వ్యక్తిగత కారణాలతో ఓ మహిళాలెక్చరర్ బలవన్మరణానికి పాల్పడింది.
మహబూబ్‌నగర్: వ్యక్తిగత కారణాలతో ఓ మహిళాలెక్చరర్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు... దేవరకద్ర మండలం పేరూర్ గ్రామానికి చెందిన మేదరి నిర్మలాదేవి(26) కొన్నేళ్లుగా ఆత్మకూరులోని వికాస్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తోంది. గత నాలుగు రోజులుగా ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కోసం జిల్లా కేంద్రానికి వచ్చి వెళుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కూడా మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఆమె స్పాట్ సెంటర్‌కు వెళ్లకుండా నేరుగా స్థానిక బండమీదిపల్లి శివారులోని రైలుపట్టాల పైకి వెళ్లి, రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.
-పెళ్లి ఇష్టం లేకనా?
మూడు రోజుల క్రితం నిర్మలాదేవికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి నచ్చింది...కుటుంసభ్యులను తీసుకుని ఆదివారం మరోసారి వస్తాం అంటూ అబ్బాయి తరఫు వారు చెప్పినట్లు మృతురాలి తల్లి చెబుతోంది. పెళ్లి ఇష్టం లేకనా.. లేక మరేదైనా కారణమా.. తమకు తెలియటం లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.