
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,మండ్య(బెంగళూరు): కాళ్ల పారాణి ఆరకముందే వేడినీళ్లు పడి నవ వధువు మృతి చెందింది. మండ్య జిల్లా మద్దూరు తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన డి గ్రూప్ ఉద్యోగి నందరాజు కుమార్తె ఉన్నతి (19)ని మళవళ్ళి తాలూకా హోంబెగౌడనదొడ్డి గ్రామానికి చెందిన ప్రజ్వల్‌కు ఇచ్చి 20 రోజుల క్రితం పెళ్లి చేశారు. ఆలూరు గ్రామంలో ఈనెల 20న ఉన్నతి వంట గదిలో నుంచి బాత్‌రూంకి వేడినీటిని తీసుకెళ్తుండగా జారిపడడంతో వేడినీళ్లు ఆమెపై పడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను మండ్యలో ఒక ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె శనివారం మృతి చెందింది. మద్దూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో..
కారు ప్రమాదంలో వైద్యుడు మృతి
మైసూరు: కారు ప్రమాదంలో శివకుమార్ (35) అనే వైద్యుడు మరణించిన ఘటన మైసూరులో జరిగింది. నగరంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పనిచేసే శివకుమార్ శనివారం ఉదయం ఇంటి వద్ద నుంచి ఆస్పత్రికి కారులో వెళ్తూ రింగ్ రోడ్డులో ఉన్న మానసి నగర వద్ద కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన శివకుమార్ అక్కడే మరణించాడు. సిద్ధార్థనగర ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
చదవండి: బీమా డబ్బుల కోసం.. కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త మామా
Comments
Please login to add a commentAdd a comment