lady lecturer
-
మహిళా లెక్చరర్ అనుమానాస్పద మృతి
విజయవాడ: నగర శివారులోని గొల్లపుడిలో గల ఓ కార్పొరేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోన్న హరిత (26) కళాశాల ప్రాంగణంలోనే అనేమానాస్పద రీతిలో మరణించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండటం మునిపల్లికి చెందిన హరిత.. గత ఐదేళ్లుగా సదరు కళాశాల ఆవరణలోని హాస్టల్లో ఉంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పేంది. శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలో స్పృహకోల్పోయిన ఆమెను.. ఇతర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గత కొద్దిరోజులుగా హరిత అనారోగ్యంతో బాధపడుతున్నదని, ఆ కారణంతోనే చనిపోయిందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. అయితే తమ కుమార్తె ఆరోగ్యంగానే ఉన్నదని, గత రాత్రి కూడా తమతో ఫోన్ లో మాట్లాడిందని, ఇంతలోనే ఎలా చనిపోతుందని మృతురాలి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మహిళా లెక్చరర్ బలవన్మరణం
మహబూబ్‌నగర్: వ్యక్తిగత కారణాలతో ఓ మహిళాలెక్చరర్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు... దేవరకద్ర మండలం పేరూర్ గ్రామానికి చెందిన మేదరి నిర్మలాదేవి(26) కొన్నేళ్లుగా ఆత్మకూరులోని వికాస్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తోంది. గత నాలుగు రోజులుగా ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కోసం జిల్లా కేంద్రానికి వచ్చి వెళుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కూడా మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఆమె స్పాట్ సెంటర్‌కు వెళ్లకుండా నేరుగా స్థానిక బండమీదిపల్లి శివారులోని రైలుపట్టాల పైకి వెళ్లి, రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. -పెళ్లి ఇష్టం లేకనా? మూడు రోజుల క్రితం నిర్మలాదేవికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి నచ్చింది...కుటుంసభ్యులను తీసుకుని ఆదివారం మరోసారి వస్తాం అంటూ అబ్బాయి తరఫు వారు చెప్పినట్లు మృతురాలి తల్లి చెబుతోంది. పెళ్లి ఇష్టం లేకనా.. లేక మరేదైనా కారణమా.. తమకు తెలియటం లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.