Naveen Yerneni
-
కిడ్నాప్ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేత నవీన్ యర్నేని
క్రియా హెల్త్‌కేర్ వివాదంలో బలవంతపు షేర్లు, యాజమాన్య బదిలీ వ్యవహారంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని పేరు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితుల జాబితాలో ఆయన కూడా ఉన్నారని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, వ్యాపారుల పట్ల బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుతో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌పై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం విషయాన్ని తెలుసుకున్న క్రియా హెల్త్‌కేర్ డైరెక్టర్ చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులను కొద్దిరోజుల క్రితం సంప్రదించారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్‌లో చిక్కుకున్న వారిలో కొందరు గతంలో తనను కిడ్నాప్ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు తాజాగా ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న నిర్మాత నవీన్ యర్నేని, గోపాలకృష్ణ సూరెడ్డి,రాజ్ తలసిల, రవికుమార్ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్రావులను నిందితుల జాబితాలో తాజాగా చేర్చారు. దీంతో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. -
MAD OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మ్యాడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ,ఎప్పుడు?
చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ ‘మ్యాడ్’. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ప్రచార చిత్రాలతో తొలి నుంచే మ్యాడ్పై హైప్ క్రియేట్ అయింది. అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం..అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్..తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. నవంబర్ 3 నుంచి ఈ చిత్రం నెట్‌ఫిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..‘మిమ్మలందర్ని పిచ్చెక్కించే ఒక శుభవార్త. మ్యాడ్ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని రాసుకొచ్చింది. ‘మ్యాడ్’ కథేంటి? మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు.ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj — Netflix India South (@Netflix_INSouth) October 30, 2023 -
కొత్త చిత్రం షురూ
గోపీచంద్ హీరోగా నటించనున్న తాజా చిత్రం శనివారం ఆరంభమైంది. సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో ప్రారంభమైన చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘‘ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్‌గారిని విభిన్న పాత్రలో చూపిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
కుషి బ్లాక్ బస్టర్ వేడుకల్లో నిర్మాత నవీన్ యెర్నేని..
-
ఆ పాయింట్‌తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్‌గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్‌పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు డైరెక్టర్స్‌కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
రష్మిక చేతుల మీదుగా జర్నలిస్ట్ లకు ఐ.డి, హెల్త్ కార్డ్ ల పంపిణీ
‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీఎఫ్జేఏ)’ జర్నలిస్టుల అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకు సంబంధించి ఎలాంటి ఫంక్షన్ జరిగినా మీరంతా(ఫిల్మ్ జర్నలిస్టులు)వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బాగుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి’ అని ప్రముఖ నటి రష్మిక మందన్నా అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ‘టీఎఫ్‌జే’ నూతన ఐడీ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు. టిఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి మనం వారికి ఏం చేస్తున్నాం అనిపించినప్పుడు రీసెంట్ గా దిల్ రాజు, చిరంజీవిగారితో అసోసియేషన్ తరఫున సినిమా కోసం ఏం చేయాలి అని మాట్లాడటం జరిగింది. మన జర్నలిస్ట్ లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు.. వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లుగా మనం సహాయం చేయాలని అని చర్చించడం జరిగింది. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చూసుకుని ఈ కమిట్ స్టార్ట్ చేయబోతున్నాం ఇక టిఎఫ్‌జేఏ అసోసియేషన్ కోసం మూడు రకాల ఇన్సూరెన్స్ లు చేశాం. ఒకటి నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. మిగతావి టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ. వీటిలో మొదటిది ఎవరికైనా జరిగితే.. ఆ కుటుంబానికి ఈ మొత్తం అందించడం జరుగుతుంది. యాక్సిడెంటల్ పాలసీలో ఎవరైనా ప్రమాదం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉంటే.. వారానికి పదివేల చొప్పున.. అసవరమైతే ఐదేళ్ల వరకూ ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ మూడు ఇన్సూరెన్స్ ల కోసం చాలా పెద్ద కంపెనీలను సంప్రదించాం. వారిలో మనకు నచ్చేలా యతిక ఇన్సూరెన్స్ వాళ్లు ముందుకు వచ్చారు. వారి తరఫున, మన తరఫున ఇద్దరు ప్రతినిధులను పెట్టాం. వీరిలో ఎవరిని సంప్రదించినా.. 24 గంటలూ అందుబాటులో ఉండబోతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోన్న మన టిఎఫ్‌జేఏ కు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. టిఎఫ్‌జేఏ ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. టిఎఫ్‌జేఏ నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదేళ్లలో మనం ఇన్సూరెన్స్ సంస్థకు కట్టిన డబ్బులు 1 కోటి 10 లక్షలు 84వేల 626 రూపాయలు. ఈ మొత్తంలో మనం చేసుకున్న క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ 90 లక్షల 76 వేల 614 రూపాయలు. ఈ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి 60లక్షల 26 వేల 614 రూపాయలు క్లెయిమ్ చేశాం. టర్మ్ ఇన్సూరెన్స్ 30 లక్షలు క్లెయిమ్ చేశాం. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు. సంతోషంగా ఉండాలనే కోరుకుందాం. కానీ ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు 24 గంటలూ ఎంతో మద్ధతుగా నిలుస్తున్నాం’ అన్నారు. ‘మేం సినిమాలు తీసిన తర్వాత వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేది జర్నలిస్ట్ లే. ఆ విషయంలో మీరెప్పుడూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. మా వైపు నుంచి వారికి ఏ సహాయం కావాలన్నా ఉంటాం’అని అన్నారు నిర్మాత నవీన్ యొర్నేని. ‘టిఎఫ్‌జేఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ గా ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ అన్నారు. -
ఐటీ సోదాలు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతకు అస్వస్థత
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయననను కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సాయంత్రం లోగా డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మైత్రీ మూవీ ఆఫీస్, నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదా లు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఐటీ రైట్స్ నేపథ్యంలో నిర్మాత ఎర్నేని నవీన్ ఆందోళనకు గురైనట్లు సమాచారం. 2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2తో పాటు మరికొన్ని సినిమాలను నిర్మిస్తోంది. -
అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం
‘‘దేశ ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐతో ఇబ్బందిపడని మధ్య తరగతి మనిషి ఉండరు. అలాంటి పాయింట్‌ని మహేశ్‌గారి లాంటి సూపర్ స్టార్‌తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. రచయితగా, దర్శకుడిగా ఈ సినిమా నాకు తృప్తినిచ్చింది. మా సినిమాకి ప్రీమియర్ షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా ఉంది. మహేశ్‌గారి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, క్లాస్.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చింది’’ అని పరశురాం అన్నారు. చదవండి: బాలీవుడ్‌పై మహేశ్ కామెంట్స్, స్పందించిన బోనీ కపూర్, ఆర్జీవీ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ‘బ్లాక్ బస్టర్ మీట్’లో నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘మా రెండేళ్ల కష్టం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఎగిరిపోయింది. అమెరికాలో ప్రీమియర్‌లో మిలియన్ డాలర్స్‌ని కలెక్ట్ చేసి నాన్ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులన్నీ క్రాస్ చేసింది’’ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో ‘సర్కారువారి పాట’ లాంటి పెద్ద సినిమా మళ్లీ చూడగలమా? అంటే సందేహమే’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే -
కల్యాణ్‌రామ్19వ చిత్రం మార్చిలో షురూ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించనున్న 19వ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై 14వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. హీరో కల్యాణ్ రామ్, నిర్మాత నవీన్ యర్నేని, సీఈఓ చెర్రీ కలసి రాజేంద్రకు స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘మార్చి రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యర్నేని అనిల్, సీఈఓ: చెర్రీ.