Kuldeep Singh: 22 Year Old Boxer From Punjab Dies Due To Drug Overdose - Sakshi
Sakshi News home page

Kuldeep Singh Passed Away: యువ బాక్సర్ అనుమానాస్పద మృతి

Jul 28 2022 7:33 PM | Updated on Jul 28 2022 9:29 PM

22 Year Old Boxer From Punjab Dies Due To Drug Overdose - Sakshi

ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఓ యువ బాక్సర్‌ ప్రాణాలు కోల్పోయిన ఘటన పంజాబ్‌లోని బటిండ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రస్థాయిలో రెండు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 5 పతకాలను సాధించిన తల్వండి సాబో గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ అలియాస్‌ దీప్‌ దలీవాల్‌ అనే 22 ఏళ్ల బాక్సర్ అధిక మోతాదులో హెరాయిన్‌ను ఇంజెక్ట్‌ చేసుకోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన  కుల్దీప్.. గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు.

అతని మృతదేహం పక్కన హెరాయిన్‌తో  పాటు మరికొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కుల్దీప్ అధిక మోతాదులో డ్రగ్స్‌ సేవించడం వల్లే మరణించి ఉంటాడని పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు. అయితే కుల్దీప్‌ కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంతో విభేదిస్తున్నారు. కుల్దీప్‌కు అసలు డ్రగ్స్ అలవాటే లేదని వాపోతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. 
చదవండి: Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్‌..?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement