
మైసూరు(బెంగళూరు): నిర్మాణంలో ఉన్న భవనం గుంతలో ఒక వ్యాపారవేత్త కుమారుని మృతదేహం లభించింది. మైసూరు హెబ్బాళు పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సెన్ ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని చెరియన్ కుమారుడు క్రిస్టోఫర్ చెరియన్ మృతుడు. సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లిన క్రిస్టోఫర్ మధ్యాహ్నం నాటికి గుంతలో శవమై కనిపించాడు.
ఏడాదిన్నర క్రితం మరియా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక శిశువు కూడా జన్మించింది. మూడు నెలల కిందట ఒక ప్రమాదంలో క్రిస్టోఫర్‌కి కాలు విరిగింది. అప్పటి నుంచి ఎక్కడా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా అనేదానిపై విజయనగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు
Comments
Please login to add a commentAdd a comment