విజయవాడ నగర శివారులోని గొల్లపుడిలో గల ఓ కార్పొరేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోన్న హరిత (26) కళాశాల ప్రాంగణంలోనే అనేమానాస్పద రీతిలో మరణించారు.
విజయవాడ: నగర శివారులోని గొల్లపుడిలో గల ఓ కార్పొరేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోన్న హరిత (26) కళాశాల ప్రాంగణంలోనే అనేమానాస్పద రీతిలో మరణించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండటం మునిపల్లికి చెందిన హరిత.. గత ఐదేళ్లుగా సదరు కళాశాల ఆవరణలోని హాస్టల్లో ఉంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పేంది.
శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలో స్పృహకోల్పోయిన ఆమెను.. ఇతర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గత కొద్దిరోజులుగా హరిత అనారోగ్యంతో బాధపడుతున్నదని, ఆ కారణంతోనే చనిపోయిందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. అయితే తమ కుమార్తె ఆరోగ్యంగానే ఉన్నదని, గత రాత్రి కూడా తమతో ఫోన్ లో మాట్లాడిందని, ఇంతలోనే ఎలా చనిపోతుందని మృతురాలి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.