సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం | Mythri Movie Makers Given 50 Lakhs rupees Cheque To Sri Tej Family | Sakshi
Sakshi News home page

Mythri Movie Makers: రేవతి కుటుంబానికి రూ.50 లక్షల చెక్.. అందించిన పుష్ప-2 నిర్మాత నవీన్

Published Mon, Dec 23 2024 5:13 PM | Last Updated on Mon, Dec 23 2024 5:30 PM

Mythri Movie Makers Given 50 Lakhs rupees Cheque To Sri Tej Family

పుష్ప-2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని కీలక నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బాలుడి చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాజకీయం చేయొద్దు: మంత్రి కోమటిరెడ్డి

ఇక ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని.. సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని.. రూమర్స్ ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement