మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. హనుమాన్ మాల ధరించిన ఆయన మంగళవారం జిగిత్యాల జిల్లలోని కొండగట్టుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ్‌కు అక్కడి అధికారులు, అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొదటిసారి హనుమాన్ మాల ధరించి, కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తెలిపారు.
ఇక వరుణ్ సినిమాల విషయాలకొస్తే.. ఆయన హీరోగా నటించిన మట్కా చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. కరుణ కుమార్ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. థియేటర్‌లో ఫ్లాప్ టాక్ రావడంతో 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 5 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment