Boxer
-
మళ్లీ ‘రింగ్’లోకి దిగాలనుంది
ముంబై: బాక్సింగ్ క్రీడకు తాను ఇంకా రిటైర్మెంటే ప్రకటించలేదని... మళ్లీ ప్రొఫెషనల్ బాక్సింగ్ సర్క్యూట్‌లోకి దిగాలనే ఆలోచన ఉందని భారత మేటి బాక్సర్ మేరీకోమ్ తెలిపింది. ‘పోటీల్లో పాల్గొనాలనుకుంటున్నాను. పునరాగమనంపై నా అవకాశాల కోసం చూస్తున్నా. ఇంకో నాలుగేళ్లు ఆడే సత్తా నాలో వుంది. నా ప్రపంచం బాక్సింగే. అందుకే అందులో ఎంత ఆడినా, పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్లెన్ని గెలిచినా ఇంకా కెరీర్‌ను కొనసాగించాలనే ఆశతో ఉన్నాను’ అని మాజీ రాజ్యసభ ఎంపీ అయిన మేరీకోమ్ తెలిపింది. పారిస్‌లో భారత బాక్సర్ల వైఫల్యం... దరిమిలా తన అభిప్రాయాలను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్యతో వివరించాలనుకుంటున్నట్లు చెప్పింది. ప్రపంచ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, రియో పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ పారిస్‌లో పతకాలు గెలుపొందలేకపోయారు. ఇక టోర్నీల సమయంలో బరువు నియంత్రణ, నిర్వహణ బాధ్యత పూర్తిగా క్రీడాకారులదేనని మేరీకోమ్ స్పష్టం చేసింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వంద గ్రాముల అధిక బరువుతో పసిడి వేటలో అనర్హతకు గురైంది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల మేరీ ఆమె పేరును ప్రస్తావించకుండా ‘బరువు’ బాధ్యత గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘ఈ విషయంలో నేనెంతగానో నిరాశకు గురయ్యాను. నేను కూడా ఇలాంటి సమస్యల్ని కొన్నేళ్ల పాటు ఎదుర్కొన్నాను. అతి బరువు నుంచి మనమే జాగ్రత్త వహించాలి. ఇది మన బాధ్యతే! ఇందులో నేను ఎవరినీ నిందించాలనుకోను. వినేశ్ కేసుపై నేను వ్యాఖ్యానించడం లేదు. నా కెరీర్లో ఎదురైన చేదు అనుభవాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. బరువును నియంత్రించుకోకపోతే బరిలోకి దిగడం కుదరదు. పతకం లక్ష్యమైనపుడు మన బాధ్యత మనకెపుడు గుర్తుండాలిగా’ అని వివరించింది. -
ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా బిక్షాటన ..నేడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని..!
మన చుట్టూ తరిచి చూస్తే స్ఫూర్తిని కలిగించే ఎన్నో కథలు మనమందు మెదులుతాయి. అలాంటి ప్రేరణ కలిగించే కథ మైసూరులో చోటు చేసుకుంది. ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా దుర్భరమైన జీవితాన్ని అనుభవించింది. ఆ తర్వాత ఓ చిన్నారిని దత్తత తీసుకుని తల్లిగా అద్భుతమైన అమ్మాయిగా తీర్చిదిద్ది సమాజమే సెల్యూట్ చేసేలా ఎదిగింది. అవమానాలను, అసమానతలకు తట్టుకుని..శక్తిమంతమైన మహిళగా ఎదుగుతూ మరొకరికి మంచి జీవితాన్ని ఇచ్చే మహత్తర కార్యం చేసి శెభాష్ అనిపించుకుంది. ఎవరా ట్రాన్స్ జెండర్ అంటే..ఆ ట్రాన్స్‌జెండర్ పేరు షబనా అక్రం పాషా. దాదాపు రెండు దశాబ్దాల క్రితం బీబీ ఫాతిమాను దత్తత తీసుకుంది. నిజానికి షబనా ట్రాన్స్‌జెండర్‌గా చిన్ననాటి నుంచి ఎన్నో చిత్కారాలు, అవమానాల మధ్య దుర్భరమైన జీవితాన్ని గడిపింది. బతకటం కోసం బిక్షాటన వృత్తిని కూడా చేసింది. అలాంటి షబానా తమలాంటి వాళ్లలో ఉన్న మంచి కోణాన్ని పరిచయం చేసింది. ఒకసారి ఫబానా దగ్గరి బంధువు నలుగురు కూతుళ్లను విడిచిపెట్టేసి పరారయ్యాడు. అయితే షబానా తాను బతుకు ఈడ్చటమే గగనం అన్న పరిస్థితుల్లో ఉండి కూడా ఏ మాత్రం సంకోచించకుండా ఆ నలుగురిని దత్తత తీసుకుంది. వారిని తన పిల్లలుగా పెంచడం ప్రారంభించింది. వారికి తల్లిగా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే దానిపైన దృష్టిపెట్టింది. అలా ఒక్కో పైసా పోగు చేసి బీబీ ఫాతిమా అనే అమ్మాయిని బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించి కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌గా తీర్చిదిద్దింది. ఈ క్రమంలో కూడా షబానా ఎన్నో అవమానాలు ఎదుర్కొక తప్పలేదు. ఎందుకంటే షబానే అనే ట్రాన్స్ జెండర్ కూతురు కాబట్టి ట్రైనింగ్‌లో అందరితో కాకుండా ఫాతిమాకు వేరుగా శిక్షణ ఇచ్చేవారు. అందుకోసం గంటలు తరబడి ఇన్స్టిట్యూట్ వెలుపలే వేచి ఉండాల్సి వచ్చేది. అయినా సరే ఈ తల్లి కూతుళ్ల ద్వయం 'తగ్గేదే లే' అంటూ ఆ అసమానతలు, వివక్షతను దాటి ప్రపంచానికి తామెంటో చూపించారు. శక్తిమంతమైన మహిళలుగా ఎదిగారు. షబానా కష్టం ఫలించి ఫాతిమా రాష్ట్ర, జాతీయ కిక్‌బాక్సర్‌గా రాణించడమే గాక ఏకంగా మొత్తం 23 పతకాలు సాధించింది. ప్రస్తుతం ఫాతిమాకు 20 ఏళ్లు. ఆమె పెంచిన కూతురు విజయంతో ఒక్కసారిగా షబానా ట్రాన్స్‌జెండర్ పేరు ప్రపంచానికి తెలిసేలా మారుమ్రోగింది. ఈ మేరకు షబానా మాట్లాడుతూ.." మా జీవితాలు తరచు వివక్ష, కళకంతో దెబ్బతిన్నాయి. అయినా మేము గొప్ప ప్రేమ, బాధ్యతను విస్మరించం. కేవలం ఈ అమ్మాయిలను దత్తత తీసుకుని తీర్చదిద్ది.. మాలాంటి వాళ్లను మనుషులుగా గుర్తించండి అని చెప్పాలనుకుంటున్నా. అన్ని రకాలుగా బాగున్న వాళ్లకంటే తామలాంటి వాళ్లే ఎంతో ఉదారంగా ఉంటారని చాటి చెప్పాలనుకున్నా అంటూ ఆవేదన చెప్పుకొచ్చింది." షబానా. మనలో చాలామంది ఆడపిల్ల అనగానే భారం అనే భావన నుంచి బయటపడటం లేదు. ఒకరికి మించి ఇద్దరు ఆడపిల్లలు అంటే నోరు బార్లా తెరుస్తారు.. వెంటనే చేతులు దులుపుకునే యత్నం చేస్తారు. కానీ షబానా తన బతకు గడవటమే కష్టంగా ఉన్నా..ఆ అమ్మాయిలను దత్తత తీసుకోవడమే గాక వారికి మంచి జీవితం ఇవ్వాలని తాపత్రయం పడటం అనేది ఎంతో స్ఫూర్తిదాయకం కదూ. (చదవండి: ఫరా ఖాన్ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!) -
ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్‌పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్‌ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్‌ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
Paris olympics: ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్‌పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్‌ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్‌ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
2000 సీసీ బీఎండబ్ల్యూ బాక్సర్ (ఫోటోలు)
-
నిఖత్ జరీన్‌కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. 52 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5–0 పాయింట్ల తేడాతో స్థానిక బాక్సర్, కజకిస్తాన్‌కు చెందిన జజీరా ఉరక్‌బయెవాపై ఘన విజయం సాధించింది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 4–1తో రహ్మొనొవా సైదాహొన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది. అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. -
నాలుగో బాక్సర్ కూడా తొలి రౌండ్లోనే...
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే దీపక్, నరేందర్, జాస్మిన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... తాజాగా వీరి సరసన మరో భారత బాక్సర్ లక్ష్య చహర్ కూడా చేరాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 80 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో ఇరాన్ బాక్సర్ గెష్లగి మేసమ్ భారత జాతీయ చాంపియన్ లక్ష్య చహర్‌ను నాకౌట్ చేశాడు. -
ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా: భారత టాప్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ ఏకపక్ష సమరంలో గెలిచి ఈ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీస్‌లో నిఖత్ 5–0 స్కోరుతో స్థానిక బాక్సర్ జ్లాటిస్లోవ్ చుకనోవాపై విజయం సాధించింది. తొలి రౌండ్లో నిఖత్ జాగ్రత్తగా ఆడగా బల్గేరియా బాక్సర్ కూడా పోటీనిచ్చింది. దాంతో స్కోరు 3–2తో ముగిసింది. అయితే తర్వాతి రెండు రౌండ్లలో ఆమెకు ఎదురు లేకుండా పోవడంతో 5–0, 5–0తో రౌండ్లు సొంతమయ్యా యి. ఓవరాల్ స్కోరింగ్‌తో చివరకు 5–0తో నిఖత్‌దే పైచేయి అయింది. నేడు జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సబీనా బొ»ొకులోవాతో నిఖత్ తలపడుతుంది. 66 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ అరుంధరి చౌదరి కూడా ఫైనల్‌కు చేరగా...పురుషుల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంఘాల్ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టాడు. -
నాన్న కలను నిజం చేస్తూ..
అచ్యుతాపురం (అనకాపల్లి): తాను బాక్సర్‌గా ఎదగాలనుకున్నాడు.. కాలం కలిసిరాక లారీ డ్రైవర్‌గా మిగిలాడు. అయితేనేం తన ఆశయాన్ని సజీవంగా ఉంచుకున్నాడు. కొడుకు ద్వారా తన కలను నెరవేర్చుకుంటున్నాడు. విశాఖకు చెందిన కాకి వెంకట సత్యనారాయణ బాక్సర్ అవ్వాలని భావించారు. రెండుసార్లు నేషనల్స్‌లో పాల్గొన్నారు కూడా. కానీ కాలం కలిసి రాలేదు. బతుకు తెరువు కోసం లారీ డ్రైవర్‌గా మారిపోయిన సత్యనారాయణ యలమంచిలి మండలం పురుషోత్తపురానికి వలస వచ్చారు. అక్కడికి సమీపంలోని ఒక సిమెంట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ.. తన కుమారుడు, కుమార్తెలకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించారు. కుమార్తె మధ్యలోనే విరమించగా 9 ఏళ్ల ప్రాయం నుంచి బాక్సింగ్‌లో శిక్షణ పొందిన కుమారుడు భవానీ ప్రసాద్ పతకాలు సాధిస్తూ.. తండ్రి కలను నిజం చేస్తున్నాడు. బాక్సింగ్ శిక్షణ అంటే ఆషామాషీ కాదు. కఠినంగా ఉండడమే కాదు శారీరక దారుఢ్యం నిలుపుకునేందుకు ఫీడింగ్‌కే బోలెడంత ఖర్చవుతుంది. కొడుకును తీర్చిదిద్దడానికి సత్యనారాయణ లక్షల్లో అప్పు చేశారు. తండ్రి తపనను అర్ధం చేసుకున్న భవానీ ప్రసాద్ బాక్సింగ్ రింగ్‌లో దూసుకుపోవడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు నేషనల్స్‌లో పాల్గొన్న ఈ బాక్సర్ ఇటీవల దుబాయ్‌లో ఓపెన్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. తాజాగా చెన్నయ్‌కి సమీపంలోని కడలూరులో నిర్వహించిన జాతీయ స్థాయి బాక్సింగ్‌లో ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ ర్యాంక్‌ను సాధించిన ప్రసాద్ ప్రస్తుతం విశాఖలోని నేషనల్ బాక్సర్ అమోర్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. తన కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో టాప్ 50లో స్థానం సంపాదించాలన్నది తన లక్ష్యమని, దీని కోసం ఎంత కష్టమైనా పడతానని సత్యానారాయణ సాక్షికి తెలిపారు. -
38 సార్లు అరెస్ట్! జైలర్ చొరవతో ఇలా! వివాహేతర సంబంధాలు.. ఈ ‘హీరో’ విలన్ కూడా!
1986 నవంబర్ 22 .. వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్. అప్పటికి విజేతగా ఉన్న జమైకా బాక్సర్ ట్రెవర్ బెర్బిక్ తన టైటిల్ నిలబెట్టుకునేందుకు తయారయ్యాడు. ఎదురుగా 20 ఏళ్ల కుర్రాడొకడు తనతో పోటీకి సిద్ధమయ్యాడు. అప్పటికే ఆ కుర్రాడు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నా సరే.. ఒకప్పుడు మొహమ్మద్ అలీనే ఓడించిన రికార్డు ఉన్న బెర్బిక్ గెలుపుపై ఎవరికీ సందేహాలు లేవు. మొత్తం 12 రౌండ్ల పోరు.. రెండో రౌండ్లో ఆ కొత్త బాక్సర్ విసిరిన ఒక పదునైన పంచ్‌కు బెర్బిక్ కుప్పకూలాడు. అయితే లేచి నిలబడే ప్రయత్నం చేసి మళ్లీ పడిపోయాడు. మరోసారి కూడా అలాగే శక్తి కూడదీసుకొని నిలబడే ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాక కింద పడిపోయాడు! ఒక్క దెబ్బకు బెర్బిక్ మూడు సార్లు నేలకూలాడు! అప్పటికి జరిగింది 2 నిమిషాల 35 సెకన్ల పోరు మాత్రమే. రిఫరీ వచ్చి ఆటను ఆపేశాడు. కొత్త కుర్రాడిని వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా ప్రకటించాడు. ఆ పంచ్ గురించి గర్వంగా చెప్పుకున్న, తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా అభివర్ణించుకున్న ఆ బాక్సర్ పేరే ‘మైక్ టైసన్’. సుదీర్ఘకాలం పాటు ఒక తరం మొత్తానికి బాక్సింగ్ అంటే టైసన్ మాత్రమే అనిపించుకున్న మహాబలుడు. ‘అమ్మను నేను ఎప్పుడూ సంతోషంగా చూడలేదు. నేను ఆమె కోసం ఏమీ చేయలేకపోయాను. వీథుల్లో నేను ఆవారాగా తిరుగుతూ గొడవలు పడుతుంటానని ఆమెకు తెలుసు. ప్రతిరోజూ కొత్త బట్టలతో వస్తుంటే అవి నేను కొన్నవి కాదనీ ఆమెకు తెలుసు. అసలు అమ్మతో నేను ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేకపోయాను’ అంటూ తన బాల్యం, తల్లి గురించి టైసన్ చెప్పుకున్న మాటలు అవి. నిజంగానే దశాదిశా లేని జీవితం. పట్టించుకోని తండ్రి.. గల్లీ గూండాలతో సాన్నిహిత్యం.. డీలర్ల నుంచి డ్రగ్స్ దొంగతనం.. టైసన్ చిన్నతనమంతా ఇలాగే సాగింది. 13 ఏళ్ల వయసు వచ్చే సరికే టైసన్ 38 సార్లు అరెస్ట్ అయ్యాడు. జైలర్ వల్లే అయితే టీనేజర్‌గా జైలుకు వెళ్లిన సమయం కూడా చివరకు అతని జీవితానికి కొత్త దారిని చూపించింది. ఒక స్ట్రీట్ ఫైటర్ స్థాయి నుంచి వరల్డ్ చాంపియన్‌గా నిలిపింది. టైసన్లోని ఆవేశాన్ని సరైన రీతిలో వాడుకుంటే అద్భుతాలు చేయవచ్చని గుర్తించిన వ్యక్తి అక్కడి జైలర్.. మాజీ బాక్సర్ కూడా అయిన బాబీ స్టివార్ట్! టైసన్ పవర్‌ను పద్ధతిగా ఉపయోగించుకునేలా చేశాడు. స్టివార్ట్తో పాటు తల్లి తాను చనిపోతూ టైసన్‌ను అప్పగించిన వ్యక్తి కస్ డి అమాటో.. ఆ తర్వాత టైసన్ దిగ్గజ బాక్సర్‌గా మారేందుకు దిశానిర్దేశం చేశాడు. టీనేజర్‌గా ఉన్నప్పుడే తాను ఇష్టపడే పావురం మెడ విరిచాడనే కోపంతో వీథిలో ఒక పెద్ద రౌడీ మెడవిరిచి తనలో ఆవేశాన్ని ప్రదర్శించిన టైసన్ ఆ తర్వాత ఎంతో మంది ప్రత్యర్థులను తన నాకౌట్ పంచ్‌లతో కుప్పకూల్చాడు. ఆరంభం అదిరేలా.. కెరీర్ ఆరంభంలో టైసన్ అమెచ్యూర్ బాక్సర్‌గా రాణించాడు. వరుసగా రెండేళ్లు జూనియర్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించాడు. అయితే అతని కోచ్‌లు, ప్రమోటర్లు వాటిని టైసన్ స్థాయికి మరీ చిన్నవిగా భావించారు. అందుకే అన్ని రకాలుగా సిద్ధం చేసి పదునైన ప్రొఫెషనల్ రింగ్లోకే దింపారు. టైసన్ వారి అంచనాలను వమ్ము చేయలేదు. 18 ఏళ్ల వయసులో తొలిసారి అసలు పోరులోకి దిగిన టైసన్ తొలి మ్యాచ్‌లో హెక్టర్ మెర్సిడెజ్‌తో తలపడ్డాడు. టెక్నికల్ నాకౌట్ ద్వారా తన ప్రత్యర్థిని చిత్తు చేసిన టైసన్‌ను చూడగానే అందరికీ కొత్త చాంపియన్ వచ్చాడని అర్థమైంది. అక్కడితో మొదలైన విజయ ప్రస్థానం 37 బౌట్ల వరకు సాగింది. వీటిలో తొలి 26 బౌట్లలోనైతే అతను ఏకపక్షంగా విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వని ఈ పోటీలన్నీ నాకౌట్ లేదా టెక్నికల్ నాకౌట్ ద్వారా ముగిశాయి. ఈ ప్రదర్శన చూస్తేనే అతని ఆధిపత్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. 20 ఏళ్ల 145 రోజుల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన అతను ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ‘బాక్సింగ్ భవిష్యత్ గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. రాబోయే కొన్నేళ్ల పాటు ఈ ఆటకు ప్రాచుర్యపరంగా శిఖరానికి తీసుకెళ్లగలవాడు వచ్చేశాడు’ అంటూ విశ్లేషకులంతా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. కొనసాగిన జోరు అతి బలమైన శరీరం, వేగంగా దూసుకొచ్చే చేయి, తీవ్రత, కచ్చితత్వంతో పాటు ఎప్పుడు పంచ్ విసరాలో తెలిసిన టైమింగ్‌తో టైసన్ బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించాడు. ప్రత్యర్థి శరీరంపై కుడి చేత్తో హుక్ చేసిన వెంటనే అప్పర్‌కట్‌తో దవడపై వరుసగా దాడి చేసే శైలికి ఎదురులేకుండా పోయింది. పైగా బలమైన డిఫెన్స్ అవతలి బాక్సర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అతని ఈ ఆటపై అప్పట్లో ‘మైక్ టైసన్స్ పంచ్ అవుట్’ పేరుతో ఒక వీడియో గేమ్ కూడా వచ్చి సూపర్ హిట్ అయిందంటే అతని పాపులారిటీ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో బాక్సింగ్ ప్రపంచాన్ని నడిపిస్తున్న మూడు వేర్వేరు సంఘాలు వేర్వేరు వరల్డ్ చాంపియన్ షిప్‌లను నిర్వహిస్తుండేవి. అలా డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీసీ, ఐబీఎఫ్ నిర్వహించిన వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ షిప్‌లలో గెలిచి ఈ మూడింటిలో ఒకేసారి చాంపియన్ గా నిలిచిన ఏకైక బాక్సర్‌గా చరిత్రలో నిలిచాడు టైసన్. ఆ ఒక్క ఓటమితో.. వరుసగా 37 బౌట్లలో విజయాలు, అన్ని హెవీవెయిట్ పోటీల్లోనూ విశ్వవిజేత, అప్రతిహతంగా సాగిపోతున్న మైక్ టైసన్ కు 1990 ఫిబ్రవరిలో షాక్ తగిలింది. తన మూడు టైటిల్స్‌ను కాపాడుకునేందుకు జేమ్స్ బస్టర్ డగ్లస్‌తో టైసన్ పోటీ పడాల్సి వచ్చింది. అప్పటికే కొంత కాలంగా వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతూ ప్రాక్టీస్‌కు కూడా తగినంత సమయం ఇవ్వలేకపోయిన టైసన్ ఈ పోరుకు వచ్చాడు. అయినా సరే అతనిపై 42–1 తేడాతో బెట్టింగ్ అంచనాలు ఉన్నాయి. కానీ 10 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు టైసన్ తడబడ్డాడు. 82 సెకన్ల వ్యవధిలో ముగిసిన పోరులో టైసన్ ఓడి తన మూడు టైటిల్స్‌ను కోల్పోయాడు. అతని కెరీర్లో ఇదే తొలి పరాజయం. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత సంచలన ఫలితాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఈ పరాజయం అప్పటికప్పుడు టైసన్ కు నష్టం కలిగించకపోయినా ఆటపై అతని ఏకాగ్రత చెదిరినట్లు బాక్సింగ్ ప్రపంచం గుర్తించింది. డగ్లస్‌తో పోరు తర్వాత మరికొన్ని విజయాలు దక్కినా, అవి మునుపటి టైసన్ ను చూపించలేకపోయాయి. టైసన్‌ను కూడా ఓడించవచ్చనే విషయాన్ని గుర్తించేలా చేశాయి. తర్వాతి తొమ్మిదేళ్ల కెరీర్లో 12 బౌట్లలో పాల్గొన్న టైసన్ ఐదింటిలో పరాజయం చవిచూడటం అతనిలో సత్తా తగ్గిందని నిరూపించాయి. దాంతో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి తప్పుకోవడం అనివార్యంగా మారింది. హోలీఫీల్డ్, లెనాక్స్ లూయీ లాంటి స్టార్లతో పాటు కెరీర్ చివర్లో డానీ విలియమ్స్, కెవిన్ మెక్‌బ్రైన్ లాంటి అనామకులు కూడా టైసన్ ను ఓడించగలిగారు. ఆద్యంతం వివాదాలమయం.. ఒక దశలో తన పంచ్‌లతో ప్రపంచాన్ని శాసించిన మహా బాక్సర్ జీవితంలో లెక్కలేనన్ని వివాదాలు ఉన్నాయి. ఒక అమ్మాయిపై అత్యాచారం చేసి ఆరేళ్ల జైలుశిక్షకు గురి కావడంతో టైసన్ పతనం మొదలైంది. శిక్ష తగ్గించుకొని మూడేళ్లకే బయటకు వచ్చినా ఇతరత్రా కూడా అతనిలోని ‘పాత టైసన్ ’ బయటకు వచ్చి కెరీర్‌ను నాశనం చేశాడు. వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌తో పట్టుబడటం వివాదాల కారణంగా అప్పటికే తెచ్చుకున్న పేరుప్రతిష్ఠలను కోల్పోవడమే కాకుండా తను ఆర్జించిన కోట్లాది సంపద కూడా ఆవిరైంది. బాక్సింగ్ రింగ్‌లో చూస్తే ఓటమి ఎదురువుతున్న దశలో పంచ్‌లతో కాకుండా హోలీఫీల్డ్ ‘చెవి కొరికి’ డిస్క్వాలిఫై కావడం అతని చక్కటి కెరీర్లో మచ్చగా మిగిలిపోయింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా బయట అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌తో పట్టుబడటం, డోపింగ్, కోర్టు వివాదాలు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ నెగెటివ్ వార్తలే! అద్భుతమైన అతని కెరీర్‌ను మరచి అతన్ని ఒక దుర్మార్గుడిలా చిత్రీకరించాయి. తన ఆత్మకథ ‘ద అన్ డిస్ప్యూటెడ్ ట్రూత్’లో అతను ఈ విషయాలన్నీ పంచుకున్నాడు. అమెరికాలో పలు టీవీ సిరీస్‌లలో నటించిన టైసన్ ఇటీవల తెలుగు సినిమా ‘లైగర్’లోనూ కనిపించాడు. అయితే టైసన్లోని ‘విలన్’ను పక్కన పెట్టి చూస్తే క్రీడా ప్రపంచంలో ఎదురు లేని ‘హీరో’ల్లో ఒకడిగా టైసన్ నిలిచిపోతాడనేది నిజం! -మొహమ్మద్ అబ్దుల్ హాది -
కేవలం ఉద్యోగం కోసం మొదలుపెట్టాడు.. విధిరాత మరోలా ఉంది! అందుకే ఇలా..
Achievers- Vijender Singh: బాక్సింగ్‌ను మన దేశంలో చాలా మంది ఒక ఆటగానే చూడరు. బాక్సర్లంటే గొడవలు చేసేవాళ్లనో లేదంటే పిచ్చివాళ్లుగానో ముద్ర వేస్తారు.. చాలా కాలంగా, చాలా మందిలో ఉన్న అభిప్రాయమది. ఆ కుర్రాడు కూడా మొదట్లో అలాగే అనుకున్నాడు. అందుకే ఆ ఆటకు దూరంగా ఉండటమే మేలనుకున్నాడు. కానీ తన ప్రమేయం లేకుండానే బాక్సింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఒక ఉద్యోగం పొందడానికి ఆ ఆట ఉంటే సరిపోతుందని సాధన చేశాడు. ఏకంగా ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశం గర్వించదగిన బాక్సర్‌గా నిలిచాడు. అతడే విజేందర్ సింగ్ బేనివాల్... ఒలింపిక్స్‌లో మెడల్ గెలుచుకున్న తొలి భారత బాక్సర్. హరియాణాలోని భివానీ పట్టణం.. ఢిల్లీ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో దాదాపు 2 లక్షల జనాభాతో ఉంటుంది. ఆ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను అందించిన ఊరు. రాజకీయపరమైన విశేషాన్ని పక్కన పెడితే అది భారత బాక్సింగ్‌కు సంబంధించి ఒక పెద్ద అడ్డా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు చెందిన కోచింగ్ కేంద్రం అక్కడ ఉండటంతో ఎంతో మంది బాక్సర్లు అక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన హవా సింగ్ పట్టుబట్టి మరీ ‘సాయ్’ కేంద్రాన్ని అక్కడికి తీసుకొచ్చారు. అనంతరం అది అద్భుతమైన ఫలితాలను అందించింది. PC: Vijender Singh Instagram ఒకే ఒక్కడు.. విజేందర్ సింగ్ కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఐదుగురు బాక్సర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే అందులో నలుగురు.. ‘మినీ క్యూబా’గా పిలిచే భివానీ సెంటర్‌కు చెందినవారు కావడంతో ఒక్కసారిగా దాని గుర్తింపు పెరిగిపోయింది. ఈ ఐదుగురిలో విజేందర్ సింగ్ ఒక్కడే సత్తా చాటి కాంస్య పతకంతో మెరిశాడు. భారత బాక్సింగ్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అన్న స్ఫూర్తితో.. విజేందర్ తండ్రి హరియాణా ఆర్టీసీలో డ్రైవర్. మరీ పెద్ద సంపాదన కాదు. కానీ ఇద్దరు పిల్లల్ని బాగా చదివించాలనే తాపత్రయంతో సాధ్యమైనంతగా కష్టపడేవాడు. అయితే పెద్ద కొడుకు మనోజ్ సహజంగానే స్థానిక మిత్రుల సాన్నిహిత్యంతో బాక్సింగ్ వైపు వెళ్లాడు. గొప్ప విజయాలు సాధించకపోయినా.. స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం దక్కించుకునేందుకు అది సరిపోయింది. విజేందర్కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అన్నకు ఉద్యోగం వచ్చి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది. దాంతో అప్పటి వరకు బాగానే చదువుతున్న విజేందర్కు చదువుకంటే ఆటనే బాగుంటుందనిపించింది. చివరకు తండ్రి, అన్న కూడా అతడిని కాదనలేకపోయారు. దాంతో పూర్తి స్థాయిలో బాక్సింగ్ శిక్షణ వైపు మళ్లించారు. సహజ ప్రతిభ కనబర్చిన అతను ఆటలో వేగంగా మంచి ఫలితాలు సాధించాడు. భార్యాపిల్లలతో విజేందర్‌సింగ్ PC: Vijender Singh Instagram వరుస విజయాలు.. హరియాణా రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచిన తర్వాత 12 ఏళ్ల వయసులో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్ కావడంతో తొలిసారి విజేందర్కు గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో 2003లో జరిగిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అతని కెరీర్‌కు కీలకంగా మారాయి. అప్పటికి జూనియర్ స్థాయిలోనే ఆడుతున్నా.. పట్టుదలగా పోటీ పడి సీనియర్ టీమ్‌లో చోటు దక్కించుకున్న విజేందర్ రజతంతో సత్తా చాటాడు. అయితే ఇదే ఊపులో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ కోసం సిద్ధమైన విజేందర్కు షాక్ తగిలింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. దాంతో తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని విజేందర్కు అర్థమైంది. ఒలింపిక్ పతకం వైపు.. ఏథెన్స్ ముగిసిన రెండేళ్ల తర్వాత విజేందర్ కెరీర్ కీలక మలుపు తీసుకుంది. తన వెయిట్ కేటగిరీని మార్చుకోవాలని అతను తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను అందించింది. 75 కేజీల మిడిల్వెయిట్కు అతను మారాడు. అదే ఏడాది దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన విజేందర్.. ఆ ఏడాదే కామన్వెల్త్ క్రీడల్లోనూ రజత పతకం గెలుచుకున్నాడు. దాంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జర్మనీలో ప్రత్యేక శిక్షణ అనంతరం అది రెట్టింపైంది. ఒలింపిక్స్‌లోనూ రాణించగలననే నమ్మకంతోనే అతను బీజింగ్‌లో అడుగు పెట్టాడు. చివరకు దానిని సాధించడంలో విజేందర్ సఫలమయ్యాడు. 22 ఆగస్టు, 2008న కంచు పతకం సాధించి ఒలింపిక్స్‌లో ఈ ఘనత నమోదు చేసి తొలి భారత బాక్సర్‌గా వేదికపై సగర్వంగా నిలిచాడు. ఈ విజయంలో ఒక్కసారిగా విజేందర్‌ను కీర్తి, కనకాదులు వరించాయి. కానీ అతను ఏ దశలోనూ ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ఒలింపిక్ పతకం తర్వాత కూడా వరల్డ్ చాంపియన్ షిప్లో, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్ షిప్లో వరుస పతకాలు గెలుచుకున్నాడు. వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకున్నాడు. PC: Vijender Singh Instagram డ్రగ్స్ వివాదాన్ని దాటి.. ఆటగాడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత ఒలింపిక్స్ మెడల్ గెలిచిన నాలుగేళ్లకు విజేందర్ కెరీర్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా స్పోర్ట్స్‌మన్ డ్రగ్స్ అంటే నిషేధిత ఉత్ప్రేరకాలే అని వినిపిస్తుంది. కానీ ఇది అలాంటిది కాదు. విజేందర్ హెరాయిన్ తదితర డ్రగ్స్‌ను తీసుకుంటూ పట్టుబడ్డాడని పోలీసులు ప్రకటించారు. ఒక డ్రగ్ డీలర్ ఇంటి ముందు విజేందర్ భార్య కారు ఉండటం కూడా పోలీసు విచారణంలో కీలకంగా మారింది. పోటీలు లేని సమయంలో తీసుకునే డ్రగ్స్‌కు సంబంధించి తాము పరీక్షలు చేయలేమంటూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించడం విజేందర్కు ఊరటనిచ్చింది. అయితే యువ ఆటగాళ్లపై ఇలాంటి ఘటనలు ప్రభావితం చూపిస్తాయంటూ నేరుగా కేంద్రప్రభుత్వం ఆదేశించడంతో ‘నాడా’ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 14 నెలలు వివాదం సాగిన తర్వాత విజేందర్కు ‘క్లీన్చిట్’ లభించింది. పురస్కారాలు ఆటగాడిగా అద్భుత ప్రదర్శనకు భారత ప్రభుత్వం అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న విజేందర్ సింగ్... పలు సంస్థలకు మాడలింగ్ చేయడంతో పాటు ‘పగ్లీ’ అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించాడు. త్వరలో రాబోయే సల్మాన్ ఖాన్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లోనూ అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు.. ఇతర భారత బాక్సర్లతో పోలిస్తే విజేందర్ సింగ్ కెరీర్ కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఒలింపిక్ పతకం అందించిన అమెచ్యూర్ బాక్సింగ్‌ను దాటి ఏ భారత బాక్సర్ ఆలోచించలేదు. కానీ విజేందర్ మాత్రం సాహసం ప్రదర్శించాడు. అమెచ్యూర్తో పోలిస్తే ఎంతో ప్రమాదకరంగా, రక్షణ ఉపకరణాలు వాడే అవకాశం లేని ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టాడు. ‘సాధించిన పేరు ప్రతిష్ఠలు చాలు. ఇప్పుడు ఇదంతా అవసరమా? లేనిపోని ప్రమాదం కొనితెచ్చుకోవడమే’ అని సహచరులు వారించినా అతను వెనుకడుగు వేయలేదు. నేను బాక్సర్‌ను, ఎక్కడైనా పోరాడతాను అంటూ తన గురించి తాను చెప్పుకున్న విజేందర్, 2015 అక్టోబరులో తొలిసారి ఇందులోకి అడుగు పెట్టాడు. అంచనాలకు మించి రాణించిన అతను అక్కడా మంచి విజయాలు అందుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో 14 బౌట్లు ఆడిన అతను 13 గెలిచి ఒకసారి మాత్రమే ఓడాడు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే విజేందర్ సింగ్ 2011లో ఢిల్లీకి చెందిన అర్చనా సింగ్‌ను వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు అబీర్ సింగ్, అమ్రిక్ సింగ్ సంతానం. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్ -
సుమీత్ నగాల్ అవుట్...
పుణే: దేశంలోని ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్రలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ పోరు ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫిలిప్ క్రజినోవిచ్ (సెర్బియా) 6–4, 4–6, 6–4 స్కోరుతో నగాల్‌పై విజయం సాధించాడు. 2 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ‘వైల్డ్ కార్డ్’ సుమీత్ తీవ్రంగా పోరాడినా లాభం లేకపోయింది. క్రజినోవిచ్ 8 ఏస్‌లు కొట్టగా, నగాల్ 3 ఏస్‌లు నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మైకేల్ మో 6–2, 6–4 స్కోరుతో 15 ఏళ్ల భారత సంచలనం మానస్ ధమ్నేపై విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫైనల్లో శివ థాపా జాతీయ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్ శివ థాపా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆరు సార్లు ఆసియా పతకాలు సాధించిన అస్సాం బాక్సర్ థాపా... 63.5 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో జస్వీందర్ సింగ్ (ఢిల్లీ)ని తన నాకౌట్ పంచ్‌తో చిత్తు చేశాడు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన రోహిత్ టోకస్ (రైల్వేస్) కూడా 5–0తో జై సింగ్ (ఛత్తీస్‌గఢ్)పై ఘన విజయం సాధించాడు. -
బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
భోపాల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి దగ్గర ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటి వరకు అయిదు రాష్ట్రాల్లో పూర్తయ్యింది. రోజుకీ సగటున 20-25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారు. భిన్న నేపథ్యాలు, భిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మొత్తం 12 రాష్ట్రల్లో యాత్ర కొనసాగనుంది. 150 రోజుల్లో ఆయన 3,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జోడో యాత్ర ముగుస్తుంది. రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, నటీనటులు పాల్గొని జోడో యాత్రలో జోష్ నింపుతున్నారు. వీరే కాక వేలాది మంది విద్యార్థులు, యువత, మధ్య వయస్కులు, మహిళలు, ఉద్యమకారులు.. ఇలా ఎందరో రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ఒలంపిక్ మెడలిస్ట్, బాక్సర్, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ జోడో యాత్రలో జాయిన్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో కాంగ్రెస్ నాయకుడితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్‌తో మాట్లాడుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడిచారు. ఆ సమయంలో ఇద్దరూ హర్యాన్వీ స్టైల్లో తమ మీసాలు తిప్పారు. బాక్సింగ్ పంచ్ ఇస్తున్నట్లు కూడా ఫోజు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో రాహుల్, విజేందర్ సింగ్‌తో పాటు పక్కన ప్రియాంక కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है। शुक्रिया आपका...🙏🏻 pic.twitter.com/4oZOFqPdp9 — Congress (@INCIndia) November 25, 2022 హర్యానాలోని భివాని జిల్లాకు చెందిన విజేందర్ సింగ్.. గత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అతను బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా నలిచారు. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెషనల్ బాక్సర్‌గా రాణిస్తూ అనేక దేశాల్లో పోటీల్లో పాల్గొంటున్నారు. -
బాక్సర్‌గా మారిన రొనాల్డో.. ఇదంతా దాని కోసమా!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఫుట్‌బాలర్‌గా వెలుగొందుతున్న రొనాల్డో బాక్సర్‌గా దర్శనమిచ్చాడు. కండలు తిరిగిన దేహంతో బాక్సింగ్ రింగ్‌లో ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రత్యర్థితో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రొనాల్డో లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఫుట్‌బాలర్ కంటే బాక్సర్‌గానే రొనాల్డో బాగున్నాడంటూ అభిమానులు తెగ సంతోషపడిపోయారు. కానీ వారి ఆనందం కాసేపు మాత్రమే మిగిలింది. ఇదంతా ఒక యాడ్ కోసమని తెలియగానే ఫ్యాన్స్ నాలుక కరుచుకున్నారు. అవునండీ రొనాల్డో.. అండర్వేర్ దుస్తులకు సంబంధించిన ఒక యాడ్‌లో పాల్గొన్నాడు. సీఆర్ 7 బ్రాండ్ కలిగిన అండర్వేర్ యాడ్‌కు రొనాల్డో ప్రమోషన్ చేశాడు. ''బద్దకానికి వ్యతిరేకంగా నా పోరాటం ప్రారంభమైంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక రొనాల్డో ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదిలే రొనాల్డొ ఎనర్జీ వెనుక అతని ఫిట్నెస్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత పాపులారిటీ కలిగిన ఆటగాడిగా పేరున్న రొనాల్డో ఇటీవలే ఆటకు తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ప్రతిష్టాత్మక ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ తొలిసారి టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికి రొనాల్డోకు క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదని తాజా వీడియో నిరూపించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫుట్‌బాల్ తర్వాత రొనాల్డోకు అత్యంత ఇష్టమైన క్రీడ ఎంఎంఏ(MMA-మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్). ఫుట్‌బాల్ కెరీర్ నుంచి తప్పుకున్న తర్వాత ఎంఎంఏ క్రీడలో పెట్టుబడులు పెడతానని రొనాల్డొ ఇదివరకే పేర్కొన్నాడు. కాగా తాను ఫుట్‌బాలర్ కాకపోయుంటే కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందేవాడినని రొనాల్డో ఒక సందర్భంలో తెలిపాడు. View this post on Instagram A post shared by CR7 (@cr7cristianoronaldo) చదవండి: సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు! -
CWG 2022: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘పసిడి’ పంచ్‌తో..
CWG 2022- Boxer Nitu Ghanghas: బాక్సింగ్‌లో మన అమ్మాయిల పంచ్ కామన్వెల్త్ క్రీడల్లో గట్టిగా పడింది. తెలంగాణ నిఖత్ జరీన్‌తో పాటు హర్యాణ నీతు ఘణఘస్ కూడా స్వర్ణం సాధించింది. నిఖత్ వెనుక ఆమె తండ్రి ఎలా మద్దతుగా నిలిచాడో నీతు ఘంఘస్ వెనుక ఆమె తండ్రి జై భగవాన్ నిలిచాడు. హర్యాణ విధాన సభలో బిల్ మెసెంజర్‌గా పని చేసే జై భగవాన్ ఉద్యోగానికి జీతం లేని సెలవు పెట్టి నీతు బాక్సింగ్‌కు వెన్నుదన్నుగా నిలిచాడు. అతని త్యాగం ఫలించింది. నీతు బంగారు పతకం సాధించింది. ఆదివారం కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన నీతు ఘణఘస్ అక్కడి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో అభిమానులు ‘భారత మాతాకీ జై’ అని ఉత్సాహంగా నినాదాలు ఇస్తుంటే తన మెడలోని బంగారు పతకాన్ని చూపుతూ ‘ఈ పతకం ఈ దేశ ప్రజలందరితో పాటు మా నాన్నకు అంకితం’ అని చెప్పింది. కామన్వెల్త్ క్రీడలలో 45– 48 కేజీల విభాగంలో నీతు ఘణఘస్ ఇంగ్లండ్ బాక్సర్ డెమీ జేడ్‌ను ఘోరంగా ఓడించింది. ఎంత గట్టిగా అంటే రెఫరీలందరూ ఆమెకు ఏకగ్రీవంగా 5–0తో గెలుపునిచ్చారు. ‘మా కోచ్ భాస్కర్ చంద్ర భట్ నాతో నీ ప్రత్యర్థి ఎత్తు తక్కువ ఉంది. ఎక్కువగా దాడి చేసే వీలు ఉంది. కాచుకోవడానికి పక్కకు జరుగుతూ దాడి చెయ్ అన్నారు. అదే పాటించాను’ అంది నీతు. ఇలాంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొంది కాబట్టే ఇవాళ ఆమె విజేత అయ్యింది. తండ్రికీ, దేశానికీ గర్వకారణంగా నిలిచింది. అతని గెలుపుతో స్ఫూర్తి 2008లో బీజింగ్ ఒలిపింగ్స్లో బాక్సర్ విజేందర్ సింగ్ స్వర్ణం సాధించడంతో నీతు కల మొదలైంది. అప్పటికి ఆ అమ్మాయికి 8 ఏళ్లు. ఆమె ఊరు ధనానాకు విజేందర్ సింగ్ ఊరు సమీపంలోనే ఉంటుంది. ఆ తర్వాత మూడు నాలుగేళ్ల వరకూ విజేందర్ విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో నీతు తాను కూడా బాక్సర్ కావాలని నిశ్చయించుకుంది. ముగ్గురు తోబుట్టువులలో ఒకరైన నీతు ఇంట్లోగాని స్కూల్లోగాని ఫైటింగుల్లో ముందు ఉంటుంది. ఆ దూకుడు గమనించిన తండ్రి జై భగవాన్ ఆమెను బాక్సర్‌ను చేయడానికి నిశ్చయించుకుని చండీగఢ్‌లోని కుటుంబాన్ని ధనానాకు మార్చాడు. తను ఉద్యోగం చేస్తూ కూతురిని అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘భివాని బాక్సింగ్ క్లబ్’కు శిక్షణ కోసం వెళ్లి వచ్చే ఏర్పాటు చేశాడు. భివానిలోనే విజేందర్ సింగ్ బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. రెండేళ్లు గడిచిపోయాయి. కాని నీతు బాక్సింగ్‌లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. ‘నేను బాక్సింగ్ మానేస్తాను నాన్నా’ అని తండ్రికి చెప్పింది. కాని కూతురు అలా నిరాశలో కూరుకుపోవడం తండ్రికి నచ్చలేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి చండీఘడ్‌లో విధాన సభలో బిల్ మెసెంజర్‌గా పని చేసేవాడు. చిన్న ఉద్యోగం. మూడేళ్లు లీవ్ అడిగాడు కూతురి కోసం. అన్నేళ్లు ఎవరు ఇస్తారు. పైగా కూతురి బాక్సింగ్ కోసం అంటే నవ్వుతారు. కాని జై భగవాన్ లాస్ ఆఫ్ పే మీద వెళ్లిపోయాడు. సొంత ఊరు ధనానాకు చేరుకుని ఉదయం సాయంత్రం కూతురిని ట్రైనింగ్‌కు తీసుకెళ్లసాగాడు. జరుగుబాటుకు డబ్బులు లేవు. తండ్రి నుంచి వచ్చిన పొలంలో కొంత అమ్మేశాడు. ఎప్పుడో కొనుక్కున్న కారు అమ్మేశాడు. ఒక్కోసారి ట్రైనింగ్ కోసం ధనానా నుంచి భివానికి నీతు వెళ్లకపోయేది. ఇంట్లోనే సాధన చేయడానికి ఊక బస్తాను వేళ్లాడగట్టి ఉత్సాహపరిచేవాడు. ‘నువ్వు గొప్ప బాక్సర్వి కావాలి’ అనేవాడు. ‘నాన్నా... నేను మంచి బాక్సర్‌ని కాకపోతే నువ్వు ఉద్యోగంలో చేరిపో’ అని నీతు అనేది. ‘దాని గురించి ఆలోచించకు’ అని లక్ష్యంవైపు గురి నిలపమనేవాడు. విజయం వరించింది జై భగవాన్ అతని భార్య ముకేశ్ కుమారి కలిసి నీతు మీద పెట్టుకున్న ఆశలు ఫలించాయి. 2017, 2018 రెండు సంవత్సరాలు వరుసగా యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో నీతు ఛాంపియన్‌గా నిలిచింది. 21 ఏళ్ల వయసులో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో దిగి గోల్డ్‌మెడల్ సాధించడంతో ఆమె ఘనత ఉన్నత స్థితికి చేరింది. గొప్ప విషయమేమంటే ఏ విధాన సభలో తండ్రి పని చేస్తాడో అదే విధాన సభ చైర్మన్ జ్ఞాన్‌చంద్ నీతు విజయం గురించి విని సంబరాలు జరపడం. నీతు తండ్రి జై భగవాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. ‘మనమ్మాయి గొప్ప విజయం సాధించింది’ అన్నాడాయన జై భగవాన్‌తో నిజమే. ఇప్పుడు నీతు ‘మన అమ్మాయి’. మన భారతదేశ గర్వకారణం. చదవండి: CWG 2022: నిఖత్ జరీన్‌కు అరుదైన గౌరవం Sourav Ganguly: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్ రా బాబు!
Common Wealth Games 2022.. డోపింగ్ టెస్టులో అడ్డంగా దొరికిన ఘనా బాక్సర్ షాకుల్ సమద్‌ను కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు సస్పెండ్ చేశారు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన యాంటీ డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలాడు. షాకుల్ నిషేధిత డ్రగ్(ఫ్యూరోసిమైడ్) తీసుకున్నట్లు యాంటీ డోపింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో బాక్సర్ షాకుల్ సమద్‌పై కామన్వెల్త్ సస్పెన్షన్ వేటు విధించింది. కాగా ఇంతకముందు టోక్యో ఒలింపిక్స్‌లోనూ షాకుల్ సమద్ వెయిట్ విషయంలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వెయిట్ కేటగిరి విషయంలో తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడంతో నిర్వాహకులు మ్యాచ్ ఆడేందుకు అనుమతించలేదు. దీంతో తన ప్రత్యర్థి ఆటగాడికి వాకోవర్ లభించింది. తాజాగా కామన్వెల్త్లో పతకం సాధిస్తాడనుకుంటే ఈసారి ఏకంగా డోపింగ్ టెస్టులో దొరికిపోయి గేమ్స్ నుంచి సస్పెండ్ అయ్యాడు. దీంతో ఈ ఘనా బాక్సర్ ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే పనిగా పెట్టుకున్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా! Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
యువ బాక్సర్ అనుమానాస్పద మృతి
ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఓ యువ బాక్సర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన పంజాబ్‌లోని బటిండ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రస్థాయిలో రెండు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 5 పతకాలను సాధించిన తల్వండి సాబో గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ అలియాస్ దీప్ దలీవాల్ అనే 22 ఏళ్ల బాక్సర్ అధిక మోతాదులో హెరాయిన్‌ను ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుల్దీప్.. గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. A five-time medal winner and national-level boxer died, allegedly due to drug overdose, at Talwandi Sabo in this district on Thursday. Kuldeep Singh, aka Deep Dhaliwal, 22, had won five medals including two gold. #DRUGS #Punjab #Udta #Punjab pic.twitter.com/F6DCpq10dT — Ankush Saini अंकुश सैनी ਅੰਕੁਸ਼ ਸੈਣੀ انکوش سائیں (@ank1saini) July 28, 2022 అతని మృతదేహం పక్కన హెరాయిన్‌తో పాటు మరికొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కుల్దీప్ అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడం వల్లే మరణించి ఉంటాడని పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు. అయితే కుల్దీప్ కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంతో విభేదిస్తున్నారు. కుల్దీప్కు అసలు డ్రగ్స్ అలవాటే లేదని వాపోతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. చదవండి: Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్..? -
మేరీ కోమ్ విల్ పవర్ పంచ్
ముప్పై తొమ్మిదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. (ఆడపిల్లలు లేని కారణంగా దత్తత తీసుకున్న అమ్మాయితో కలిపి నలుగురు పిల్లలు). ఆరు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్. ఒక ఒలింపిక్ మెడల్! మొన్నటి వరకు రాజ్యసభ సభ్యురాలు. ఏమిటి మేరీ కోమ్ విజయ రహస్యం? బాక్సర్‌గా అనుభవమా? ఆమె ఫిట్నెస్సా? రెండూ! రెండిటినీ మించి గెలవాలన్న తపన. అలాగని కోమ్ మరీ గంటల కొద్దీ ప్రాక్టీసేం చెయ్యరు. యువ బాక్సర్లకు రెండు గంటల ప్రాక్టీస్ చాలు. కోమ్‌కి రోజూ 40 నుంచి 45 నిమిషాల సాధన సరిపోతుందట. ఇక శక్తి. ఎక్కడి నుంచి వస్తుంది ఆమెలోంచి ఆ పవర్ పంచ్? విల్ పవర్ ఎలాగూ ఉంటుంది. డైట్ ఏమిటి? స్పెషల్‌గా ఏమీ ఉండదట. ఏం తినాలని ఉంటే అప్పటికి అది తినేస్తారట. జన్రల్‌గా కోమ్ తినేది వరన్నం (వరి అన్నం). ‘‘రైస్ లేకుండా నేను బతకలేను. తరచు జిలేబీలు తింటాను. అలాగే ఐస్‌క్రీమ్. ఒక్కోసారి రెండూ కూడా. అయితే నో మసాలా.. నో స్పైసీ ఫుడ్’’ అని చెప్తారు మేరీ కోమ్. ఇవి మాత్రమే కాదు. సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారట. బలమిచ్చే మందులు. డాక్టర్ నిఖిల్ లేటీ ఆమె ఫిజియోథెరపిస్ట్. ఆయన్నడిగితే కోమ్ ఆహారపు అలవాట్ల గురించి మరికొంత వివరంగా చెబుతారు. ఇంట్లో వండిన మణిపురి ఫుడ్. అన్నంలోకి మాంసం, కూరగాయలు. బయట డబ్బాలో లభించే ప్రొటీన్, మల్టీ విటమిన్లు. ఇదీ మేరీ మెనూ. సరే, బాక్సింగ్‌లో ఆడడానికి ఒక వెయిట్ ఉండాలి కదా! ఆ వెయిట్‌ని ఎక్కువా కాకుండా, తక్కువగా కాకుండా కోమ్ ఎలా మేనేజ్ చెయ్యగలుగుతున్నారు? పోటీలో కేటగిరీలను బట్టి ఆటకు తగ్గట్లు కేలరీలు పెంచడం, తగ్గించడం కోమ్‌కి కష్టమేం కాదట! బరువు తగ్గడానికి స్కిప్పింగ్, బ్యాడ్మింటన్. పెరగడానికి.. బలమైన ఆహారం. క్రమబద్ధమైన వ్యాయామం. చివరగా ఒక్క విషయం. కోమ్ సాధారణంగా బంగారు పతకాన్నో, ఇంకో బ్రాస్ పతకాన్నో పంటి కింద కొరుకుతూ కనిపిస్తారు కానీ.. ఆహారాన్ని భుజిస్తూ ఎక్కడా కనిపించరు! అలాగే ఇకముందు పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో కూడా మేరీ కోమ్ కనిపించబోవడం లేదు. యువ బాక్సర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. కోమ్ మణిపూర్‌లో జన్మించిన మన చైనత్య భారతి. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. కష్టపడి పైకొచ్చారు. క్రీడాకారిణిగా రాణించారు. (చదవండి: తొలి మహిళా రాష్ట్రపతి... తొలి ఆదివాసీ రాష్ట్రపతి) -
కామన్వెల్త్కు హుసాముద్దీన్
పటియాలా: తెలంగాణకు చెందిన బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలోకి ఎంపికయ్యాడు. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించిన భారత బాక్సింగ్ సమాఖ్య వేర్వేరు విభాగాలకు చెందిన ఎనిమిది మంది బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేసింది. 57 కేజీల విభాగం ట్రయల్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4–1 తేడాతో 2019 ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత కవీందర్ సింగ్‌పై విజయం సాధించడంతో అతనికి అవకాశం దక్కింది. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొన్న హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. భారత జట్టు వివరాలు: అమిత్ పంఘాల్ (51 కేజీలు), హుసాముద్దీన్ (57), శివ థాపా (63), రోహిత్ టోకస్ (67), సుమిత్ (75), ఆశిష్ కుమార్ (80), సంజీత్ (92), సాగర్ (92 ప్లస్). -
రింగ్‌లోనే కుప్పకూలిన బాక్సర్.. వీడియో వైరల్
జర్మనీ స్టార్ బాక్సర్ ముసా యమక్ మరణం క్రీడాలోకాన్ని దిగ్రాంతికి గురి చేసింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ముసా యమక్ రింగ్‌లోనే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 38 సంవత్సరాల జర్మన్ ఛాంపియన్ మూసా యమక్ గత శనివారం ఉగాండకి చెందిన హమ్జా వాండెరతో బాక్సింగ్‌కి దిగాడు. వీరిద్దరి మధ్య మూడు సెట్ల మ్యాచ్ జరుగుతుండగా.. సెకండ్ రౌండ్లో వాండెర బలంగా మూసాని బలంగా గుద్దాడు. దాంతో మూడో రౌండ్ ముందు రింగ్‌లోకి రాగానే మూసా కుప్పకూలినట్లు పలు పత్రికలుధ్రువీకరించాయి. రింగ్‌లోనే మూసా కుప్పకూలడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే బాక్సర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా టర్కిష్ సంతతికి చెందిన యమక్ 2017లో బాక్సింగ్‌లోకి వచ్చినా.. 2021లో డబ్ల్యూబీఫెడ్ ఇంటర్నేషనల్ టైటిల్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. యూరోపియన్, ఆసియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన మూసా యమక్ మరణంపై తోటి బాక్సర్లు తమ సంతాపం ప్రకటించారు. చదవండి: Womens World Boxing Championships: పసిడికి పంచ్ దూరంలో... -
గెలుపంటే ఇది అనిపించేలా సాధించింది: వీడియో వైరల్
Despite Losing Shoe She Won Track Race: మనం చాలా క్రీడల్లో చూస్తుంటాం. అసలు వాళ్లు ఆ ఆటలో ఓడిపోతారేమో అనుకునే సమయంలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచి చూపిస్తారు. అంతెందుకు క్రికెట్ మ్యాచ్ లేదా టెన్నిస్ మరే ఏ ఆటైన ఆ క్రీడాకారులు ఆడుతున్న తీరు చూసి గెలవరని అర్థమైపోతుంది. కానీ వాళ్లు అందరీ అంచనాలను తారుమారు చేసి మరీ మంచి గా ఆడి గెలుస్తారు. అచ్చం అలాంటి సంఘనటనే అమెరికాలో నెబ్రాస్కాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ప్రముఖ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్ కుమార్తె 7 ఏళ్ల తలయా నార్త్‌వెస్ట్ హై స్కూల్లోని స్ప్రింట్ పోటీ(పరుగుల పోటీ) లో పాల్గొంది. ఐతే ఆ ట్రాక్ రేస్ మొదలైనప్పుడూ ఆమె కాలి షూ జారిపోతుంది. దీంతో ఆ రేస్‌లో పాల్గొన్న వాళ్లంతా తలయా కంటే చాలా ముందంజలో ఉన్నారు. కానీ ఆమె ఆ షు వేసుకోవడంలోనే ఉండిపోతుంది. ఆమె పరుగు మొదలు పెట్టేటప్పటికే చాలా ఆలస్యమవుతుంది. ఆ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా ఆమె గెలవదనే అనుకుంటారు. కానీ అందరీ అభిప్రాయలను తలకిందులు చేస్తూ అనుహ్యంగా తనతోటి రేసర్లను వెనక్కి నెట్టి మరీ ముందుంటుంది. చివరికీ ఆ పోటీలో ఆమె గెలుస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పొట్టు పొట్టు చినిగిన నాశనం అయిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం) -
జిమ్ మారో జిమ్.. షార్ట్‌కట్స్ ఉండవ్.. చెమటలు కక్కాల్సిందే!
భారత స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఈ ఏడాది జులైలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ పూర్తి దృష్టి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలపైనే ఉంది. దీని కోసం ఆమె చెమటలు కక్కుతోంది తన కసరత్తుల వీడియో ను మేరీ కోమ్ సోషల్ మీడియా యాప్ కూ లో షేర్ చేసింది, విజయానికి కృషి మాత్రమే అవసరమని రాసింది. షార్ట్‌కట్ పద్ధతిలో ప్రయత్నించినా ఫలితం ఉండదని కష్టపడి పనిచేయాల్సిందే అంటోంది. బాక్సింగ్ ప్రాక్టీస్ తర్వాత, మేరీ కోమ్ మధ్యాహ్నం జిమ్‌కి వెళుతుంది. పుష్-అప్స్ సిట్-అప్లు, అలాగే హెవీ వెయిట్ లిఫ్టింగ్ వంటి బాడీ వెయిట్ వ్యాయామాలతో కండరాలను బలంగా ఉంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తుంది. Koo App Do or do not. There is no try. There is no shortcuts. Only HARD WORK. View attached media content - M C Mary Kom (@mcmarykom) 10 May 2022 -
వరల్డ్ స్ట్రాంగెస్ట్ గర్ల్: దెబ్బ పడితే ఖతమే!
12-year-old girl has been dubbed the 'world's strongest girl: కొంతమంది చిన్నారులు బాల్యం నుంచి మంచి ప్రతిభ కనబరుస్తారు. పైగా వేగవంతంగా నేర్చుకోవడమే కాక మంచి జ్ఞాపక శక్తి వారి సొంతం. అయితే ఇక్కడొక అమ్మాయి చాలా చిన్న వయసులోనే మంచి బాక్సర్‌గా రాణించడమే కాక ప్రపంచంలోనే బలమైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అసలు విషయంలోకెళ్లితే...రష్యాకి చెందిన రుస్త్రమ్ సాద్వాకాస్ అనే బాక్సర్‌కి 12 ఏళ్ల ఇవింక సావకస్ అనే కుమార్తె ఉంది. ఆమె చిన్నతనం నుంచి తన తండ్రి రుస్త్రమ్ వద్దే బాక్సింగ్ శిక్షణ తీసుకుంది. అయితే ఆయన తన కుమార్తె ప్రతిభను నాలగేళ్ల ప్రాయంలోనే గుర్తించారు. పైగా ఇవింకా తన కంటే పెద్ద విద్యార్థులు తీసుకునే శిక్షణను తీసుకునేదని తెలిపారు. అంతేకాదు కేవలం ఒక్క నిమిషంలోనే సుమారు 100 పంచ్‌లు విసిరేదని చెప్పారు. ఈ మేరకు ఆ బాలిక చెట్లను, ఐరన్ తలుపులను తన పంచ్‌లతో చాలా సునాయాసంగా పడగొడుతుంది. దీంతో ఆ అమ్మాయి ప్రపంచంలోనే అత్యంత బలమైన బాలికగా పేరు సంపాదించుకుంది. అంతేకాదు తన బాక్సింగ్ ప్రావిణ్యంతో చెట్లను, ఐరన్ తలుపులను పడుగొడుతన్న వీడియోలను ట్విట్టర్లోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. Watch Little Evnika Saadvakass also known as the 'World's Strongest Girl' punching down a tree using her Amazing boxing skills. Shes has been training hard since she was three and dreams of becoming a professional boxer one day. pic.twitter.com/A4ERWjB57b — Quarantine Traders (@QuarantineTrad1) January 8, 2022 View this post on Instagram A post shared by SAADVAKASS Family (@saadvakass) -
ఎలన్‌కు 24 ఏళ్ల యువకుడి సవాల్..! నువ్వు 45 వేల కోట్లిస్తే..? నేను..!
American Boxer Jake Paul Promises To Donate 10 Million: అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి 24 ఏళ్ల యువకుడు సవాల్ విసిరాడు. ఆకలి సమస్యని తీర్చేందుకు ఎలన్ 6 బిలియన్లను (4,49,13,30,00,000 రూపాయలు) అందిస్తే తాను 10మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని తెలిపాడు. అయితే ఇందుకు తాను పెట్టిన ఒక షరతును ఎలన్ ఒప్పుకోవాలని తెలిపాడు. ఇటీవల యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ మాట్లాడుతూ..వరల్డ్ వైడ్‌గా 155 మిలియన్ల మందికి సరైన ఆహార లేదని, ఈ సమస్యను అధిగమించేందుకు సంపన్నులైన అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌లు 6 బిలియన్ల డాలర్లను డొనేట్ చేయాలని కోరారు. అయితే డేవిడ్ బిస్లీ వ్యాఖ్యలపై ఎలన్ స్పందించారు. 6 బిలియన్ల డాలర్లతో ప్రపంచం ఎదుర్కొంటున్న ఆహార సమస్యను ఎలా పరిష్కరించవచ్చో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఆ ప్రణాళికను ప్రజలందరి ఎదుట బహిర్గతం చేస్తే తాను తన టెస్లా షేర్లు అమ్మి ఆ మొత్తాన్ని దానం చేస్తామని స్పష్టం చేశారు. ఆ అంశం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చాంశనీయమైంది. ఎలన్ చేసిన ప్రకటనపై 24ఏళ్ల అమెరికన్ బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ స్పందించారు. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్డబ్ల్యూఎఫ్పీకి తాను 10 మిలియన్లను (74,50,05,000.00 రూపాయలు) విరాళంగా అందిస్తానని చెప్పాడు. అయితే తాను డొనేషన్ ఇవ్వాలంటే ఈ రెండు కండీషన్లకు కట్టుబడి ఉండాలని తెలిపాడు. అందులో ఒకటి మస్క్ 6 బిలియన్ డాలర్లను ఇవ్వడం, రెండోది తాను చేసిన ట్వీట్‌కు 690కే రీట్వీట్ వస్తే విరాళం ఇస్తామని చెప్పాడు. కాగా,పాల్ చేసిన ట్వీట్‌కి ఇప్పటివరకు 10,000 రీట్వీట్లు వచ్చాయి. చదవండి: ఎలన్ మస్క్ సవాల్: అలా చేస్తే రూ.45 వేల కోట్లు ఇస్తాను -
Eksha Hangma Subba: సూపర్ ఉమన్!
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు విమానాలను కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యంతో రాణిస్తూంటే ‘ఇక్షా హంగ్మా సుబ్బ’ మాత్రం నాలుగు నైపుణ్యాలతో వందమందిలో ఒక్కటిగా దూసుకుపోతుంది. ఇక్షా హంగ్మా సుబ్బ.. ఏంటీ అనిపిస్తుంది కదూ! అవును ఈ పేరు పలకడానికి, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నట్టుగానే ఇక్షా వృత్తినైపుణ్యాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోయినప్పటికీ, తనదైన శైలిలో రాణిస్తూ అందరిచేత సూపర్ ఉమన్ అనిపిస్తోంది. బోల్డ్ అండ్ బ్యూటిపుల్‌గా పేరొందిన ఇక్షా.. సిక్కిం పోలీస్ ఆఫీసర్, జాతీయ స్థాయి బాక్సర్, బైకర్, ఎమ్‌టీవీ సూపర్ మోడల్. సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా సొంబారియా గ్రామంలో ఐతరాజ్, సుకర్ణి సుబ్బా దంపతులకు 2000 సంవత్సరంలో ఇక్షా జన్మిచింది. ఒక సోదరుడు ఉన్నాడు. ప్రైమరీ,సెకండరీ విద్యాభ్యాసం అంతా సొంతూరులోనే పూర్తి చేసింది. తరువాత గ్యాంగ్‌టక్‌లోని బహదూర్ భండారీ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఈ సమయం లోనే ఎన్ఎస్ఎస్లోలో చేరింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే ఇక్షాకు నటన అన్నా... మోడలింగ్ అన్నా అమితాసక్తి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీ చదువుతూనే పోలీసు ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో సిక్కిం పోలీస్ విభాగంలో చేరింది. 14 నెలల శిక్షణ తరువాత ‘యాంటీ రైట్ ఫోర్స్’ విభాగంలో పోలీస్ ఆధికారిగా చేరింది. ఉద్యోగంలో చేరి, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ చిన్నప్పటినుంచి ఉన్న మోడలింగ్ ఆసక్తి వెలితిగా తోచింది తనకు. మిస్ సిక్కిం.. పోలీస్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు వివిధ మోడలింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లలో పాల్గొని గెలిచిన సందర్భాలు, కాలేజీలో ‘మిస్ ఫ్రెషర్’గా టైటిల్‌ను గెలుచుకున్న సందర్భాలు తనకి గుర్తొచ్చేవి. తన గ్రామం నుంచి రాష్ట్రస్థాయి మోడలింగ్ పోటీలలో పాల్గొని మిస్ సిక్కిం టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఇక్షాకు మోడలింగ్‌లోకి వెళ్లేందుకు నమ్మకం కుదిరింది. అక్కడి నుంచి వివిధ రకాల మోడలింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఎమ్‌టీవీ సూపర్ మోడల్ –2 రియాల్టీ షో ఆడిషన్స్‌కు హాజరై సెలక్ట్ అయింది. ఈ సెలక్షన్స్ ద్వారా ఇక్షా గురించి అందరికీ తెలిసింది. మొత్తం పదిహేనుమంది పాల్గొన్న ఈ షోలో మొదట టాప్ నైన్లో చోటు సంపాదించుకుని పాపులర్ అయ్యింది. పోటాపోటీగా జరుగుతున్న ఈ షోలో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతూ అందర్ని ఆకట్టుకుంటోంది. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సూపర్ మోడల్‌గా ఇక్షాను పొగుడుతూ ట్వీట్ చేయడం, షో న్యాయనిర్ణేతలు కూడా ఇక్షాను అభినందిస్తుండంతో అంతా ఆమెను అభినందనలలో ముంచెత్తుతున్నారు. ఇక్షా ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ఆటలు బాగా పనికొస్తాయని ప్రోత్సహించడంతో స్థానికంగా నిర్వహించే బాక్సింగ్ తరగతులకు హాజరై బాక్సింగ్ నేర్చుకుని జాతీయస్థాయి బాక్సర్‌గా ఎదిగింది. అలా ఒకపక్క బాక్సింగ్ చేస్తూనే మరోపక్క ఉద్యోగం చేస్తూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ సూపర్ ఉమన్‌గా నిలుస్తోంది. ఇక్షాకు మోడలింగ్‌తోపాటు డ్రైవింగ్ కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కేటీఎమ్ ఆర్సీ 200 మోటర్ బైక్ నడుపుతూ లాంగ్ రైడ్స్‌కు వెళ్తుంటుంది. చిన్న వయసులో ఇన్ని రకాల నైపుణ్యాలతో దూసుకుపోతూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది ఇక్షా. -
ఫిలిప్పీన్స్ అధ్యక్ష బరిలో బాక్సర్ పకియావ్
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో బరిలో ఉంటానని ఆ దేశ బాక్సింగ్ దిగ్గజం, సెనేటర్ మానీ పకియావ్(42) ప్రకటించారు. ఆదివారం జరిగిన పీడీపీ–లబన్ పార్టీ సమావేశంలో పకియావ్ పేరును ఒక వర్గం నేతలు ప్రతిపాదించగా ఆయన అందుకు సమ్మతించారు. ప్రభుత్వ మార్పు కోసం వేచి చూస్తున్న ఫిలిపినో ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘నేనొక యోధుడిని. బరిలోనూ వెలుపల యోధుడిగానే ఎల్లప్పుడూ ఉంటాను’ అని పేర్కొన్నారు. అధికార పీడీపీ–లబన్లోని ఒక వర్గానికి పకియావ్, సెనేటర్ అక్విలినో నాయకత్వం వహిస్తున్నారు. పార్టీలోని మరో వర్గం, ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు డుటెర్టెని ఉపాధ్యక్షుడిగా, సెనేటర్ బాంగ్ గోను అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసింది. బాక్సింగ్‌లోని ఎనిమిది వేర్వేరు విభాగాల్లో ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక బాక్సర్‌గా పకియావ్ చరిత్ర సృష్టించారు. చదవండి: షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ Tokyo Olympics: ముఖానికి 13 కుట్లు.. అయినా సరే పోరాటం -
National Boxing Championships: క్వార్టర్స్‌లో తెలంగాణ బాక్సర్
జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్ సావియో డొమినిక్ మైకేల్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 54 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సావియో 4–1తో కృష్ణ జొరా (జార్ఖండ్)పై గెలుపొంది ముందంజ వేశాడు. అయితే 75 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మరో తెలంగాణ బాక్సర్ వేణు మండల ప్రయాణం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మహారాష్ట్ర బాక్సర్ నిఖిల్ దూబే చేతిలో వేణు ఓడిపోయాడు. ప్రత్యర్థి పంచ్‌కు వేణు కిందపడిపోగా రిఫరీ మ్యాచ్‌ను ఆపి దూబేను విజేతగా ప్రకటించాడు. చదవండి: Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు! -
60 ఏళ్ల వయసులో నటుడి బాక్సింగ్ ప్రాక్టీస్
కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు మోహన్‌లాల్. తాజాగా ఆయనకు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్ ఒకటి నచ్చిందట. అంతే.. చేతికి గ్లౌజ్‌లు తొడిగి బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇందులో మోహన్‌లాల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆరుపదుల వయసులో ఉన్నారు మోహన్‌లాల్. ఈ వయసులో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అది కూడా బాక్సింగ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ కావడం అంటే గొప్ప విషయమే. -
Video: ఈ నటుడి డెడికేషన్‌కి హ్యాట్సాఫ్.. మామూలు కష్టం కాదు!
తెరపై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఆడియెన్స్-వ్యూయర్స్‌పై ఎంత ఇంపాక్ట్ చూపించామన్నది ముఖ్యం. ఫ్యామిలీ మ్యాన్ ‘చెల్లం’సర్ లాంటి కొన్ని క్యారెక్టర్లు ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా అలాంటి ఇంపాక్ట్ చూపించిన మరో క్యారెక్టర్.. డ్యాన్సింగ్ రోజ్. పా రంజిత్ డైరెక్షన్లో అమెజాన్ ప్రైమ్‌లో లేటెస్ట్గా రిలీజ్ అయ్యింది ‘సార్పట్ట పరంపర’(సార్పట్ట పరంబరై). ఈ సినిమాలో ఈ ‘డ్యాన్సింగ్ రోజ్’ అనే క్యారెక్టర్‌కి ప్రాధాన్యత పదిహేను నిమిషాలు ఉంటుంది. కానీ, ఆ క్యారెక్టర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు పా రంజిత్. స్లిమ్ ఫిట్ బాడీ, నుదుట రింగు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ వేసే స్టెప్పులు. రింగ్‌లో ఊగిపోతూ ఓడిపోతున్నట్లుగా ప్రత్యర్థులను భ్రమపెట్టి, కాళ్ల వేగంతో కన్ఫ్యూజ్ చేసి బాక్సింగ్‌లో గెలుపు సాధించే క్యారెక్టర్ డ్యాన్సింగ్ రోజ్‌ది. అయితే డ్యాన్సింగ్ రోజ్కి ఓ క్యారెక్టర్ అంటూ ఉంటుంది. సమర(కబిలన్)తో ఓడినప్పటికీ, విలన్ బ్యాచ్‌లో ఉన్నప్పటికీ.. నీతి తప్పడు. పైగా క్లైమాక్స్ పోటీకి ముందు వేటపులి(వేంబులి)కి హితబోధ కూడా చేస్తాడు. అందుకే చాలామందికి ఈ పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. ఇంతకీ ఈ క్యారెక్టర్ చేసింది ఎవరంటే.. చెన్నై థియేటర్ ఆర్టిస్ట్ షబీర్ కళ్ళరక్కల్. మాంచి థియేటర్ ఆర్టిస్ట్ 2009 నుంచి నటన వైపు అడుగులేశాడు నటుడు షబీర్ కళ్ళరక్కల్. యాభైకి పైగా స్టేజ్ షోలతో థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆపై ‘నెరుంగి వా ముథమిడతే’(2014) హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు షబీర్. కానీ, ఆ తర్వాత అవకాశాలే పెద్దగా రాలేదు. దీంతో ‘అడంగ మరు, పెట్టా, టెడ్డీ’ లాంటి పెద్దసినిమాల్లో చిన్నరోల్స్ చేశాడు. షబీర్ స్వతహాగా ఫిట్నెస్ ప్రియుడు. దీంతో కాస్టింగ్ డైరెక్టర్ నిత్య.. సార్పట్ట అడిషన్స్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. అలా క్యారెక్టర్ దక్కింది. ఫిట్నెస్ ఉన్నోడు కావడంతో మార్షల్ ఆర్ట్స్ కళలో శిక్షణ తీసుకోగలిగాడు. స్టంట్ మాస్టర్ తిరు నేతృత్వంలో.. రకరకాల కళలను సులువుగా అవపోసన పట్టగలిగాడు. అంత కష్టపడ్డాడు గనుకే డ్యాన్సింగ్ రోజ్ సీక్వెన్స్‌లన్నీ అంతగా పేలాయి. ఇక అతను పడ్డ కష్టం తాలుకా వీడియోను చూసేయండి. Shabeer Kallarakkal aka DANCING ROSE. pic.twitter.com/aCUSdfJwSN — LetsOTT GLOBAL (@LetsOTT) July 22, 2021 అన్నట్లు డ్యాన్సింగ్ రోజ్‌కు ఇన్స్పిరేషన్.. యూకే బాక్సింగ్ లెజెండ్ నసీమ్ హమెద్. ఆయన ఎంట్రీ దగ్గరి నుంచి రింగ్‌లో కదలికల దాకా అంతా విచిత్రంగా ఉంటుంది. 1992-2002 మధ్య ప్రొఫెసనల్ బాక్సర్‌గా కొనసాగిన నసీమ్.. 37 ఫైటింగ్ల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయాడు. ఐదున్నర అడుగుల ఎత్తుండే ప్రిన్స్.. క్యారెక్టర్ స్ఫూర్తితో జపనీస్ మాంగా సిరీస్ ‘హజెమె నో ఇప్పో’లో అమెరికన్ బాక్సింగ్ ఛాంపియన్ బ్రయాన్ హక్ క్యారెక్టర్‌ను సైతం తీర్చిదిద్దారు. -
టోక్యో ఒలింపిక్స్ 2020: ఓడిన ఓ ‘విజేత’ కథ
ఏడాది ఆలస్యం తర్వాత ప్రారంభమైన క్రీడా సంబురం ఒలింపిక్స్.. ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే మొదలైంది. టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వక్రీడల సమరాన్ని ఆసక్తిగా తిలకించబోతున్నారు కోట్లాది ప్రజలు. అయితే నిన్న ఆరంభ వేడుకల్లో జరిగిన ఓ ఈవెంట్.. ఎవరికీ అంతుబట్టని రీతిలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పక్క డ్యాన్సులు కొనసాగుతున్న టైంలో.. ఆ వెలుగుల జిగేలులో ట్రెడ్‌మిల్‌పై ఓ మహిళ పరుగులు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె ఎవరు? ఎందుకలా చేసింది? అనే ప్రశ్నలతో పాటు ఆ ట్రెడ్మిల్ వీడియో సోషల్ మీడియాలో మీమ్‌లా వైరల్ అవుతోంది. ఆమె పేరు అరిస సుబాటా. వయసు 27 ఏళ్లు. జపాన్‌కే చెందిన ఆమె ఒక ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. కానీ, పిడిగుద్దులతో బాక్సర్‌గా కూడా ఆమెకు మాంచి గుర్తింపు ఉంది ఈ దేశంలో. ఒలింపిక్స్ అర్హత కోసం ఏడాదిన్నరగా కష్టపడిందామె. కానీ, కరోనా ఆమెను ఘోరంగా ఓడించింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ రద్దు చేయడంతో ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే ఆమె విజ్ఞప్తి మేరకు ఇలా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ట్రెడ్‌మిల్‌పై సందడి చేసింది. పేద కుటుంబంలో పుట్టిన సుబాటా కెరీర్లోకి అడుగుపెట్టి మూడేళ్లే అయ్యింది. అయితేనేం జపాన్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగింది. కరోనా టైంలో ఆటగాళ్లంతా ఐసోలేషన్‌లో మెగా టోర్నీని సన్నద్ధం అవుతుంటే.. ఆమె మాత్రం నర్సుగా తన విధుల్ని నిర్వహిస్తూనే మరోవైపు ఒలింపిక్స్ కోసం రేయింబవళ్లు కష్టపడింది. కానీ, ఆ కష్టం వృథా అయ్యింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్ని రద్దుచేసేసింది ఐవోసీ. అంతేకాదు 2017 నుంచి ప్రపంచ ర్యాంకింగ్‌ల ఆధారంగా 53 బాక్సర్లను మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేసింది. తనకు అవకాశం దక్కకపోవడంపై ఆమె నిరాశ చెందింది. అయితేనేం మిగతా ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ‘ట్రెడ్‌మిల్‌పై నేను చూపించింది నా కష్టం మాత్రమే కాదు.. వేలమంది అథ్లెట్ల కష్టానికి ప్రతీక. వాళ్లందరికీ ఆల్‌దిబెస్ట్ చెబుతున్నా. తన చేష్టలను చాలామంది నవ్వుకోవచ్చు. కొందరు మెచ్చుకోవచ్చు. కానీ, మిగతా ఆటగాళ్లను అందరూ ప్రోత్సహించండి. ఏదో ఒకనాటికి ఛాంపియన్ అయ్యి తీరుతా’ అని కన్నీళ్లతో మీడియాతో మాట్లాడిందామె. -
నా కల నిజమైంది..అలా మారడం చాలెంజింగ్: హీరో ఆర్య
అది పెద్ద సవాల్ఆర్య హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సారపట్ట పరంబరై’. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా ఆర్య మాట్లాడుతూ– ‘‘ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న నాకు రంజిత్ చెప్పిన ‘సారపట్ట పరంబరై’ కథ బాగా నచ్చింది. ఈ కథలో ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ బాక్సింగ్ ఉంటుంది. జీవితాలను ప్రతిబింబిస్తుంది. 1975లో మద్రాస్‌లో ఉండే బాక్సింగ్ కల్చర్‌ని చూపించాం. బాక్సర్‌గా మారడం ఫిజికల్‌గా పెద్ద చాలెంజింగ్‌గా అనిపించింది. జాతీయ స్థాయి బాక్సర్ల దగ్గర శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నా మ్యారీడ్ లైఫ్ బాగుంది. ‘గజినీకాంత్, కాప్పాన్, టెడ్డీ’ చిత్రాల్లో సాయేషా (హీరోయిన్, ఆర్య భార్య), నేను కలిసి నటించాం. మంచి కథ దొరికితే మళ్లీ నటిస్తాం. తెలుగులో ‘వరుడు’, ‘సైజ్ జీరో’ చిత్రాల తర్వాత మరో సినిమా చేయాలని నాకూ ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
Mandeep Jangra: అరంగేట్రంలోనే అదరగొట్టాడు
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సింగ్ అరంగేట్రంలోనే భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రా గెలుపు రుచి చూశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన బౌట్లో అర్జెంటీనా బాక్సర్ లూసియానో రామోస్‌పై మన్దీప్ విజయం సాధించాడు. తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. నాలుగు రౌండ్లపాటు సాగిన ఈ బౌట్లో 27 ఏళ్ల మన్దీప్ పంచ్‌ల ముందు రామోస్ నిలబడలేకపోయాడు. అమెచ్యూర్ బాక్సర్‌గా 69 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మన్దీప్ 2013 ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్లో రజతం... 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించాడు. పక్కా ప్రణాళికతో టోక్యో ఒలింపిక్స్‌కు... నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న ఒలింపిక్ హాకీ పతకాన్ని ఈసారి అందుకునే సత్తా భారత పురుషుల హాకీ జట్టుకు ఉందని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించాడు. జూలై–ఆగస్టులలో జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం భారత జట్టు బెంగళూరులో సన్నద్ధమవుతోంది. టోక్యో వాతావరణానికి అనుగుణంగాబెంగళూరులో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నామని మన్‌ప్రీత్ అన్నాడు. చదవండి: గుర్‌ప్రీత్‌కు కాంస్యం -
మేరీకోమ్‌కు పతకం ఖాయం
కాస్టెలాన్ (స్పెయిన్): ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ పతకాన్ని ఖాయం చేసుకుంది. బాక్సమ్ ఓపెన్ టోర్నీలో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో ఇటలీకి చెందిన జియోర్డానా సొరెన్టినోపై గెలిచింది. సెమీఫైనల్లో అమెరికా బాక్సర్ వర్జీనియాతో మేరీకోమ్ ఆడనుంది. పురుషుల విభాగంలో మనీశ్ (63 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో మనీశ్ 5–0తో రడుయెన్ (స్పెయిన్)పై నెగ్గాడు. -
బాక్సర్ ఇన్ యాక్షన్
వరుణ్ తేజ్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఇంకొన్ని రోజులు ఇదే మూడ్‌లో ఉంటారట. ఇదంతా సినిమా కోసమే. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తారు వరుణ్. ఈ చిత్రానికి ‘బాక్సర్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తు్తన్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని టాక్. మరో పదిరోజల పాటు ఈ షెడ్యూల్ సాగనుందట. ఆ తర్వాత తన సోదరి నిహారిక పెళ్లి కోసం వరుణ్ తేజ్ చిన్న బ్రేక్ తీసుకుంటారు. -
డెలివరీ బాయ్‌గా మారిన అంతర్జాతీయ క్రికెటర్
ఒలింపిక్ చాంపియన్... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. లాడ్జ్ (పోలాండ్): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్ క్రీడాంశంలో రూబెన్ లిమార్డో గాస్కన్ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా రూబెన్ లిమార్డో; ‘లండన్’ స్వర్ణంతో... రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్ దేశం పోలాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్‌పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్‌గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్ చాంపియన్ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్ డాలర్ విలువ సుమారు 10 వేల వెనిజులన్ బొలీవర్స్కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్ కూడా... నెదర్లాండ్స్‌కు చెందిన 28 ఏళ్ల పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు. అక్టోబర్–నవంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్ మీకెరన్ కూడా ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్‌గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్ క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్ ట్వీట్ చేశాడు. -
వరుణ్ తేజ్‌కు నిద్రలేని రాత్రుళ్లు..
కొణిదెల వారసుడు, హీరో వరుణ్ తేజ్ రాత్రిళ్లు నిద్రపోవడం లేదు. నిద్రలేమి సమస్యలేమైనా బాధిస్తున్నాయా? అని అనుకుంటున్నారా?. మరేం లేదు... సినిమా వాళ్లు షూటింగ్‌కు సమయానికి వెళ్తారే కానీ, ఎప్పుడు షూటింగ్ ముగించుకుని ఇంటికి వస్తారనేది ముందే చెప్పలేం కదా.. పైగా సమయంతో పని లేకుండా చిత్రీకరణ జరుపుతూనే ఉంటారు. అలాగే వరుణ్ తన తాజా సినిమా 'బాక్సర్' కోసం రాత్రి రెండు దాటుతోన్నా సెట్స్‌లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. (చదవండి: డిసెంబర్లో నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్..) కాగా వైజాగ్‌లో ప్లాన్ చేసిన ఈ సినిమాలోని కీలక షెడ్యూల్ మార్చిలోనే పూర్తైంది. ఆ వెంటనే లాక్డౌన్ పిడుగు పడటంతో షూటింగ్ వాయిదా పడింది. తాజాగా కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది మధ్య చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ నీరజ్ గోయత్ వద్ద నెలరోజుల పాటు బాక్సింగ్ మెళకువలు నేర్చుకోవడంతోపాటు బాడీ లాంగ్వేజ్ మీద దృష్టిపెట్టారు. దబాంగ్ 3లో సల్మాన్ సరసన మెరిసిన సాయి మంజ్రేకర్.. వరుణ్‌తో జోడీ కడుతున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. (చదవండి: ఒలీవియా.. ఆలియా.. పాఠాలయ్యా) -
బాక్సర్ సరితాదేవి ‘నెగెటివ్’
న్యూఢిల్లీ: ప్రపంచ, ఆసియా మాజీ చాంపియన్, భారత మేటి బాక్సర్ లైష్రామ్ సరితా దేవి కోవిడ్–19 నుంచి బయట పడింది. తాజా పరీక్షలో తనకు నెగెటివ్ ఫలితం వచ్చినట్లు ఆమె వెల్లడించింది. అయితే ఏడేళ్ల తన కుమారుని ఆరోగ్య భద్రత దృష్ట్యా మరో 10 రోజుల పాటు ఇంటికి దూరంగా క్వారంటైన్లో ఉండనున్నట్లు పేర్కొంది. 38 ఏళ్ల సరితా దేవి, ఆమె భర్త తోయిబా సింగ్ ఆగస్టు 17న కరోనా పాజిటివ్‌గా తేలారు. చికిత్స అనంతరం సోమవారం కోవిడ్ సెంటర్ నుంచి డిశ్చార్జి అయినట్లు ఆమె తెలిపింది. ‘నాకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా బయటపడ్డాయి. కాస్త జలుబు చేసింది అంతే. అయితే నెగెటివ్‌గా తేలడంతో ఆసుపత్రి నుంచి సోమవారమే బయటకొచ్చా. కానీ మరికొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి ఉంటే నా ఏడేళ్ల కుమారుడు వెంటనే వచ్చి నన్ను హత్తుకుని ఉండేవాడు. అతని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడం మాకిష్టం లేదు. అందుకే నా అకాడమీలోని హాస్టల్ గదిలో మరో పది రోజులు స్వీయ నిర్బంధాన్ని పాటిస్తా’ అని సరితా వివరించింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకో సింగ్ తర్వాత వైరస్ బారిన పడిన రెండో బాక్సర్ సరిత కావడం గమనార్హం. -
బాక్సర్ సరిత దేవికి కరోనా పాజిటివ్
సాక్షి, ఇంఫాల్: ప్రముఖ ఇండియన్ బాక్సర్ లైశ్రమ్ సరితా దేవి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోమవారం ప్రకటించారు. గత మూడు రోజులుగా తను జ్వరం, కండరాల నొప్పితో బాధపడ్డారని, దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. కోవిడ్ పరీక్ష ఫలితాల్లో తనకు పాజిటివ్‌గా తెలిందని తెలిపారు. దీంతో తన భర్త, కుమారుడు సైతం కరోనా పరీక్షలు చేయించుకోగా తన భర్తకు పాజిటివ్ రాగా.. తన కుమరుడి నెగిటివ్ వచ్చినట్లు సరిత తెలిపారు. (చదవండి: ఒకే రోజు కోలుకున్న 7,866 మంది) దేశంలో రోజు రోజు కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 57,982 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో కలిసి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26,47,664 కు చేరుకుంది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. (చదవండి: ప్రతి 3 నిమిషాలకు ఓ ఇద్దరు..) -
‘జాతీయ శిబిరానికి వెళ్లేది లేదు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బాక్సర్లకు సన్నాహకంగా పటియాలలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో తాను పాల్గొనేది లేదని భారత టాప్ బాక్సర్ వికాస్ కృషన్æ స్పష్టం చేశాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కంటే... తాను అమెరికాలో కొన్ని ప్రొ బాక్సింగ్ బౌట్లలో తలపడేందుకు ఇష్టపడతానని చెప్పాడు. ప్రస్తుతం వికాస్ బెంగళూరులోని ‘ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)’లో ఆమెరికన్ కోచ్ రొనాల్డ్ సిమ్స్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. దాంతో కరోనా క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో భారత బాక్సింగ్ సమాఖ్య వికాస్‌పై విచారణకు ఆదేశించింది. అనంతరం అతడు కావాలని ఇదంతా చేయలేదని తేలడంతో అతడిని వెంటనే పాటియాలలోని శిక్షణ శిబిరంలో ప్రాక్టీస్ చేయాల్సిందిగా ఆదేశించింది. దీనిపై స్పందించిన వికాస్... ప్రస్తుతం ఐఐఎస్‌లో తన శిక్షణ చక్కగా కొనసాగుతుందని, అటువంటప్పుడు ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపాడు. -
భారత మాజీ బాక్సర్ డింకో సింగ్‌కు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత మాజీ స్టార్ బాక్సర్ డింకో సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన 41 ఏళ్ల డింకో సింగ్ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన డింకో సింగ్‌కు పచ్చ కామెర్లు రావడంతో రేడియేషన్ థెరపీని మధ్యలోనే ఆపేశారు. దాంతో డింకో సింగ్ రోడ్డు మార్గం గుండా 2400 కిలోమీటర్లు అంబులెన్స్‌లో ప్రయాణించి మళ్లీ మణిపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది. -
జాతీయ క్రీడా అవార్డుల ఎంపికలో పారదర్శకత లేదు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత, భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎంపిక ప్రక్రియను మార్చాలని పేర్కొంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు శుక్రవారం లేఖ రాశాడు. ప్రస్తుతం అమలవుతోన్న విధానంలో వివక్ష ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘ప్రస్తుత విధానంలో అవార్డుల కోసం ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. అందులో నుంచి క్రీడా కమిటీ కొన్నింటిని ఎంపిక చేస్తుంది. ఈ ఎంపికను క్రీడా కమిటీ సభ్యులు ప్రభావితం చేయొచ్చు. ఇందులో పారదర్శకత లేదు’ అని అమిత్ లేఖలో రాసుకొచ్చాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఈ ప్రక్రియలో మార్పు రావాల్సిందే కాబట్టి అందుకు తానే ముందుకొచ్చానని అమిత్ తెలిపాడు. ఇప్పటికే కేంద్ర క్రీడా శాఖ, ‘సాయ్’ అధికారుల దగ్గర అవార్డు నామినీల జాబితా ఉందని పేర్కొన్న అమిత్... ఎవరికి అవార్డు దక్కుతుందో, ఎవరికి దక్కదో వారికి తెలుసని పేర్కొన్నాడు. గతంలో రెండు పర్యాయాలు ‘అర్జున’ అవార్డు కోసం అమిత్ నామినేట్ అయినప్పటికీ డోపింగ్ ఆరోపణలతో అతని పేరు తిరస్కరణకు గురైంది. భారత్ తరఫున నిలకడగా రాణిస్తోన్న తనకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. 2012లో చికెన్‌పాక్స్ చికిత్సలో భాగంగా తీసుకున్న ఔషధాల కారణంగా అమిత్ డోపింగ్‌లో పట్టుబడి ఏడాదిపాటు నిషేధానికి గురయ్యాడు. డోపింగ్ నేపథ్యమున్న క్రీడాకారులు జాతీయ క్రీడా పురస్కారాలకు అనర్హులని కేంద్ర క్రీడా శాఖ గతంలో పేర్కొనడంతో అమిత్‌కు జాతీయ క్రీడా అవార్డులు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. -
బాక్సర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ అనుమానాస్పద మృతి..
లాస్ఏంజెల్స్ : మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మెవెదర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ జోసీ హారిస్ సబర్బన్ లాస్ఏంజెల్స్లోని తన నివాసంలో మరణించారు. మెవెదర్తో ముగ్గురు సంతానం కలిగిన జోసీ హారిస్ (40) తన ఇంట్లోనే వాక్వేలోని ఓ వాహనంలో విగతజీవిగా పడిఉన్నారని లాస్ఏంజెల్స్ కౌంటీ షరీఫ్ అలెక్స్ విలెనువా వెల్లడించారు. ఆమె మృతిపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. 2010లో మెవెదర్ హారిస్‌ను తీవ్రంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. తాను హారిస్‌పై చేయిచేసుకున్నానని, ఆమె చేతిని మెలితిప్పానని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించాడు. గృహ హింస ఆరోపణలపై రెండు నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో డ్రగ్స్ తీసుకున్న హారిస్‌ను నియంత్రించేందుకే తానలా చేశానని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక హారిస్ 2015లో మెవెదర్పై పరువునష్టం దావా వేశారు. చదవండి : షరపోవా.. అన్‌స్టాపబుల్ -
ఒలింపిక్స్ బరిలో ‘రికార్డు’ పంచ్
అమ్మాన్ (జోర్డాన్): భారత్ నుంచి రికార్డు స్థాయిలో మరో బాక్సర్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ప్రపంచ కాంస్య పతక విజేత మనీశ్ కౌశిక్ (63 కేజీలు) తాజాగా ‘టోక్యో’ దారిలో పడ్డాడు. ఆసి యా క్వాలిఫయర్స్ ఈవెంట్లో బుధవారం కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్, రెండో సీడ్ హరిసన్ గార్సి డ్ (ఆస్ట్రేలియా)పై 4–1తో గెలుపొందడం ద్వారా కౌశిక్‌కు ఒలింపిక్స్ బెర్తు ఖాయమైంది. ఇప్పటికే ఎనిమిది మంది బాక్సర్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. కౌశిక్‌తో ఆ జాబితా తొమ్మిదికి చేరింది. దీంతో ఈ సారి అత్యధిక బాక్సర్లు అర్హత సంపాదించినట్లయింది. గతంలో లండన్ ఒలింపిక్స్ (2012)లో భారత్ నుంచి 8 మంది పాల్గొన్నారు. ఇప్పుడీ రికార్డు 9 మందితో మెరుగైంది. 81 కేజీల కేటగిరీలో సచిన్ కుమార్ నిరాశపరిచాడు. అతను 0–5తో షబ్బొస్ నెగ్మతుల్లెవ్ (తజకిస్తాన్) చేతిలో కంగుతిన్నాడు. సిమ్రన్‌కు రజతం మహిళల 60 కేజీల ఫైనల్ బౌట్లో సిమ్రన్‌జిత్ కౌర్ పరాజయం చవిచూసింది. దీంతో ఆమె స్వర్ణావకాశం చేజారి రజతంతో సరిపెట్టుకుంది. తుదిపోరులో భారత బాక్సర్ 0–5తో దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యూన్ జీ చేతిలో పరాజయం పాలైంది. 69 కేజీల విభాగంలో వికాస్ క్రిషన్ కంటి గాయంతో స్వర్ణ పతక పోరు నుంచి తప్పుకున్నాడు. దీంతో అతను రజతంతో తృప్తి చెందాడు. -
విషాదం : 19 ఏళ్ల బాక్సర్ ఆత్మహత్య
ముంబై : మహారాష్ట్రలోని అకోలాలో జాతీయస్థాయి యువ బాక్సర్ పవన్ రౌత్(19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకోలాలో తన హాస్టల్ గదిలో శుక్రవారం ఉదయం పవన్ రౌత్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని కోచ్ సతీష్ చంద్ర భట్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ పోటీల్లో పవన్ రౌత్ మహారాష్ట్ర తరపున ప్రాతినిథ్యం వహించాడని కోచ్ సతీష్ చెప్పారు. నాగ్‌పూర్‌కు చెందిన పవన్ రౌత్ అకోలాలోని స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతూనే అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. కాగా, శుక్రవారం అకోలోలానే జరిగే ఒక టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉండగా.. అతడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అనారోగ్యంతో పవన్ రౌత్ శిక్షణకు రాలేదని, శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కోచ్ తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర క్రీడా మంత్రి సునీల్ కేదార్ విచారం వ్యక్తం చేశారు. పవన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
బాక్సింగ్‌కి రెడీ
బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు వరుణ్‌తేజ్. ప్రత్యర్థితో ఫైట్ చేయడానికి కావాల్సిన శిక్షణను కూడా దాదాపు ముగించారట. వరుణ్‌తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో బాక్సర్‌గా వరుణ్‌తేజ్ కనిపిస్తారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండోవారం నుంచి వైజాగ్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో వరుణ్ తేజ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మిస్తున్నారు. -
అందుకే మిమ్మల్ని ద్వేషిస్తున్నా
లండన్ : అదేంటి ఎప్పుడు కూల్‌గా ఉంటూ ఏ విషయంలో తలదూర్చని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నెటిజన్లపై మండిపడుతున్నారేంటి అనుకుంటున్నారా! అయితే మీరు పొరబడ్డట్లే. అసలు విషయం ఏంటంటే.. పాకిస్థాన్ మూలాలున్న బ్రిటీష్ బాక్సర్ ఆమిర్‌ఖాన్ తన భార్య, పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశారు. 'మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు నా కుటుంబసభ్యులతో ఆనందంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నా. ఖాన్ ఫ్యామిలీ నుంచి మీ అందరికి మరోసారి #మెర్రీ క్రిస్మస్' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. అయితే దీనిపై స్పందించిన అతని ఫాలోవర్స్ ఆమిర్‌ను తప్పుబడుతున్నారు. ఒక ముస్లిం అయి ఉండి క్రైసవుల పండుగను ఎలా జరుపుకుంటారని ఆమిర్‌ను దుమ్మెత్తిపోశారు. దీంతో ఆమిర్ ఖాన్ స్పందిస్తూ.. 'మీరు పెట్టిన కామెంట్స్ నాకు ఆశ్చర్యం కలిగించాయి. మతం అనే బేషజాలు లేని ఒక వ్యక్తిగా నేను అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు జరుపుకున్నాము. కానీ దీనిని మీరందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే నేను మీ అందరిని మనస్పూర్తిగా ద్వేషిస్తున్నా' అంటూ రీట్వీట్ చేశారు. So shocked by all the hate I’m getting on my Twitter & instagram for wishing everyone Merry Christmas and posting a picture with my family in Christmas outfits. Just want to tell those people ‘I don’t give a f**k’ — Amir Khan (@amirkingkhan) December 26, 2019 బ్రిటీష్ బాక్సర్‌గా పేరు పొందిన ఆమిర్ ఖాన్ గత కొంతకాలంగా గాయంతో బాధపడుతూ రింగ్‌లోకి దిగలేదు. అయితే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో బరిలోకి దిగనున్నట్లు ఇంతకు ముందే మీడియాకు వెల్లడించాడు. కాగా 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో లైట్ వెయిట్ విభాగంలో ఆమిర్ దేశానికి సిల్వర్ మెడల్‌ను అందించాడు. కాగా, 33 ఏళ్ల ఆమిర్ ఖాన్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నట్లు ఇదివరకే స్పష్టం చేశాడు. -
మరో ప్రాణం తీసిన బాక్సింగ్ రింగ్
చికాగో: గత జూలై నెలలో ఇద్దరు బాక్సర్లు రోజుల వ్యవధిలో బాక్సింగ్ రింగ్‌లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన మరువకముందే మరొక బాక్సర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థి నుంచి వచ్చిన ముష్టిఘాతాలకు తాళలేకపోయిన అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ పాట్రిక్ డే ప్రాణాలు కోల్పోయాడు. బాక్సింగ్ బౌట్లో తలకు తీవ్ర గాయాలు కావడంతో నాలుగు రోజుల పాటు కోమాలోకి వెళ్లిన పోయిన పాట్రిక్.. చివరకు తుది శ్వాస విడిచాడు. శనివారం చికాగలో జూనియర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చార్లస్ కాన్వెల్తో జరిగిన మ్యాచ్‌లో పాట్రిక్ నాకౌట్ అయ్యాడు. చార్లస్ కాన్వెల్ నుంచి వచ్చిన బలమైన పంచ్‌లకు రింగ్‌లో నిలబడలేకపోయిన పాట్రిక్ అక్కడే కులబడిపోయాడు. దాంతో అతన్ని స్ట్రెచర్ సాయంతో ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పాట్రిక్‌ను బతికించడం కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. నాలుగు రోజు పాటు మృత్యువుతో పోరాడిన పాట్రిక్ దాన్ని జయించలేకపోయాడు. బుధవారం ప్రాణం విడిచినట్లు అతని ప్రమోటర్ డిబెల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల రష్యా చెందిన బాక్సర్ మాక్సిమ్ డడ్‌షెవ్, అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్లకు ఇదే తరహాలో మృత్యువాత పడ్డారు. -
మరో ప్రాణం తీసిన బాక్సింగ్ రింగ్
బ్యూనోస్ ఎయిర్స్: రింగ్‌లో ప్రత్యర్ధి పిడిగుద్దులు మరో బాక్సర్ ప్రాణం తీశాయి. బాక్సింగ్ రింగ్‌లో తీవ్రంగా గాయపడి రష్యా చెందిన బాక్సర్ మాక్సిమ్ డడ్‌షెవ్ మంగళవారం తుది శ్వాస విడవగా, మరొక బౌట్లో గాయాలు పాలైన అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. గత శనివారం ఉరేగ్వే బాక్సర్ ఎడ్వర్డో అబ్రెతో జరిగిన బౌట్‌ను డ్రా చేసుకున్న తర్వాత సాంతిల్లాన్ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. 10వ రౌండ్ తర్వాత మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇరువురి బాక్సర్ల చేతులను పైకి ఎత్తే క్రమంలో సాంతిల్లాన్ నిలబడలేకపోయాడు. దాంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేశారు. అయితే అది విఫలం కావడంతో గుండు పోటుకు గురైన సాంతిల్లాన్ ప్రాణాలు విడిచాడు. 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన సాంతిల్లాన్.. ఇప్పటివరకూ 19 విజయాలు సాధించి అరుదైన రికార్డును కల్గి ఉన్నాడు. ఈ విజయాల్లో 8 నాకౌట్ విజయాలు కాగా, రెండు డ్రాగా ముగిశాయి. 2016 సెప్టెంబర్‌లో దక్షిణ అమెరికా సూపర్ ఫెదర్వెయిట్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో సాంతిల్లాన్ వెలుగులోకి వచ్చాడు. సాంతిల్లాన్ మృతిపై వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లాటినో సిల్వర్ లైట్ వెయిట్ టైటిల్లో భాగంగా అబ్రెతో జరిగిన పోరులో 23 ఏళ్ల సాంతిల్లాన్ గాయాలు పాలై మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొంది. (ఇక్కడ చదవండి: ప్రాణం తీసిన పంచ్) -
ప్రాణం తీసిన పంచ్
మాస్కో: రింగ్‌లో ప్రత్యర్థి పిడిగుద్దులు ఓ యువ బాక్సర్ ఉసురు తీశాయి. ప్రొఫెషనల్ ఆటలో భౌతిక దాడి స్థాయిలో విసిరిన పంచ్‌లు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాలు... మేరీలాండ్ పరిధి అక్సన్ హిల్‌లో గత శుక్రవారం రాత్రి మాక్సిమ్ డడ్‌షెవ్ (రష్యా), సుబ్రియెల్ మటియాస్ (ప్యూర్టోరికో) మధ్య ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) సూపర్ లైట్ వెయిట్ విభాగంలో బౌట్ జరిగింది. ఇందులో మటియాస్ వరుసగా విసిరిన పంచ్‌ల ధాటికి 28 ఏళ్ల డడ్‌షెవ్ దిమ్మతిరిగింది. డ్రెస్సింగ్ రూమ్ వరకు సైతం నడవలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని హుటాహుటిన వాషింగ్టన్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. మెదడులో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం కావడంతో చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. డడ్‌షెవ్ తాను తలపడిన గత 13 బౌట్లలో అజేయంగా నిలిచాడు. శుక్రవారం నాటి పోరులో మాత్రం మటియాస్ ముందు నిలవలేకపోయాడు. ఆరంభం నుంచే దూకుడు చూపిన మటియాస్... ప్రత్యర్థి తప్పించుకోలేనంతగా బలమైన పంచ్‌లు విసిరాడు. వీటికి డడ్‌షెవ్ తాళలేకపోయాడు. 11వ రౌండ్ తర్వాత కుప్పకూలిన అతడు గ్లోవ్స్ చాటున తలదాచుకుంటూ ‘ఇక ఆపదల్చుకున్నాను’ అని సంకేతాలిచ్చాడు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆస్పత్రిలో అత్యవసర వార్డులో చేర్చి చికిత్స చేసినా ప్రాణం దక్కలేదు. దీనిపై కార్నర్మన్ మెక్గ్రిట్ మాట్లాడుతూ... బౌట్‌ను ఆపేలా డడ్షెవ్ను ఒప్పించలేకపోయానని అంటున్నాడు. మరోవైపు రష్యా బాక్సింగ్ సమాఖ్య ఈ బౌట్‌పై విచారణ జరుపుతోంది. ఈ బౌట్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉమర్ క్రెమ్లెవ్ ఆరోపించాడు. డడ్షెవ్కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఉమర్ ప్రకటించారు. -
పంచ్ పడుద్ది
ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగానూ కొనసాగుతున్నారు అరుణ్ విజయ్. గతేడాది ‘తడం’ అనే తమిళ థ్రిల్లర్ చిత్రంతో సూపర్ హిట్ సాధించిన ఆయన తాజాగా ‘బాక్సర్’ అనే సినిమా అంగీకరించారు. ఇందులో బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు అరుణ్ విజయ్. ఈ పాత్ర కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారట. ఆల్రెడీ వియత్నాంలో ట్రైనింగ్ కూడా మొదలెట్టారు. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రితికా సింగ్ హీరోయిన్. స్పోర్ట్స్ జర్నలిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘సాహో’ సినిమాలో అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. -
అసలు ఆట అప్పుడే!
మొన్నామధ్య వరుణ్ తేజ్ కాలిఫోర్నియా వెళ్లి బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. విదేశీ మాజీ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. వరుణ్. మరి.. బాక్సింగ్ బరిలోకి వరుణ్ ఎంట్రీ ఎప్పుడు అంటే ఆగస్టులో అట. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాను చేయనున్న బాక్సర్ రోల్ కోసం వరుణ్ తేజ్ శిక్షణ తీసుకున్నారు. ఆగస్ట్‌లో షూటింగ్ ప్రారంభించి హైదారాబాద్, వైజాగ్, ఢిల్లీలో మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్మీకి’ సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. -
అక్కడే ఉండిపో!
మన అమ్మాయో, అబ్బాయో ఆటల పోటీల్లో స్కూల్ ఫస్ట్ వస్తే ఏం చేస్తాం? భుజం తట్టి ప్రోత్సహిస్తాం. అదే.. మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో కప్పు గెలుచుకుంటే..? మళ్లీ ఇదేం ప్రశ్న? అప్పుడు కూడా మెచ్చుకుంటాం. మరింతగా ఎంకరేజ్ చేస్తాం. ఇంకొంచెం ముందుకు వెళ్లి జాతీయ స్థాయిలో పేరు తెస్తే?అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మన వెన్ను తట్టి అండగా నిలుస్తుంది. అవార్డులూ రివార్డులూ ప్రకటిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో అయితే..ఇక చెప్పేదేముంది? ప్రభుత్వమే పరమానందపడిపోయి ఇళ్ల స్థలాలూ, కార్లూ, ఉద్యోగాలూ ఇచ్చేస్తుంది. ఇది మన దేశంలో. మన దేశంలో అనేముంది? దాదాపుగా ఏ దేశమైనా ఇంతే. కానీ ఇరాన్లో మాత్రం అంతర్జాతీయ బాక్సింగ్‌లో కప్పు గెలుచుకున్న అమ్మాయిని మెచ్చి మెడలో హారం వేయలేదు కానీ, ఆగ్రహించి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇదేం చిత్రం అంటారా? చిత్రం కాదు... వాస్తవం.మీరు కనుక ఇరానియన్ అయితే, ముందు మీరు స్త్రీనా, పురుషుడా అని చూస్తారు. తర్వాత మీరు ధరించిన దుస్తులేమిటో తేరిపార చూస్తారు. చూసి... తేడా వస్తే గనక అరెస్ట్ చేసేస్తారు. అక్కడేవో నిబంధనలు, నియమాలు ఉన్నాయి మరి. పాపం.. ఈ ఇరానియన్ బాక్సర్ సదరా ఖదేమ్ ఫ్రాన్స్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో అన్నే చౌవీన్ అనే తన ప్రత్యర్థిపై గెలిచింది. అందుకు ప్రతిఫలంగా ఆమెకు దక్కింది స్వదేశం జారీచేసిన అరెస్ట్ వారెంట్. ఇరాన్ ప్రభుత్వం ఆమెకు ఈ వారెంట్‌ను ఎందుకు ఇచ్చిందో తెలుసా? మ్యాచ్ జరిగే సమయంలో ఆమె తన ముఖానికి మేలిముసుగు వేసుకోలేదు మరి! అయితే? అది ఆ దేశ నియమాల ప్రకారం చాలా ఘోరమైన తప్పిదమట. దాంతో ఆమె బాక్సింగ్‌లో ఏ దేశ ప్రత్యర్థినైతే మట్టి కరిపించి విజయ బావుటా ఎగుర వేసిందో, ఆ దేశంలోనే శరణార్థిగా జీవించవలసిన పరిస్థితి... కాదు దుస్థితి ఏర్పడింది.ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దవలసిన ఇరాన్ జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆ పని చేయకపోగా సదాఫ్ను గెటౌట్ అంది. ఆమెను తమ దేశానికి తిరిగి రప్పించేది లేదని పంచ్ స్టేట్మెంట్లు విసిరి మరీ చెబుతోంది. అంతేకాదు.. ‘‘ఫెడరేషన్ దృష్టిలో అదంతా ఆమె వ్యక్తిగత విషయం. జనంలోకి వచ్చేటప్పుడు వళ్లు దగ్గర పెట్టుకోనక్కరలేదా?’’ అంటూ గుడ్లురుముతున్నాడు సమాఖ్య అధ్యక్షుడు హుసేన్ సూరి. – డి.వి.ఆర్. -
ఒంటరి వృద్ధులు, మహిళలే లక్ష్యంగా బాక్సర్ పంజా..
సాక్షి, సిటీబ్యూరో: కుటుంబ ఆర్థిక సమస్యలకు తోడుగా చేసిన అప్పులు తీర్చే క్రమంలో ఈజీమనీ కోసం చైన్‌స్నాచింగ్‌ల బాట పట్టిన ఓ బాక్సర్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 16.5 తులాల బంగారు ఆభరణాలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన మేరకు.. ఉప్పుగూడలో నివాసముండే కోన నర్సింగ్‌రావు అలియాస్ నర్సింహా కుటుంబ పోషణ కోసం 2006లోనే చదువులను మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత పలు ఉద్యోగాలు చేశాడు. ఈ క్రమంలోనే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకొని ఏకంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. గౌలిపురా గ్రౌండ్లో బాక్సింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. ఓలా, ఉబర్ క్యాబ్‌లను అద్దెకు తీసుకున్న క్రమంలో పరిచయస్తుల నుంచి అప్పు చేశాడు. వచ్చే ఆదాయం సరిపోక అప్పులు పెరగడంతో సులభంగా డబ్బు లు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. సులభంగా డబ్బుల కోసం చైన్ స్నాచింగ్‌ల బాట... తాను నివసిస్తున్న ఉప్పుగూడలో అసలైన నంబర్ ప్లేట్‌తో ద్విచక్ర వాహనం నడిపించే నర్సింగ్‌రావు చోరీ చేసే ప్రాంతాల్లో మాత్రం రెండు, మూడు నంబర్ ప్లేట్లు మార్చేవాడు. స్నాచింగ్‌లకు వెళ్లినప్పుడు నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగిస్తుంటాడు. ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుతూ.. ఒంటరిగా ఉదయం, సాయంత్రం నడకకు వెళ్లే వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలలో నుంచి మంగళసూత్రాలు, బంగారు గొలుసులు లాక్కొని పరారవుతుంటాడు. ఇలా ఏడు నెలల కాలంలో వరుసగా 10 గొలుసు దొంగతనాలు చేశాడు. ఈ సొత్తును ముత్తూట్, మణపురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థలలో కుదవపెట్టగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ...మరోవైపు అప్పులు చెల్లిస్తున్నాడు. రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం అనుమానాస్పదంగా సంచరిస్తున్న కోన నర్సింగ్రావును గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం బాక్సర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆరు కేసులలో మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని పరారరైనట్టు, మరో నాలుగు కేసులలో అపహరణ కోసం ప్రయత్నం చేసినట్టు ఒప్పుకున్నాడు. తదుపరి విచారణ కోసం గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. ఇతనిపై పీడీయాక్టు ప్రయోగించనున్నారు. -
బాక్సింగ్‌లో రాణిస్తున్న నిరుపేద క్రిడాకారిణి..మౌనిక
-
అర్జున అవార్డు గ్రహీత.. ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాడు!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో రజత పతక విజేత... ‘అర్జున’ అవార్డు గ్రహీత...ఈ ఘనతలేవీ కూడా ఒక అంతర్జాతీయ బాక్సర్‌కు చిరుద్యోగం, ఆర్థిక భద్రతను ఇవ్వలేకపోయాయి. ఫలితంగా అప్పులు తీర్చుకునేందుకు అతను రోడ్డుపై ఐస్ క్రీమ్‌లు అమ్ముకోవాల్సిన దీన స్థితి! 30 ఏళ్ల భారత వెటరన్ బాక్సర్ దినేశ్ కుమార్ పరిస్థితి ఇది. చాలా మందిలాగే హరియాణాలోని బాక్సింగ్ అడ్డా భివాని నుంచి వెలుగులోకి వచ్చిన దినేశ్ అంతర్జాతీయ స్థాయిలో 17 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు సాధించాడు. 2010లో చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో దినేశ్ 81 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. అతని ప్రదర్శనకు గాను అదే ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ‘అర్జున’ పురస్కారం కూడా అందుకున్నాడు. 2014 కామన్వెల్త్ క్రీడలకు కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేని దినేశ్ గత నాలుగేళ్లలో తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ‘నన్ను బాక్సర్‌గా తీర్చిదిద్దేందుకే మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. అవన్నీ తీరక ముందే నాకు ప్రమాదం జరిగింది. చికిత్స కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక అంతర్జాతీయ ఆటగాడిగా నాకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. చిన్నపాటి ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నాకు రోజు గడవడంతో పాటు అప్పులు తీర్చాలంటే మరో మార్గం లేదు. అందుకే ఇలా తోపుడు బండిపై రోడ్డు మీద కుల్ఫీ (ఐస్‌క్రీమ్)లు అమ్మేందుకు సిద్ధమయ్యాను’ అని దినేశ్ కుమార్ ఆవేదనగా చెప్పాడు. 2018 ఆసియా క్రీడల విజేతలకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ప్రకటించిన హరియాణా ప్రభుత్వం దినేశ్లాంటి గత విజేతను ఇప్పటిౖకైనా ఆదుకుంటుందేమో వేచి చూడాలి. -
వేధింపుల కేసులో బాక్సర్‌కు జైలుశిక్ష
విశాఖపట్నం, పీఎంపాలెం(భీమిలి): బాక్సింగ్ క్రీడలో పతకాలు తీసుకు వచ్చిన యువకుడు కట్టుకున్న భార్యకు ప్రేమాభిమానాలు కనబరచడంలో విఫలమయ్యాడు. వివాహ బంధానికి తూట్లు పొడిచాడు. భర్త గొప్ప క్రీడాకారుడని ఎంతో మురిసిపోయిన యువతికి నరకం చూపించాడు. కట్న పిశాచిలా మారాడు. అమ్మాయి తరఫువారు ఎంతగా ప్రాధేయ పడినా.. అడిగినప్పుడల్లా కానులు సమర్పించినా మనసు కరగలేదు. బాక్సర్ అయిన భర్త పెట్టే హింసలు తాళలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిది. కేసును విచారించిన భీమిలి న్యాయ స్థానం నేరం రుజువవడంతో వీరోతి సంతోష్‌కుమార్ అనే అంతర్జాతీయ బాక్సర్తో పాటు ఇదే కేసులో మరో ముగ్గురు కుటుంబసభ్యులకు న్యాయమూర్తి ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ. 2500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ. కె.లక్ష్మణమూర్తి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపగుంట సాయిమాధవ్నగర్కు చెందిన వీరోతి సంతోష్‌కుమార్ (27)అంతర్జాతీయ స్థాయి బాక్సర్. ఆసియాడ్‌లో పతకాలు సాధించాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు.అతని క్రీడా ప్రతిభను కేంద్రప్రభుత్వం గుర్తించి ఆర్మీ లో సుబేదార్ హోదా ఉద్యోగం ఇచ్చింది. ఇది ఇలా ఉండగా మధురవాడకు చెందిన వి.మారుతీ ప్రసాద్ తన కుమార్తె మణిరత్నానికి బాక్సర్ సంతోష్ కుమార్‌కు 2014 డిసెంబరు 12న వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. వధువు కన్నవారు ఉన్నంతలో కట్నకానుకలు, కారు సమర్పించారు. అయినా సంతోష్‌కుమార్‌కు అతని తండ్రి విశ్వనాథంకు కట్నం దాహం తీరలేదు. నిత్యం అదనపు కట్నం కోసం వేధించేవారు. సూటి పోటి మాటలతో హింసించేవారు. పండగలు, పబ్బాలకు కన్నవారింటికి పంపించేవారు కాదు.నరకం చూపించేవారు. కుమార్తెకు పెట్టే హింసలు చూసి కన్నవారు అక్కున చేర్చుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు 2016 ఆగస్టే 23న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం భీమిలి కోర్టులో చార్జిషీటు దాకలు చేశారు. నేరారోపణలు రుజువు కావడంతో భీమునిపట్నం 16వ అడిషనల్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ బాక్సింగ్ క్రీడాకారుడు సంతోషకుమార్, అతని తల్లిదండ్రులు విశ్వనా«థం,ఈశ్వరమ్మతో పాటు సోదరుడు భాను అప్పలగణేష్(అలియాస్ గణేష్‌ల)కు వరకట్న నిషేధ చట్టం కింద, 498 కింద ఏడాది జైలుశిక్ష, రూ. 2500లు వంతున జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారని సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. -
బాక్సింగ్ సెమీస్‌లో వికాస్, అమిత్
ఏషియాడ్ బాక్సింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం క్వార్టర్ ఫైనల్స్‌లో స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ (75 కేజీలు) 3–2తో చైనాకు చెందిన తుహెటా ఎర్బీక్ తంగ్లథియాన్‌పై నెగ్గి సెమీస్‌కు చేరాడు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో అమిత్ ఫంఘాల్ (49 కేజీలు) 5–0తో దక్షిణ కొరియా బాక్సర్ కిమ్ జాంగ్ ర్యాంగ్‌పై గెలుపొందాడు. మరోవైపు మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో సర్జుబాలా దేవి (51 కేజీలు) 0–5 తేడాతో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. దీంతో భారత మహిళా బాక్సర్లు పతకాలేమీ సాధించకుండా వెనుదిరిగినట్లయింది. మహిళల బాక్సింగ్‌ను ఏషియాడ్‌లో ప్రవేశపెట్టిన (2010) తర్వాత భారత్‌కు ఇలా జరగడం ఇదే మొదటిసారి. -
మహిళా ఉద్యోగిపై దాడి.. ప్రముఖ బాక్సర్‌పై కేసు
చండీగఢ్ : మహిళా ఉద్యోగిపై దాడి చేశారని ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహిత జై భగవాన్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒలంపిక్ విజేత జై భగవాన్ ఫతేహాబాద్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు హిసార్‌లో లోని లక్ష్మీవిహార్ సమీపంలో మద్యం షాపు ఉంది. నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్ముతున్నారని ఆరోపనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత నెల 19న రాత్రి 9 గంటలకు హీసార్ మహిళా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీవిహార్కు చేరుకొని మద్యం షాపు డాక్యుమెంట్లను చూపించాలని కోరారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జైభగవాన్ ఆమెపై దాడికి పాల్పడ్డారు. నిబంధనల ప్రకారమే మద్యం విక్రయిస్తున్నామంటూ ఆమెను అడ్డుకున్నారు. తన మనుషులతో ఆమెను చుట్టుముట్టారు. అసభ్యకరపదజాలంతో దూషించారు. గంటకు పైగా ఆమె కారును చుట్టిముట్టారు. దీంతో ఈ విషయాన్ని ఆమె పై అధికారుల వద్దకు తీసుకెళ్లారు. జై భగవాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా హిసార్ డిప్యూటీ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్(డీఈటీసీ) ని కోరారు. జై భగవాన్ వివాదంపై విచారణ చేపట్టాల్సిందిగా డీఈటీసీ హిరాస్ ఎస్పీని ఆదేశించారు. దీంతో ఈ నెల జూన్12 న భగవాన్‌పై కేసు నమోదు చేశారు. -
కివీస్ బాక్సర్ కామన్వెల్త్ స్వర్ణం చోరీ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ నీకా కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన స్వర్ణ పతకాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆక్లాండ్‌లో కారులో ఉంచిన ఆ పతకం చోరికి గురైందని అతను వాపోతున్నాడు. గత నెల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ క్రీడల్లో హెవీవెయిట్ కేటగిరీలో అతను విజేతగా నిలిచాడు. ‘ఒక యువ అభిమానికి చూపించేందుకు నేను ఆ పతకాన్ని ఇంట్లోంచి బయటకు తీశాను. అది కారులో ఉండగా దొంగిలించారు. అది లేకపోతే నా కెరీర్‌కే విలువుండదు. దయచేసి నా పతకం నాకు ఇచ్చేయండి. నేను చెమటోడ్చి సాధించిన స్వర్ణం తిరిగి నా చేతికందుతుందన్న నమ్మకం నాకుంది’ అని నీకా తెలిపాడు. -
కామ్న్వెల్త్లో భారత బాక్సర్ల జోరు
-
నాతో పెట్టుకుంటే పంచ్‌పడుద్ది
తమిళసినిమా: చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో. నాతో పెట్టుకుంటే పంచ్‌పడుద్ది అంటున్నట్టుంది నటి త్రిష వాలకం చూస్తుంటే. ఏంటీ అసందర్భ ప్రేలాపన అని అనుకుంటున్నారా? చెన్నై చంద్రం త్రిష నటిగా దశాబ్దం కాలాన్ని అవలీలగా దాటేసింది. ఈ చిన్నది ప్రేమలో ఫెయిల్ అయ్యి ఉండవచ్చుగానీ, నటిగా సక్సెస్‌లోనే ఉంది. జయాపజయాలకు అతీతంగా నటిగా తన గ్రోత్‌ను నానాటికీ పెంచుకుంటూ పోతోంది. గ్లామర్ హీరోయిన్ స్టేజ్‌ను దాటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల స్థాయికి చేరుకుంది. అలా నటించిన నాయకి చిత్రం ఫ్లాప్ అయినా, ఆ తరహా అవకాశాలు మాత్రం త్రిషను వరిస్తూనే ఉన్నాయి. అరవిందస్వామికి జంటగా నటించిన చదురంగవేట్టై– 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విజయ్‌సేతుపతితో నటిస్తున్న 96 చిత్రం నిర్మాణంలో ఉంది. ఇక 1818 చిత్రంతో పాటు, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు మోహిని, గర్జన చిత్రాల్లో నటిస్తున్న త్రిష ఈ స్థాయికి రావడానికి తన నిరంతర శ్రమ, పాత్రలపై అంకిత భావం లాంటివి కారణంగా భావించాలి. 3 పదుల వయసు మీద పడినా పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి చేసే కృషిలోమాత్రం మార్చు లేదన్నది తాజాగా తను విడుదల చేసిన ఒక వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ఆ వీడియోలో త్రిష తన శిక్షకుడితో బాక్సింగ్ క్రీడలో తర్ఫీదు పొందుతున్న దృశ్యాలు అందర్నీ అచ్చరువు చెందేలా చేస్తున్నాయి. అందులో త్రిష శిక్షణ పొందుతున్నట్లు కనిపించడం లేదు. గెలుపు కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థిపై పైచెయ్యి సాధించేలా చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో, నాతో పెట్టుకుంటే మడతైపోద్ది అన్నట్లు ఉంది. ఈ అందాల తార తన కొత్త చిత్రం కోసం కిక్ బాక్సింగ్‌లో తీవ్రంగా శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ఈ చిన్నది బాక్సింగ్ చేస్తున్న వీడియో దృశ్యాలిప్పుడు సోషల్ మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.వీటిని ఆమె అభిమానులు యమాగా ఎంజాయ్ చేస్తున్నారు. త్రిషానా మజాకా! -
మట్టిలో మాణిక్యం
కటిక పేదరికం. అయినవాళ్లున్నా అనాథలా జీవనం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం. కుటుంబ భారం మోయలేక చేతులెత్తేసిన తండ్రి. నిస్సహాయ స్థితిలో ఐదుగురు ఆడపిల్లల్ని స్వచ్ఛంద సంస్థలో చేర్చిన తల్లి... ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్‌లో రాణిస్తోన్న ప్రియాంక జీవితం. కడుపునిండా తిండి లేకున్నా అత్యున్నత శిఖరాలకు చేరాలన్న ఆశయాన్ని వీడలేదు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదంటూ క్రీడల్లో సత్తా చాటుతోంది. అమ్మాయిలు ఎవరికీ తీసిపోరని రుజువుచేస్తూ సాహసోపేతమైన కిక్ బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని ముందడుగు వేస్తోంది. బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ వీఎస్టీ సమీపంలోని నాగమయ్య కుంట మురికివాడలో జన్మించిన ప్రియాంక జీవితం కన్నీటి పర్యంతం. సంగీత, రాజేందర్ దంపతులకు కలిగిన ఐదుగురు ఆడ సంతానంలో ప్రియాంక నాలుగో అమ్మాయి. ఆడపిల్లలు భారమని భావించిన తండ్రి రాజేందర్ ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం కోలుకోలేకపోయింది. అప్పటికే పేదరికంలో మగ్గిపోతున్న తల్లి సంగీత నిస్సహాయురాలై పిల్లలందరినీ చిన్నతనంలోనే స్వచ్ఛంద సంస్థలో చేర్చింది. వీరికి అఫ్జల్‌గంజ్‌లోని అఫ్సా రెయిన్బో హోమ్ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఇదే ఆశ్రమంలో తలదాచుకుంటోన్న ప్రియాంక చాదర్‌ఘాట్‌లోని డీఆర్ జిందాల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. రెజ్లింగ్ నుంచి కిక్‌బాక్సర్‌గా... ప్రియాంక కిక్ బాక్సర్‌గా ఎదగడం వెనుక కోచ్‌లు అక్రముల్లా, శ్రీనివాస్‌ల ప్రోత్సాహం ఉంది. చిన్నప్పటి నుంచి క్రీడల్లో రాణించే ప్రియాంక తొలుత రెజ్లింగ్ వైపు ఆసక్తి చూపించింది. అయితే బెల్ట్ రెజ్లింగ్‌లో వయసు సరిపోకపోవడంతో అర్హత సాధించలేకపోయింది. దీంతో కోచ్‌లు ఆమెను కిక్ బాక్సింగ్ వైపు ప్రోత్సహించారు. ప్రాణాలను పణంగా పెట్టే కిక్ బాక్సింగ్‌లో రాణించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపనతో ఆమె కిక్ బాక్సింగ్‌లో అడుగుపెట్టింది. ఆదిలోనే బంగారు పతకం... కిక్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే ప్రియాంక జాతీయ స్థాయిలో రాణించింది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణాన్ని సాధించింది. 48 కేజీల వెయిట్ కేటగిరీలో మధ్యప్రదేశ్ క్రీడాకారిణిని ఓడించి ప్రియాంక విజేతగా నిలిచింది. పోలీస్‌గా ఎదగాలనే కాంక్ష... సమాజాన్ని ప్రక్షాళన చేసేందుకు అవకాశం ఉన్న పోలీస్ అధికారిణిగా ఎదగడమే తన లక్ష్యమని ప్రియాంక చెబుతోంది. అందుకు అనుగుణంగానే క్రీడలతో పాటు, చదువులోనూ రాణిస్తోంది. అఫ్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రెయిన్బో హోమ్ తనను అక్కున చేర్చుకుని తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతోందని ఆమె చెప్పింది. ఆ సంస్థ ప్రేమను జీవితాంతం గుండెల్లో నిలబెట్టుకుంటానని ప్రియాంక కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసింది. నిస్సహాయులకు అండగా ఉంటాం: అఫ్సా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నగరంలోని నిరుపేదలకు ఆశ్రయాన్ని కల్పించి వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అఫ్సా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో అవసరమైన శిక్షణను ఇప్పించడం ద్వారా మురికివాడల్లోని పేద యువతీ యువకులు అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా తమ సంస్థ చేయూతనిస్తోందన్నారు. -
బాక్సర్ దారుణ హత్య
నోయిడా : హర్యానాకు చెందిన మాజీ బాక్సర్ జితేందర్ మన్ శుక్రవారం అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. జెటా సెక్టార్‌లోని ఏవీజే హైట్స్ అపార్ట్మెంట్లో తన ఇంటిలో శవమై కనిపించాడు. జితేందర్‌ను కలవాడినికి ప్రీతం అనే స్నేహితుడు జితేందర్ ప్లాట్ వెళ్లాడు. ఎంతసేపటికి తలపుతట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ప్రీతం పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై ఎస్పీ సునీత్ మట్లాడుతూ జితేందర్ శరీరంపై పలు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక జితేందర్ విషయానికి వస్తే జూనియర్ బాక్సింగ్‌లో భారత్ తరపున ఉబ్జెకిస్తాన్, క్యూబా, ఫ్రాన్స్, రష్యాలతో పాటు పలు అంతర్జాతీయ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. గాయాల కారణంగా గత ఏడు నెలల క్రితం బాక్సింగ్‌కు వీడ్కొలు పలికి జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. -
దిగ్గజ దీనస్థితి.. స్పందించిన సూపర్ స్టార్
సాక్షి, సినిమా : బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మరోసారి తన దయా గుణాన్ని ప్రదర్శించాడు. బాక్సింగ్ దిగ్గజం కౌర్ సింగ్(69)కు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న కౌర్ కొంత కాలంగా మొహలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. 1982లో ఏషియన్ గేమ్స్‌లో బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ అయిన కౌర్ మెడికల్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారంటూ ఈ మధ్యే టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. అది చూసి స్పందించిన షారూఖ్ తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పేరు మీదుగా కౌర్‌సింగ్ కుటుంబానికి అందజేశారు. ‘‘ఆటగాళ్లుగా ఇలాంటి దిగ్గజాలు తమ కృషి ద్వారా దేశానికి ఎంతో పేరు తెచ్చారు. అలాంటప్పుడు వారి బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అంటూ షారూఖ్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ మధ్యే పంజాబ్ ప్రభుత్వం రెండు లక్షల చెక్‌ను ఆయనకు అందజేయగా.. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) కూడా లక్ష రూపాయాలను ఆయన చికిత్స కోసం అందజేసిన విషయం తెలిసిందే. బాక్సింగ్ లెజెండ్ ముహమద్ అలీతో రింగ్‌లో తలపడిన ఏకైక భారతీయుడిగా కౌర్ సింగ్ ఘనత సాధించారు. -
బాక్సర్ అనుమానాస్పద మరణం
ప్రొఫెషనల్ బాక్సర్ కావాలని కలలుకన్న ఓ యువ బాక్సర్ ఆసక్మిక మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. స్కాటిష్ బాక్సర్ జోర్డాన్ కో (20) తన కలల సాకారంలో భాగంగా థాయిలాండ్ వెళ్లాడు. అక్కడ బరువుతగ్గడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం భారీ ట్రాక్ సూట్ లో శవమై తేలాడు. తన తదుపరి పోరాటం కోసం ఒక నిర్దిష్ట వెయిట్‌ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్యంగా థాయిలాండ్ లో మరణించడం కలకలం రేపింది. అయితే వడదెబ్బతో చనిపోయాడని అధికారులు ప్రాథమికంగా అంచానా వేశారు. జోర్డాన్ కో శనివారం రాత్రి మాంగ్ జిల్లా లో ఒక కంబోడియన్ బాక్సర్ తో తరపడాల్సి ఉంది. ఈ పోటీ తరువాత అతను గ్లాస్గో థాయ్ బాక్సింగ్ అకాడమీ పోటీల్లో పాల్గొనేందుకు స్కాట్లాండ్ కు తిరిగి వస్తాడని అందరూ భావించారు. కానీ కోచ్ క్రైగ్ ఫ్లోన్ గ్లాస్గో ఆదివారం ఉదయం జోర్డాన్ మరణించాడనే సమాచారాన్ని అందించాడు. వడదెబ్బతో అతని చనిపోయినట్టుగా అధికారులు భావిస్తున్నారని తెలిపాడు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు నిధుల సేకరణకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మూడున్నర సంవత్సరాలు తనతో కలిసి పనిచేశాడని, తాజాగా జోర్డాన్ ఒక ప్రొఫెషనల్ కావాలనే కోరికతో థాయ్‌లాండ్‌కు వచ్చినట్టు చెప్పారు. ఇంతలోనే అతను కన్నుమూయడం విచారకరమన్నాడు.మరోవైపు జోర్డాన్ మరణం పట్ల థాయ్‌లాండ్ విదేశాంగ శాఖ ప్రతినిధి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. -
ప్రొఫెషనల్’ బౌట్లకు అఖిల్, జితేందర్ రెడీ
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్‌సింగ్ లాగే అఖిల్ కుమార్, జితేందర్ కుమార్‌లు కూడా ‘ప్రొఫెషనల్’ బాట పట్టారు. బీజింగ్ ఒలింపిక్స్ (2008)లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన వీరిద్దరు ప్రొఫెషనల్ సర్క్యూట్ లోఈ ఏడాది ఏకంగా ఆరు బౌట్లలో ఆడేందుకు సిద్ధమయా్యరు. 2006 మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన అఖిల్ ప్రొఫెషనల్ పోరు ఏప్రిల్ 1న ఆరంభం కానుంది. అఖిల్ సూపర్ లైట్ వెయిట్ కేటగిరీలో, జితేందర్ సూపర్ ఫెదర్ వెయిట్ కేటగిరీలో పోటీపడనున్నారు. ‘ఆరంగేట్రానికి తకు్కవ సమయమున్నప్పటికీ త్వరగానే ప్రొఫెషనల్ పోటీలకు అలవాటు పడిపోతామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం’ అని 35 ఏళ్ల అఖిల్ అన్నాడు. జితేందర్ మాట్లాడుతూ ‘నేను, అఖిల్ ఈ ప్రయాణంలో విజయవంతమవుతామనే నమ్మకంతో ఉన్నాం’ అని అన్నాడు. హరియాణాకు చెందిన వీరిద్దరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగాలిచ్చింది. ఇప్పుడు పోలీసు శాఖ అనుమతితోనే ‘ప్రొఫెషనల్’ బాక్సరు్లగా మారారు. -
అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీకి నిఖత్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బల్గేరియాలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికైంది. ఫిబ్రవరి 20న మొదలయ్యే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టును ప్రకటించారు. మహిళల విభాగంలో ఐదుగురు, పురుషుల విభాగంలో పదిమంది బాక్సర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో పోటీపడుతుంది. మీనా కుమారి (54 కేజీలు), ప్రీతి బెనివాల్ (60 కేజీలు), జ్యోతి (64 కేజీలు), మోనికా సౌన్ (75 కేజీలు) మిగతా సభ్యులుగా ఉన్నారు. పురుషుల విభాగంలో గువాహటిలో గత నెలలో జరిగిన సీనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు నెగ్గిన వారిని ఈ టోర్నీకి ఎంపిక చేశారు. పది మందితో కూడిన జట్టులో రియో ఒలింపియన్స్ శివ థాపా (60 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు) ఉన్నారు. -
సరిత ‘ప్రొ’ పంచ్ అదుర్స్
ఇంఫాల్: భారత మహిళా స్టార్ బాక్సర్ లైష్రామ్ సరితా దేవి తన ప్రొఫెషనల్ కెరీర్లో శుభారంభం చేసింది. తన తొలిపోరులో హంగేరికి చెందిన వెటరన్ సోఫియా బెడోను కంగుతినిపించింది. ఆదివారం ఇక్కడి ఖుమన్ లాంపక్ స్టేడియంలో జరిగిన ‘ఐబీసీ’ ఫైట్నైట్లో సరిత... ప్రొ సర్క్యూ ట్లో ఎంతో అనుభవజ్ఞురాలైన సోఫియాను అలవోకగా ఓడించింది. 59 ప్రొఫెషనల్ బౌట్లలో తలపడిన ఆమె భారత బాక్సర్ పంచ్‌లకు తలవంచింది. మరో పోరులో పింకీ జాంగ్రా కూడా శుభారంభం చేసింది. 26 ఏళ్ల పింకీ... స్లోవేకియాకు చెందిన క్లౌడియా ఫెరెన్జీపై విజయం సాధించింది. -
ఆలీ ద గ్రేట్
-
బాక్సర్ కళావతికి స్వర్ణం
హైదరాబాద్: రాష్ట్రస్థాయి స్కూల్ బాక్సింగ్ టోర్నమెంట్లో గండిపేట మండల పరిధిలోని పుప్పాలగూడ గ్రామానికి చెందిన జి. కళావతి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఈ టోర్నీలో కళావతి 46-48 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఈనెల 25వ తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయి పోటీలకు కళావతి ఎంపికైయిందని ఆమె కోచ్ శివకుమార్ తెలిపారు. 9వ తరగతి చదువుతోన్న కళావతి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ నేర్చుకోవడంతో పాటు పలు పోటీలలో పాల్గొని పతకాలు గెలిచింది. జాతీయస్థాయి పోటీల్లోనూ ఆమె ఇదే జోరును కొనసాగించి పతకం సాధిస్తుందని కోచ్‌లు శివకుమార్, వినేశ్బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. -
నందమూరి హీరోల్లో 'బాక్సర్' ఎవరు..?
ప్రస్తుతం జనతా గ్యారేజ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా త్వరలోనే తన సినిమాను పూర్తి చేసి ఫ్రీ అవ్వనున్నాడు. దీంతో ఈ ఇద్దరు నందమూరి అన్నదమ్ముల నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై భారీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాక్సర్ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు కళ్యాణ్ రామ్. మరి ఈ బాక్సర్‌లో హీరోగా నటించబోయేది ఎవరు..? ఇప్పటికే వక్కంతం వంశీ, పూరి జగన్నాథ్‌లు ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో కళ్యాణ్ రామ్ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. బాక్సర్ టైటిల్‌తో సినిమా ఎవరు చేస్తారో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
పతకానికి అడుగు దూరంలో..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ పంచ్ అదిరింది. 75 కేజీల మిడిల్‌వెయిట్ విభాగంలో బరిలోకి దిగిన వికాస్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన పోరులో వికాస్ 3-0 తేడాతో సైపల్ ఓండర్(టర్కీ)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ వికాస్ ఆద్యంత పైచేయి సాధించి నాకౌట్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. ఒకానొక దశలో వికాస్ పంచ్‌లకు ఓండర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కంటినుంచి రక్తం కారడంతో 38 సెకెండ్లపాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత కూడా వికాస్ మరింత దూకుడునే కొనసాగించి ఓండర్ ను చిత్తు చేశాడు. దీంతో జడ్జిల ఏకపక్ష నిర్ణయంతో విజయాన్ని సొంతం చేసుకుని క్వార్టర్స్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ బెక్తిమిర్ మెలికుజివ్తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. 2015 ఆసియన్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి పోరులో మెలికుజివ్ విజయం సాధించాడు. మరోవైపు 2014 యూత్ ఒలింపిక్ చాంపియన్ అయిన మెలికుజివ్.. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో వీరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. -
‘పిడికిళ్ల పోరు’లో యోధురాలు
ఆల్కాట్‌తోట: ఆమెలోని ఉక్కు సంకల్పంలాగే..పిన్నవయసులోనే ఆమె పిడికిలి రాటుదేలింది. ఆ గోదావరి బిడ్డ గోదాలో దిగితే తిరుగులేని యోధురాలినని చాటుతోంది. తన పిడిగుద్దుల వర్షంతో పతకాల పంట పండిస్తోంది. జాతీయంగానూ ఈ గడ్డ ఖ్యాతిని చాటాలన్న ధ్యేయంతో ఉన్న ఆమెకు.. దాన్ని సాకారం చేసుకోగల సిరి మాత్రం లేదు. సర్కారు సహకరిస్తేనే ఆమె స్వప్నం సత్యమవుతుంది. ఆ బాలికే రాజమహేంద్రవరానికి చెందిన షేక్ నస్రీన్. నగరంలోని ఐఎల్టీడీ ప్రాంతానికి చెందిన నస్రీన్ తండ్రి షేక్ మస్తాన్ చిరువ్యాపారం చేస్తుంటారు. 2014లో హైదరాబాద్‌లోని బాబాయి ఇంటికి వెళ్లిన ఆమె.. అక్కడ తన ఈడులోనే వివిధ క్రీడల్లో రాణిస్తున్న వారిని చూసి ఉత్తేజితురాలైంది. తానూ ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలన్న ఆలోచన అంకురించింది. అందుకు బాక్సింగ్‌ను ఎంచుకోవాలన్న నస్రీన్ ఆకాంక్షను బంధువులంతా తిరస్కరించారు. ఆడపిల్లకు క్రీడ ఎందుకని నిరుత్సాహపరిచారు. అయితే ఆమె తండ్రి మస్తాన్, తల్లి మీరా మాత్రం కూతురి కోరికను మన్నించారు. దాంతో ఆమె హైదరాబాద్‌లో బాబాయి ఇంటి వద్దే ఉండి, 9వ తరగతి చదువుకుంటూ అక్కడి ఎల్బీ స్టేడియంలో శాప్ బాక్సింగ్ కోచ్ ఓంకార్ రాధా యాదవ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. రంగారెడ్డిలో జరిగిన జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీల్లో 54–56 వెయిట్ కేటగిరీలో గోల్డ్‌మెడల్ సాధించి, స్టేట్‌మీట్‌కు ఎంపికైంది. ఆ పోటీల్లోనూ తన పిడికిలి పట్టును చాటి, గోల్డ్‌మెడల్ సాధించింది. అనంతరం తెలంగాణలోని సరూర్‌నగర్‌లో జరిగిన జాతీయస్థాయి చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపు శాప్‌లో నిర్వహించిన రాష్ట్ర రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కూ నస్రీన్ అర్హత సాధించింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజమహేంద్రవరం తిరిగి వచ్చేసిన ఆమె ఇక్కడే పదో తరగతిలో చేరింది. వసతులూ, శిక్షణా దూరమైనా.. సాధనను కొనసాగిస్తూ కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ స్కూల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో అండర్–17 కేటగిరీ 62–66 కిలోల విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించింది. పంజాబ్‌లో జరిగిన నేషనల్ మీట్‌కు ఎంపికైంది.అలాగే రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న డిస్ట్రిక్ట్ మీట్లో, విశాఖలో జరిగిన స్టేట్‌మీట్‌లో గోల్డ్‌మెడళ్లు సాధించింది. చెన్నైలో జరిగిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో పాల్గొంది. ప్రోత్సహిస్తేనే రాష్ట్రంలో ఇతర క్రీడలతో పాటు బాక్సింగ్కూ ప్రోత్సాహం కరువైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా స్వశక్తితో పిడికిళ్లకు పదును పెట్టుకుంటున్న నస్రీన్.. ఇంటి వద్ద సాధన చేస్తూనే.. అమలాపురం వెళ్లి మధుకుమార్ అనే కోచ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. క్రీడారంగానికి దిగ్గజాల వంటి క్రీడాకారులెందరినో అందించిన ఘన చరిత్ర రాజమహేంద్రవరానికి ఉంది. అలాంటి నగరంలో బాక్సింగ్‌కు కనీసం శిక్షణా కేంద్రాలు లేకపోవడం క్రీడాకారిణిగా నస్రీన్ వికాసానికి విఘాతంగా పరిణించింది. ప్రస్తుతం పదవతరగతి పాసైన నస్రీన్ కడప స్పోర్ట్స్ అకాడమీలోనైనా ఇంటర్లో సీటు లభిస్తే తన లక్ష్యం నెరవేరగలదని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జిల్లాస్థాయి అధికారులు తన ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తే అకాడమీలో స్థానం దక్కుతుందని చెపుతోంది. మరి.. ఈ క్రీడారత్నం మరింత రాణించి, ఈ గడ్డ ఖ్యాతి జాతీయ వేదికలపై మార్మోగేలా చేయడానికి.. సంబంధిత అధికారులు, క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని వేదికలపై ఆర్భాటంగా చెప్పే ప్రజాప్రతినిధులూ చేయూతనిస్తారో, లేదో చూడాలి. జాతీయస్థాయిలో స్వర్ణపతకమే లక్ష్యం జాతీయస్థాయిలో బాక్సింగ్‌లో రాణించి గోల్డ్‌మెడల్ సాధించడం నా లక్ష్యం. రాష్ట్రంలో సరైన సదుపాయాలు లేకపోవడం పాటవాన్ని పెంచుకోవడానికి ఆటంకంగా ఉంది. కోచింగ్ తీసుకోవాలన్నా వ్యయప్రయాసలతో కూడుకున్నది. నా తల్లిదండ్రులకు భారమైనా వారి ప్రోత్సాహంతోనే ఇంతవరకూ రాణించగలిగాను. ప్రభుత్వాధికారులు లేదా ఎవరైనా స్పాన్సరర్లు సహకరిస్తేనే నా లక్ష్యం నెరవేరుతుంది. –నస్రీన్ -
విజేందర్ సింగ్‌పై కేసు నమోదు
న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల జరిగిన డబ్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్‌ను సాధించిన విజేందర్ ఆ పోరు సందర్భంగా మువ్వన్నెల రంగుతో ఉన్న షార్ట్ ను ధరించడమే వివాదానికి కారణమైంది. దీనిపై ఢిల్లీకి చెందిన ఉల్లాస్ అనే వ్యక్తి స్థానిక అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఇలా త్రివర్ణ రంగులతో ఉన్న ఒక షార్ట్‌ను ధరించి పోటీలో పాల్గొనడం భారత జాతీయ జెండాను అవమానపరిచినట్లేనని ఉల్లాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు విజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన బౌట్లో విజేందర్ 98-92, 98-92, 100-90తో ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ పై గెలిచి టైటిల్ సాధించాడు. పది రౌండ్ల పాటు జరిగిన బౌట్లో విజేందర్ ఏకపక్ష విజయం నమోదు చేశాడు. అంతకుముందు ప్రొ బాక్సింగ్‌లో ఆరు బౌట్లను గెలిచిన విజేందర్.. స్వదేశంలో అభిమానుల మధ్య తొలిసారి జరిగిన పోరులో అపూర్వమైన గెలుపును సొంతం చేసుకున్నాడు. కాగా, తాజా వివాదంపై విజేందర్ ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. -
బాక్సర్ అలీని పట్టించుకోని కొడుకు!
లాస్ ఏంజెల్స్: బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీని ప్రపంచ మొత్తం అభిమానించినా, అతని విలువేమిటో సొంత కొడుకు జూనియర్ అలీ గుర్తించలేకపోయాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా తండ్రిగా దూరంగా ఉంటున్న జూనియర్ ఆలీ.. ఒకానొక సందర్భంలో తండ్రిపై తన అసహనాన్ని వెల్లగక్కాడు. తండ్రి సరిగా పట్టించుకోలేకపోవడం వల్లే తాను పేదరికంలో మగ్గాల్సి వస్తుందన్నాడు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను తండ్రి గురించి ఆలోచించడం మానేశానని, ఆయనకు ఏం జరిగినా తనకు అనవసరమని గట్టిగా చెప్పేశాడు. ప్రస్తుతం చికాగాలో తల్లి తరపు తాతయ్య దగ్గర భార్యతో కలిసి జూనియర్ అలీ జీవిస్తున్నాడు. అతనికి భార్య షకీరా, పిల్లలు అమీరా(8), షకీరా(7)లు ఉన్నారు. కాగా, ఒక స్వచ్ఛంద సంస్థ అందించే సహకారంతోనే భార్యను తన ఇద్దరు పిల్లల్ని పోషించడం జూనియర్ అలీ దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. మొహమ్మద్ అలీకి నలుగురు భార్యలు కాగా, మొత్తం తొమ్మిది మంది పిల్లలు. అందులో మొదటి భార్య కొడుకే జూనియర్ అలీ. సోన్జీ రాయ్, బెలిండా బాయ్డ్, వెరొనియా పోర్ష్లకు విడాకులు ఇచ్చిన తర్వాత 1986లో లోనీ విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. మూడోభార్య పిల్లలైన లైలా అలీ, హనా అలీతోనే తండ్రికి అనుబంధం ఎక్కువ. లైలా బాక్సర్‌గా సత్తా చాటగా... హనా రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. అయితే లైలా, హనాలను తరచు జూనియర్ అలీ కలిసినా, తండ్రి గురించి మాత్రం కనీసం తెలుసుకునే ప్రయత్నంకూడా చేయకపోవడం బాధాకరమే. ప్రపంచానికి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మొహ్మద్ అలీ కుమారుడు ఒక అనామకుడిలా మిగిలిపోవడం విచారకరం. -
'రింగ్' రోదిస్తోంది
- బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ కన్నుమూత - మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాటం - సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని విజయాలు లాస్ ఏంజెల్స్: ‘నన్ను ఓడించాలని ఎవరైనా కలగన్నా.. వెంటనే నిద్ర లేచి నాకు క్షమాపణలు చెప్పాలి’... అంటూ రొమ్ము విరిచిన తెగింపుతో... తిరుగులేని ఆటతో... సుదీర్ఘకాలం ప్రపంచ బాక్సింగ్‌ను శాసించిన ‘ది గ్రేట్’ మొహమ్మద్ అలీ (74) శనివారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలకు చికిత్స పొందుతూ ఫోనిక్స్‌లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ‘చాంపియన్లు జిమ్‌లో పుట్టరు’ అంటూనే 21 ఏళ్ల బాక్సింగ్ కెరీర్లో (1960-81) తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను నిలువెల్లా వణికించారు. కవ్వించే మాటలకు.. కన్పించని తంత్రాలకు... తనదైన రీతిలో ముష్టిఘాతాలు కురిపిస్తూ... ఎదురుపడ్డోడి ఒంట్లో నరాలన్నీంటిని పిండి చేశారు. ‘ప్రతి నిమిషం శిక్షణ నాకు నచ్చదు’ అంటూనే... అవసరమైనప్పుడు శ్రమకు నిర్వచనంగా నిలిచారు. బాధతో విలవిలలాడే ప్రత్యర్థులు పిడిగుద్దులు గుద్దినా ఓర్పుగా అనుభవిస్తూనే.. నేర్పుగా తాను అనుకున్న ఫలితాన్ని రాబట్టారు. అభిమానులు చంపేయంటూ అరిచినా... ప్రత్యర్థులు భీకరిల్లే అరుపులు పెట్టినా... దాన్ని బౌట్ వరకే పరిమితం చేశారు. కానీ ఆనాడు తగిలిన దెబ్బలకు జీవితంలో ఎన్నడూ కోలుకోలేని ‘పార్కిన్సన్’ వ్యాధికి (1984) గురై దాదాపు మూడు దశాబ్దాలు చిత్ర వధ అనుభవించారు. దీంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు, న్యూమోనియా (2014), యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (2015)తో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ జీవిత గమనాన్ని నెట్టుకుంటూ వచ్చిన అలీ.. రెండు రోజుల కిందట శ్వాస సమస్యలతోనే మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. కానీ చికిత్స చేసినా... పరిస్థితి చేజారడంతో ఈ లోకం విడిచారు. చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన అలీ... చివరిసారిగా పార్కిన్సన్ చికిత్సకు నిధులు సమకూర్చుకునేందుకు ఏప్రిల్‌లో ఫోనిక్స్‌లో ‘సెలబ్రిటీ ఫైట్ నైట్ డిన్నర్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌తో అనుబంధం న్యూఢిల్లీ: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ భారత్‌లో రెండుసార్లు పర్యటించారు. కేవలం రెండు పర్యటనల్లోనే ఎంతోమంది ఆత్మీయ అభిమానులను సంపాదించుకున్నారు. 1980లో ఓ పారిశ్రామికవేత్త ఆహ్వానం మేరకు తొలిసారి అలీ ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నైలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ బౌట్లలో పాల్గొన్నారు. రెండోసారి 1990లో భారత్ వచ్చిన అలీ కోల్‌కతాలో మూడు రోజులు గడిపారు. ఇక్కడే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ మ్యాచ్ కోసం నేను బండరాతిని హత్య చేశాను... కొండను గాయపర్చాను... చికిత్స చేసే మందులను కూడా నేను ఇప్పుడు రోగిగా మార్చగలను... ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరుకు ముందు ప్రత్యర్థికి సవాల్ విసురుతూ... బాక్సింగ్ రింగ్‌లో అలీ గర్జన. యూనిఫారం ధరించి 10 వేల మైళ్లు ప్రయాణించి అమాయకులైన ప్రజలపై బాంబులు వేసేందుకు నన్ను పంపిస్తారా? మన దేశంలో నల్లజాతివారిని మనుషులుగా చూడకుండా... తెల్లవాళ్ల ఆధిపత్యం కోసం మరో పేద దేశాన్ని బలి చేస్తారా... అమెరికా ప్రభుత్వంపై అలీ ధిక్కారం. నాకు ట్రైనింగ్ అంటే అసహ్యం...కానీ జీవిత కాలమంతా చాంపియన్‌గా బతకాలంటే ఇప్పుడు ఆగిపోవద్దు. రిస్క్‌లు చేయడం ఇష్టం లేనివారు జీవితంలో ఏదీ సాధించలేరు... నా జీవితంలో నేను తలపైనే 29 వేల పంచ్‌లు తిన్నాను... అనుభవంతో అలీ నింపే స్ఫూర్తి. మొహమ్మద్ అలీ బాక్సర్ మాత్రమే కాదు...రింగ్‌లో రక్తం కళ్లచూసినవాడు. కానీ బయట మానవత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. నమ్మిన సిద్ధాంతం కోసం ఒకనాడు బాక్సింగ్ కెరీర్‌నే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బాక్సింగ్‌లో సూపర్ మ్యాన్‌లా ప్రపంచాన్ని శాసించిన అతను నల్లజాతివారి హక్కుల కోసం ఎంతటి వారినైనా ఎదిరించేందుకు వెనుకాడలేదు. అదే అలీని ప్రపంచ క్రీడాకారుల్లో అందరికంటే ముందు నిలిపింది. ఒక ఫైటర్నుంచి మత ప్రచారకుడి వరకు అతనిలో ఎన్నో కోణాలు ఉన్నాయి. బాక్సింగ్‌లోనే కాదు మాటల్లో కూడా పంచ్‌లతో అలీ తనకు ఎదురు లేదనిపించాడు. ‘నేను గొప్పవాడినే కాదు. అంతకంటే ఎక్కువే’ అంటూ స్వయంగా ప్రకటించుకోగలగడం ఎంత మందికి సాధ్యమవుతుంది. దేవుడు తన చాంపియన్ కోసం కిందికి దిగి వచ్చాడు... అలీ మరణానంతరం మరో స్టార్ బాక్సర్ మైక్ టైసన్ ఇచ్చిన నివాళి ఇది. బాక్సింగ్‌లో అసలైన చాంపియన్‌గా రెండు దశాబ్దాల పాటు అలీ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టాడు. ఆ పంచ్‌కు రింగ్‌లో కుప్పకూలిన ఆటగాళ్లెందరో... ఆ పవర్‌కు ఇక చాలు అంటూ శరణుజొచ్చిన బాక్సర్లు మరెందరో... మూడు సార్లు ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఏకైక బాక్సర్ అయిన అలీ, గత వందేళ్లలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుడిగా నీరాజనాలందుకున్నాడు. తిరుగులేని పంచ్‌లు: తన సైకిల్ ఎత్తుకుపోయిన దొంగను పట్టుకొని చితకబాదాలని 12 ఏళ్ల కుర్రాడిలో వచ్చిన ఆవేశాన్ని ఒక పోలీస్ గుర్తించి సానబెట్టడంతోనే ప్రపంచ బాక్సింగ్‌కు అలీ లభించాడు. కాసియస్ మార్సెలస్ క్లేగా పలు సంచలన విజయాలు సాధించిన అతను 1960 రోమ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే ఏడాది ప్రొఫెషనల్‌గా రింగ్‌లోకి అడుగు పెట్టిన అతనికి ఆ తర్వాత ఎదురే లేకుండా పోయింది. 22 ఏళ్ల వయసులోనే వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలవడంతో అలీ పేరు మా రుమోగిపోయింది. ఆ తర్వాత మరో రెండు సార్లు అతను ఈ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 1960 నుంచి 1981 మధ్య కాలంలో ప్రొఫెషనల్ బాక్సిం గ్లో తలపడిన 61 బౌట్లలో 56 విజయాలు... ఇందులో 37 నాకౌట్లే ఉండటం విశేషం. మతంపై నమ్మకంతో...:1967లో వియత్నాంపై అమెరికా యుద్ధం సాగిస్తున్న రోజులవి. అప్పటికే ముస్లింగా మారిన అలీ తాను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అప్పటి నిబంధనల ప్రకారం అలీ కూడా ఆర్మీలో చేరి వియత్నాం యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ తాను నమ్మిన ఇస్లాం అమాయకులను చంపనీయదంటూ దానిని వ్యతిరేకించాడు. దాంతో ప్రభుత్వం అతని హెవీవెయిట్ టైటిల్స్ రద్దు చేసి అరెస్ట్ కూడా చేయించింది. దీనిపై కోర్టులో పోరాటం తర్వాత అలీని అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో దాదాపు నాలుగేళ్ల కాలం అలీ జోరుకు అడ్డు వేసింది. అయినా పునరాగమనం తర్వాత కూడా పదును తగ్గని అతను మళ్లీ తన దూకుడును కొనసాగించాడు. శాంతి కోరుతూ...: ‘రంగు కారణంగా మనుషులను ద్వేషించడంకంటే దుర్మార్గం మరొకటి లేదు’ అంటూ అమెరికాలో నల్లజాతివారిపై చూపించే వివక్షకు వ్యతిరేకంగా అలీ పోరాడాడు. కెరీర్‌ను పణంగా పెట్టి ప్రభుత్వాన్ని ఎదిరించడం అక్కడి నల్లజాతీయులందరిలో స్ఫూర్తి నింపింది. కెరీర్ ముగిసిన తర్వాత కూడా అలీ మానవ హక్కుల కోసం తన పోరాటం కొనసాగించాడు. అనారోగ్యంతో బాధ పడుతున్నా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పర్యటించి శాంతి కోసం ప్రచారం చేశాడు. అమెరికా అత్యున్నత పురస్కారాలు ప్రెసిడెన్షియల్ సిటిజన్స్ మెడల్, మెడల్ ఆఫ్ ఫ్రీడం అలీకి దక్కాయి. చివరి రోజుల్లో కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ట్రంప్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తామూ అమెరికన్లమే అంటూ ఘాటుగా బదులిచ్చాడు. పాపులర్ ‘పంచ్’లు అలీxసోనీ లిస్టన్ (1964) అలీ తొలిసారి వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన బౌట్. అతనిపై ఎవరికీ అంచనాలు లేవు. ఆరు రౌండ్లలో అలీ చేతుల్లో తీవ్రంగా గాయపడ్డ లిస్టన్ తాను కొనసాగించలేనంటూ చేతులెత్తేశాడు. అలీx జార్జ్ ఫోర్మన్ (1974) ఆఫ్రికా దేశం జైర్‌లో జరిగిన ఈ పోరుకు ‘రంబల్ ఇన్ ద జంగిల్’గా పేరు పెట్టారు. అలీ అద్భుతమైన ఆటతో ఎనిమిదో రౌండ్లో ఫోర్మన్ను పడగొట్టాడు. మ్యాచ్ జరిగినంత సేపూ ‘అలీ...అతడిని చంపేయ్’ అంటూ ప్రేక్షకులు హోరెత్తించడం బాక్సింగ్‌లో చాలా కాలం చర్చనీయాంశం అయింది. అలీx జో ఫ్రేజర్ (1975) ‘థ్రిల్ల ఇన్ మనీలా’ పేరుతో ఈ బౌట్ సాగింది. ఇద్దరు బాక్సర్లూ పరస్పరం పదునైన పంచ్‌లు విసురుకున్నారు. అయితే 14వ రౌండ్ ముగిసే సరికి ఫ్రేజర్ తీవ్రంగా గాయపడగా...అతని ప్రాణాలు కాపాడేందుకు కౌంట్‌కు స్పందించకుండా ట్రైనర్ అడ్డుపడటంతో అలీని విజేతగా ప్రకటించారు. తాను చావుకు దగ్గరగా వెళ్లిన బౌట్ ఇదని అలీ తర్వాత చెప్పుకున్నాడు. అలీ ఉత్తమ ఆటగాడు. స్ఫూర్తి ప్రదాత, అందరికీ ప్రేరణగా నిలిచే గొప్ప బాక్సర్. ఆయన మరణం విచారకరం.- భారత ప్రధాని మోదీ అలీ మరణం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఎల్లప్పుడు మంచి కోసం ఫైట్ చేసిన చాంపియన్. ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపం. - అమెరికా అధ్యక్షుడు ఒబామా గొప్ప చాంపియన్, అదర్శనీయమైన వ్యక్తి. మనమంతా ఆయన్ని కోల్పోయాం. - డొనాల్డ్ ట్రంప్ అలీ రింగ్‌లో చూపించే ధైర్యం, తెగువ బాక్సింగ్‌ను అందమైన ఆటగా మార్చాయి.ఆయన వ్యక్తిత్వమే ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. - హిల్లరీ క్లింటన్ ‘జీవితంలో ఒక్కసారైనా ఆ దిగ్గజాన్ని కలవాలని అనుకున్నాను. కానీ నా కోరిక ఇక తీరదు’- సచిన్ ‘ఆటకు ఆయన చేసిన సేవ మరువలేనిది. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. చిరస్మరణీ యులు’ - విజేందర్ ‘బాక్సింగ్‌కు అలీ మరణం తీరని లోటు. ఆయనే నాకు ఆదర్శం. నాలాంటి ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాత. ఒక గొప్ప వ్యక్తిగా అందరి మదిలో నిలిచిపోయారు’ - మేరీ కోమ్ ►కెరీర్ బౌట్స్: 61 ►విజయాలు: 56 (ఇందులో 37 నాకౌట్స్) ► ఓటములు: 5 కింగ్ ఆఫ్ ద రింగ్ 1942: జనవరి 17న అమెరికాలోని కెంటకీలో జననం అసలు పేరు: కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్ ఎత్తు: 6.3 అడుగులు 1954: 12వ ఏట బాక్సింగ్ శిక్షణ ప్రారంభం 1959: జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ యూనియన్ లైట్ హెవీవెయిట్ టైటిల్ 1960: రోమ్ ఒలింపిక్స్‌లో లైట్ హెవీవెయిట్ స్వర్ణం 1960: ప్రొఫెషనల్‌గా మార్పు 1964: దిగ్గజ బాక్సర్ సోనీ లిస్టన్‌ను ఓడించి 22 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ టైటిల్ దక్కించుకున్నాడు. అనంతరం ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును మొహమ్మద్ అలీగా మార్చుకున్నారు. సోంజి రాయ్‌తో తొలి వివాహం 1967: అమెరికా, వియత్నాం యుద్ధ సమయంలో ఆర్మీలో చేరేందుకు నిరాకరణ. టైటిల్ కోల్పోవడంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత17 ఏళ్ల బెలిండా బాయ్డ్‌తో రెండో వివాహం 1970: న్యాయ పోరాటం అనంతరం తిరిగి బాక్సింగ్ బరిలోకి దిగారు 1971: జో ఫ్రేజర్‌తో జరిగిన ‘శతాబ్దపు ఫైట్’లో ఓటమి.అలీపై ఉన్న అభియోగాలను కొట్టివేసిన యూఎస్ సుప్రీం కోర్టు 1974: రెండోసారి ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ టైటిల్ (జార్జి ఫోర్మన్పై విజయం) 1977: వెరోనికా పోర్షేతో అలీ మూడో వివాహం 1978: మూడోసారి ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ (లియోన్ స్పింక్స్పై విజయం)తో తొలిసారి ఈ ఫీట్ సాధించిన బాక్సర్‌గా రికార్డు. అదే ఏడాది రిటైర్మెంట్ ప్రకటన. 1980: పునరాగమనంలో లారీ హోమ్స్‌పై నాకౌట్ ఓటమి 1981: ట్రెవర్ బెర్బిక్తో ఓటమి అనంతరం తన కెరీర్‌కు ముగింపు పలికారు 1984: చికిత్సకు లొంగని పార్కిన్సన్ వ్యాధిని గుర్తించారు 1986: యోలండా లోనీ విలియమ్స్‌తో నాలుగో వివాహం 1998: ఐక్యరాజ్యసమితి శాంతి దూతగా ప్రకటన 2002: అట్లాంటా ఒలింపిక్స్‌లో తొలిసారిగా జ్యోతి ప్రజ్వలన చేశారు 2005: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేసినందుకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’ పురస్కారం. అప్పటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఆసుపత్రికి మినహా పెద్దగా బయటకు రాలేదు. 2016: జూన్ 3న (అమెరికా కాలమానం) 74వ ఏట మరణం. -
అలీ... ఫ్యామిలీ...
నివాళి ‘‘నాన్నా... నేనూ నీలాగే బాక్సర్‌ను అవుదామనుకుంటున్నా’’నని తన కూతురు అడిగిన క్షణాన ఆ తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ‘ఛాతీపై దెబ్బలు తినేందుకు కాదు అమ్మాయిల శరీరం ఉన్నది...’ అంటూ ఇరవై ఏళ్లుగా ఆయన బాక్సింగ్‌లో ప్రమాదాల గురించి చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన సొంత కూతురే ఎదురుగా నిలబడి పంచ్‌లు కొట్టేందుకు సిద్ధం అంటోంది. తేరుకోవడానికి కాస్త ఆలస్యమైనా మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాడు. అయితే మొహమ్మద్ అలీ కూతురు లైలా అలీ తండ్రిని నిరాశకు గురి చేయలేదు. మహిళల బాక్సింగ్‌లో జగజ్జేతగా నిలిచి తండ్రి గర్వపడేలా చేసింది. 24 బౌట్లు ఆడితే 21 నాకౌట్లు సహా అన్నీ విజయాలే. అలీ సంతానంలో ఎక్కువగా పాపులర్ అయింది లైలానే. సాధారణంగా తండ్రి వారసత్వాన్ని కుమారులు కొనసాగించడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఆడబిడ్డ తన తండ్రి గర్వపడేలా చేసింది. తొమ్మిది మంది పిల్లలు మొహమ్మద్ అలీకి నలుగురు భార్యలు. మొత్తం తొమ్మిది మంది పిల్లలు. సోన్జీ రాయ్, బెలిండా బాయ్డ్, వెరొనియా పోర్ష్లకు విడాకులు ఇచ్చిన తర్వాత 1986లో లోనీ విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. మూడోభార్య పిల్లలైన లైలా అలీ, హనా అలీతోనే తండ్రికి అనుబంధం ఎక్కువ. లైలా బాక్సర్‌గా సత్తా చాటగా... హనా రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. తరచు తండ్రిని కలుస్తూ, అతని గురించి ట్వీట్లు చేస్తూ హనా మాత్రమే తండ్రిని ప్రస్తావిస్తూ వస్తోంది. అలీ మరణం అనంతరం మా నాన్న శిఖర సమానుడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడు. నా జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తి నీవు అంటూ హనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్ట్ పెట్టింది. లైనా, హనా మాత్రమే గత జనవరిలో తండ్రి పుట్టిన రోజున కలిసి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. మిగతా ఐదుగురు అమ్మాయిలు ఖలియా, రాషెదా, జమీయుల్లా, మియా, మరియం పెద్దగా ఎక్కడా కనిపించరు. వాస్తవానికి నాలుగో భార్య విలియమ్స్ వ్యవహార శైలి కారణంగానే వారంతా తమ తండ్రితో ఎక్కువగా కలవలేకపోయారని అలీ తమ్ముడు చెబుతుంటాడు. అయితే పార్కిన్సన్ బారిన పడిన తర్వాత అలీ ఈ మాత్రమైనా జీవితాన్ని కొనసాగించగలిగాలంటే ఆమె చలవే అని మరికొందరు అంటారు. అలీ, విలియమ్స్‌కు అసద్ అమీన్ అనే దత్త పుత్రుడు ఉన్నాడు. కొరగాని కొడుకు ప్రపంచం మొత్తం అభిమానించినా, నాన్న బాక్సింగ్ పంచ్ పవర్ విలువేమిటో, అందులో పదును ఏమిటో సొంత కొడుకు మాత్రం గుర్తించలేకపోయాడు. అలీ అసలు కొడుకు జూనియర్ అలీ మాత్రం గత రెండేళ్లుగా తండ్రికి దూరంగా ఉంటున్నాడు. నాన్న తనను సరిగా పట్టించుకోలేదని, ఫలితంగా సరైన దిశ లేకుండా పేదరికానికే పరిమితమయ్యానని అతను తన ఆక్రోశం వెళ్లగక్కాడు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను తండ్రి గురించి ఆలోచించడం మానేశానని, ఆయనకు ఏం జరిగినా తనకు అనవసరమని గట్టిగా చెప్పేశాడు. బాక్సింగ్ దిగ్గజానికి వారసుడుగా ఉండాల్సిన కుమారుడు అనామకుడిగా మిగిలిపోయాడు. మరోవైపు అలీ ఇన్నేళ్ల పాపులర్ కెరీర్లో మరో ఇద్దరు మహిళలు కూడా తమను పెళ్లి చేసుకున్నాడని, తమతో సంబంధం కొనసాగించాడని ముందుకు రాగా, మరో ఇద్దరు తామూ అలీ సంతానమేనని ప్రకటించుకున్నా అవి నిర్ధారణ కాలేదు. - మొహమ్మద్ అబ్దుల్ హాదీ -
మహ్మద్ అలీ మృతిపట్ల మోదీ సంతాపం
హెరాత్: బాక్సింగ్ యోధుడు మహ్మద్ అలీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా ప్రొఫెషనల్ బాక్సింగ్ ప్లేయర్ అలీ మరణం తీరని లోటని ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ఆదర్శప్రాయమైన క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న అలీ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తెలిపారు. సకల మానవాళికి అతని జీవితం స్ఫూర్తిగా నిలిచిందని మోదీ కొనియాడారు. ప్రస్తుతం ఐదు దేశాల పర్యటనలో భాగంగా అప్ఘాన్ లో ఉన్న మోదీ.. మహ్మద్ అలీ మృతివార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అలీ కన్నుమూశారు. -
సినిమాల్లోకి అలనాటి బాక్సర్
మైక్ టైసన్... ఒకప్పుడు ప్రత్యర్థి ఎవరైనా కూడా ఒక నిమిషంలోపే నాకౌట్ చేసిన ధీరుడు. 20 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లోకి వచ్చి, మొదటి 19 బౌట్లలోను నాకౌట్ విజయాలు సాధించాడు. అందులో 12 మొదటి రౌండులోనే పడేశాడు. అలాంటి లెజెండరీ బాక్సర్... ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాడు. 'కిక్బాక్సర్: ద రిటాలియేషన్' అనే సినిమాలో టైసన్ నటిస్తున్నాడు. ఇంకా విడుదల కావాల్సిన మార్షల్ ఆర్ట్స్ సినిమా 'కిక్ బాక్సర్: వెంజెన్స్'కు ఇది సీక్వెల్. టైసన్ సినిమా ప్రస్తుతం కాలిఫోర్నియా, నెవడాలలో షూటింగ్ జరుపుకొంటోంది. జూన్‌లో థాయ్‌లాండ్‌లో షూటింగ్ ఉంటుంది. ఒక కేసులో దోషిగా తేలి.. జైల్లో తప్పనిసరిగా ఫైటింగ్ ప్రపంచంలోకి వెళ్లిన వ్యక్తి పాత్రను టైసన్ పోషిస్తున్నాడు. ఇప్పటికి తాము క్రీడా ప్రపంచంలో 14 మంది చాంపియన్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇప్పుడు టైసన్ రాకతో సినిమాకు కొత్త లుక్, సరికొత్త ఉత్సాహం వచ్చాయని నిర్మాత రాబర్ట్ హిక్మన్ చెప్పారు. 'కిక్బాక్సర్: వెంజెన్స్' సినిమాకు జాన్ స్టాక్‌వెల్ దర్శకత్వం వహించారు. 1989లో విడుదలైన 'కిక్బాక్సర్' సినిమాకు ఇది రీమేక్. -
బాక్సర్ అలెగ్జాండర్ హత్య
సాన్ జూవాన్: పూర్టో రికా చెందిన యువ బాక్సర్ అలెగ్జాండర్ డి జీసెస్(33) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం అతనిపై దాడి చేసిన కొంతమంది దుండగులు కాల్చి చంపారు. అలెగ్జాండర్‌ను బెల్మొంట్ లోని ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు అతనిపై పలుమార్లు కాల్పులు జరిపి హత్య చేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో పూర్టో రికా తరపున అలెగ్జాండర్ ప్రాతినిధ్యం వహించాడు. ఆపై అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న అలెగ్జాండర్ పలు పతకాలను గెలుచుకున్నాడు. అయితే 2005లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారి 19 బౌట్లలో విజయం సాధించాడు. కాగా, 2009లో అర్జెంటీనా ఆటగాడు సీజర్ రీనే చేతిలో ఓటమి పాలై తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. అనంతరం గృహహింస కేసులో అలెగ్జాండర్ నాలుగు సంవత్సరాల జైలు జీవితం అనుభవించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో భాగంగా జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలోనే ప్రత్యేక అనుమతితో అలెగ్జాండర్ బయటకొచ్చాడు. 2010లో జరిగిన ఆ పోటీలో అలెగ్జండర్ తన దేశానికి చెందిన ఏంజెల్ రోమన్ సునాయాసంగా ఓడించి సత్తాను చాటుకున్నాడు. ఆపై 2013 లో జైలు నుంచి విముక్తి లభించడంతో అప్పట్నుంచి తిరిగి బాక్సింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ఆ క్రమంలోనే జావేర్ గార్సియాపై ఏకపక్ష విజయం సాధించి తన పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. అయితే గత నెల్లోనే తన కెరీర్ లో రెండో ఓటమిని అలెగ్జాండర్ చవిచూశాడు. అలెగ్జండర్ ఓవరాల్ విజయాల రికార్డు 21-2 గా ఉంది. ఇందులో 13 నాకౌట్ మ్యాచ్‌లు ఉండటం విశేషం.