mythri movies
-
Bommak Siva: సినిమా అంతా ఒకటే పాత్ర ఉంటుంది
‘‘105 మినిట్స్’ మంచి ప్రయోగాత్మక చిత్రం. సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది. కానీ, ఇంకో వాయిస్ వినిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ బాలీవుడ్ నటుడి మాటలు వినిపిస్తుంటాయి’’ అని నిర్మాత బొమ్మక్ శివ అన్నారు. హీరోయిన్ హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వం వహించిన చిత్రం ‘105 మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. బొమ్మక్ శివ మాట్లాడుతూ– ‘‘నాకు రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్‌లు ఉన్నాయి. సినిమాపై ఫ్యాషన్‌తో మొదటి ్రపాజెక్టుగా ‘105’ మూవీ తీశాను. రాజు దుస్సా చక్కగా తీశాడు. హన్సికను ఈ మూవీలో కొత్తగా చూస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ మా సినిమాని రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
సంక్రాంతి సినిమాల పంచాయతీ సెటిలైందా ?
-
'హను-మాన్'ను వెంటాడుతున్న సమస్య.. నిర్మాతలకు నష్టం!
సంక్రాంతి బరిలో సినిమాల రిలీజ్‌పై మొన్నటివరకు పెద్ద చర్చే జరిగింది. ఓవైపు పెద్ద హీరో సినిమా గుంటూరు కారం, మరోవైపు చిన్న హీరో చిత్రం హను-మాన్ జనవరి 12వ తేదీకే గురి పెట్టాయి. హనుమాన్ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయొచ్చుగా అని సలహా ఇచ్చాడు దిల్ రాజు. కానీ హను-మాన్ నిర్మాతలు మాత్రం.. ఒక్క రోజు కూడా ముందుకూ వెనక్కూ జరిగేది లేదని తేల్చి చెప్పేసింది. చివరకు అన్నట్లుగానే గుంటూరు కారం చిత్రానికి పోటీగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తమకు సరిపడా థియేటర్లు ఇవ్వలేదని మొదటి నుంచీ మొత్తుకున్నారు హనుమాన్ మేకర్స్. ఆ గొడవ అలా సాగుతుండగానే రిలీజ్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ బేఖాతరు తాజాగా మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే పెద్దగా థియేటర్లు లేవంటే హను-మాన్ కోసం అగ్రిమెంట్లు కుదుర్చుకున్న థియేటర్లు సైతం సదరు చిత్రాన్ని ప్రదర్శించడం లేదట! ఈ విషయంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూర్లు, నిర్మాత నిరంజన్ రెడ్డి.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. థియేటర్ల యజమానులు ఇలా నిబంధనలు అతిక్రమించడాన్ని నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. 'జనవరి 12 నుంచి హనుమాన్ ప్రదర్శించేందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణలో కొన్ని థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ వాళ్లు ఈ అగ్రిమెంట్‌ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా థియేటర్లలో సినిమా ప్రదర్శించడం లేదు. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని భరించాలి దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం కలిగింది. కాబట్టి ఈ థియేటర్లు వెంటనే హను-మాన్ సినిమాను ప్రదర్శించడంతో పాటు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని భరించాలి. థియేటర్ల యజమానులు ఇలా ఇష్టారీతిన వ్యవహరించడం తెలుగు సినీ పరిశ్రమ మనుగడకే ప్రమాదం. ఇప్పటికైనా పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ సినిమాకు సత్వర న్యాయం చేయండి' అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ లేఖ విడుదల చేసింది. చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? -
వాస్తవ ఘటనతో...
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. డా. బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన ఈ చిత్రంలో ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రల్లో నటించారు. రమేష్ చెప్పాల రచన–దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మైత్రీ మూవీస్ ద్వారా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ‘‘ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఆ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కంటెంట్ నచ్చి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్ ఐటీ రైడ్స్, కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై నిన్న(డిసెంబర్ 12న) ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జీఎస్టీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి జరగగా రాత్రి 12 గంటలకు ఈ తనిఖీలు ముగిసినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ డైరెక్టర్స్ అయిన యలమంచిలి రవిశంకర, ఎర్నేనీ నవీన్‌కు సంబంధించిన ఇల్లు, కార్యాలయలపైన కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు పలు హార్డ్‌డిస్క్‌లను స్వాధినం చేసుకున్నట్లు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హై బడ్జెట్ చిత్రాలకు నిర్మాణ వ్యయం, పెట్టుబడులను ఎలా సమకుర్చుతున్నారనే దానిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాదు హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్, లాభాల గురించి కూడా సంస్థ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలను ఈ సందర్భంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఇది రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగానే సోదాలు నిర్వహించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ మీడియాతో పేర్కొన్నారు. కాగా పుష్ప, శ్రీమంతుడు, డియర్ కామ్రేడ్,సర్కారు వారి పాట, ఉప్పెన, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఈ సంస్థలోనే నిర్మించబడ్డాయి. చదవండి: నన్ను నమ్మిన మొదటి వ్యక్తి నువ్వే డార్లింగ్: ప్రభాస్‌పై జక్కన్న కామెంట్స్ అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్‌బీర్ కపూర్ -
మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ సోదాలు
-
మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ దాడులు
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీస్‌కు చెందిన కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది. పుష్ప, శ్రీమంతుడు, డియర్ కామ్రేడ్,సర్కారు వారి పాట, ఉప్పెన, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. సంస్థ లావాదేవీలు, సినిమా బడ్జెట్‌కు సంబంధించి లెక్కలు సరిగా చూపలేదని ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన అన్ని ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ప్రొడ్యూసర్స్ యలమంచిలి రవి, నవీన్ ఏర్నేని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ అల్లు అర్జున్‌తో పుష్ప-2, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. -
అనసూయ ‘అరి’పై మైత్రీ మూవీ మేకర్స్ కన్ను!
ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’. శ్రీమంతుడు సినిమాతో మొదలైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం.. మూడు హిట్లు, ఆరు సక్సెస్‌లతో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా అవతరించింది. స్టార్ హీరోలతో పాటు అప్ కమింగ్ హీరోలతో ఇంట్రస్టింగ్ కంటెంట్ ప్రజెంట్ చేస్తుంది. టాలెంట్ ఎక్కడ ఉన్నా.. కొత్త కంటెంట్ ఎక్కడ దొరికినా.. మైత్రీ మేకర్స్ దానిని తెలుగు ప్రేక్షకులకు అందజేస్తుంది. తాజాగా మైత్రీ వాళ్ల కన్ను ‘అరి’చిత్రంపై పడిందట. `పేపర్ బాయ్`లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా , ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో తాజాగా విడుదలైంది. (చదవండి: ‘గుడ్‌బై’ చెప్పడం ఇష్టం లేదు : రష్మిక) టైటిల్ లోగో ఈవెంట్‌కి మైత్రీ మైత్రీమూవీస్ రవిశంకర్ కూడా హాజరయ్యారు. లోగోతో పాటు కాస్సెప్ట్ కూడా బాగా నచ్చడంతో ‘అరి’రైట్స్ తీసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర యూనిట్‌తో చర్చలు జరుపుతున్నారట. నిర్మాతల్లో ఒకరైన శేషు మైత్రీ నవీన్‌కు మంచి స్నేహితుడు. దీంతో అరి రైట్స్ కచ్చితంగా మైత్రీ మూవీ మేకర్స్‌కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ చిత్ర దర్శకుడు జయశంకర్‌పై కూడా మైత్రీ మూవీస్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయనతో కూడా ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తోందట. మంచి స్క్రిప్ట్ తీసుకొని రమ్మని దర్శకుడికి చెప్పినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ‘అరి’ తర్వాత జయశంకర్ నయనతారతో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. అన్ని కుదిరితే.. ఈ చిత్రం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో జయశంకర్ కొత్త సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. -
విజయ్ కొత్త సినిమా ప్రారంభం
అర్జున్ రెడ్డి సినిమా ఇచ్చిన విజయంతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించారు విజయ్ దేవరకొండ. ఈ మూవీ తరువాత వరుసగా సినిమాలను ఓకే చేస్తూ.. షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించారు. మైత్రీ మూవీస్ సంస్థలో ‘డియర్ కామ్రెడ్’ అనే సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది. సంగీత దర్శకుడు కీరవాణి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రష్మిక మందాన నటిస్తున్నారు. భరత్ కమ్మ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ విద్యార్థి నాయకుడిగా నటించనున్నారని సమాచారం. విజయ్ ప్రస్తుతం టాక్సీవాలా షూటింగ్‌ను పూర్తి చేసుకోగా, గీతా గోవిందం, నోటా, షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయ్ ‘డియర్ కామ్రెడ్’ అప్డేట్స్
అర్జున్ రెడ్డి సినిమాతో దశ తిరిగిన హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగారు. ఈ సినిమా సక్సెస్‌తో పెద్ద నిర్మాణ సంస్థల్లో అవకాశాలు వరుస కట్టాయి. గీతా ఆర్ట్స్‌లో రెండు, మైత్రీ మూవీస్‌లో ఒకటి, తెలుగు తమిళ భాషల్లో మరో సినిమాను పట్టాలెక్కించారు. విజయ్ సినిమాల్లో ప్రస్తుతం ట్యాక్సీవాలా విడుదలకు రెడీగా ఉంది. గీతా గోవిందం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇవి రెండు గీతా ఆర్ట్స్ సంస్థలో తెరకెక్కుతున్నాయి. ఇక మైత్రీ మూవీ బ్యానర్లో డియర్ కామ్రెడ్ అనే సినిమాను చేయబోతున్నారు. రేపు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రేపు (జూలై 2) ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించనున్నారు. -
పవన్, త్రివిక్రమ్‌ల తీన్మార్
తెలుగు ఇండస్ట్రీలో కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న మైత్రీ మూవీస్ క్రేజీ కాంబినేషన్లను సెట్ చేస్తోంది. తొలి సినిమాతోనే మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌తో శ్రీమంతుడు సినిమా చేసిన మైత్రీ మూవీస్ టీం, రెండో సినిమాగా కూడా ఆసక్తికరమైన కాంబినేషన్‌ను సెట్ చేశారు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాకముందే మరో భారీ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశారు. జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారీ సక్సెస్‌లు అందించిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ దశలో త్రివిక్రమ్‌తో సినిమాను పవన్ స్వయంగా నిర్మించాలని కూడా భావించాడు. అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌ను మరోసారి తెర మీదకు తీసుకువచ్చే బాధ్యతను మైత్రీ మూవీస్ తీసుకుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అన్న విషయం మీద మాత్రం క్లారిటీ రాలేదు.