలు సాధారణ వ్యాధులకు ఉండేవిగానే ఉంటాయి. నిజానికి అతడికి కూడా తెలియదు ఆ వ్యాధి ఉందని, ప్రాణాంతకమని. పేషెంట్ తాను ఫేస్ చేస్తున్న వాటిని వైద్యుడికి క్లియర్‌గా చెప్పినప్పటికీ కూడా గుర్తించడం కష్టం. చికిత్స కూడా లేదు. ఇంతకీ ఏంటా వ్యాధి అంటే.. ఈ భయానక వ్యాధి పేరు ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్(ఈడీఎస్) ఈ వ్యాధి జన్యుపరమైన రుగ్మత లేదా అరుదైన వారసత్వ రుగ్మతగా పేర్కొంటారు. ఎందుకంటే ఈ వ్యాధి ఏ ఏజ్‌లో వస్తుందని చెప్పలేం. ఎలా అటాక్ అవుతోందో తెలియదు సడెన్‌గా వచ్చేస్తుంది. కానీ లక్షణాలు చాలా రోజులకు గానీ బయటపడవు. ఆయా వ్యక్తలు నిర్లక్ష్యం వహించకుండా చెకప్‌కి వెళ్లి..అదృష్టవశాత్తు వైద్యులు ఆ వ్యాధి ఏంటో గుర్తించగలిగితే మందులతో ప్రాణాలను నిలబెట్టి.. ఆయుష్షుని పొడిగించుకోవచ్చు. అంతే తప్ప చికిత్స మాత్రం లేదు. అంత విచిత్రంగా ఉంటుంది ఆ వ్యాధి. అచ్చం అలాంటి వ్యాధి బారినే న్యూజిలాండ్‌కి చెందిన 33 ఏళ్ల మహిళ పడింది. పాపం ఆమె తెలుసుకోలేకపోయిందో ఏమో గానీ మానసిక సమస్యలు ఉన్నట్లు పొరబడి అలానే వైద్యలకు తెలిపింది. ఒంట్లో ఒకటే నీరసంగా ఉంటుదని ఆస్పత్రికి వెళ్లింది. వారు చూసి నార్మల్ ఫీవర్ అనే అనుకున్నారు. తన సమస్యలు గురించి కూడా ఏం సరిగా వివరించలేకపోయింది. దీంతో వాళ్లు కొన్ని టెస్ట్‌లు చేసి ఏదో వ్యాధి అనే ఫీలింగ్‌లో ఉంటుంది కాబోలు ఇది మానసిక సమస్యకు సంబంధించిందిగా భావించి మానసిక రోగుల వార్డుకి తరలించారు. ఐతే కానీ ఆమె అనుహ్యంగా చికిత్స తీసుకుంటూ సడెన్‌గా ప్రాణాలు కోల్పోయింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు అసలు ఏ కారణంతో చనిపోయిందని పరీక్షలు చేయగా ఈ విషయం అంతా బయటపడింది. ఆమెకు ఎహర్స్ డాన్లోస్ సిండ్రోమ్(ఈడీఎస్) ఉందని. ఆ వ్యాధి ఆమెకు 25 ఏళ్లు వయసు ఉన్నప్పుడే వచ్చిందని, ఆమె దీన్ని గమనించలేకపోయిందని అన్నారు వైద్యులు. సాధారణ సమస్యలుగానే ఫీలయ్యింది ఇదే ఇంతటి ఘోరం జరగడానికి కారణమైందన్నారు. ఆమె ఈ వ్యాధిని వారసత్వంగా పొందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇది చర్మంలోని టిష్యులకు ఎముకలు, రక్తనాళాలు, ఇతర అవయవాలకు మద్దతు ఇచ్చే ప్రోటీన్ల డెఫిషియన్సీ అని పేర్కొన్నారు వైద్యులు. దీనికారణంగా చర్మం సాగదీయబడినట్లుగా ఉండి, కీళ్లు వదులుగా ఉంటాయి. చిన్న రక్తనాళాలు పెళుసుగా మారి మచ్చలు ఏర్పడతాయి. శరీరం అంతా ఒకవిధమైన గాయాలు వచ్చి ఎన్నటికి నయం కాకుండా ఇబ్బంది పెడతుంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఈ సిండ్రోమ్ కేసుల్లో కొన్ని తేలికపాటి సమస్యలే ఉంటాయి. కొన్ని మాత్రం ప్రాణాంతకంగా మారతాయని చెప్పుకొచ్చారు. ప్రతి 5 వేలమందిలో ఒకరు ఈ వ్యాధి బారినపడతారట. దీనికి వైద్యం లేదు. ఈడీఎస్తో బాధపడుతున్న వ్యక్తులు తరుచుగా మందులతో ప్రాణాలను నిలబెట్టుకుని ఎదురయ్యే సమస్యలను అధిగమించడమే మార్గం అని చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ లక్షణాలు.. తీవ్రమైన మైగ్రేన్ నొప్పి. పొత్తి కడుపు నొప్పి, కీళ్లు తప్పటం, సులభంగా గాయాలు అవ్వటం, ఇనుము లోపం, తదితర లక్షణాలను చూపిస్తాయి. దీంతో వైద్యులు చెక్ చేసి ఎలాంటి సమస్య లేదని తేల్చేస్తారు. ఇలాంటి మిస్టీరియస్ వ్యాధులను క్షుణ్ణంగా స్టడీ చేయాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధి మూర్చ, దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలనే చూపిస్తుంది. కాబట్టి వైద్యుడు ఆ తరహాలో చూసి చికిత్స అందిస్తాడు. ఇలాంటి కేసుల్లో ఈ సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలను దృష్టిలో ఉంచుకుని బేరీజు వేసుకుని ఆ తర్వాత మందులు ఇవ్వాలి. లేదంటే ఆ వ్యాధి అని గుర్తించక ఇచ్చిన మందులు రియాక్షన్ చెంది రోగి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం లేకపోలేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వైద్యలు కొన్ని కేసులు మమ్మల్ని కదిలించాయని, అందులో ఈ న్యూజిలాండ్ మహిళ కేసు కూడా ఒకటని అన్నారు. అలాంటి రోగుల సమస్యలను గుర్తించడంలో వైద్యలకు శిక్షణ ఇవ్వడమే గాక రోగి వైద్య హిస్టరీని కూడా స్టడీ చేసేలా సూచనలిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం ఫేస్ చేశాడు! ఆ వ్యాధి ఏంటంటే..) -
డెత్ మిస్టరీ: ఆ ఇంట్లో ఏం జరిగింది? ఐలీన్ ఎలా చనిపోయింది?
అది 1986 ఏప్రిల్ 29.. ఉదయం పది నలభై దాటింది. అమెరికా, ఓక్లహోమాలోని లాటన్ హైవే పక్కన పాడుబడిన వంతెనపైన మంటలు ఎగసిపడుతున్నాయి. కాస్త దూరం నుంచి వాటిని గమనించిన ఓ రైతు.. వెంటనే ఫైరింజిన్కి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సరిగ్గా 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలు ఆర్పి.. పరిశీలనగా చూసేసరికి.. కారు డ్రైవింగ్ సీట్లో ఓ అస్థిపంజరం కలవరపరచింది. కారు అదుపు తప్పి.. క్రాష్ అయ్యిందని భావించిన అధికారులు.. కారు ఎవరిది? కారులో ఉన్నది ఎవరు? లాంటి ప్రశ్నలతో, క్లూ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాసేపటికి ఆ కారు పాత్ కాన్వే అనే 33 ఏళ్ల వివాహితుడిదని గుర్తించారు. దాంతో చనిపోయింది అతడి భార్య ఐలీన్ కాన్వే అని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ హైవే.. వాళ్ల ఇంటికి కేవలం పదిహేను మైళ్ల దూరంలో ఉంది. తాను మంటల్ని గుర్తించే సమయానికి ఏ అరుపులు వినిపించలేదని రైతు చెప్పడంతో అధికారులు.. అప్పటికే ఐలీన్ ప్రాణం పోయి ఉంటుందని భావించారు. కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. యాక్సిడెంట్ జరిగే సమయానికి కారు స్పీడ్ 50 నుంచి 60 లోపే ఉందని అధికారులు అంచనా వేశారు. ఆ మాత్రం వేగానికి అంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ప్రమాదం జరిగిన కొన్ని గంటలకు పాత్.. ఇంటికి వెళ్లి, అక్కడ పరిస్థితి చూసి మరింత ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఇంట్లో.. ఐలీన్ మాత్రమే ఒంటరిగా ఉందని తనకు బాగా తెలుసు. కానీ అక్కడ కొన్ని ఆనవాళ్లు అతడ్ని గజగజ వణికించాయి. ఇంటి ముందు గార్డెన్లో వాటర్ పైప్ చాలా సేపటి నుంచి పొంగడంతో ఆ నీళ్లు స్మిమ్మింగ్ పూల్‌లోకి పోవడం గమనించాడు. వెంటనే దాన్ని ఆఫ్ చేసి ఇంట్లోకి నడవబోయాడు. అయితే ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో.. అతడిలో అనుమానం మొదలైంది. దానికి తోడు హాల్లో ఐరన్ బాక్స్ కాలిపోయి ఉంది. బట్టలు ఇస్త్రీ చేయడానికి స్విచ్ ఆన్ చేసి ఎన్నో గంటలైందని అక్కడ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పాత్ అడుగులు.. ఆందోళనగా ముందుకు కదిలాయి. మాస్టర్ బాత్రూమ్లో బాత్ టబ్ పక్కనే ఉన్న టెలీఫోన్ రిసీవర్ పక్కకు తీసి, దాని హుక్ లాగినట్లుగా కనిపించింది. వెంటనే పాత్ కంగారు కంగారుగా ఇల్లంతా వెతికాడు. ఓ చోట భార్య డ్రైవింగ్ లైసెన్స్, కళ్లజోడు ఉన్న హ్యాండ్‌బ్యాగ్ కనిపించింది. హ్యాండ్‌బ్యాగ్ కూడా వదిలిపెట్టి.. కారులో ఎక్కడికి బయలుదేరింది? ఆమెకు డ్రైవింగ్ అనుభవం ఉన్నాకూడా ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది? పాత్ దగ్గర అన్నీ ప్రశ్నలే మిగిలాయి. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. తన భార్య మరణమై అనుమానాలు ఉన్నాయని.. కంప్లైంట్ ఇచ్చాడు. యాక్సిడెంట్ అయిన చోటును పాత్ కానీ, ఐలీన్ కానీ అంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. వెంటనే జిల్లా న్యాయవాది కార్యాలయంలోని రే ఆండర్సన్ని సంప్రదించాడు. మొదట ఆండర్సన్.. పాత్ వాదనను నమ్మలేదు. తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేక లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నాడని భావించాడు. అయినా పాత్.. తన ప్రయత్నాలు ఆపలేదు. యాక్సిడెంట్ జరిగిన చోటే క్లూ కోసం వెతకడం మొదలుపెట్టాడు. కారు కాలిపోయిన చోటికి 200 అడుగుల దూరంలోని చర్చి బులెటిన్ కనిపించింది. అది ఐలీన్ హాజరైన చర్చ్‌కి సంబంధించిందే. పాత్.. దాన్ని చివరిగా కారు డాష్‌బోర్డ్‌లో చూశాడు. ఐలీన్కి ఎప్పుడూ కారు విండోస్ క్లోజ్ చేసి.. ఎయిర్ కండిషనింగ్ ఆన్‌తో డ్రైవింగ్ చేయడం అలవాటు. అలాంటప్పుడు చర్చి బులెటిన్ కదులుతున్న కారు నుంచి బయటకు రావడం అసాధ్యం. అంటే ఆ కారులో ఐలీన్‌తో పాటు కిల్లర్ ఉన్నాడని పాత్ ఊహించాడు. ప్రాణాలతో లేని / సృహలో లేని ఐలీన్ని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి.. యాక్సిలేటర్‌ని పెంచేసి, కారు ముందుకు పోయేలాచేసి ఉంటారని పాత్ బలంగా నమ్మాడు. యాక్సిడెంట్ అయిన తర్వాతే కారుకు నిప్పు పెట్టి ఉంటారని భావించాడు. తన అనుమానాలను అధికారులకు బలంగా వినిపించి.. కేసు హిస్టరీలో ప్రమాదవశాత్తు అనే పదానికి బదులు అనుమానాస్పద మృతి అని మార్పించాడు. ఏది ఏమైనా ఆమె మరణానికి అసలు కారణం మాత్రం తేలలేదు. ఊహాగానాలు.. ఐలీన్ మరణానికి వారం క్రితం ఆ పరిసరప్రాంతాల్లో దొంగలు పెట్రేగిపోయారు. ఎవరూ లేని ఇళ్లపై దోపిడీలు చేసిన కేసులు చాలానే నమోదయ్యాయి. ఐలీన్ ఇంట్లో ఉందనే విషయం తెలియక.. ఆ దొంగల ముఠా ఆ ఇంటిపై దాడిచేసి ఉంటారని.. ఐలీన్ వాళ్లను చూడడంతో ఆమెను చంపేసి యాక్సిడెంట్‌లా క్రియేట్ చేసి ఉంటారని పాత్‌తో పాటు చాలామందే నమ్మారు. అయితే ఐలీన్ హెల్త్ హిస్టరీ తెలిసిన కొందరు.. ఆమెకు ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చి ఉంటుందని.. ఆ మెడికల్ ఎమర్జెన్సీతో ఇంటి పనులన్నీ మధ్యలోనే వదిలిపెట్టి ఆసుపత్రికి తనంతట తానే కారులో బయలుదేరి ఉంటుందని.. దారిలో అనుకోకుండా ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. అయితే న్యాయపోరాటం చేస్తున్న పాత్ దురదృష్టవశాత్తు 2013లో.. నిజం తెలుసుకోకుండానే మరణించాడు. అనంతరం అతడి కుమారుడు ఫ్రైడ్ కూడా ఆ పోరాటాన్ని కొనసాగించాడు. 2018లో అతడు కూడా కన్నుమూయడంతో ఈ కేసు కోల్డ్ కేసుల సరసన చేరి.. అపరిషృతంగానే మిగిలిపోయింది. నిజానికి ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఐలీన్ ఎలా చనిపోయింది? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. ∙సంహిత నిమ్మన -
అంతా మిస్టరీగా ఉంది.. ఉదయం వాకింగ్ వెళ్లి.. మధ్యాహ్నం నాటికి ఓ గుంతలో
మైసూరు(బెంగళూరు): నిర్మాణంలో ఉన్న భవనం గుంతలో ఒక వ్యాపారవేత్త కుమారుని మృతదేహం లభించింది. మైసూరు హెబ్బాళు పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సెన్ ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని చెరియన్ కుమారుడు క్రిస్టోఫర్ చెరియన్ మృతుడు. సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లిన క్రిస్టోఫర్ మధ్యాహ్నం నాటికి గుంతలో శవమై కనిపించాడు. ఏడాదిన్నర క్రితం మరియా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక శిశువు కూడా జన్మించింది. మూడు నెలల కిందట ఒక ప్రమాదంలో క్రిస్టోఫర్‌కి కాలు విరిగింది. అప్పటి నుంచి ఎక్కడా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా అనేదానిపై విజయనగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు -
అర్ధరాత్రి బయటకు వెళ్లిన మహిళ.. ఉదయాన్నే కాళ్లు, చేతులు లభ్యం
మైసూరు(కర్ణాటక): బుడకట్టు సముదాయం మహిళ ఒకరు అనుమానాస్పదరీతిలో చనిపోయిన ఘటన కొడగు జిల్లా పొన్నంపేటె తాలూకాలోని హుదికెరె దగ్గర బెళ్ళూరిలో చోటు చేసుకుంది. ఫణి రాజు భార్య చోందు (25) మృతదేహం భాగాలు కాళ్ళు, చేతులను, దుస్తులను ఇంటి వెనుక ఉన్న కాఫీ తోటలో గుర్తించారు. బెళలూరు గిరిజన హాడికి చెందిన చోందు శనివారం అర్ధరాత్రి ఇంటిలో నుంచి బయటకి వెళ్ళి మళ్లీ కనిపించలేదు. ఆదివారం తెల్లవారుజామున భర్త వెతుకుతూ వెళ్లగా ఇంటి వెనుక సుమారు 500 మీటర్ల దూరంలో పొదల్లో కాళ్లు, చేతులు, బట్టలు, కొన్ని ఎముకలు మాత్రమే కనిపించాయి. భర్త గట్టిగా కేకలు వేయడంతో అందరూ అక్కడికి చేరుకుని భయాందోళనకు గురయ్యారు. హతురాలి సోదరి నేత్ర శ్రీమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరైనా హత్య చేశారా, లేక ఆమె బహిర్భూమికని బయటకు వెళ్లినప్పుడు పులి, చిరుత వంటివి దాడి చేసి చంపేశాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో స్థానికంగా భయాందోళన అలముకొంది. చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ -
అంతుచిక్కని వ్యాధితో 8 మంది మృతి.. రెండు గ్రామాల్లో లాక్డౌన్..
మలాబో: ఆఫ్రికా దేశం ఈక్వెటోరియల్ గినియాలో అంతుచిక్కని వ్యాధి బెంబేలెత్తిస్తోంది. రక్తస్త్రావ జ్వరంతో 8 మంది చనిపోవడం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ వ్యాధి ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 8 మంది తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. రక్తస్రావం, జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు 200 మందిని క్వారంటైన్‌కు తరలించారు. రెండు గ్రామాల్లో లాక్డౌన్ విధించారు. వ్యాధి బారినపడిన వారి నమూనాలను సేకరించి పొరుగు దేశం గబాన్‌కు పంపారు. లాసా, ఎబోలా వంటి ప్రాణాంతక మహమ్మారులు వెలుగుచూసిన ప్రాంతం కావడంతో కొత్త వ్యాధి గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతుచిక్కని వ్యాధిబారిన పడిన వారు ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో గంటల్లోనే చనిపోయారని అధికారులు వివరించారు. ఈ వ్యాధిపై నిఘా కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈక్వెటోరియల్ గినియా పొరుగు దేశం కామెరూన్ కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఇతరులకు ప్రవేశం లేకుండా ఆంక్షలు విధించింది. చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు.. -
రష్యాలో ఒకరి తర్వాత ఒకరు.. అపర కుబేరులు ఎందుకు చనిపోతున్నారు?
రష్యాలో అపర కుబేరులు హఠాత్తుగా చనిపోతున్నారు. అంత్యంత అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన వారేఎందుకిలా చనిపోతున్నారో అంతు చిక్కడం లేదు. ఒక్క రష్యాలోనే కాదు ఇతర దేశాల్లోనూ రష్యన్ కుబేరులు మిస్టీరియస్‌గా తలలు వాల్చేస్తున్నారు. ఇవన్నీ ఆత్మహత్యలేనని పుతిన్ ప్రభుత్వం అంటోంది. అయితే మరణాలు జరిగిన తీరు చూస్తే మాత్రం ఇవి హత్యలేమో! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? లేక సహజ మరణాలా? హత్యలైతే వీటి వెనుక ఉన్న కుట్రదారు ఎవరు? సూత్రధారి ఎవరు? హంతకులు ఎవరు? ఏంటీ డెత్ మిస్టరీ? డిసెంబరు 24న మన పొరుగునే ఉన్న ఒడిషాలోని రాయగడలోని ఓ హోటల్ కిటికీ నుంచి పడి రష్యాకు చెందిన ఎంపీ, మల్టీ బిలియనీర్ పావెల్ ఆంటోవ్ అనుమానస్పద స్థితిలో మరణించారు. దీనికి రెండు రోజుల ముందే అంటే డిసెంబరు 22న ఇదే హోటల్లో ఆంటోవ్ సన్నిహితుడు అయిన మరో రష్యన్ వ్లదిమీర్ బిడెనోవ్ గుండెపోటుతో మరణించారు. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు రష్యన్లు డిసెంబరు 21న ఈ హోటల్ లో దిగారు. ఆంటోవ్ 66వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోడానికి ప్రశాంతంగా ఉండే రాయగడ ప్రాంతాన్ని ఎంచుకున్న నలుగురు స్నేహితులు కలిసి ఇక్కడకు వచ్చారు. బిడెనోవ్ మరణంతో షాక్ తిన్న ఆంటోవ్ డిప్రెషన్లో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండచ్చన్నది పోలీసుల అనుమానం. అయితే ఈ రెండూ కూడా సహజ మరణాలో ఆత్మహత్యలో కావని ఇవి కచ్చితంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్లేనని మరి కొందరు అంటున్నారు. ఇంకో చిత్రం ఏంటంటే ఆంటోవ్ చనిపోయిన రోజే సెయింట్ పీటర్స్ బర్గ్ లోఅడ్మిరల్లీ షిప్ యార్డ్స్ డైరెక్టర్ జనరల్ అలెక్జాండర్ బుజకోవ్ హఠాత్తుగా మరణించారు. ఆయన మరణానికి కారణాలేంటన్నది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. వెనకున్నదెవరు? ఏంటీ మరణాలు? వీటి వెనుక ఏమన్నా కుట్ర ఉందా? కిరాయి హంతకులు ఉన్నారా? ఉంటే ఆ హంతకుల వెనుక ఉన్నదెవరు? ఎందుకంటే చనిపోయిన ఈ ముగ్గురూ కూడా మామూలు మనుషులు కారు. ఆంటోవ్ అయితే రష్యాలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడు. వ్యాపారాల్లోనూ దిట్ట. మిగతా వారూ మల్టీ బిలియనీర్లే. ఒక వేళ వీరివి హత్యలే అయితే.. వీరిని హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కోట్లకు పడగలెత్తిన వీరిని హతమార్చడానికి కిరాయి హంతకులను కుదుర్చుకోగల సత్తా ఎవరికి ఉంటుంది? కచ్చితంగా ఈ కోటీశ్వరులను తలదన్నే పెద్దలే దీని వెనుక ఉండే అవకాశాలు ఉంటాయి. రష్యాలో ఇలా అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తోన్న కుబేరుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? పెద్ద సస్పెన్స్ హర్రర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌ను మరిపించే ఈ వరుస మిస్టీరియస్ డెత్స్ వెనుక ఉన్న కథేంటి? ఇదే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఈ ఒక్క నెలలోనే అయిదుగురు రష్యన్ కుబేరులు అనుమానస్పదంగా మరణించారు. మొత్తం మీద ఏడాదికాలంగా 22 మంది రష్యన్ ప్రముఖులు భయానకంగా చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రష్యాలోని ప్రముఖ చమురు , సహజ వాయువు కంపెనీల్లో అత్యున్నత హోదాల్లో ఉన్నవారే కావడం గమనార్హం. గ్రాజ్ పోమ్, నోవాటెక్ వంటి ఆయిల్ కంపెనీలు రష్యాలో వ్యాపారాలను శాసిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన కుబేరులు అనుమానాస్పదంగా మరణించిన వారిలో ఉండడం విశేషం. చనిపోయిన వారిలో చాలా మంది తాము ఉన్న అపార్ట్‌మెంట్‌పై అంతస్థుల కిటికీలనుండి కిందకు పడి చనిపోయారు. కొందరయితే తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. కొద్ది మంది గుండెపోటుతో మరణించినట్లు అధికారులు పేర్కొనగా ఒకళ్లిద్దరి విషయంలో మరణాలకు కారణాలు కూడా తెలీలేదు. కొందరి మరణాలు సంభవించిన తీరు మరీ భయంకరంగా ఉంది. ఇవన్నీ చూస్తే ఇవి నిజంగానే సహజ మరణాలా? ఆత్మహత్యలా? లేక కిరాయి హంతకులతో వీరిని ఎవరైనా తుదముట్టించారా? అన్న అనుమానాలు కలగక మానవు. విగత జీవులుగా భార్య పిల్లలు.. ఆయనేమో ఉరికి నోవాటెక్ కంపెనీ మాజీ డిప్యూటీ ఛైర్మన్ సెర్గీ ప్రోటో సెన్యా ఈ ఏడాది ఏప్రిల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఓ లక్జరీ విల్లాలో బస చేశారు. ఓ రోజు ఉదయాన చూసే సరికి ప్రోటో సెన్యా విల్లా చూరుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. ప్రొటో సెన్యా భార్య, కూతురుల మృతదేహాలు విల్లాలో ఉన్నాయి. ఆ ఇద్దరి శరీరాలపైనా గొడ్డలితో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే కత్తితో పొడిచిన గాట్లు కూడా ఉన్నాయి. ప్రొటో సెన్యానే తన భార్యా పిల్లల్ని రాక్షసంగా చంపేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని స్పానిష్ పోలీసులు అన్నారు. ఒకవేళ ప్రొటొ సెన్యా ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎందుకు చేసుకుంటున్నాడో ఓ లేఖను పెట్టే వాడు. కానీ ఈ విల్లాలో ఎక్కడా కూడా సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఒక్కరోజు ముందే ప్రొటో సెన్యా విషాద మరణానికి ఒక్కరోజు ముందే ఏప్రిల్ 18న గ్యాజ్ ప్రోమ్ బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వ్లడిశ్లావ్ అవయేవ్ మాస్కోలనో తన అపార్ట్ మెంట్ లో భార్య పిల్లలతో సహా శవమై కనిపించారు. తన భార్య పిల్లల్ని కాల్చి చంపిన తర్వాత అవయేవ్ పిస్తోల్‌తో తనని తాను కాల్చుకుని చనిపోయి ఉండచ్చని భావిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే కంపెనీకి గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఇగోర్ వోలో బుయేవ్ అయితే అవయేవ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని అన్నారు. బహుశా వ్యవస్థలో చాలా పెద్దలకు సంబంధించిన కీలక సమాచారం ఏదో అవయేవ్ కు తెలిసి ఉంటుందని.. అది తమకి ప్రమాదమని భావించే వారి చేతిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయని ఇగోర్ భావిస్తున్నారు. అనుమానస్పద మృతి అవయేవ్ మరణానికి ఇంచుమించు నెల రోజుల క్రితం మార్చి 23న మెడ్ స్టార్మ్ కంపెనీ అధినేత వాసిలీ మెల్నికోవ్ నోవో గొరోడ్ లోని తన అపార్ట్ మెంట్లో తన భార్య, ఇద్దరు కొడుకులతో సహా అనుమానస్పద స్థితిలో మరణించారు. వైద్య పరికరాల తయారీ కంపెనీ అధినేత అయిన మెల్నికోవ్ తన భార్య, కొడుకులను కత్తితో పొడిచి చంపి అనంతరం తనని తాను పొడుచుకుని చనిపోయారన్నది పోలీసుల కథ. ఉరి తాడుకు వేలాడుతూ గతేడాది జనవరి 30న గ్యాస్ ప్రోమ్ డైరెక్టర్ షుల్మన్ తన ఇంట్లోని బాత్ రూంలో శవమై కనిపించారు. ఆయన పక్కన ఓ సూసైడ్ నోట్ కూడా దొరికినట్లు పోలీసులు చెప్పారు. గ్యాజ్ ప్రోమ్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ట్యుల్య కోవ్ సెయింట్ పీటర్ బర్గ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. ట్యుల్యకోవ్ చనిపోయిన మూడు రోజులకే రష్యాలోనే ప్రముఖ ఆయిల్ కంపెనీ మ్యాగ్నెట్ గా పేరొందిన మిఖైల్ వాట్ ఫోర్డ్ ఇంగ్లాండ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత స్కై రిసార్ట్ అధినేత ఆండ్రీ క్రుకోవ్ స్కీ ఓ శిఖరంపై నుండి జారి పడి చనిపోయారు. పుతిన్‌పై అనుమానాలు అన్నీ అనుమానస్పద మరణాలే. ప్రతీ మరణ ఘటన లోనూ ఎన్నో ప్రశ్నలు. ఏ ప్రశ్నకూ సమాధానం లేదు. అన్నీ దారుణ ఘటనలే. వీటన్నింటినీ నిశితంగా గమనిస్తే ఇవన్నీ కూడా రష్యా ప్రభుత్వాధినేత పుతిన్ చేయించినవే కావచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తన ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వారిని కానీ.. తనకు కంట్లో నలుసుగా తయారయ్యే వారిని కానీ తనకి భవిష్యత్తులో తలనొప్పిగా మారతారన్న వారిని కానీ ప్రాణాలతో విడిచి పెట్టడం అంత మంచిది కాదని పుతిన్ భావిస్తారన్నది పుతిన్ వ్యతిరేకుల వాదన. మొదట్నుంచీ కూడా పుతిన్ తన ప్రత్యర్ధులపై హత్యాయత్నాలకు పాల్పడిన చరిత్ర ఉందని వారంటున్నారు. రాజకీయాల్లో పుతిన్‌కు నిద్ర లేకుండా చేసిన రాజకీయ ప్రత్యర్ధి నావెల్నీపై 2020లో విష ప్రయోగం జరిగింది. ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స అనంతరం నావెల్నీ ప్రాణాలతో బయట పడ్డారు. అంతకు రెండేళ్ల క్రితం 2018లో రష్యా నిఘా విభాగానికి మాజీ అధిపతి అయిన సెర్గీ స్క్రిపాల్ పైనా నావెల్నీ తరహాలోనే విష ప్రయోగం జరిగింది. ఈయన కూడా తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. రష్యా భద్రతాధికారి అలెగ్జాండర్ లిట్వినెంకోపై లండన్‌లో రేడియో ధార్మిక పదార్ధమైన పొలోనియంను ప్రయోగించారు. అలెగ్జాండర్ మాత్రం ఈ ఘలనలో చనిపోయారు. పుతిన్ పై అనుమానానికి కారణాలు లేకపోలేదు. ఒడిషాలో అనుమానస్పదంగా మరణించిన పావెల్ ఆంటోవ్ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి కాలు దువ్వడాన్ని విమర్శించారు. క్యీవ్ నగరంపై రష్యా వైమానిక దాడులను ఉగ్ర వాద చర్యగా అభివర్ణించారు. అయితే ఆ వెంటనే ఆంటోవ్ పై నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఆ వెంటనే ఆంటోవ్ చేత బలవంతంగా క్షమాపణలు చెప్పించేశారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవని అవగాహనా రాహిత్యంతో సాంకేతిక లోపంతో చేసిన వ్యాఖ్యలని ఆంటోవ్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అసలు అపర కుబేరులే ఎందుకు చనిపోతున్నారు.? ఈ మిస్టీరియస్ డెత్స్ వెనుక నిజంగానే పుతిన్ ఉన్నారా? ఇంతకీ ఈ అపర కుబేరులు ఎలా అవతరించారో కూడా తెలుసుకోవాలి. 1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కమ్యూనిస్టు దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రష్యా కొత్త నేత బోరిస్ ఎల్సిన్ అధికారంలోకి రావడంతోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారు. వేలాది సంస్థలను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేజిక్కించుకున్నారు. రాత్రికి రాత్రే వారు అపర కుబేరులయ్యే అవకాశం వచ్చింది. ప్రత్యేకించి రష్యాకు ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు సహజ వాయు రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులు అడుగు పెట్టారు. అలా కీలక రంగాలన్నీ దక్కించుకున్న ఈ నయా వ్యాపారులనే ఆలిగాక్స్ అని పిలుస్తున్నారు. వారే రష్యాలో అత్యంత ధనవంతులన్నమాట. పుతిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాపారుల్లో కొందరు పుతిన్ కు అండగా నిలిచారు. పుతిన్ వ్యవహార శైలి నచ్చక కొందరు దూరంగా ఉన్నారు. ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధానికి కాలుదువ్విన మరుక్షణమే ప్రపంచంలో అందరి కన్నాఎక్కువగా ఆందోళన చెందింది ఈ కుబేరులే. ఎందుకంటే తమ వ్యాపారాలపై యుద్ద ప్రభావం పడుతుందని వీరు భయపడ్డారు. వీరు అనుకున్నట్లే నాటో దేశాల ఆంక్షల తో రష్యన్ బిలియనీర్ల వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. అన్నింటినీ మించి యూకే, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్ లలో రష్యన్ కుబేరులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. విలాసవంతమైన విల్లాలు, ఎస్టేటులు కొన్నారు ప్రైవేటు జెట్ విమానాలు, ఓడలు పోర్టులు కొన్నారు. రష్యా యుద్ధం మొదలు పెట్టగానే నాటో దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి. రష్యన్లకు ఇతర దేశాల్లో ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఒక పక్క రష్యాలో తమ వ్యాపారాలు పడిపోవడం మరో పక్క విదేశాల్లోని తమ ఆస్తులన్నీ ఫ్రీజ్ అయిపోవడంతో రష్యన్ బిలయనీర్లు ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయారు. ఇది వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. ఈ ఫ్రస్ట్రేషన్ లోనే యుద్ధానికి కారణమైన పుతిన్ పై వ్యాపారులు మండి పడ్డారు. ఆ కోపంలోనే పుతిన్ పై విమర్శలూ చేశారు. ఆ తర్వాతనే 22 మంది సంపన్నులు అనుమానస్పద స్థితిలో చనిపోతూ వచ్చారు. సస్పెన్స్ సినిమాలో మాదిరిగా ఒకరి తర్వాత ఒకరు ఒకే విధంగా మరణానికి గురి కావడం ఆశ్చర్యచకితులను చేసింది. కొన్ని మరణాలు మరీ బీభత్సంగా క్రూరంగా ఉండడం మిగతా వారిని భయపెట్టింది. ప్రభుత్వం ఏమో ఆత్మహత్యలే అంటుంది. అక్కడి వాతావరణం చనిపోయిన తీరు చూస్తే అవి హత్యలేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.ఈ మారణ హోమం ఎప్పటికి అంతం అవుతుందనేది అతి పెద్ద ప్రశ్న. ఉక్రెయిన్ తో యుద్ధం ఆగిన వెంటనే ఈ మరణాలు కూడా ఆగితే మాత్రం ఇవి ముమ్మాటికీ పుతిన్ ప్రభుత్వ హత్యలే అనుకోవలసి వస్తుందని మేథావులు అంటున్నారు. పాలకులను చికాకు పెట్టే వారినీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టేవారినీ మూడోకంటికి తెలీకుండా మాయం చేసేసి శాల్తీలు గల్లంతు చేయడం అనేది రష్యాకు కొత్తకాదంటున్నారు విశ్లేషకులు. సోవియట్ యూనియన్ రోజుల్లోనూ నాటి గూఢచర సంస్థ కేజీబీ ఇదే చేసేదని వారంటున్నారు. ఇపుడు రష్యాలో కమ్యూనిజం లేకపోవచ్చుకానీ ప్రత్యర్ధులను లేపేసే వారసత్వం మాత్రం అలానే కొనసాగుతోందని వారంటున్నారు. పుతిన్ విధానాలను నిలదీసినందుకే రష్యాలో ఆలిగాక్స్ ల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉండచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సోవియట్ యూనియన్ కాలంలోనే కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశాధినేత పుతిన్ కూడా ఒకనాటి కేజీబీ అధికారి కాబట్టే సోవియట్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లుందని వారు అభిప్రాయ పడుతున్నారు. విషాదం ఏంటంటే రష్యాలో చోటు చేసుకుంటోన్న వరుస మృతి ఘటనల్లో ఏ ఒక్క కేసులోనూ సరియైన సాక్ష్యాలు లేకపోవడం. అయితే దీన్ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారు మేధావులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
ఏడాదిన్నరగా ప్లాస్టిక్ డ్రమ్ములోనే మృతదేహం
అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖపట్నం మధురవాడలోని వికలాంగుల కాలనీలో ప్లాస్టిక్ డ్రమ్ములో పుర్రె, అస్తిపంజరం బయటపడిన కేసులో చిక్కుముడి వీడింది. పోలీసుల విచారణలో మృతురాలు శ్రీకాకుళం జిల్లా మోదంటి వీధికి చెందిన బమ్మిడి ధనలక్ష్మి(24)గా గుర్తించారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన దండు రిషివర్ధన్ అలియాస్ కొప్పిశెట్టి రిషివర్ధన్ అలియాస్ రిషిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాదిలో వెల్డింగ్ దుకాణం నడుపుతున్న నండూరి రమేష్‌కు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని తన వద్ద పనిచేస్తున్న రిషికి 2020 సెప్టెంబర్‌లో అద్దెకు ఇవ్వగా.. అతడు కొంతకాలంగా అద్దె చెల్లించడం లేదు. ఆ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లును మే 2021 నుంచి చెల్లించకపోవడం, బిల్లు ఎక్కువగా వస్తుండటంతో రమేష్ ఆ ఇంటిని చూసేందుకు ఈ నెల 4వ తేదీన వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండగా.. ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇంటి వెనుక తలుపు తీసి ఉండటంతో లోపలకు వెళ్లి చూడగా.. ఓ పక్కన ప్లాస్టిక్ డ్రమ్ము పీవీసీ టేప్‌తో సీల్ చేసి ఉండటం, దుర్వాసన రావటంతో పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి డ్రమ్ము తెరిచిచూడగా.. పుర్రె, అస్థి పంజరం, జుట్టు కనిపించాయి. వివరాలు వెల్లడిస్తున్న పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ చున్నీ బిగించి.. డ్రమ్ములో దాచేశాడు నిందితుడు రిషివర్ధన్ తన భార్యతో కలిసి రమేష్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. భార్య గర్భవతి కావటంతో 2021 జనవరిలో తన అత్తగారి ఊరైన శ్రీకాకుళం బల్లిగూడకు కాన్పు నిమిత్తం పంపించాడు. ఆ తరువాత తరచూ భార్యను చూసేందుకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో 2021 మే 29న శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం వేచి ఉండగా.. బమ్మిడి ధనలక్ష్మి (24) అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు కలసి ఆటోలో నాతవరం వరకు ప్రయాణించారు. అదే నెల 30న రిషికి ధనలక్ష్మి పలుమార్లు ఫోన్ చేసింది. తన భార్య ఇంటివద్ద లేదని రిషి చెప్పటంతో ధనలక్షి ఆ రోజు రాత్రి అతడి ఇంటికెళ్లింది. వేకువజామున 4.30 గంటల సమయంలో ధనలక్ష్మి రూ.2 వేలు కావాలని డిమాండ్ చేసింది. తన వద్ద 100 రూపాయలే ఉన్నాయని రిషి చెప్పగా.. అతడి భార్య దుస్తులు, టీవీ ఇమ్మని అడిగింది. అందుకు తిరస్కరించగా.. తాను అడిగినవి ఇవ్వకపోతే బయటకు వెళ్లి గొడవ చేస్తానని హెచ్చరించడంతో రిషి కోపంతో ఆమె మెడకు చున్నీ బిగించటంతో ప్రాణం విడిచింది. మృతదేహాన్ని బ్లాంకెట్ ప్లాస్టిక్ జిప్ కవర్లో ప్యాక్ చేసి.. ఇంట్లోని ప్లాస్టిక్ డ్రమ్‌లో దించి మూతను సెల్లో టేప్‌తో మూసివేశాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయి తన సెల్‌ఫోన్‌ను 13 రోజులు స్విచ్ఛాఫ్ చేసి ఉంచాడు. ఆ తరువాత ఇంటిని ఖాళీ చేసిన రిషి వెల్డింగ్ షాపులో పని కూడా మానేసి తన అత్తగారింటికి వెళ్లిపోయాడు. ఇలా దొరికాడు ఘటనా స్థలంలో మృతురాలు ధనలక్ష్మికి చెందిన బ్యాగ్ లభించగా.. అందులో రిషి ఫోన్ నంబర్ రాసి ఉన్న ఓ స్లిప్ దొరికింది. కాల్ లిస్ట్ ఆధారంగా ఘటన జరగడానికి ముందు మృతురాలి నంబర్ నుంచి అతడి నంబర్‌కు ఫోన్లు రావడాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి మృతురాలి వివరాలతోపాటు నిందితుడిని గుర్తించారు. ధనలక్ష్మికి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు ఎవరూ లేకపోవటంతో ఆమె కనిపించడం లేదని ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా.. అతడు 6 నెలలుగా కొమ్మాదిలోని ఒక హాస్టల్లో అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కేసు ఛేదించినట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. -
విశాఖ: మిస్టరీగా మహిళ మర్డర్.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
పీఎంపాలెం (భీమిలి): మహిళ హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య సంఘటనలో అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో పాత్రధారులు, సూత్రధారుల నిగ్గుతేల్చే పనిలో 5 పోలీసుల బృందాలున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, పర్లాకిమిడి ప్రాంతాల్లో మూడు బృందాలు విచారణకు పంపినట్టు సీఐ వై. రామృష్ణ తెలిపారు. కొమ్మాది వికలాంగుల కాలనీ లో సీలు వేసిన డ్రమ్ములో మహిళా మృతదేహం ఆదివారం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...కొమ్మాదిలో ఉంటున్న నండూరి రమేష్ తన ఇంటిని రుషి అనే వ్యక్తికి 2019లో అద్దెకిచ్చాడు. రుషి తన భార్యతో ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి యజమాని రమే‹Ùకు వెల్డింగ్ షాపు ఉంది. ఆ షాపులో రుషిని పనికి పెట్టుకున్నాడు. 2020లో రుషి భార్య డెలివరీ కోసమని పార్వతీపురం జిల్లా పాలకొండ దరి సీతంపేటకు తీసుకువెళ్లాడు. 2021 ఏప్రిల్‌లో ఒక్కడే తిరిగొచ్చాడు. రెండు రోజుల అనంతరం మళ్లీ తిరిగి వెళ్లి పోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోయినా పెరిగిన కరెంట్ బిల్లు అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఎవరూ నివసించకపోయినా కరెంట్ బిల్లులు అధికంగా వస్తుండటంతో ఇంటి యజమాని రమేషకు అనుమానం వచ్చి వాస్తవం తెలుసుకోవడానికి ఆదివారం సాయంత్రం రుషికి అద్దెకు ఇచ్చిన ఇంటికి వెళ్లాడు. ఇంటో లైట్లు వెలిగి ఫ్యాను తిరుగుతూ కని పించింది. ఇంట్లో మాత్రం ఎవరూ లేరు. ఇంటి వద్ద వాటర్ డ్రమ్ముకు సీలు వేసి ఉండడంతో అదేంటో చూద్దామని మూత తొలగించడందో భరించరాని దుర్గంధం వెదజల్లింది. మహిళ అస్తిపంజరం కనిపించడంతో భయకంపితుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మృతదేహం సుమారు 2 నెలల కిందటే ఆ డ్రమ్ములో పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? రెండు నెలలు క్రితం హత్యకు గురైన మహిళ ఎవరు? ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి డ్రమ్ములో పెట్టి సీలు వేశారంటే ఎంతో పకడ్బందీగా చేసిన వ్యవహారంగా తెలుస్తోంది. అంతేకాకుండా రుషి 2021 నుంచి ఆ ఇంట్లో ఉండడం లేదని, ఇల్లు ఖాళీగా ఉందని ఇంటి ఓనర్ రమేష్ చెబుతున్నాడు. ఇంట్లో రుషి లేకపోయినా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుండడంతో ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు. రుషికి తెలిసే ఈ వ్యవహారం నడిచిందా. లేక ఇల్లు ఖాళీగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య కోసం వినియోగించారా? అనేది మిస్టరీగా ఉంది. అంతేకాకుండా రుషి 2021 ఏప్రిల్ నుంచి ఇంట్లో ఉండడం లేదని చెబుతున్న రమేష్ మరి ఆ ఇంటిని వేరే వాళ్లకు ఎందుకు అద్దెకు ఇవ్వలేదన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో రుషి? హత్య జరిగిన ఇంట్లో అద్దెకు ఉంటున్న రుషిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించలేదు. -
ఐదు రోజుల పాటు బాత్రూమ్లోనే..
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): ఐదు రోజుల పాటు బాత్రూమ్లోనే ఆ వ్యక్తి మృతదేహం ఉండిపోయింది. ఎక్కడో తమిళనాడు నుంచి ఇక్కడి వరకు వచ్చి పనిచేసుకుంటున్న ఆ మనిషి చనిపోయిన సంగతి ఐదు రోజుల తర్వాత అందరికీ తెలిసింది. టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి స్థానిక పాతజాతీయ రహదారి వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ఇంటిలో ఐదు రోజుల కిందట చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతుడు తమిళనాడుకి చెందిన గోవిందన్ వేణుగోపాల్ (54)గా గుర్తించారు. అతను హడ్డుబంగి గ్రామ సమీపంలో గల మార్గర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్వారీ ఇన్చార్జిగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఈ క్వారీ కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి వేణుగోపాల్ రూమ్‌లోనే ఉండేవారు. అప్పుడప్పుడు క్వారీకి వెళ్లి వచ్చేవారు. అయితే ఐదు రోజులుగా క్వారీకి రావడం లేదని అక్కడి వాచ్మెన్ తెలిపారు. వినాయక చవితి రోజున ఆరోగ్యం సరిగా లేదు రానని వాచ్‌మెన్‌కు వేణుగోపాల్ చెప్పారు. ఈ నెల 2న ఇంటి అద్దెను కూడా చెల్లించారు. అప్పటి నుంచి ఆయన కనిపించ లేదు. ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని ఇంటి యజమాని అనుకున్నారు. శనివారం వేణుగోపాల్ ఉండే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని వెళ్లి చూశారు. బాత్రూమ్లో వేణుగోపాల్ మృతదేహం కనిపించడంతో నిశ్చేష్టుడైపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అతను మరణించి ఐదు రోజులు అయి ఉంటుందని తెలిపారు. క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించారు. మృతుడు ఒక్కడే ఇంటిలో ఉండడంతో అతను చనిపోయిన సంగతి ఎవరికీ తెలియలేదని చెప్పారు. చదవండి: మాట్లాడుకుందామని పిలిచి.. అత్యాచారం.. ఆపై హత్య -
యువ బాక్సర్ అనుమానాస్పద మృతి
ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఓ యువ బాక్సర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన పంజాబ్‌లోని బటిండ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రస్థాయిలో రెండు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 5 పతకాలను సాధించిన తల్వండి సాబో గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ అలియాస్ దీప్ దలీవాల్ అనే 22 ఏళ్ల బాక్సర్ అధిక మోతాదులో హెరాయిన్‌ను ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుల్దీప్.. గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. A five-time medal winner and national-level boxer died, allegedly due to drug overdose, at Talwandi Sabo in this district on Thursday. Kuldeep Singh, aka Deep Dhaliwal, 22, had won five medals including two gold. #DRUGS #Punjab #Udta #Punjab pic.twitter.com/F6DCpq10dT — Ankush Saini अंकुश सैनी ਅੰਕੁਸ਼ ਸੈਣੀ انکوش سائیں (@ank1saini) July 28, 2022 అతని మృతదేహం పక్కన హెరాయిన్‌తో పాటు మరికొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కుల్దీప్ అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడం వల్లే మరణించి ఉంటాడని పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు. అయితే కుల్దీప్ కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంతో విభేదిస్తున్నారు. కుల్దీప్కు అసలు డ్రగ్స్ అలవాటే లేదని వాపోతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. చదవండి: Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్..? -
సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్.. ఇప్పటికీ అంతుచిక్కని డెత్ మిస్టరీ
ముగింపునకు నిర్వచనమైన మరణం కూడా కొన్నిసార్లు సరికొత్త కథ ఆరంభానికి కారణమవుతుంది. ఎన్నో చిక్కు ప్రశ్నలతో ముందుకు సాగుతుంది. 44 ఏళ్ల క్రితం కెనడాలోని టోఫిల్డ్ నగరంలో మొదలైన సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్ కథ అలాంటిదే. అది 1977.. ఏప్రిల్ నెల. చార్లీ మెక్లియోడ్ అనే వ్యక్తి.. కెనడాకు పశ్చిమంగా ఉన్న అల్బెర్టాలోని టోఫిల్డ్లో.. తన కొత్త ఇంటి నిర్మాణపనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ ఇంటికి కొద్ది దూరంలోనే తన ఫామ్‌హౌస్ ఉండటంతో.. కొత్త ఇంటికి ప్రత్యేకంగా సెప్టిక్ ట్యాంక్ ఎందుకు? ఫామ్‌హౌస్‌లోని పాత సెప్టిక్ ట్యాంక్ వాడితే సరిపోతుంది కదా? అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పాత సెప్టిక్ ట్యాంక్‌ను రిపేర్ చేయించే పనిలో పడ్డాడు. ఫామ్‌హౌస్‌లోని సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేయించి.. క్లీనింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టించాడు. అయితే తవ్వకాల్లో ఒక సాక్స్, ఒక షూ బయటికి వచ్చాయి. లోపల గమనిస్తే.. పసుపు రంగు బెడ్ షీట్లో ఏదో చుట్టి, నైలాన్ తాడుతో దాన్ని కట్టి ఉన్నట్లుగా కనిపించింది. దాంతో వెంటనే చార్లీ పోలీస్ స్టేషన్‌కు పరుగుతీశాడు. ప్రెస్ వాళ్లకూ సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. 6.5 అడుగుల లోతులో ఉన్న ఆ పసుపు రంగు మూటను (1977 ఏప్రిల్ 13న) వెలికి తీయించారు. అందులో నీలిరంగు జీన్స్, నీలిరంగు వర్కర్స్ యూనిఫామ్ ధరించిన ఓ మృతదేహం ఉందని గుర్తించారు. సుమారు 50 కేజీల కాల్షియం ఆక్సైడ్ (బాడీని త్వరగా డీకంపోజ్ చేసే రసాయన మిశ్రమం) మధ్యలో ఉందా కాయం. మరునాడు ఉదయాన్నే.. ‘సెప్టిక్ ట్యాంక్‌లో గుర్తు తెలియని మృతదేహం..’ అనే హెడ్డింగ్‌తో పత్రికలు ఆ విషయాన్ని సంచలనం చేశాయి. ఆ వ్యక్తికి 23 నుంచి 32 మధ్య వయసు ఉండొచ్చని.. యూరోపియన్ సంతతికి చెందినవాడని, వలస కూలీ అయి ఉంటాడని, 5.8 అడుగుల ఎత్తు, 82 కేజీల బరువు ఉండొచ్చని అంచనాకొచ్చారు అధికారులు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో చాలా విషయాలు బయటపడ్డాయి. అతడు చనిపోయే ముందు చిత్రహింసలకు గురయ్యాడని.. ఒంటిపై చాలా చోట్ల కాలిన గాయాలు ఉన్నాయని.. జననాంగాలు కత్తిరించి, వికృతంగా, క్రూరంగా హింసించారని.. చివరికి తుపాకీతో రెండు సార్లు కాల్చి చంపేశారని, చంపిన తర్వాతే సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారని.. అందులో పడేసి అప్పటికే.. ఏడాది కావస్తుందని నిర్ధారించారు. అతడు ఎవరో తెలుసుకోవడానికి ఒకే ఒక్క ఆధారం దొరికింది. అదేంటంటే.. బాధితుడు చనిపోయే ముందు పంటికి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. దాంతో అల్బెర్టాలోని దాదాపు 800 మంది దంతవైద్యులను సంప్రదించారు పోలీసులు. ఓ వైద్యుడి దగ్గర బాధితుడితో సరిపోలిన రికార్డులున్నాయి. కానీ అక్కడ పేషెంట్ వివరాలు స్పష్టంగా లేవు. దాంతో కేసు నీరుగారింది. విచారణలో భాగంగా ఊహా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు, విలేఖర్లతో పాటు ప్రజలు కూడా.. ‘అసలు ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు?’ అనే దానిపై ఆసక్తి కనబరచడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఈ కేసు కెనడాలో మోస్ట్ పాపులర్ క్రైమ్ స్టోరీలో ఒకటిగా మారిపోయింది. దాంతో పోలీసులు 1988లో చనిపోయిన వ్యక్తికి ‘సెప్టిక్ ట్యాంక్ శ్యామ్’ అని నామకరణం కూడా చేశారు. చాలా మిస్సింగ్ కేసుల్ని ఈ కేసు అంశాలతో పోల్చి.. కాదని తేల్చారు. అయినా అతడు ఎవరు? అతడ్ని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అనే ఎన్నో ప్రశ్నలకు ఒక్క ఆధారం కూడా చిక్కలేదు. అతడి వయసు, బరువులపై మాత్రం అంచనాలు మారుతూ వచ్చాయి. అధికారులు భావించినట్లు ‘సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్’.. అంత బరువు ఉండడని, అంత ఎత్తు ఉండడని.. డాక్టర్ క్లైడ్ స్నో భావించాడు. ఎన్ని అంచనాలు వేసినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు ఎవరు అనేది తేలకపోవడంతో కేసు కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. దాంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్’.. ఎవరో అమ్మాయిని మోసం చేసి ఉంటాడని.. అందుకే అతడి జననాంగాలు కత్తించి, లైగికంగా హింసించి చంపేశారని, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడని.. నమ్మడం మొదలుపెట్టారు చాలామంది. 2017లో కెనడియన్ పోలీసులు.. మిస్ అయిన వారి కోసం జాతీయస్థాయిలో డీఎన్ఏ సేకరణ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 2019 నాటికి ఆ ప్రయోగం చాలా విజయవంతం అయ్యింది. 2012తో పోల్చుకుంటే.. ఎన్నో మిస్సింగ్ కేసులను పరిష్కరించగలిగారు. కానీ సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్ కేసులో ఏ కదలికా రాలేదు. చివరికి 2021, జూన్ 30న సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్ కెనడా దేశస్థుడేనని, అసలు పేరు గోర్డాన్ ఎడ్విన్ శాండర్సన్ అని, 1950 అక్టోబర్ 22న మానిటోబాలో జన్మించాడని, అతడు చనిపోయేనాటికి 26 ఏళ్ల వివాహితుడని.. అతడికి ఒక కూతురు కూడా ఉందని తేలింది. అతడ్ని గుర్తించడానికి అతడి సోదరి డీఎన్ఏ ఉపయోగపడింది. అతడు చివరిసారిగా.. కాల్గరీలో నివాసముంటున్న సోదరుడి దగ్గరకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఇప్పటికే శాండర్సన్ కేసు నిమిత్తం పది లక్షల డాలర్లకు పైగా ఖర్చు అయ్యిందని అధికారులు లెక్కలేశారు. అయితే ఇంకా ఈ కేసు తేలలేదు. శాండర్సన్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అంత క్రూరంగా హింసించి చంపడానికి గల కారణం ఏంటీ? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. -సంహిత నిమ్మన -
కట్టె కాలేలోపు మరొకరు.. నిడమనూరుకు ఏమైంది?
సాక్షి, నల్గొండ: అయితే హత్యలు.. లేదంటే ప్రమాదాలు.. మరీ కాదంటే అనారోగ్య సమస్యలు.. కారణాలు ఏమైతేనేం రోజు లేదా గంటల వ్యవధిలోనే ఇద్దరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. ఇది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లా పాత తాలూకా కేంద్రమైన నిడమనూరులో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తి రోజు వ్యవధిలో మృతిచెందడంతో చర్చ తెరపైకి వచ్చింది. ఒకరి కట్టె కాలుతుందంటే చాలు రెండో వ్యక్తి ఎవరు? అని గ్రామస్తుల్లో వణుకు పుడుతోంది. నిడమనూరుకు ఏమైంది? అని గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 1990 దశకం నుంచి ఇప్పటి వరకు ఇదే తరహాలో పదుల సంఖ్యలో ఘటనలు చోటు చేసుకోవడం గ్రామస్తులను కలవరపెడుతోంది. తాజాగా.. నిడమనూరు గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య, ఇదే గ్రామానికి చెందిన తన బంధువు సూరయ్యతో కలిసి హుజూర్‌నగర్‌లో బంధువులో ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు శుక్రవారం బైక్‌పై వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో వీరి బైక్‌ను హుజూర్‌నగర్‌లోనే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పిల్లి లింగయ్య శనివారం మృతిచెందాడు. మరుసటి రోజు ప్రభుత్వ ఉద్యోగి.. పెద్దవూర : నిడమనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ (50) కుటుంబంతో కలిసి హాలియాలో నివాసం ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం నిడమనూరు సాయంత్రం ఇంటికి చేరుకున్న సయ్యద్ స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరాడు. పెద్దవూర మండలం తెప్పలమడుగు స్టేజి సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. 1990నుంచి మచ్చుకు కొన్ని ఘటనలు ► 1990లో అప్పటి సర్పంచ్ మేరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఉన్నం రామారావుల హత్యలు ఒకే రోజు గంటల వ్యవధిలో జరిగాయి. ► 1991లో మండల కేంద్రానికి చెందిన సత్యనారాయణ, మేరెడ్డి చలపతిరెడ్డిలు ఒకే రోజు మండలంలోని ముకుందాపురం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ► తదనంతరం గ్రామానికి చెందిన గుండెమెడ స్వరాజ్యం, ఆమె కుమారుడు వెంకటేశ్వరరావు(బాబ్జీ)లు సైతం ఒక రోజు తేడాతో అనారోగ్యంతో మృతిచెందారు. ► మండల కేంద్రానికే చెందిన పాల్వాయి నారాయణ ఆయన భార్య లలిత ఇంట్లో నిద్రిస్తుండగా వర్షానికి మిద్దె కూలి ఇద్దరూ నిద్రలోనే కన్నుమూశారు. ► 2018 జూలై 27న మండల కేంద్రానికి చెందిన నంబూరి రమాదేవితో పాటు ఆమె కుమారుడు రఘురామ్, కూతురు సునీత, మనుమడు అభిరామ్‌లు అక్షరాభ్యాసం చేయించేందుకు బాసరకు కా రులో బయలుదేరగా హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురూ మృతిచెందారు. -
పొలంవైపు కుళ్లిన వాసన.. అక్కడికి వెళ్లి చూస్తే..
సాక్షి,రాజాం సిటీ(విజయనగరం): మండల పరిధి పొగిరి గ్రామ పంటపొలాల్లో సోమవారం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతదేహాన్ని పరిశీలించి పాత్రుని అప్పలసూరి (25)గా గుర్తించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పొందరవీధికి చెందిన అప్పలసూరి కర్నాటకలోని మిర్చియార్డులో పనిచేసి ఈ నెల 19న గ్రామానికి వచ్చాడు. 20తేదీ ఉదయం బయటకు వెళ్లిన కుమారుడు ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు మిర్చియార్డు కాంట్రాక్టర్‌ను వాకబుచేశారు. ఇక్కడికి రాలేదని కాంట్రాక్టర్ చెప్పడంతో ఆందోళన చెంది అన్ని చోట్లా వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో పొలంవైపు వెళ్లిన గ్రామస్తులకు కుళ్లిన వాసనరావడంతో పరిశీలించి మృతదేహంగా గుర్తించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతి కేసు నమోదుచేశామని ఎస్సై ఇ.శ్రీనివాస్ తెలిపారు. చదవండి: డాడీ వెరీ బ్యాడ్.. నరకం చూపిస్తున్నాడు! -
వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే..
సాక్షి,నెల్లూరు(క్రైమ్): వివాహిత తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రామచంద్రాపురంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాజీనగర్‌లోని చీపురుకట్ట సంఘానికి చెందిన సంపూర్ణ (28) సుమారు 11 ఏళ్ల క్రితం అదే ప్రాంతంలో టీ మాస్టర్‌గా పనిచేస్తున్న వేణును ప్రేమ వివాహం చేసుకున్నారు. నవాబుపేట రామచంద్రాపురంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి సంజన, జయశ్రీ కుమార్తెలు. పొదలకూరురోడ్డులోని ఓ పెట్రోల్ బంక్‌లో సేల్స్‌గర్ల్‌గా ఆమె పనిచేస్తున్నారు. మనస్పర్థల నేపథ్యంతో సంపూర్ణ, వేణు మూడేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు. ఆటోడ్రైవర్ ఆమె ఇంటికి శుక్రవారం రాత్రి వచ్చివెళ్లారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ సంపూర్ణ నిద్ర లేవలేదు. దీంతో కుమార్తెలు అమ్మమ్మ జయమ్మకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకొని కుమార్తెను నగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందారని నిర్ధారించారు. మృతురాలి మెడపై చిన్నపాటి గాయం ఉంది. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు నవాబుపేట ఎస్సై వీరనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Elderly Couple In Tirupati: ఎంగిలిపేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా -
స్టేట్ లెవెల్ బాక్సింగ్ ప్లేయర్, పోలీసు ఉద్యోగం.. కానీ ఏం జరిగిందో ఏమో..
ఎచ్చెర్ల క్యాంపస్: ఆయన ఒకప్పుడు స్టేట్ లెవెల్ బాక్సింగ్ ప్లేయర్. స్పోర్ట్స్ కోటాలోనే పోలీసు ఉద్యోగం. కుమారుడు కూడా పోలీసే. కొడుకు కూతురికి వివాహాలు అయిపోయాయి. బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు. బయట నుంచి చూసే వారికి ఏ సమస్యలు లేని జీవితం ఆయనది. కానీ ఏం జరిగిందో గానీ ఒక్కసారిగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఎందరివో సమస్యలు చూసిన హెడ్ కానిస్టేబుల్ ఏ కష్టం గురించి మదనపడ్డారో గానీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ మర్రిపాడు సుబ్బారావు (50) సోమ వారం ఎచ్చెర్ల పోలీస్క్వార్టర్స్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో పోలీసు వర్గాలు విస్మయానికి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సుబ్బారావు సోమవారం ఉదయం 5.45 సమయానికి ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా ప్లంబర్ విధుల్లో భాగంగా పోలీస్ క్వార్టర్సులో వాటర్ స్కీమ్ ద్వారా నీరు విడిచిపెట్టారు. అనంతరం రోల్ కాల్‌కు వెళ్లారు. దాని తర్వాత ఉదయం ఏడు గంటల సమయంలో పోలీస్ క్వార్టర్సులో 8వ లైన్లో శిథిల క్వార్టర్లోకి వెళ్లి తాడుతో శ్లాబ్ హుక్కు ఊరి పోసుకున్నారు. డ్యూటీ నుంచి బయటకు వెళ్లిన సుబ్బారావు ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి సిబ్బంది అనుమానంతో పరిశీలించగా ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానిక సిబ్బంది ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులకు విషయం తెలుపగా.. వారు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఎస్పీ జీఆర్ రాధిక, ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు మృతదేహాన్ని తరలించారు. మానసిక ఆందోళనే కారణమా..? సుబ్బారావుకు ఆర్థిక సమస్యలేవీ లేవు. అ యితే ఇటీవల కుటుంబ కలహాలు సమస్యగా మారినట్టు సమాచారం. భార్య వీరమ్మకు అనారోగ్యం చేసి మంచానికే పరిమితం కావడం, మద్యం అలవాటు వంటివి ఆయనలో మానసిక ఆందోళనకు దారి తీశాయి. ఇవే ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించాయని సహచరులు భావిస్తున్నారు. ఈయన రాష్ట్రస్థాయి బాక్సింగ్ క్రీడాకారుడు. క్రీడా కోటాలో 1992లో ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. మెళియాపుట్టి మండలం బండపల్లి సొంత ప్రాంతం కాగా, తోటపాలేం పంచాయతీ తవిటయ్య నగర్లో నివాసం ఉంటున్నారు. కుమారుడు రాజారావు సైతం ప్రస్తు తం ఎస్టీటీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అల్లుడు కూడా ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Tamil Nadu: విద్యార్థుల గ్రూపు వివాదాలు.. ఏకంగా కత్తులతో.. -
ఆ రాత్రి ఏం జరిగింది? వీడుతున్న వంటమాస్టర్ హత్య కేసు మిస్టరీ
సాక్షి,మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న వంట మాస్టర్ హత్య కేసు చిక్కుముడి వీడుతున్నట్లు తెలిసింది. దామరచర్లకు చెందిన కుర్ర లింగరాజు(38) ఈ నెల 12వ తేదీన రాత్రి మండల కేంద్రంలోని రైల్వే పట్టాల పక్కన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు.. దామరచర్లకు చెందిన లింగరాజుకు అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. లింగరాజు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలోవంట మనిషిగా పనిచేస్తున్నాడు. కాగా, లింగరాజు మద్యానికి బానిసగా మారి అనుమానంతో మల్లీశ్వరిని వేధిస్తున్నాడు. అతడి ప్రవర్తనతో విసుగుచెందిన మల్లీశ్వరి, తన సోదరుడు వెంకటేశ్ కలిసి లింగరాజును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. లింగరాజు అడ్డుతొలగితే వచ్చే ఆస్తి, ఉద్యోగంతో సుఖంగా జీవించాలన్న ఉద్దేశంతో అతడి భార్య మల్లీశ్వరి, ఆమె సోదరుడు వెంకటేశ్ పథకం ప్రకారమే మరో ఇద్దరి సహకారంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఆ.. రాత్రి ఏం జరిగింది? లింగరాజు రోజూ మాదిరిగానే 12వ తేదీ రాత్రి 8గంటల ప్రాంతంలో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంట వండి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న లింగరాజు ఇంటికి వచ్చాక భార్య మల్లీశ్వరితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య డబ్బులు, కుటుంబ వ్యవహారాలపై తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం లింగరాజు 9గంటల ప్రాంతంలో మళ్లీ మద్యం తాగేందుకు బయటికి వెళ్లినట్లు తెలిసింది. ఆత్మహత్యగా చిత్రీకరించాలని.. అయితే, ఇదే క్రమంలో లింగరాజు భార్య మల్లీశ్వరి ఇంట్లో జరిగిన గొడవ గురించి సోదరుడు వెంకటేశ్‌కు ఫోన్ చేసి వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి లింగరాజును హత్య చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి సోదరుడు వెంకటేశ్ మరో ఇద్దరితో కలిసి లింగరాజు వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తదనంతరం ఇంటి సమీపంలోనే రైల్వేట్రాక్ పక్కన మల్లీశ్వరి, లింగరాజు, వెంకటేశ్, వెంట వచ్చిన రాజ గట్టుకు చెందిన డ్రైవర్, హాస్టల్లో పనిచేసే మరో వ్యక్తి సమావేశమయ్యారు.అక్కడే మద్యం తాగుతూ గొడవలు పడితే పరువు పోతుందని లింగరాజుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే హత్య చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్ ఈ క్రజుమంలోనే తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో లింగరాజు గొంతు కోసినట్లు తెలుస్తోంది. తదనంతరం అతడి మృతదేహాన్ని రైలు పట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని పథకం కూడా రచించినట్లు తెలుస్తోంది. అయితే, అర్ధరాత్రి దాటిన ఆ సమయ ంలో సమీప కాలనీవాసులు, ఇసుక ట్రాక్టర్లు తిరుగాడుతుండడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలిసింది. పోలీసు జాగిలం అక్కడి వరకే వెళ్లి.. హత్యోదంతం వెలుగుచూడడంతో పోలీసులు జాగిలాన్ని రప్పించారు. మృతదేహం పడి ఉన్న కొద్ది దూరంలో ఉన్న నల్లా వద్దకు వెళ్లి జాగిలం ఆగిపోయింది. అక్కడే రెండు మద్యం బాటిళ్లు కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. మద్యం తాపిన తర్వాతే లింగరాజును హత్య చేసి ఉంటా రని, అందుకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని అక్కడే నల్లా వద్ద శుభ్రం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లోతుగా పోలీసుల విచారణ లింగరాజును అతడి భార్య, బావమరిదే హత్య చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగానే పోలీ సులు లింగరాజు భార్య మల్లీశ్వరి, ఆమె సోదరుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు హత్యోదంతానికి సహకారం అందించిన రాజగట్టుకు చెందిన డ్రైవర్, హాస్టల్లో పనిచేసే మరో వ్యక్తి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, లింగరాజును హత్య చేయడానికి గల బలమైన కారణాలు ఏమిటి..? హత్యోదంతంలో సూత్రధారులు వెంకటేశ్, మల్లీశ్వరినేనా ? అతడి వెంట వెళ్లిన మరో ఇద్దరు కూడా పాత్రధారులేనా..? ఈ మొత్తం వ్యవహారంలో లింగరాజు భార్య మల్లీశ్వరి పాత్ర ఎంత మేరకు ఉంది.? ఇలా పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు ఒకటి రెండు రోజుల్లో హత్యోదంతం కేసు చిక్కుముడిని విప్పి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది. -
హత్యల కేసులో నిందితుడు.. కువైట్ జైలులో ఏపీవాసి అనుమానాస్పద మృతి
కువైట్‌లో హత్య కేసులో జైలులో ఉన్న వైఎస్సార్‌జిల్లా వాసి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం సెంట్రల్ జైలు కస్టడీలో ఉన్నఅతను బుధవారం సాయంత్రం తన గదిలో రెండు వరసల మంచానికి.. గుడ్డతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ‘అరబ్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. వెంకటేష్ అత్మహత్యపై ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ విభాగానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంట ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. కువైట్ లో ఆత్మహత్యకు పాల్పడిన పిల్లోల్ల వెంకటేష్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎపీఎన్ఆర్టీ ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. (చదవండి: ‘నా భర్తను ఇండియాకు పిలిపించండి.. అన్యాయంగా ఇరికించారు’ ) నా భర్తను అన్యాయంగా ఉరి వేసి చంపారు వెంకటేష్ మరణ వార్త తెలియగానే అతని భార్య స్వాతి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తను అన్యాయంగా ఉరి వేసి చంపేశారని, ఇక తన పిల్లలకు దిక్కెవరంటూ మృతుడి భార్య స్వాతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆఖరికి తన భర్త చివరి చూపైనా దక్కుతుందా లేదా అని స్వాతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏ తప్పూ చేయని తన భర్తను ప్రభుత్వాలు కాపాడలేకపోయాయని ఆమె తల్లడిల్లుతోంది. వెంకటేష్ మరణవార్తతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన పిలోళ్ల శ్రీరాములు కుమారుడు వెంకటేష్ కువైట్‌లో ఓ సేఠ్ వద్ద టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్దియా పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన సేఠ్ అహ్మద్ (80), అతని భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసి అక్కడి జైల్లో ఉంచారు. ఆయన భార్య స్వాతి కూడా కువైట్‌లోని ఓ న్యాయవాది ఇంట్లో పనిచేస్తోంది. అయితే న్యాయవాది సహాయంతో ఈ నెల 10న కువైట్ నుంచి వైఎస్సార్ జిల్లాకు వచ్చిన వెంకటేష్ భార్య స్వాతి శుక్రవారం తన పిల్లలు జయవర్ధన్, విష్ణువర్ధన్, అత్తామామలు శ్రీరాములు, రమణమ్మ, కుటుంబసభ్యులతో కలిసి తన భర్త ఏ నేరమూ చేయలేదని, స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని కడప కలెక్టర్ వి.విజయకుమార్ రాజుకు స్వాతి విజ్ఞప్తి చేసింది. కలెక్టర్ కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. Triple murder accused commits suicide in prison#Kuwait #Indian #India #Kuwaiti #Murder #Suicide #Prisonhttps://t.co/ETqlP3NSe6— ARAB TIMES - KUWAIT (@arabtimeskuwait) March 16, 2022 -
రాత్రి బాగానే ఉన్నారు.. ఏం జరిగిందో ఏమో ఉదయం ఇంట్లో చూస్తే..
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆదివారం రాత్రి వరకు బాగానే ఉన్న దంపతులు సోమవారం ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. ఇద్దరి మెడలకు తాడు ఉండి కింద పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఆస్తి కోసం ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన స్వర్గం సత్యనారాయణ (65) బాలమణి (58) దంపతులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. సత్యానారాయణ గ్రామంలో చిన్నపాటి వ్యాపారం చేస్తుండగా, భార్య బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా వీరికి సంతానం లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. గజ్వేల్‌కు చెందిన యువకుడితో పెళ్లి కూడా జరిపించారు. సత్యనారాయణ సోదరుడు బుచ్చయ్యకు కూడా పిల్లలు లేకపోవడంతో అక్కారం గ్రామానికి చెందిన శ్రీను అనే బాలుడిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. మరో సోదరుడు ప్రభాకర్ చిన్నప్పుడే తంగళ్లపల్లిలో స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం బుచ్చయ్య దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు.అప్పటి నుంచి శ్రీను ఒంటరిగానే ఉంటున్నాడు. సత్యనారాయణ, బుచ్చయ్యకు సంబంధించి 39 గుంటల భూమి ఉండడంతో రెండు నెలల క్రితం రూ. 25 లక్షలకు విక్రయించారు. అప్పటి నుంచి చిన్నపాటి గొడవలు ప్రారంభం అయ్యాయి. సత్యనారాయణ ఇద్దరు చెల్లెళ్లలకు తలా రూ. లక్ష ఇవ్వగా, శ్రీనుకు రూ. 3 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు సత్యనారాయణ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. శ్రీనుకు పెళ్లి కాకపోవడంతో పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించారు. ఈక్రమంలో సోమవారం ఉదయం 8 గంటలు దాటినా సత్యనారాయణ తలుపులు తీయలేదు. స్థానికుడైన వెంకట్‌రెడ్డి ఫోన్ చేసినా లేపలేదు. దీంతో ఇంటి వెనకలా తలుపును తట్టి చూడగా ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. వెంటనే అతడు సర్పంచ్ భానుప్రకాష్‌రావుకు సమాచారం అందించాడు. అనంతరం జగదేవ్‌పూర్ పోలీసులకు సమాచారం తెలిపారు. వెంటనే ఏసీపీ రమేష్, గజ్వేల రూరల్ సీఐ కమలాకర్, ఎస్ఐలు రాజు, పుష్పరాజు ఘటనా స్థలికి చేరుకొని క్లూస్‌టీం, డాగ్స్క్వాడ్లతో పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ ఇంటి చుట్టూ తిరిగి పక్కన ఉన్న ఫంక్షన్‌హాల్ ముందు నుంచి రోడ్డుపై వెళ్లి ఆగింది. ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. దంపతుల మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాలెన్నో.. సోదరుడి పొత్తుల భూమి అమ్మగా సత్యనారాయణకు మరో ఎకరన్నర భూమి ఉంది. డబ్బులు, ఉన్న భూమి, ఆస్తి కోసం హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. బీరువాను చూడకపోవడం, అందులో సుమారు రూ. 2 లక్షల వరకు డబ్బులు, బంగారు ఆభరణాలు అలాగే ఉండడం, బాలమణి ఒంటిపై నగలుఉన్నాయి. వారి ఒంటిపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ?
పుణ్య క్షేత్రాలకు, పురాతన దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. ఐతే మన దేశ అగ్రభాగంలో ఉన్న ఓ నది మాత్రం పుణ్యక్షేత్రం కానప్పటికీ దానిని చూసేందుకు వేలల్లో జనాలు వెళ్తుంటారు. కాకపోతే ఆ నదిలో నీళ్లతోపాటు, పైన తేలే అస్థిపంజరాలు కూడా ఉంటాయి. దీని వెనుక దాగి ఉన్న మిస్టరీ ఎంటో తెలుసుకుందాం.. ఏడాదంతా మంచులోనే.. అదికరిగిందంటే మాత్రం.. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోనే ఉందీ నది. రూప్‌ఖండ్ నది అని దీనికి పేరు. ఇది సముద్ర మట్టానికి 5029 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏడాదిలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుందీ నది. కానీ మంచు కరిగిపోగానే అక్కడి వాతావరణం అంతా కూడా భయానకంగా మారిపోతుంది. వందలాది అస్థిపంజరాలతో చూసేందుకు అత్యంత భీభత్సంగా ఉంటుంది. ఈ అస్థిపంజరాలను మొదటిసారిగా 1942లో బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ గుర్తించారు. ఐతే ఎన్నో యేళ్లుగా ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు సాగాయి. ఎవరెవరేం చేప్పారంటే.. జనరల్ జోరావర్ సింగ్ సైన్యమేనా.. ఈ అస్థిపంజరాలు కాశ్మీర్‌కు చెందిన జనరల్ జోరావర్ సింగ్ సైన్యానికి సంబంధించినవని అక్కడి స్థానికులు నమ్ముతారు. 1841లో టిబెట్ యుద్ధం నుండి తిరిగి వస్తుండగా, మంచు తుఫానులో చిక్కుకుని హిమాలయ ప్రాంతం మధ్యలో తప్పిపోయి మరణించారనే కథనం ప్రచారంలో ఉంది. చదవండి: Interesting Facts About Death: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. మంచు తుఫానే కారణమా.. కనౌజ్ రాజా జస్ధావల్, అతని భార్య బలంప, అతని సేవకులు, నృత్య బృందంతో కలిసి నందా దేవి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు పెద్ద మంచు తుఫాను కారణంగా పూర్తి సమూహం మరణించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవం ఏమిటీ? ఐతే 2014 శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ఫ్రోజెన్ లేక్‌లో ఉన్న మొత్తం 200 అస్థిపంజరాలు 9వ శతాబ్ధానికి చెందినవ భారత తెగకు చెందినవని, భారీ వడగండ్లవానలో వీరంతా మరణించారని తేల్చింది. దీనితో దీనివెనుక దాగిన మిస్టరీ వీడింది. పాపం.. అంత పెద్ద వడగండ్లు తగిలి.. మృతుల తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగలడం మూలంగా వీరంతా మరణించారని, బహుశా క్రికెట్ బాల్ సైజు వడగళ్ళు కురిసి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఐతే వారి శరీర ఇతర భాగాలపై ఎటువంటి గాయాలు కనుబడలేదట. దీంతో ఎటువంటి యుద్ధం గానీ, ఆయుధాల ప్రమేయంగానీ లేకుండా జరిగిన ప్రమాదమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ప్రతీయేట ఈ మిస్టీరియస్ రూప్‌ఖండ్ నదిని చూసేందుకు వేలాదిమంది పర్యాటకులు, సాహసికులు వస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, చూపరులకు అందమైన అనుభూతిని కలిగించినప్పటికీ, నదిలో తేలుతున్న అస్థిపంజరాల భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు మాత్రం వారి వెన్నులో వణుకు ప్రారంభమౌతుంది..!! చదవండి: Coffee and Alzheimer's Disease: మతిమరుపుతో బాధపడుతున్నారా? కాఫీతో మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి.. -
2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్..
World's Scariest Place Catacombs of Paris: ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ టూరిస్ట్ స్పాట్‌గా మనందరికీ సుపరిచితమే. ప్యారీస్‌లో కనులకు ఇంపైన ప్రదేశాలేకాదు.. వణుకు పుట్టించే మిస్టీరియస్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అలాంటివి ఏమీ ఉండవని పెదవి విరుస్తున్నారా? ఐతే ఇది చదవండి. ‘ప్యారీస్ కాటకోంబ్స్’ గురించే మీకు చెప్పబోతుంది. అక్కడ దాదాపు 60 లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఉంది. దీనికి సంబంధించిన చరిత్ర 18వ శతాబ్ధం చివరి భాగం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. చనిపోయినవారిని పాతిపెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించారు. 1785లో మరే ఇతర శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేయలేనంత మరణాలు సంభవించాయి. వర్షం కురవడంతో శ్మశానవాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకువచ్చాయట. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడవేశారు. అనతికాలంలోనే దాదాపు 60 లక్షల మృతదేహాలు ఇక్కడ నిక్షిప్తమయ్యాయి. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి మ్యూజియంగా మార్చారు. ఈ గోడను భూమిలోపల 20 మీటర్ల లోతులో నుంచి కట్టారు. అందుకే ఈ స్థలాన్ని ‘సమాధుల నేలమాళిగ (బేస్మెంట్ ఆఫ్ టోంబ్స్)’ అని పిలుస్తారు. నేడు ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీనిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు కూడా. చనిపోయినవారి ఎముకలు, పుర్రెలతో నిర్మించిన 2.2 కి.మీ పొడవున్న ఈ మొత్తం గోడ దాదాపు 800 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఐతే ఈ మొత్తం గోడను నేటివరకూ పర్యాటకుల సందర్శనకు ఇప్పటివరకూ ఉంచలేదు. ఈ సొరంగంలోని కొన్ని భాగాలు మాత్రమే చూసేందుకు అనుమతి ఉంది. ఏదిఏమైనప్పటికీ సమాధులను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా అస్థిపంజరాలతో కట్టిన ఈ గోడను చూడటానికి అన్ని వేల మంది ఎలా వెళ్తున్నారో!! చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
సూసైడ్ సాంగ్: ఓ పాట వందల ప్రాణాలు తీసింది.. నేటికీ మిస్టరీనే..
మాటల్లో చెప్పలేని భావాన్ని కూడా పాటలోని రాగం స్పష్టంగా పలికి స్తుంది. మనసుల్ని సుతారంగా మీటుతూ భావోద్వేగాలను స్పృశిస్తుంది. అలాంటి ఓ పాట వందల మంది ప్రాణాలు తీసేసింది. హంగేరీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ‘హంగేరియన్ సూసైడ్ సాంగ్’ చరిత్ర నేటికీ ఓ మిస్టరీనే. స్మైల్ క్లబ్స్ 1933.. అప్పుడప్పుడే పలు దేశాలు మొదటి ప్రపంచ యుద్ధం మిగిల్చిన విషాదం నుంచి తేరుకుంటున్నాయి. అప్పటికే ఎందరో సైనికుల్ని కోల్పోయిన హంగేరీ రాజధాని బుడాపెస్ట్ ప్రజలను మాత్రం మరో విషాదం ఏడిపించింది. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు జనం. ఏదో మైకం కమ్మినట్లు, దెయ్యం పట్టినట్లు.. ట్రాన్స్‌లోకి వెళ్లి పెద్దపెద్ద భవనాల మీద నుంచి, నదుల వంతెనల మీద నుంచి దూకేయసాగారు. కారణం లేకుండానే మెడకు ఉరితాళ్లు బిగించుకునేవారు. పదుల సంఖ్యతో మొదలైన ఆత్మహత్యలు వందలకు చేరుకున్నాయి. దాంతో ఆ పరిసరప్రాంతాల్లోని నదులు, ఎత్తైన కట్టడాల చుట్టూ పోలీసులు కాపలా కాయసాగారు. ఎవరైనా చనిపోవాలని నదిలోకి దూకేస్తే వెంటనే రక్షించేవారు. ఇలా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కానీ, ప్రజల్లో ఆత్మహత్య ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. కేవలం బుడాపెస్ట్‌లోనే కాకుండా హంగేరీలోని ఇతర నగరాల్లోనూ ఇలాంటి ఘటనలే కనిపించసాగాయి. డిప్రెషన్‌తోనే అలా ప్రవర్తిస్తున్నారని భావించిన ప్రభుత్వ అధికారులు.. ప్రజలకు కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికీ సూసైడ్స్ ఆగలేదు. అంత యుద్ధమప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోని జనం ఇప్పుడింతటి మనోవ్యాకులతకు ఎందుకు గురవుతున్నారో అర్థం కాలేదు నిపుణులకు, ప్రభుత్వ యంత్రాంగానికి. అసలు కారణం తెలుసుకోవడం కోసం.. కొందరు వైద్య నిపుణులు, మరికొందరు రక్షణ సిబ్బంది, పలు శాఖల అధికారులతో ఓ విచారణ కమిటీ ఏర్పడింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి, ప్రాణాలతో బయటపడిన వారిని ఆ కమిటీ ప్రశ్నించడంతో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ‘గ్లూమీ సండే’. అదొక పాట. నిత్యం రేడియోలో ప్లే అవుతున్న ఆ పాటను విన్న తర్వాత మదిలో ఏదో తెలియని ఆవేదన మొదలైందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోబోయామని తెలిపారు వాళ్లు. దాంతో అధికారులు తక్షణమే ఆ పాట ప్రసారాన్ని నిలిపేశారు. వరుస ఆత్మహత్యలతో అప్పటికే బుడాపెస్ట్‌కు ఆత్మహత్యల నగరంగా పేరు వచ్చేసింది. ఆ పేరును పోగొట్టే లక్ష్యంతో పలు స్మైల్ క్లబ్స్ ఏర్పాటయ్యాయి. అందులో జాయిన్ అయినవారిని డిప్రెషన్‌కి దూరం చేసి, నవ్వమని ప్రోత్సహించేవారు. ఎక్కడికక్కడ అహ్లాదాన్ని కలిగించే విధంగా నవ్వుతున్న మోనాలిసా, హాలీవుడ్ యాక్టర్స్ చిత్రాలను వేలాడదీసేవారు. నవ్వుకున్న గొప్పతనంపై అవగాహన కల్పిస్తూ.. ప్రజలంతా స్మైలీ మాస్కులు ధరించేలా ప్రోత్సహించారు. నవ్వే పెదవులని ముఖానికి అతికించుకుని అద్దంలో చూసుకోమనేవారు. వరుస ఆత్మహత్యలు సరే.. ప్రజల స్మైలీ మాస్కులతో మరోసారి ప్రపంచం దృష్టిలో పడింది బుడాపెస్ట్. మొత్తానికి.. ఒక పాట మనుషుల మనసులను కకావికలం చేసి, జీవితంపై విరక్తి పుట్టించడం ఊహించని పరిణామమే. మరి, బుడాపెస్ట్ ఆత్మహత్యలకు కారణం ‘గ్లూమీ సండే’ పాటేనా? మరింకేదైనా మిస్టరీ ఉందా? అనేవారికి మాత్రం నేటికీ సమాధానం దొరకలేదు. అయితే లాస్లీ జావోర్ రాసిన మూలకథనం (ఫెయిల్యూర్ లవ్ స్టోరీ) ఆధారంగా హంగేరీలో చాలా సినిమాలు వచ్చాయి. ఇదీ.. పాట చరిత్ర.. 1933లో రెజ్సే సీరెస్ అనే పియానిస్ట్ స్వరపరచిన ఈ పాట అసలు సాహిత్యం ‘ప్రపంచం అంతమవుతోంది’ అనే పేరుతో ఉంటుంది. యుద్ధం వల్ల కలిగే నిరాశ, ప్రజల పాపాల గురించిన ప్రార్థనతో ముగుస్తుందీ గీతం. అయితే లాస్లీ జావోర్ అనే కవి ఆ పాటను ‘గ్లూమీ సండే’గా మార్చి సొంత లిరిక్స్‌ను జోడించాడు. అందులో ప్రేయసి చనిపోవడంతో, ఆమె ప్రియుడి ఆత్మహత్య ఆలోచనలతో నిండిన వేదన ఉంటుంది. (అయితే లాస్లీ తన భార్యతో విడిపోయినప్పుడు ఈ పాట రాశాడనే వాదన కూడా ఉంది) 1935లో పాల్ కల్మర్ హంగేరియన్‌లో రికార్డ్ చేశాడు. 1936లో హాల్ కెంప్ ఆంగ్లంలో తర్జుమా చేశాడు. 1941లో ‘బిల్లీ హాలిడే’ వెర్షన్ పేరిట.. పాట ఆంగ్ల ప్రపంచానికీ పరిచయమై ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అయితే బీబీసీ 2002 వరకూ ఈ పాటను నిషేధించింది. - సంహిత నిమ్మన చదవండి: ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా.. మోస్ట్ బ్యూటిఫుల్..!