‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీఎఫ్‌జేఏ)’ జర్నలిస్టుల అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకు సంబంధించి ఎలాంటి ఫంక్షన్ జరిగినా మీరంతా(ఫిల్మ్ జర్నలిస్టులు)వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బాగుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి’ అని ప్రముఖ నటి రష్మిక మందన్నా అన్నారు.
సోమవారం హైదరాబాద్‌లో ‘టీఎఫ్‌జే’ నూతన ఐడీ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు.
టిఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి మనం వారికి ఏం చేస్తున్నాం అనిపించినప్పుడు రీసెంట్ గా దిల్ రాజు, చిరంజీవిగారితో అసోసియేషన్ తరఫున సినిమా కోసం ఏం చేయాలి అని మాట్లాడటం జరిగింది. మన జర్నలిస్ట్ లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు.. వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లుగా మనం సహాయం చేయాలని అని చర్చించడం జరిగింది. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చూసుకుని ఈ కమిట్ స్టార్ట్ చేయబోతున్నాం
ఇక టిఎఫ్‌జేఏ అసోసియేషన్ కోసం మూడు రకాల ఇన్సూరెన్స్ లు చేశాం. ఒకటి నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. మిగతావి టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ. వీటిలో మొదటిది ఎవరికైనా జరిగితే.. ఆ కుటుంబానికి ఈ మొత్తం అందించడం జరుగుతుంది. యాక్సిడెంటల్ పాలసీలో ఎవరైనా ప్రమాదం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉంటే.. వారానికి పదివేల చొప్పున.. అసవరమైతే ఐదేళ్ల వరకూ ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ మూడు ఇన్సూరెన్స్ ల కోసం చాలా పెద్ద కంపెనీలను సంప్రదించాం. వారిలో మనకు నచ్చేలా యతిక ఇన్సూరెన్స్ వాళ్లు ముందుకు వచ్చారు.
వారి తరఫున, మన తరఫున ఇద్దరు ప్రతినిధులను పెట్టాం. వీరిలో ఎవరిని సంప్రదించినా.. 24 గంటలూ అందుబాటులో ఉండబోతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోన్న మన టిఎఫ్‌జేఏ కు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. టిఎఫ్‌జేఏ ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. టిఎఫ్‌జేఏ నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదేళ్లలో మనం ఇన్సూరెన్స్ సంస్థకు కట్టిన డబ్బులు 1 కోటి 10 లక్షలు 84వేల 626 రూపాయలు. ఈ మొత్తంలో మనం చేసుకున్న క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ 90 లక్షల 76 వేల 614 రూపాయలు. ఈ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి 60లక్షల 26 వేల 614 రూపాయలు క్లెయిమ్ చేశాం. టర్మ్ ఇన్సూరెన్స్ 30 లక్షలు క్లెయిమ్ చేశాం. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు. సంతోషంగా ఉండాలనే కోరుకుందాం. కానీ ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు 24 గంటలూ ఎంతో మద్ధతుగా నిలుస్తున్నాం’ అన్నారు.
‘మేం సినిమాలు తీసిన తర్వాత వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేది జర్నలిస్ట్ లే. ఆ విషయంలో మీరెప్పుడూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. మా వైపు నుంచి వారికి ఏ సహాయం కావాలన్నా ఉంటాం’అని అన్నారు నిర్మాత నవీన్ యొర్నేని. ‘టిఎఫ్‌జేఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ గా ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment