అర్జున్ రెడ్డి సినిమా ఇచ్చిన విజయంతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించారు విజయ్ దేవరకొండ. ఈ మూవీ తరువాత వరుసగా సినిమాలను ఓకే చేస్తూ.. షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించారు.
మైత్రీ మూవీస్ సంస్థలో ‘డియర్ కామ్రెడ్’ అనే సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది. సంగీత దర్శకుడు కీరవాణి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రష్మిక మందాన నటిస్తున్నారు. భరత్ కమ్మ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ విద్యార్థి నాయకుడిగా నటించనున్నారని సమాచారం. విజయ్ ప్రస్తుతం టాక్సీవాలా షూటింగ్‌ను పూర్తి చేసుకోగా, గీతా గోవిందం, నోటా, షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment