
బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు వరుణ్‌తేజ్. ప్రత్యర్థితో ఫైట్ చేయడానికి కావాల్సిన శిక్షణను కూడా దాదాపు ముగించారట. వరుణ్‌తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో బాక్సర్‌గా వరుణ్‌తేజ్ కనిపిస్తారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండోవారం నుంచి వైజాగ్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో వరుణ్ తేజ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment