సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం.. హయత్‌నగర్‌లో కుంట్లూరు మైనార్టీ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని సౌమ్య హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.
కాగా, నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గ్రామానికి చెందిన దర్శనం చంద్రయ్య, బాలవ్వ దంపతుల రెండో కూతురు భార్గవి హైదరాబాద్‌లో గల ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment