న్యూఢిల్లీ: పంజాబ్ ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలు మరిచిందని టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన స్టార్ బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల క్రితం ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హామీలు ఇవ్వగా ఏవీ నెరవేరలేదని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టిక్‌టాక్ స్టార్లకు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఆర్థికం సాయం చేసిందని ఆమె విమర్శించారు. తనకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని, ఆర్థిక కష్టాల్లో ఉన్నాని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పంజాబ్ ప్రభుత్వం ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుని సాయం అందిస్తుందో తెలియడం లేదని సిమ్రన్ వాపోయారు. కాగా, సిమ్రన్‌జిత్ కౌర్ జనవరిలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో మీడియా ద్వారా ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న సీఎం అమరీందర్ సింగ్ అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు.
(చదవండి: కుంబ్లేతో మా పని సులువవుతుంది)
Comments
Please login to add a commentAdd a comment