కొణిదెల వారసుడు, హీరో వరుణ్ తేజ్ రాత్రిళ్లు నిద్రపోవడం లేదు. నిద్రలేమి సమస్యలేమైనా బాధిస్తున్నాయా? అని అనుకుంటున్నారా?. మరేం లేదు... సినిమా వాళ్లు షూటింగ్‌కు సమయానికి వెళ్తారే కానీ, ఎప్పుడు షూటింగ్ ముగించుకుని ఇంటికి వస్తారనేది ముందే చెప్పలేం కదా.. పైగా సమయంతో పని లేకుండా చిత్రీకరణ జరుపుతూనే ఉంటారు. అలాగే వరుణ్ తన తాజా సినిమా 'బాక్సర్' కోసం రాత్రి రెండు దాటుతోన్నా సెట్స్‌లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. (చదవండి: డిసెంబర్‌లో నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్..)
కాగా వైజాగ్‌లో ప్లాన్ చేసిన ఈ సినిమాలోని కీలక షెడ్యూల్ మార్చిలోనే పూర్తైంది. ఆ వెంటనే లాక్‌డౌన్ పిడుగు పడటంతో షూటింగ్ వాయిదా పడింది. తాజాగా కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది మధ్య చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ నీరజ్ గోయత్ వద్ద నెలరోజుల పాటు బాక్సింగ్ మెళకువలు నేర్చుకోవడంతోపాటు బాడీ లాంగ్వేజ్ మీద దృష్టిపెట్టారు. దబాంగ్ 3లో సల్మాన్ సరసన మెరిసిన సాయి మంజ్రేకర్.. వరుణ్‌తో జోడీ కడుతున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. (చదవండి: ఒలీవియా.. ఆలియా.. పాఠాలయ్యా)
Comments
Please login to add a commentAdd a comment