అర్ధరాత్రి బయటకు వెళ్లిన మహిళ.. ఉదయాన్నే కాళ్లు, చేతులు లభ్యం   | Karnataka: Mysterious Death Of Married Woman | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి బయటకు వెళ్లిన మహిళ.. ఉదయాన్నే కాళ్లు, చేతులు లభ్యం  

Published Tue, May 23 2023 10:06 AM | Last Updated on Tue, May 23 2023 10:22 AM

Karnataka: Mysterious Death Of Married Woman - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైసూరు(కర్ణాటక): బుడకట్టు సముదాయం మహిళ ఒకరు అనుమానాస్పదరీతిలో చనిపోయిన ఘటన కొడగు జిల్లా పొన్నంపేటె తాలూకాలోని హుదికెరె దగ్గర బెళ్ళూరిలో చోటు చేసుకుంది. ఫణి రాజు భార్య చోందు (25) మృతదేహం భాగాలు కాళ్ళు, చేతులను, దుస్తులను ఇంటి వెనుక ఉన్న కాఫీ తోటలో గుర్తించారు. బెళలూరు గిరిజన హాడికి చెందిన చోందు శనివారం అర్ధరాత్రి ఇంటిలో నుంచి బయటకి వెళ్ళి మళ్లీ కనిపించలేదు.

ఆదివారం తెల్లవారుజామున భర్త వెతుకుతూ వెళ్లగా ఇంటి వెనుక సుమారు 500 మీటర్ల దూరంలో పొదల్లో కాళ్లు, చేతులు, బట్టలు, కొన్ని ఎముకలు మాత్రమే కనిపించాయి. భర్త గట్టిగా కేకలు వేయడంతో అందరూ అక్కడికి చేరుకుని భయాందోళనకు గురయ్యారు. హతురాలి సోదరి నేత్ర శ్రీమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి  పరిశీలించి కేసు నమోదు చేశారు.  ఎవరైనా హత్య చేశారా, లేక ఆమె బహిర్భూమికని బయటకు వెళ్లినప్పుడు పులి, చిరుత వంటివి దాడి చేసి చంపేశాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో స్థానికంగా భయాందోళన అలముకొంది.

చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement