pune techie
-
శరద్ పవార్ కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు
ముంబై: ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు విషయమై ఆయన కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన ముంబై పోలీసులు ఈ చర్యకు పాల్పడింది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేగా గుర్తించి సోమవారం అతడిని అరెస్టు చేశారు. అదే గతి పడుతుంది.. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఒక వార్నింగ్ ప్రత్యక్షమైంది. ఆ బెదిరింపులో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ కు ఎదురైన పరిస్థితి అతి త్వరలో శరద్ పవార్ కు కూడా ఎదురవుతుందని, 2013లో నరేంద్ర దభోల్కర్ ను ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చి కాల్చి చంపినట్టే ఈయనను కూడా చంపుతామని పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ పోస్ట్ చేసిన వ్యక్తిని కనుగొనేందుకు విచారణ చేపట్టారు. ఆమెతో పాటు ఎన్సీపీ కార్యకర్త ఒకరు లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఎలా పట్టుకున్నారంటే.. ఈ వార్నింగ్ ఏ ఐపీ అడ్రస్ నుండి వచ్చిందన్న కోణంలో ఎంక్వైరీ చేయగా ఆ ఐపీ అడ్రస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేకు చెందినదని గుర్తించారు పోలీసులు. సాగర్ ఓ ప్రయివేటు కంపెనీలో డేటా ఫీడింగ్ అండ్ అనలిటిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. నిందితుడి వివరాలు తెలిసిందే తడవు వెంటనే సాగర్ బర్వేను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండుకు తరలించారు పోలీసులు. శరద్ పవార్ ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆయన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. నాయకత్వం చేతులు మారి పార్టీ కార్యాచరణ ముమ్మరం చేస్తున్న ఇదే సమయంలో ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆందోళనలో ఉన్నాయి పార్టీ వర్గాలు. ఎట్టకేలకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అరెస్టుతో ఎన్సీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి? -
అనుమానాస్పద స్థితిలో టెకి మృతి
ముంబై : పూణెకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తృప్తి ధిల్లాడ్ అనే యువతి మంచ మీద కూర్చుని, కిటీకికి ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పూణెలోని దేహు రోడ్లో, నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరని తెలిసింది. ఆ సమయంలో తృప్తి తండ్రి గుండేపోటుతో బాధపడుతుండటంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాయంత్రం నుంచి ఫోన్ మోగుతున్నప్పటికి ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు తృప్తి ఇంటికి వెళ్లి చూడగా ఆమె చనిపోయి కనిపించింది. దాంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే ఇది హత్యా, ఆత్యహత్య అనే విషయం ఇంకా తేలయలేదన్నారు పోలీసులు. తృప్తికి రెండు రోజుల క్రితమే విప్రోలో ఉద్యోగం వచ్చిందని.. ఇలాంటి సంఘటన జరగడం బాధకరమంటున్నారు చుట్టుపక్కల వారు. -
ఇన్ఫోసిస్ టెకీ హత్యలో సంచలన వాస్తవాలు!
''ఎవరో నా చాంబర్లోకి వస్తున్నారు.. నేను నీకు మళ్లీ ఫోన్ చేస్తాను'' ఇవీ పుణె ఇన్ఫోసిస్ కార్యాలయంలో హత్యకు గురైన రసీలా రాజు (24) చెప్పిన చివరి మాటలు. ఆరోజు ఆదివారం. నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శని, ఆదివారాల్లో పనిచేయాల్సిన అవసరం ఉండదు. కానీ, బాస్ తనను తరచు వేధిస్తున్నాడని, బలవంతంగా అదనపు సమయం పనిచేయిస్తున్నాడని ఆమె తన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆరోజు కూడా ఆమె తనకు వరుసకు సోదరి అయ్యే అంజలి నందకుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. తాను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అడిగానని, ఫిబ్రవరి మొదటివారంలో ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. కొద్ది సెకండ్లకే ఎవరో వస్తున్నారంటూ ఫోన్ కట్ చేశారు. మెడచుట్టూ కంప్యూటర్ కేబుల్ బిగించి ఆమెను ఎవరో హతమార్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె క్యూబికల్లో మృతదేహం బయటపడింది. ఆమె ముఖం మీద, ఎదమీద పలుసార్లు గట్టిగా కొట్టిన గుర్తులున్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమె ఎడమ భుజం మీద ఎవరో కొరికిన గుర్తులు కూడా ఉన్నాయని, దాన్నిబట్టి చూస్తే అత్యాచారయత్నం జరిగినట్లు.. ఆమె గట్టిగా పోరాడినట్లు తెలిసిందని బీజే మెడికల్ కాలేజికి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు చెప్పారు. ఆమెపై దాడి చేయడానికి ఏదో గట్టి వస్తువును ఉపయోగించారని, దాని గాయాలే ఆమె ముఖం మీద, ఎదమీద ఉన్నాయని తెలిపారు. ఆమె మెడకు పవర్ కేబుల్ ఉన్న స్థితిలోనే మృతదేహాన్ని మార్చురీకి తెచ్చారని, ఆ వైరును బాగా గట్టిగా బిగించడంతో ఆమె నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారిందని, బహుశా అది నిందితుడి దుస్తుల మీద కూడా పడి ఉండొచ్చని వివరించారు. ఇంత ఘోరమైన హత్య జరిగినా పోలీసులు మాత్రం ఫోరెన్సిక్ నిపుణులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లకుండా నేరుగా మృతదేహాన్ని తరలించడం షాకింగ్ అని అన్నారు. ఈ కేసులో ఇన్ఫోసిస్ సెక్యూరిటీ గార్డు సైకియా భాబెన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెవైపు చూసినందుకు తిట్టిందన్న కోపంతోనే చంపానని అతడు విచారణలో అంగీకరించాడు. అయితే, కేవలం సెక్యూరిటీ గార్డు మాత్రమే కాదని.. అసలు ఆమెను వేధించింది బాస్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన టీమ్ మేనేజర్ తన మీద అదనపు ఒత్తిడి పెడుతున్నారని, అతడితో లంచ్‌కి వెళ్లడానికి తాను నిరాకరించినప్పటి నుంచి అలా చేశారని, తాను పెట్టుకున్న ట్రాన్స్ఫర్ అప్లికేషన్‌ను కూడా పెండింగులో పెట్టారని బాధితురాలు.. హత్య జరగడానికి మూడు రోజుల క్రితమే తన తండ్రికి చెప్పింది. ట్రాన్స్ఫర్ విషయంలో ఆమె మేనేజర్‌కు, ఆమెకు గొడవ జరిగిందని, అప్పుడే ఆయన ఆమెకు గుణపాఠం చెబుతానని బెదిరించారని రసీలా సోదరుడు లైజిన్ కుమార్ చెప్పారు. 16 రోజుల కర్మకాండలు పూర్తయిన తర్వాత తాము పుణె వెళ్లి మేనేజర్ మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీచపు పని
పుణే: తనతో గొడవ పడుతున్న భార్యకు బుద్ధి చెప్పాలని నీచపు పనికి పాల్పడో భర్త. చేసిన అకృత్యం బయటపడి చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. తన భార్య ఫోన్ నంబరును ఎస్కార్ట్ వెబ్సైట్ లో పెట్టాడన్న ఆరోపణలతో అరుణ్ వేకర్(35) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కు చెందిన అరుణ్ తన భార్యతో కలిసి పుణేలోని సస్ రోడ్డులో నివాసముంటున్నాడు. రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ లో పనిచేస్తున్న తన భార్య(33)ను నిత్యం వేధించే వాడు. తన భార్య ఫోన్ నంబరు, ఇతర వివరాలు ఆమెకు తెలియకుండా ఎస్కార్ట్ వెబ్సైట్లో పెట్టాడు. కొత్త వ్యక్తుల నుంచి అభ్యంతకర ఫోన్ కాల్స్ వస్తుండడంతో అరుణ్ భార్య జూలై 22న హింజెవాది పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదంతా చేసింది అరుణ్ అని గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. తన భార్యను వేధించేందుకే ఆమె ఫోన్ నంబరును 2 నెలల క్రితం ఎస్కార్ట్ వెబ్సైట్ లో పెట్టినట్టు ఇంటరాగేషన్ లో అరుణ్ అంగీకరించాడు. రోజూ తనతో గొడవ పడుతున్న భార్యకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశానని చెప్పాడు. అరుణ్ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.