IT Raids on Mythri Movie Makers Office At Hyderabad - Sakshi
Sakshi News home page

IT Raids on Mythri Movie Makers : మైత్రీ మూవీ మేకర్స్‌ కార్యాలయంలో ఐటీ దాడులు

Dec 12 2022 1:59 PM | Updated on Dec 12 2022 3:18 PM

IT Raids on Mythri Movie Makers Office At Hyderabad - Sakshi

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీస్‌కు చెందిన కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది. పుష్ప, శ్రీమంతుడు, డియర్‌ కామ్రేడ్‌,సర్కారు వారి పాట, ఉప్పెన, జనతా గ్యారేజ్‌, రంగస్థలం లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌.. సంస్థ లావాదేవీలు, సినిమా బడ్జెట్‌కు సంబంధించి లెక్కలు సరిగా చూపలేదని ఐటీ అధికారులకు సమాచారం అందింది. 

ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన అన్ని ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ప్రొడ్యూసర్స్‌ యలమంచిలి రవి, నవీన్‌ ఏర్నేని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్‌ అల్లు అర్జున్‌తో పుష్ప-2, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్‌ కల్యాణ్‌తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement