జీవితంలో ఎవరికైనా ఆరోగ్యం, ఆనందం, డబ్బు.. ఈ మూడే చాలా ముఖ్యమని అన్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. శుక్రవారం ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్వంలో నిర్వహించిన హెల్త్ కార్డ్, డైరీ, ఐడికార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల అందరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూడాలని తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు.
‘జర్నలిస్టుల హెల్త్ కార్డుల సెలబ్రేషన్‌లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ మొదటి నుంచీ జర్నలిస్టులు నాతోనే ఉన్నారు.నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయేమోనని భయపడి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువల్‌కి డబ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వదిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా అందరూ యుటిలైజ్ చేసుకుంటున్నారని తెలిసి ఆనందంగా అనిపించింది’ అన్నారు.
సినిమాల విషయానికొస్తే.. విజయ్ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ అనే మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. గీతగోవిందం లాంటి బ్లాస్ బస్టర్ తర్వాత విజయ్‌తో పరుశురామ్ తెరకెక్కిస్తున్న రెండో సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment