Telugu Film Journalists Association
-
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలంతో పాటు హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. శనివారం ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA) ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించిన హెల్త్ కార్డ్, డైరీ, ఐడికార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ‘తెలంగాణలో 23వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి సంస్థలోనూ ఫిల్మ్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా అక్రిడేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఎలిజెబుల్ పీపుల్‌కి కచ్చితంగా అక్రిడేషన్ ఇప్పిస్తాం. ప్రభుత్వాల నుంచి ఏ సౌకర్యాలు పొందాలన్నా అందరిలోనూ యూనిటీ ఉండాలి. అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే. మన ప్రొఫెషన్ విలువ, స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం, ఎథిక్స్ ని ఎథిక్స్ ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. జూన్ 6 తర్వాత ఎలిజిబుల్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తాం.ప్రభుత్వాల నుంచి కూడా ఏదీ ఫ్రీగా ఎక్స్ పెక్ట్ చేయొద్దు. భూములనో, ఫ్లాట్‌లనో మార్కెట్ రేటు కాకుండా, మనకంటూ ఓ రేటుకి ఇస్తే దాన్ని కట్టుకుందాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, ఆర్.నారాయణమూర్తి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టీఎఫ్‌జెఎ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ సురేంద్ర నాయుడు సహా అసోసియేషన్ సభ్యులు.. జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. -
జీవితంలో ఎవరికైనా ఆ మూడే ముఖ్యం : విజయ్ దేవరకొండ
జీవితంలో ఎవరికైనా ఆరోగ్యం, ఆనందం, డబ్బు.. ఈ మూడే చాలా ముఖ్యమని అన్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. శుక్రవారం ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్వంలో నిర్వహించిన హెల్త్ కార్డ్, డైరీ, ఐడికార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల అందరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూడాలని తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘జర్నలిస్టుల హెల్త్ కార్డుల సెలబ్రేషన్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ మొదటి నుంచీ జర్నలిస్టులు నాతోనే ఉన్నారు.నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయేమోనని భయపడి హెల్త్ ఇన్స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువల్‌కి డబ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వదిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా అందరూ యుటిలైజ్ చేసుకుంటున్నారని తెలిసి ఆనందంగా అనిపించింది’ అన్నారు. సినిమాల విషయానికొస్తే.. విజయ్ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ అనే మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. గీతగోవిందం లాంటి బ్లాస్ బస్టర్ తర్వాత విజయ్‌తో పరుశురామ్ తెరకెక్కిస్తున్న రెండో సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
రష్మిక చేతుల మీదుగా జర్నలిస్ట్ లకు ఐ.డి, హెల్త్ కార్డ్ ల పంపిణీ
‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీఎఫ్జేఏ)’ జర్నలిస్టుల అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకు సంబంధించి ఎలాంటి ఫంక్షన్ జరిగినా మీరంతా(ఫిల్మ్ జర్నలిస్టులు)వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బాగుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి’ అని ప్రముఖ నటి రష్మిక మందన్నా అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ‘టీఎఫ్‌జే’ నూతన ఐడీ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు. టిఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి మనం వారికి ఏం చేస్తున్నాం అనిపించినప్పుడు రీసెంట్ గా దిల్ రాజు, చిరంజీవిగారితో అసోసియేషన్ తరఫున సినిమా కోసం ఏం చేయాలి అని మాట్లాడటం జరిగింది. మన జర్నలిస్ట్ లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు.. వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లుగా మనం సహాయం చేయాలని అని చర్చించడం జరిగింది. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చూసుకుని ఈ కమిట్ స్టార్ట్ చేయబోతున్నాం ఇక టిఎఫ్‌జేఏ అసోసియేషన్ కోసం మూడు రకాల ఇన్సూరెన్స్ లు చేశాం. ఒకటి నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. మిగతావి టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ. వీటిలో మొదటిది ఎవరికైనా జరిగితే.. ఆ కుటుంబానికి ఈ మొత్తం అందించడం జరుగుతుంది. యాక్సిడెంటల్ పాలసీలో ఎవరైనా ప్రమాదం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉంటే.. వారానికి పదివేల చొప్పున.. అసవరమైతే ఐదేళ్ల వరకూ ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ మూడు ఇన్సూరెన్స్ ల కోసం చాలా పెద్ద కంపెనీలను సంప్రదించాం. వారిలో మనకు నచ్చేలా యతిక ఇన్సూరెన్స్ వాళ్లు ముందుకు వచ్చారు. వారి తరఫున, మన తరఫున ఇద్దరు ప్రతినిధులను పెట్టాం. వీరిలో ఎవరిని సంప్రదించినా.. 24 గంటలూ అందుబాటులో ఉండబోతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోన్న మన టిఎఫ్‌జేఏ కు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. టిఎఫ్‌జేఏ ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. టిఎఫ్‌జేఏ నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదేళ్లలో మనం ఇన్సూరెన్స్ సంస్థకు కట్టిన డబ్బులు 1 కోటి 10 లక్షలు 84వేల 626 రూపాయలు. ఈ మొత్తంలో మనం చేసుకున్న క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ 90 లక్షల 76 వేల 614 రూపాయలు. ఈ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి 60లక్షల 26 వేల 614 రూపాయలు క్లెయిమ్ చేశాం. టర్మ్ ఇన్సూరెన్స్ 30 లక్షలు క్లెయిమ్ చేశాం. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు. సంతోషంగా ఉండాలనే కోరుకుందాం. కానీ ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు 24 గంటలూ ఎంతో మద్ధతుగా నిలుస్తున్నాం’ అన్నారు. ‘మేం సినిమాలు తీసిన తర్వాత వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేది జర్నలిస్ట్ లే. ఆ విషయంలో మీరెప్పుడూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. మా వైపు నుంచి వారికి ఏ సహాయం కావాలన్నా ఉంటాం’అని అన్నారు నిర్మాత నవీన్ యొర్నేని. ‘టిఎఫ్‌జేఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ గా ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ అన్నారు.