
మొయినాబాద్(చేవెళ్ల): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎత్‌బార్‌పల్లిలోసోమవారం ఉదయం జరిగింది. ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. ఏపీ గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామానికి చెందిన కుంచాల శ్రీను, కోటేశ్వరమ్మ(38) దంపతులు రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం మొయినాబాద్ మండలం ఎత్‌బార్‌పల్లికి వచ్చారు. స్థానికంగా అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం తెల్లవారినా కోటేశ్వరమ్మ నిద్రలేవకపోవడంతోఅక్కడే మరో ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమె సోదరి రమణమ్మ ఇంటి వద్దకు వెళ్లి చూసింది. బయటి నుంచి గడియ ఉండటంతోతీసి తలుపులు తెరిచి చూసింది. పడుకొని ఉన్న కోటేశ్వరమ్మను ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఆమె చుట్టుపక్కల వారిని పిలిచింది. ఆమెను పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పడుకున్న చోటనే కోటేశ్వరమ్మ మృతి చెంది ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
అనుమానంతో హత్య?
వివరాలు సేకరిస్తున్న పోలీసు
కోటేశ్వరమ్మను ఆమె భర్త శ్రీను హత్యచేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీను భార్యపై అనుమానంతో నిత్యం గొడవపడేవాడని.. ఆదివారం రాత్రి కూడా ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి దిండుతో గొంతు నుమిలి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి శ్రీను పరారీలో ఉండటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈమేరకు పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment