Mythri Movie Makers Producer Yerneni Naveen Admitted In Hospital Due To Illness - Sakshi
Sakshi News home page

Producer Yerneni Naveen: ఐటీ సోదాలు.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతకు అస్వస్థత

Published Fri, Apr 21 2023 4:42 PM | Last Updated on Fri, Apr 21 2023 5:35 PM

Mythri Movie Makers Producer Yerneni Naveen Admitted to the Hospital Due To Illness - Sakshi

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్‌ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయననను కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సాయంత్రం లోగా డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మైత్రీ మూవీ ఆఫీస్‌, నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్‌ సుకుమార్‌ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదా లు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఐటీ రైట్స్‌ నేపథ్యంలో నిర్మాత ఎర్నేని నవీన్‌ ఆందోళనకు గురైనట్లు సమాచారం.

2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2తో పాటు మరికొన్ని సినిమాలను నిర్మిస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement