అనుమానాస్పద స్థితిలో టెకి మృతి | A Pune Techie Mysterious Death Took Place At Dehu Road | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో టెకి మృతి

Published Wed, Oct 10 2018 2:14 PM | Last Updated on Wed, Oct 10 2018 2:15 PM

A Pune Techie Mysterious Death Took Place At Dehu Road - Sakshi

ముంబై : పూణెకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తృప్తి ధిల్లాడ్‌ అనే యువతి మంచ మీద కూర్చుని, కిటీకికి ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పూణెలోని దేహు రోడ్‌లో, నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరని తెలిసింది. ఆ సమయంలో తృప్తి తండ్రి గుండేపోటుతో బాధపడుతుండటంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాయంత్రం నుంచి ఫోన్‌ మోగుతున్నప్పటికి ఎవ్వరు కాల్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు తృప్తి ఇంటికి వెళ్లి చూడగా ఆమె చనిపోయి కనిపించింది.

దాంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టమ్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే ఇది హత్యా, ఆత్యహత్య అనే విషయం ఇంకా తేలయలేదన్నారు పోలీసులు. తృప్తికి రెండు రోజుల క్రితమే విప్రోలో ఉద్యోగం వచ్చిందని.. ఇలాంటి సంఘటన జరగడం బాధకరమంటున్నారు చుట్టుపక్కల వారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement